సంకలనాలు
Telugu

పారేసిన సిగరెట్ పీకలు మొలకెత్తేలా చేసిన వీళ్ల ఐడియాకు యావత్ ప్రపంచమే ఫిదా

team ys telugu
7th Aug 2017
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మీకో విషయం తెలుసా..? యేటా 4.5 ట్రిలియన్ సిగరెట్ పీకలు.. అంటే 4లక్షల 50వేల కోట్ల బట్స్ భూమ్మీద పేరుకుపోతున్నాయి. వాటి బరువు 6.9 బిలియన్ పౌండ్స్. అంటే మన లెక్కలో దాదాపు 3,130 టన్నుల పైచిలుకు బరువు. మనకు తెలియకుండా ఎర్త్ మీద ఇంత చెత్త పేరుకుపోతోంది. ఒక్క సిగరెట్ పీకలే ఇంత బరువుంటే, రోజువారీ డంపింగ్ గురించి తలుచుకుంటే గుండె గుభేల్ మంటుంది. ప్లాస్టిక్, రేపర్స్, ఖాళీ బాటిల్స్ పరంగా చూసుకుంటే సిగరెట్ బట్స్ వల్లనే పర్యావరణానికి అతిపెద్ద ముప్పు దాపురించింది. ఇవి ఎవరో చెప్తున్న లెక్కలు కావు.. ఓషన్ ట్రాష్ ఇండెక్స్, ఓషన్ కన్సర్వెన్సీ వివరిస్తున్న వాస్తవాలు. చిన్న సిగరెట్ పీక పడేస్తే పర్యావరణానికి ఇంత డేంజరా అని ఆశ్చర్యపోకండి. పీకే కదాని పారేస్తే అది మన పీక పట్టుకుంటుంది. ఇందాక చెప్పుకున్న లెక్కలే సాక్ష్యం.

image


సిగరెట్ అనగానే అందులో వుండే పొగాకు ఆరోగ్యానికి హాని చేస్తుందని అందరికీ తెలిసిన కామన్ పాయింట్. కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు చెప్తే మైండ్ బ్లాంకై పోతుంది. పొగాకు హాని చేస్తుంది కరెక్టే. కానీ ఎంతసేపూ టుబాకోని ఆడిపోసుకోవడమే కాదు.. అది నింపిన కాయితం చుట్ట, దాని కొసన పీక సంగతి తెలుసుకుంటే అవాక్కైపోతారు.

సిగరెట్ విషయంలో పేపరే నెంబర్ వన్ విలన్. దాంతో పోల్చుకుంటే పొగాకుదెంత.? పిల్లిపిసరంత..!! సిగరెట్ పేపర్ ను అల్లాటప్పాగా తయారుచేయరు. ఒకసారి ముట్టిస్తే చివరిదాకా కాలాలంటే, దాని వెనుక చాలా తతంగమే నడుస్తుంది. 99శాతం రసాయనాలు కలుపుతారు. ఇంకా వివరంగా అర్ధం కావాలంటే హాలీవుడ్ మూవీ ఇన్ సైడర్ చూడండి. అందులో సిగరెట్ పేపర్ ను ఎలా తయారు చేస్తారో చూపిస్తారు. పొగాకుతో సిగరెట్ కు అడిక్ట్ అవడం కంటే.. దానికోసం వాడిన పేపర్ వల్లనే అతి తక్కువ సమయంలో బానిస అయిపోతాం. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇంతకూ ఏమేం మిక్స్ చేసి ఆ పేపర్ తయారు చేస్తారంటే..

image


బ్యూటేన్ (లైటర్ ఫ్లూయిడ్) టోలెన్ (పారిశ్రామిక ద్రావకం) నికోటిన్( క్రిమిసంహారకం) అసిటిక్ యాసిడ్, మెథెనాల్ (రాకెట్ ఇంధనం) అసిటోన్, కాడ్మియం, అర్సెనిక్, బెంజిన్, దాంతోపాటు అమ్మోనియా( టాయిలెట్ క్లీనర్) హెక్సామైన్ ఇంకా అనేక రకాల రసాయనాలు కలిపి పేపర్ ను అతిపలుచగా, పీల్చినాకొద్దీ కాలిపోయేలా తయారు చేస్తారు. ఆ పేపరే మనల్ని సిగరెట్ కు బానిసలుగా మారుస్తుంది. ఆ లెక్కన పొగాకు ప్రభావం పర్సంటేజీ చాలా తక్కువ. ఇక పీకల తయారీలోనూ తక్కువేం లేదు. ప్రమాదకర సెల్యులోజ్ ఎసిటేట్ అనే నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఫిల్టర్ వాడతారు. అది పర్యావరణానికి అత్యంత ప్రమాదకారి.

సరే, పేపరంటే కాలిపోతోంది.. యాష్ రాలిపోతోంది. మరి పీకల పరిస్థితేంటి? అవి ఎప్పటికి భూమిలో కలిసిపోవాలి? ఒక్క బట్ డీకంపోజ్ కావడానికి దాదాపు పదేళ్లు పడుతుంది. రోజుకి కొన్ని లక్షల కోట్ల సిగరెట్ పీకలు భూమ్మీద పేరుకుంటూ పోతుంటే భవిష్యత్ సంగతేంటి?

చాలామంది పర్యావరణవేత్తలను కలవరపెట్టే అనేక అంశాల్లో సిగరెట్ పీకలొకటి. వేద్, చేతన్ రాయ్ అనే ఇద్దరు మిత్రుల ఆవేదన కూడా అదే. మనిషిని పాడుచేయకుండా సిగరెట్లను ఎలాగూ ఆపలేం. కనీసం పీకల నుంచైనా భూమికి విముక్తి కలిగించాలి. ఇద్దరి మనసులో ఇదే బలంగా నాటుకుంది. సిగరెట్ తాగి పీకను పడేస్తే కొంతకాలానికి అది డీకంపోజ్ అయి మొలకెత్తి మొక్కగా మారాలి? విఠలాచార్య సినిమా ట్రిక్ కాదు. నిజంగానే అలాంటి పీకల్ని తయారుచేస్తే ఎలావుంటుంది? ఆలోచన అద్భుతంగా ఉంది. అలా జరిగితే ఒక మనిషి సగటున రోజుకి ఐదు నుంచి ఆరు మొక్కలు నాటేందుకు పరోక్షంగా సాయం పడ్డట్టే.

image


కర్మ టిప్స్. వేద్, చేతన్ రాయ్ బ్రెయిన్ చైల్డ్. ముంబై, ఢిల్లీలో హై ఫ్లయింగ్ అడ్వర్టయిజింగ్ జాబ్స్ వదులకుని యూనిక్ వెంచర్ స్టార్ట్ చేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా, వందశాతం ఆర్గానిక్, బయోడీగ్రేడబుల్ హాండ్ మేడ్ సిగరెట్ పీకల్ని తయారుచేయడమే కర్మటిప్స్ చేసేపని. అలా తయారుచేసిన సిగరెట్ పీకని భూమ్మీద పడేస్తే కొన్ని రోజుల్లోనే అది మొలకెత్తుతుంది.

విచిత్రమే మరి. సిగరెట్ ప్యాకెట్ మీద తాగొద్దు పోతారు అని రాసుంటుంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. అంటూ ప్రభుత్వ పరంగా ధూమపాన వ్యతిరేక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అన్నిటికి మించి కాలానుగుణంగా పెరుగుతున్న సిగరెట్ ధరలు. అయినా సరే, పొగ రాయుళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడంలేదు. ఇది కఠోరమైన నిజం. ఈ నేపథ్యంలో అందరిచేత సిగరెట్ మాన్పించాలనే ప్రయత్నం అమాయకత్వం. అందుకే అట్లీస్ట్ సిగరెట్ల తయారీలో వాడే పీకల నుంచైనా జనానికి, భూమాతకు ఎంతోకొంత విముక్తి కలిగిస్తే అదే పదివేలు. కర్మ టిప్స్ మూలసిద్ధాంతం ఇదే.

అందుకోసం ముంబై వదిలి బెంగళూరుకి షిఫ్టయ్యారు ఇద్దరు. ఆర్గానిక్ పేపర్ తో సిగరెట్ పీకల్ని తయారుచేసే పనిలో పడ్డారు. ఒక్కో పీకలో ఒక్కో రకమైన విత్తనం కూర్చుతారు. పూలమొక్కల విత్తనాలు, హెర్బల్ సీడ్స్.. ఇలా. అవి పైకి కనిపించవు. సాధారణ పీకల్లాగే తెల్లగా, గోధుమ రంగులో ఉంటాయి. సిగరెట్ తాగిన తర్వాత ఆ పీకని భూమ్మీద పడేస్తే కొన్నాళ్లకు మొలకెత్తుతుంది. అందమైన పూలమొక్కలాగో, ఆయువు పెంచే హెర్బల్ ప్లాంటులాగో వికసిస్తుంది. కాకపోతే ఒక్కటి.. పీకను అడ్డగోలుగా పడేయొద్దు. తొట్టిలో మట్టి నింపి దాన్నే యాష్ ట్రేగా వాడాలి. అందులోనే పీకను గుచ్చాలి. చిన్నపాటి గార్డెన్ లాంటిది క్రియేట్ చేసి ప్రయోగాత్మకంగా చేసి చూశారు. వాళ్ల ఐడియా అద్భుతంగా మొలకెత్తింది.

ప్రస్తుతానికి పీకల తయారీకోసం చేసిన బుక్ లెట్లను ఇండియా సహా యూకే, వాషింగ్టన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, శ్రీలంక, మలేషియాలో పెద్ద సంఖ్యలో సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రయోగాత్మక మార్కెట్ స్టార్ట్ చేశారు. దాంతో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సిగరెట్ తాగేవాళ్లంతా ఈ రకమైన పీకలతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. సిగరెట్ పీక ఎలా మొలకెత్తిందో ఫోటోలతో సహా కర్మ టిప్స్ ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ చేస్తున్నారు. ఎలాంటి ప్రచారం ఆర్బాటం లేకుండా కేవలం రెండేళ్లలో, నోటిమాట, సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా కర్మ టిప్స్ మహోన్నత ఆశయానికి బాటలు పరుచుకుంటున్నాయి.

image


ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. కర్మ టిప్స్ లో పీకలు తయారుచేసే వాళ్ల ముత్తాత ముత్తాతలంతా 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల దగ్గర పేపర్ తయారు చేశారు. వాళ్ల వారసులే కర్మటిప్స్ లో పనిచేస్తున్నారు. సంప్రదాయబద్దంగా, ఇసుమంత రసాయనం వాడకుండా, ఒక్కచెట్టునూ నరకకుండా, ఎలాంటి కలపగుజ్జునూ ఉపయోగించకుండా పీకల కోసం పేపర్లు తయారుచేస్తున్నారు. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags