సంకలనాలు
Telugu

మీకు మంచి డైట్ ఫుడ్ కావాలంటే ఈ దంపతులిద్దరినీ అడగండి

ఆహారంతో పాటు ఆరోగ్యం ప్రసాదిస్తున్న భార్యాభర్తలు

15th Jan 2017
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

గోపి, సనీషరావ్ భార్యాభర్తలు. రోజులో సగంకంటే పైనే గోపి ఆఫీసులో ఉంటాడు. ఆయన భోజనం అంతా అక్కడే. సనీష ప్రెగ్రన్సీ టైంలో మంచి డైట్ అవసరమొచ్చింది. చాలామంది న్యూట్రిషనిస్టులను కలిశారు. రకరకాల ఫుడ్ డెలివరీ సర్వీసులను సంప్రదించారు. ఎక్కడా వర్కవుట్ కాలేదు. ఇలా అయితే లాభం లేదని వాళ్లే ఒక నిర్ణయానికొచ్చారు.

బ్యాలెన్స్-డ్ మీల్ తయారు చేయడమన్నది అనుకున్నంత ఈజీ కాదు. చాలా టైం తీసుకుంటుంది. కానీ రెడీ టు సర్వ్ అంటే మాత్రం మంచి రెస్పాండ్ వుంటుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే లీన్ స్పూన్.

పర్సనల్ సేవింగ్స్ కొంత, బ్యాంక్ లోన్ మరికొంత పోగేసి ఒక మంచి చేయితిరిగిన వంటవాళ్లతో టీం ఫామ్ చేశారు. హైదరాబాదుకు చెందిన ఈ లీన్ స్పూన్ స్టార్టప్ కాన్సెప్ట్ ఒకటే. ప్రజలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. కస్టమర్ల వయసు, ఎత్తును, బరువు, హెల్త్ డిటెయిల్స్ ను బట్టి, వాళ్లకేం డైట్ అవసరమో మెనూ ద్వారా సూచించి, వాళ్ల ఆరోగ్యానికి సహకరించే ఫుడ్ సర్వ్ చేయడమే లీన్ స్పూన్ ఉద్దేశం. తేడా ఏంటంటే బయట న్యూట్రషనిస్ట్ ఫలానా తినమని సలహాలిస్తాడు. కానీ లీన్ స్పూన్ సలహాతో పాటు అవసరమైన ఆహారాన్ని వండి జాగ్రత్తగా పంపిస్తుంది.

image


ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే

చెఫ్, న్యూట్రిషనిస్టులు కలిపి లీన్ స్పూన్ లో మొత్తం 20 మంది ఉంటారు. ఇందులో ఉండే న్యూట్రిషనిస్టులకు మంచి సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. హాస్పిటల్ రంగంలో పనిచేసిన అనుభవమూ వుంది. అలాంటి వారినే ఎంపిక చేసుకున్నారు. చెఫ్స్ కూడా అంతే. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కలిగి, ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారినే తీసుకున్నారు. మొత్తం 8 మంది వంటవాళ్లుండగా, ఒక న్యూట్రిషనిస్టు ఉన్నాడు.

వీళ్లు అందించే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు సమపాళ్లలో ఉంటాయి. ఒకసారి వచ్చిన మెనూ మళ్లీ రిపీట్ కావడానికి మినమం పదివారాలు పడుతుంది. అన్ని రకాల డైట్ ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు.

వారం, నెల, మూడు నెలల బేస్ మీద సబ్ స్క్రిప్షన్ ఆఫర్ చేస్తారు. వారానికైతే ఐదు, నెలకు 22, మూడు నెలలకు 70 మీల్ ప్యాక్స్ అందిస్తారు. న్యూట్రిషన్ సలహాతో మనకు ఏం ఫుడ్ అవసరమో అదే ఆర్డర్ ఇవ్వొచ్చు. లేదంటే సొంతంగా కావల్సినవి తెప్పించుకోవచ్చు. లంచ్ అయినా, బ్రేక్ ఫాస్ట్ అయినా. ప్రస్తుతానికి సబ్ స్క్రిప్షన్ హైదరాబాదుకు మాత్రమే పరిమితం. ప్యాకింగ్‌ ఎంతో జాగ్రత్తగా చేస్తారు. ఆహారం ఒలికిపోకుండా, వేడి తగ్గకుండా, తాజాగా ఉండేలా జాగ్రత్త పడతారు.

ఫోన్ ద్వారాగానీ, ఈమెయిల్, చాట్ ద్వారా గానీ న్యూట్రిషనిస్టులు అందుబాటులోకి వస్తారు. ఏ ఫుడ్ అయితే బెటరో క్లయింట్ల వయసు, బరువును, ఇదివరకు ఫాలో అవుతున్న మెడిసిన్ బట్టి చెప్తారు. తరచుగా వెబినార్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి పలు అంశాలపై మాట్లాడుతుంటారు. వాళ్ల బ్లాగ్‌ లో ఆరోగ్యం, ఆహారంపై అనేక వ్యాసాలు అప్‌డేట్‌ చేస్తుంటారు. కార్పొరేట్‌ హెల్త్‌ - వెల్‌నెస్‌ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.

image


బ్రేక్ ఫాస్ట్, లంచ్ కలిపి నెలకు రూ. 9వేల సబ్ స్క్రిప్షన్. మూడు నెలలకైతే 25వేలు. అంటే సగటుగా ఒక మీల్ ప్యాక్ రూ. 175 నుంచి 205లో వస్తుందన్నమాట. న్యూట్రిషన్ సలహాలు, పోర్షన్ కంట్రోలింగ్, డెలివరీ టాక్స్ వగైరా కలుపుని మొత్తం అందులోనే.

ప్రస్తుతానికి లీన్ స్పూన్ నెలకు వెయ్యి ఆర్డర్లు నమోదు చేస్తోంది. ప్రతీ మీల్ డెలివరీ మీద మార్జిన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ సంవత్సరం హైదరాబాదులోనే మరో ఔట్ లెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఈసారి టార్గెట్ నెలకు రూ. 25వేలు పెట్టుకున్నారు.

వచ్చే రెండు మూడు ఏళ్లలో కస్టమర్ల కోసం లెవరింగ్ టెక్నాలజీ, వేరబుల్స్ లాంటి సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలు, జన్యుపరీక్షలు కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2017 ముగిసేనాటికి హెల్త్ కేర్ ఇండస్ట్రీ 160 బిలియన్ డాలర్లను తాకుతుంది. 2020 నాటికి ఆ సంఖ్య 280 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని అంచనా. డైట్ ప్లాన్ అనేది హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అప్ కమింగ్ బిజినెస్.

ఫస్ట్ ఈట్ పేరుతో ఇలాంటి స్టార్టప్ కంపెనీ ఒకటి గుర్గావ్ లో ఉంది. అది ఆరోగ్యకరమైన ఆహారం అందిచండంతో పాటు జనాలకు హెల్త్ పట్ల, తినే తిండి విషయంలో ఎంతో చైతన్యం తెస్తోంది. ఢిల్లీ, గుర్గావ్ లో హెల్దీ బాక్స్ అనే మరో సంస్థ ఆర్గానిక్ ఆహారాన్ని అందిస్తోంది. గ్రుబిట్ కేటర్స్ అనే ముంబై బేస్ట్ సంస్థ విభిన్నమైన డైట్ ఫుడ్ సర్వ్ చేయడంతో పాటు అవేర్నెస్ తెస్తోంది.

లీన్ స్పూన్ వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags