సంకలనాలు
Telugu

హాట్ హాట్ సమ్మర్ ను కూల్ కూల్ ఫ్యాషన్ తో అదరగొట్టేయ్యండి..!

15th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


స‌మ్మ‌ర్‌లో సూరీడు చూసే సుర‌సుర సూపుల‌కు ఒళ్లంతా భ‌గ‌భ‌గ‌మ‌న‌డం ఖాయం. వేస‌వి తాకిడికి ఎక్క‌డికీ వెళ్లలేని పరిస్థితి. ఏసీ నుంచి బ‌య‌ట కాలు పెడితే చాలు.. చెమ‌ట‌తో ఔట్ ఫిట్ అంతా పాడైపోతుంది. మ‌రి ఈ పోటీ ప్ర‌పంచంలో కార్పోరేట్ లుక్ ను, స్టైల్ ను మెయింటెయిన్ చేస్తూనే ముందుకు వెళ్ల‌డం కంప‌ల్స‌రీ. అలాంటప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూనే వేస‌వి తాపానికి గుడ్ బై చెప్పే కొన్ని టిప్స్ మీ కోసం..

1. వేసవిలో సిల్క్, పట్టు, జార్జెట్ వంటి కాస్ట్యూమ్స్ చికాకు తెప్పిస్తాయి. ఒంటిని హత్తుకుని చెమట చిందిస్తాయి. అందుకే సమ్మర్ రాగానే ట్రెండీ లేడీస్ అంతా కాటన్ కాస్ట్యూమ్స్‌లోకి షిఫ్ట్ అయిపోతారు. కాటన్‌తో పాటు సాఫ్ట్, జ్యూట్, ఖాదీ, లినెన్ మెటీరియల్స్ కంఫర్ట్‌గా సెట్ అవుతాయి.

2. ఇక సీఈఓ లేదా ఆంట్రప్రెన్యూర్స్ అయితే త‌న కార్పొరేట్ అఫీషియ‌ల్ లుక్ లో భాగంగా కోట్ జాకెట్ ధ‌రిస్తారు. అయితే అవి బరువైన‌వి కాకుండా కాస్త లైట్ వెయిట్ ఉండే కాట‌న్ వి అయితే బాగుంటుంది. అది కూడా లైట్ క‌లర్స్ అయితే మ‌రీ బెటర్. అలాగే ముదురు రంగు గాగుల్స్ ఎండ నుంచి క‌ళ్ల‌ను కాపాడుతాయి. ఇక హెయిర్ లాంగ్ గా వ‌దిలేయ‌కుండా ముడివేసుకొని బ‌న్ మెయింటెయిన్ చేస్తే స‌రి.

3. ఇక ఇంటి ప‌నిచేసే హోం మేక‌ర్స్ సూర్యుడి తాపం నుంచి త‌ట్టుకోవాలంటే మాత్రం- లైట్ కుర్తీలు వేసుకుంటే స‌రిపోతుంది. లేదా జీన్స్ వేర్ అయినా ప‌ర్లేదు. స‌మ్మ‌ర్లో త్రీ ఫోర్త్ జెగ్గింగ్స్ వేసుకుంటే కూడా కంఫ‌ర్ట్ ఉంటుంది. ఇక హెయిర్ విష‌యానికి వ‌స్తే జుట్టు ముడి వేసుకొని బ‌న్ స్ట‌యిల్ మెయిన్‌టెయిన్ చేస్తే చికాకు ఉండదు.

4. ఇక టీనెజ‌ర్లు అయితే టీస్ ఇంకా షార్ట్స్ వేసుకుంటే వేస‌వి త‌రిమేయొచ్చు. లుక్‌కు లుక్- కంఫ‌ర్ట్ కు కంఫ‌ర్ట్. ఇక ట్రెడిష‌న‌ల్ వేర్ విష‌యానికి వ‌స్తే కాట‌న్ ప్రిఫ‌ర్ చేయొచ్చు. అలాగే క్యాజువ‌ల్స్ కూడా స‌మ్మ‌ర్‌లో ట్రెండీ లుక్ ఇస్తాయి.

5. ఇక స్కిన్ టోన్ కాపాడేది స‌న్ స్ర్కీన్ లోష‌న్. కేవ‌లం ఫేస్‌కు మాత్ర‌మే కాదు చేతులు కాలి వేళ్లకు కూడా స‌న్ స్క్రీన్ లోష‌న్ అప్లై చేయాలి. ఇక జుట్టును కాపాడుకోవాలంటే డైరెక్ట్‌గా ఎండ తాక‌కుండా కాపాడుకోవాలి. స్కార్ఫ్ లేదా చిన్న టోపీ మెయిన్ టెయిన్ చేస్తే మంచిది. స‌న్ గ్లాసెస్ కూడా క‌ళ్ల‌ను కాపాడుతాయి.

image


స‌మ్మ‌ర్‌లో ఈ ట్రెండ్స్ ఫాలో అయితే స‌రి..!

ర‌ఫ‌ల్స్‌. అంటే కుచ్చిళ్ల లాగా స్టెప్స్ టైప్‌లో ఉండే స్టైల్. సాధార‌ణంగా లెహెంగాలో ర‌ఫ‌ల్స్ డిజైన్ చేస్తారు. అయితే స‌మ్మ‌ర్ లో ర‌ఫ‌ల్స్ ఉన్న స్క‌ర్ట్స్ చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. చూడ్డానికి సింపుల్ గానూ అట్రాక్టివ్‌గానూ కనిపిస్తాయి.

పేప‌ర్ బ్యాగ్ వెయిస్ట్స్‌..!

స‌న్న‌టి న‌డుము ఉన్న వాళ్ల‌కు మాత్ర‌మే పేప‌ర్ బ్యాగ్ వెయిస్ట్స్ బాగుంటాయి అని అనుకోవ‌డం అపోహ మాత్ర‌మే. వెరైటీ గా ఉండే ట్రౌజ‌ర్ న‌డుము ద‌గ్గ‌ర క్లాత్ బెల్ట్ తో స‌హా వ‌స్తుంది. బెల్ట్ తో ముడివేయ‌డం వ‌ల్ల న‌డుం దగ్గ‌ర పేప‌ర్ బ్యాగ్ ను ముడివేసిన‌ట్లు క‌నిపిస్తుంది. చూడ్డానికి వెరైటీగా ఉండే ఈ ట్రౌజ‌ర్- ఎలాంటి షేప్ ఉన్న‌వారికైనా బాగుంటుంది. ట్రావెలింగ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌

బేర్ షోల్డ‌ర్ నెక్ లైన్స్..!

నున్న‌టి భుజాలు ఎక్స్‌పోజ్ అవుతూ మెడ వ‌ర‌కు లైన్ గా వ‌చ్చే టాప్ ఇది. స‌మ్మ‌ర్ స్ప్రింగ్ వేర్ క‌లెక్ష‌న్ లో బేర్ షోల్డ‌ర్ లైన్స్ బెస్ట్ చాయిస్‌. ఇక పార్టీ వేర్‌గా బేర్ షోల్డ‌ర్ నెక్ లైన్స్ వాడుతున్నారు. ఈ డ్రెస్ లాంగ్ గౌన్స్ లోనూ, షార్ట్ టాప్స్ గానూ డిజైన్ చేసుకోవ‌చ్చు. ఈ ఔట్ ఫిట్‌లో పార్టీకే వెళితే ఎలాంటి వారికైనా మ‌తి పోవాల్సిందే..

స్లిప్ డ్రెసెస్‌..!

కాస్త స్లిమ్ అయ్యారంటే చాలు ఈ స్లిప్ డ్రెసెస్ స‌మ్మ‌ర్ లో మీకు బెస్ట్ పార్టీ ఔట్ ఫిట్‌. ఫుల్ స్లీవ్స్ లో స్ట్రిప్స్ తో వ‌చ్చే ఈ టాప్- స్లిమ్ లుక్ లో ఉన్న‌వారికి అదిరిపోతుంది. పార్టీ వేర్ గానూ బావుంటుంది. బీచ్ రిసార్ట్స్‌లోనూ బెస్ట్ ఛాయిస్‌. స్లిప్ డ్రెసెస్ స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్ బెస్ట్ ఛాయిస్. లాంగ్, షార్ట్ డ్రెసెస్‌గానూ వీటిని డిజైన్ చేయించుకోవ‌చ్చు.

ఫ్రంట్ స్లిట్ స్కర్ట్స్‌..!

కార్పొరేట్ లుక్ కి ప‌ర్ఫెక్ట్ గా సూట్ అయ్యేవి ఫ్రంట్ స్లిట్ స్క‌ర్ట్స్‌. ఈ స్క‌ర్ట్స్ చిన్న క‌ట్ తో డిఫ‌రెంట్‌గా ఉంటాయి. న‌డ‌వ‌డానికి సౌల‌భ్యంగానూ, చూడ్డానికి వెరైటీగానూ కనిపిస్తాయి. కాట‌న్‌, డెనిమ్, స్టైల్ లో ఉండే ఈ స్క‌ర్ట్స్‌ సమ్మర్ లో బెస్ట్ ఛాయిస్‌. జీన్స్ టైప్ లో కూడా ఈ స్క‌ర్ట్స్ ఉంటాయి. వ‌ర్కింగ్ విమెన్ వీటిని చూజ్ చేసుకుంటేట బాగుంటుంది. హై హీల్స్ వీటికి కాంబినేష‌న్. మీరు పొడ‌గ‌రి అయితే ఫ్లాట్స్ షూస్ కూడా వాడొచ్చు. డీసెంట్ వాస్కోట్‌, లేదా ఫుల్ షర్ట్ దీనికి ప‌ర్ఫెక్ట్ మ్యాచ్‌. లంచ్ లేదా బిజినెస్ మీటింగ్‌కు బెస్ట్.

చెక్స్‌.. స్ట్రైప్స్.. డాట్స్‌..!

స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్‌లో ఇప్పుడు బాగా చెక్స్‌, లేదా పెద్ద డాట్స్ ఉన్న క్లాత్ నే వాడుతున్నారు. అట్రాక్టివ్ గా ఉండే ఈ డిజైన్స్ ష‌ర్ట్స్‌, స్క‌ర్ట్స్‌లో వాడుతున్నారు. చెక్స్ స్ట‌యిల్ అన్ని క్లాత్ ర‌కాల‌పై సూట్ అవుతుంది. ఇక ఈవెనింగ్ పార్టీ వేర్ గా డాట్స్ ఉన్న క్లాత్‌ను వాడుతున్నారు. కాట‌న్, క్రీప్‌, షిఫాన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.

గో ఆరెంజ్‌..!

ఆరెంజ్ క‌ల‌ర్ ఇప్పుడు న్యూ ట్రెండీ ఫ్యాష‌న్. అటు డార్క్ ల‌వ‌ర్స్ కి, లైట్ క‌ల‌ర్ ల‌వ‌ర్స్ ఇద్ద‌రు ఇష్ట‌ప‌డే గ్లోవీ క‌ల‌ర్ ఆరెంజ్‌. ముఖ్యంగా స‌మ్మ‌ర్ లో ఆరెంజ్ క‌ల‌ర్ అన్ని ఫ్యాష‌న్ వేర్ల‌ను డామినేట్ చేస్తుంది. బ్లూ స్క‌ర్ట్, ఆరెంజ్ టాప్ ప‌ర్ఫెక్ట్ మ్యాచ్‌, అలాగే ఎమ‌రాల్డ్ గ్రీన్ కూడా. స్కిన్ టోన్ ను బ‌ట్టి డార్క్, లైట్ షేడ్స్ ఉన్న ఆరేంజ్ డిజైన్లను వాడ‌వ‌చ్చు.

మెటాలిక్స్‌..!

అన్ని సీజ‌న్స్‌లోనూ మెటాలిక్ లుక్ ఈవెనింగ్ పార్టీస్ లో బెస్ట్ ఛాయిస్. డ్రెస్ ఏది వేసినా చిన్న జ్యువెల‌రీ వేర్ లేకుండా ఏం బాగుంటుంది. స‌మ్మ‌ర్ లో సిల్వ‌ర్ బెస్ట్ ఛాయిస్‌. డిఫ‌రెంట్ ట్రెండీ మెట‌ల్స్ కూడా జ్యువెల‌రీ సెక్ష‌న్ లో వాడుతున్నారు. అవి వేసుకుంటే ఔట్ ఫిట్‌కు మెరుగులు అద్దిన‌ట్లే.

ఫ్లోర‌ల్‌..!

ఫ్లోర‌ల్ డిజైన్స్ స‌మ్మ‌ర్ మూడ్‌ను మార్చేస్తాయి. పెద్ద‌, చిన్న పూల డిజైన్స్ హాయి గొలుపుతాయి. వెలుతురు విర‌జిమ్ముతూ క్లాత్ అదిరిపోతుంది. ఫ్లోరల్ డిజైన్స్ లైట్ క‌ల‌ర్స్ లో అదిరిపోతాయి. స్క‌ర్ట్స్‌, లాంగ్ గౌన్స్‌, షార్ట్ గౌన్స్ లో వాడ‌వచ్చు.

స‌మ్మ‌ర్ ను త‌రిమేసే ఫ్యాష‌న్ ట్రెండీ టిప్స్ చదివారుగా, ఇంకేం.. ఫాలో అయిపోండి. పార్టీ అయినా, ఆఫీస్ అయినా, ట్రావెలింగ్ అయినా అద‌ర‌గొట్టే లుక్ ఇవ్వండి .. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags