సంకలనాలు
Telugu

కోరుకున్న స్టార్టప్ కోసం లండన్ వదిలిన ఎంబిఎ గ్రాడ్యుయేట్

Amuktha Malyada
13th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లండన్‌లో ఎంబిఏ పూర్తి చేసిన మొనీష, ఎన్నో జాబ్స్ కోసం అప్లై చేసుకుంటే, ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం లభించింది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కోరుకునే ఆకర్షణీయమైన జీతం, మంచి వర్క్ రోల్ ఆమెకు వచ్చింది. "అయినప్పటికీ, ఎక్కడో, ఏదో తెలియని వెలితి. నేను ఆ ఉద్యోగంతోనే తృప్తి పడాలని అనుకోలేదు. జాబ్ వదిలేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన నేను ఒక రోజు రిజైన్ చేశాను. నా హోం టౌన్ ముంబై వచ్చి, నాకంటూ నేనే పనిచేయాలనుకున్నాను" అంటుంది మొనీషా.

తల్లిదండ్రుల అండ దండ, స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన, కాస్మొటాలజీ మీద ఉన్న మక్కువ...ఈ మూడు మొనీషా గిడ్వానిని యంగ్ ఆంట్రప్రెన్యూర్‌గా మార్చాయి. ఆ మూడు ఫాక్టర్స్ "సెడక్షన్ లాస్‌వెగాస్" ఆవిర్భావానికి తోడ్పడ్డాయి. తన బిజినెస్ ప్రారంభానికి క్రెడిట్ అంతా పేరెంట్స్‌కే ఇస్తుంది మొనీషా. అప్పటిదాకా వాళ్లు దాచుకున్న డబ్బంతా తన బిజినెస్ కోసం ఇచ్చారని మొనీషా అంటుంది.

image


మొనీషా గిడ్వాని

"ఫార్మసి చదువుతున్న రోజుల నుంచి, డ్రగ్స్ మీద కాకుండా నా మనసంతా కాస్మొటాలజీ మీదే ఉండేది. ఏదో ఒక రోజు నేను కాస్మొటిక్ లైన్‌లోకి వెళ్తానని అనుకునేదాన్ని. క్వాలిటి విషయంలో రాజీ పడకుండా, అందరికీ అందుబాటులో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తీసుకురావాలన్న ఆలోచన బలంగా ఉండేది", అంటున్న మొనీషా. లండన్‌లో అన్నీ వదిలేసి, ఆంట్రప్రెన్యూర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాలన్న తన ఆలోచనను తండ్రితో పంచుకుంది మొనీషా. దాంతో వెంటనే తండ్రి అంగీకారం తెలిపాడు.

కస్టమరే రాజు

"కస్టమరే నీ బిజినెస్ ను ప్రభావితం చేయగలడు. దాన్ని నమ్మే నేను, వారు కోరుకున్న దానికంటే ఎక్కువే ఇవ్వాలని భావించా" అంటున్న మొనీషా, బిజినెస్‌లో ఎలాంటి ఎమోషన్స్‌కు తావు ఉండకూడదని, బలహీనమైన వారు ఆ పని చేయలేరని భావిస్తుంది. ఎమోషన్స్ అన్నింటినీ దాచిపెట్టుకోవాలని నేర్చుకున్నానని అంటుంది మొనీషా. "ఎవరైనా నువ్వు ఆ పని చేయలేవని అన్నపుడు నిరుత్సాహపడకూడదు. వారే బెస్ట్ క్రిటిక్స్ అని అర్థం చేసుకోవాలి " అంతుంది మొనీషా.

దీంతోపాటే బిజినెస్‌లో ఎంప్లాయీస్‌ను హైర్ చేసుకోకూడదని నేర్చుకుంది. హైర్ ఎంప్లాయీస్ బిజినెస్‌ను తమ కుటుంబ బాధ్యతగా భావిస్తారు అంటుంది మొనీషా. వారు ఒక్కోసారి బిజినెస్‌ను నిలబెట్టవచ్చు లేదా బ్రేక్ చేయవచ్చని అంటుంది. అలాగే తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ వినాలని తెలుసుకుంది.

స్టార్టప్

నెయిల్ పాలిష్‌తో తన బ్రాండ్‌ను ప్రారంభించింది మొనీషా. హానికరమైన DBP, ఫార్మాల్డిహైడ్, టాలిన్ ప్రొడక్ట్స్ లేకుండా ప్రొడక్ట్ విడుదల చేయాలనుకుంది. ఈ హానికారక రసాయనాలన్నింటినీ విదేశాల్లో బ్యాన్ చేశారు. తను అనుకున్న ప్రొడక్ట్‌ను చిన్న మొత్తంలోనైనా ఉత్పత్తి చేయడానికి బెస్ట్ మాన్యుఫాక్చర్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నాని అంటుంది.

బిజినెస్ ప్రారంభించిన తొలి రోజుల్లో బాగా శ్రమించించాల్సి వచ్చింది. "మా ప్రొడక్ట్స్ సాంపిల్స్ తీసుకుని ఎన్నో పార్లర్స్, రిటైల్ ఔట్ లెట్స్ చుట్టూ తిరిగాం. పార్లర్స్ మా మొదటి కస్టమర్లయ్యారు. మా ప్రొడక్ట్ క్వాలిటీని అర్ధం చేసుకుని మమ్మల్ని అభినందించారు" అంటుంది మొనీషా. దేశీయ మార్కెట్లో రిటైల్ సెగ్మెంట్ అంతా క్రెడిట్ మీదనే ఉండడంతో మొనీషా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మొదట్ళో ఒక ఏరియాకే పరిమితమయి, ఆ తర్వాత మంచి రిటైలర్లను పట్టుకుని, ముంబైలోని 300 బ్యూటీ పార్లర్లకు విస్తరించింది.

image


మొనీషా గిడ్వాని అంతర్గతం

"నెయిల్ పాలిష్ ను లాంచ్ చేయడానికి ప్రధాన కారణం, బ్రాండ్ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడాలనే. ఆ తర్వాత లిప్ స్టిక్‌ను 6 ట్రెండీ షేడ్స్‌లో రిలీజ్ చేస్తే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. దాని తర్వాత వాటర్ ప్రూఫ్ కాజల్ విషయంలోను అంతే. మా లిప్ స్టిక్స్ జనాలకు నచ్చాయని అర్థమయ్యాక మరో 12 షేడ్స్ లాంచ్ చేస్తే, ముంబై అంతటా అవి చక్కగా అమ్ముడవుతున్నాయి" అంటుంది ఆంట్రప్రెన్యూర్ మొనీషా.

టెక్నాలజి ఉపయోగం

కస్టమర్లు ఒక్కసారి తమ ప్రొడక్ట్స్ వాడితే అవి వారికి విపరీతంగా నచ్చుతాయని, వాటిని అభిమానిస్తారని ముందునుంచి అనుకుంటుండేది మొనీషా. "బ్లాగర్స్‌తోను, ఫ్యాషనిస్ట్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవాళ్లం, వారికి మా ప్రొడక్ట్ సాంపిల్స్ పంపించేవాళ్లం. వారికి మా ప్రొడక్ట్స్ నచ్చినపుడు మాకు సంతృప్తి కలిగేది. మా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంస్‌లో, కస్టమర్లు మా ప్రొడక్ట్స్‌కు అలవాటు పడేలా గివ్ అవే గా ఉంచేవాళ్లం. అలా మౌత్ పబ్లిసిటిని కలిగించాం" అంటుంది మొనీషా. ఈ ఏడాది ముగిసేనాటికి గుజరాత్‌లో తమ ప్రొడక్ట్స్‌ను ప్రవేశపెట్టడంతో పాటుగా, ముంబైలో సేల్స్‌ను డబుల్ చేయాలని భావిస్తోంది మొనీషా. 2016 అంతానికి మూడు నుంచి ఆరు రెట్లు "సెడక్షన్ లాస్‌వెగాస్" ప్రొడక్ట్స్ పెరిగేలా చేయాలని ప్లాన్ చేస్తోంది.

మొనీషాకు కొన్ని ప్రశ్నలు

" మీరు చాలా యంగ్, మీ బాస్ ఎవరు ? " అన్న ప్రశ్న మొనీష రెగ్యులర్‌గా ఫేస్ చేస్తుంది. ఆ ప్రశ్న మొదట్లో బాధించినా, దాన్ని తన బలంగా మార్చుకుంది. " దాన్ని నేను నా బలంగా మలుచుకున్నాను. నా సహచరులు కోరుకుంటుంది అదే కదా" అంటుంది మొనీషా. ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అంటే భారత్‌లో ఇప్పటికీ సీరియస్‌గా తీసుకోరని, మహిళలంటే వండి పెట్టడం, ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని పెంచడంగా మాత్రమే భావిస్తున్నారని మొనీషా అంటుంది. మహిళలు ఇవన్నీ ఖచ్చితంగా చేస్తూ కూడా బిజినెస్‌ను విజయవంతంగా నడిపిస్తారని అంటుంది.

దీంతోపాటే, పెళ్లయిన తర్వాత బిజినెస్‌ను ఏం చేస్తారని ప్రశ్న తనను బాధిస్తుందని అంటుంది మొనీషా. "ఇప్పటికీ భారతీయ సమాజం పెళ్లయిన తర్వాత కెరీర్ ఎండ్ అయినట్లేనని అనుకుంటుంది. కానీ, నా పేరెంట్స్ అలా భావించకుండా, నాకు ముందునుంచీ సహాయ సహకారాలు ఇస్తున్నందుకు సంతోషపడ్తున్నాను" అని మొనీషా అంటుంది.

మేరీ కే కాస్మొటిక్స్ వ్యవస్థాపకురాలైన మేరీ కేను తన మోడల్‌గా భావించడంతో పాటుగా, ఆమె ప్రిన్సిపుల్ అయిన "ఈ ప్రపంచంలో నువ్వు కావాలనుకున్నా దేన్నయినా సాధించగలవు, అయితే దాని నువ్వు గట్టిగా కోరుకోవాలి, దాని కోసం ఏదయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి" అనే విషయాన్ని కూడా పాటిస్తుంది మొనీషా.

పేరెంట్స్ అందించిన ప్రోత్సాహం, స్పూర్తి

కుటుంబం కోసం తీవ్రంగా శ్రమించిన తండ్రి మొనీషాకు ఆదర్శం. "నేను అడిగిన వెంటనే ఆయన ఊరికే ఎన్నడు డబ్బులు ఇచ్చేయలేదు, బిజినెస్ ప్రపోజల్‌ను, దాని పట్ల నాకున్న డెడికేషన్‌ను అడిగాక మాత్రమే ఇచ్చేవారు" అంటుంది. ఇక తల్లి తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్తుంది. "నేను ఎక్కువగా బాధపడ్డ రోజు, ముందు ముందు మంచే జరుగుతుంది, బాధపడొద్దని చెప్పేది" అంటుంది మొనీషా.

ఇక తన వెంచర్ గురించి చెప్తూ, "అందం అనేది సమ్మోహనంగానే ఉంటుంది, అందంగా కనపడాలని ఎవరు కోరుకోరు?" అంటూ ముగించింది మొనీషా.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags