సంకలనాలు
Telugu

నీళ్లు ఎప్పుడొస్తాయో మెసేజ్ పంపేందుకు పుట్టుకొచ్చిందో సంస్థ

కాలేజీ చదువు కూడా పూర్తి చేయని కుర్రాడునీటి పంపిణీ లోపాలను తెలిపే నెక్స్ట్ డ్రాప్ నీళ్లు గురించి గంటలు గంటలు వేచిఉండే వ్యవస్థకు స్వస్థినీళ్లు ఎప్పుడు వదులుతారో గంట ముందే ఎస్ఎంఎస్నెలకు రూ.10 ఛార్జ్ వసూలు

CLN RAJU
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్రతి ఏటా 20 బిలియన్ డాలర్ల ఆదాయం భారత్‌కు విదేశాల నుంచి వస్తోంది. ప్రపంచం మొత్తంలో ఇది సుమారు 10 శాతం. డిగ్రీ పూర్తి చేసుకున్న కుర్రాళ్లంతా పై చదువులకోసం అమెరికాకు చెక్కేస్తున్నారు. 2011లో అమెరికాలో చదువులకోసం వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. సిలికాన్ వ్యాలీ, న్యూయార్క్ లాంటి నగరాల్లో వాళ్లు ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. కానీ ఈ స్టోరీ మాత్రం దీనికి భిన్నం. అమెరికాలో కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసిన ఓ కుర్రాడు భారత్‌లో ఓ సిలికాన్ వ్యాలీ కోసం పయనమయ్యాడు.

image


ఇది చాలా సవాల్‌తో కూడుకున్న పని. కానీ దానికి తగ్గ ఫలితముంది. దాని వల్ల చాలా మంది జీవితాల్లో వచ్చిన మార్పును నేను గమనించాను.. అంటాడు డెవిన్ మిల్లర్. నెక్స్ట్ డ్రాప్ (NextDrop) సాఫ్ట్ వేర్ రూపకర్త అతనే. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు బెర్కెలీ సివిల్ ఇంజినీరింగ్ కాంపిటీషన్ కోసం ప్రాజెక్టు వర్కులో భాగంగా ఇది ప్రారంభమైంది. గతేడాది ఈ 20 ఏళ్ల కుర్రాడిని నెక్స్ట్ డ్రాప్ సీఈవో, సహవ్యవస్థాపకుడు అను శ్రీథరన్ కలిశాడు. భారత్‌లో నీటి సమస్యను పరిష్కరించడంలో సాయపడాలని కోరాడు. “కాలేజీ చదువు మద్యలోనే వదిలేసి నా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడం కోసం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది. ఆసియాలో చాలా ప్రాంతాలు తిరిగాను. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకున్నాను. ”

నెక్స్ట్ డ్రాప్ సీఈవో అను శ్రీధరన్, ఇతర సభ్యులతో  డెవిన్ మిల్లర్

నెక్స్ట్ డ్రాప్ సీఈవో అను శ్రీధరన్, ఇతర సభ్యులతో డెవిన్ మిల్లర్


నెక్స్ట్ డ్రాప్ ప్రధాన ఉత్పత్తి సాఫ్ట్‌వేర్. దాని స్మార్ట్ గ్రిడ్ లైట్ “Smart Grid ‘Lite’” సొల్యూషన్ నగరాల్లో నీటి సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అందరికీ చేరవేస్తుంది. వాల్వ్‌మెన్ రిజర్వాయర్లలోని నీటిని ప్రతిరోజూ కొలుస్తాడు. నెక్స్ట్ డ్రాప్ ఆ సమాచారాన్ని ఇంజినీర్లకు పంపుతుంది. ఏ ఏరియాకు నీళ్లు ఎప్పుడు వదలాలి, ఎంత వదలాలి..అనే అంశాలను ఇంజినీర్లే నిర్ణయిస్తారు. వినియోగదారులు నెక్స్ట్ డ్రాప్‌కు కాల్ చేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా తమ ఏరియాకు నీళ్లు ఎప్పుడు వస్తాయో కనుక్కోగలుగుతారు. సమీపంలోని ప్రాంతాలకు నీరు వచ్చినప్పుడు గంట లేదా అరగంట ముందుగానే వాళ్లకు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలిసిపోతుంది. వాల్వ్‌మెన్ ఇచ్చిన సమాచారాన్ని నివాసితులు నెక్స్ట్ డ్రాప్‌కు కాల్ చేసి నిర్ధారించుకుంటూ ఉంటారు.

“ప్రభుత్వానికి, పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చుతుందనేది మా ఆలోచన. మొబైల్ ఫోన్లతో అనుసంధానించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఇది చేరువవుతుంది. అలాగే ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వం తెలుసుకుంటుంది. పైపుల లీకేజీ, నీళ్లు సన్నగా రావడం లాంటి వివరాలను ప్రతిరోజూ మేం సేకరిస్తుంటాం. దీన్ని ప్రభుత్వానికి చేరవేయడం వల్ల పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది..’ అంటారు డెవిన్.

నెక్స్ట్ డ్రాప్‌ను 2011లో కర్నాటకలోని జంటనగరాలు హుబ్లి-ధార్వాడ్‌లలో ఇది ప్రారంభమైంది. నీళ్ల కోసం సుదూరప్రాంతాలకు వెళ్లడం, సైకిళ్లపై నీళ్లు తెచ్చుకోవడం, బకెట్లతో కనిపించే మనుషులు, నీటి సౌకర్యమే లేని ప్రాంతాలు.. లాంటి దృశ్యాలన్నింటినీ డెవిన్ గుర్తుచేసుకుంటున్నాడు. “అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మనసు ద్రవిస్తుంది. అలాంటి వాళ్ల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో.. ఇలాంటి వాటిని నేను మరిచిపోవాలనుకోవట్లేదు. వాటిని నా పుస్తకంలో రాసుకున్నాను.. ముసలివాడినయినప్పుడు గుర్తుచేసుకుంటాను”.. అంటాడు డెవిన్.

హుబ్లిలో 16వేల కుటుంబాలకు పైగా నెక్స్ట్ డ్రాప్ సేవలందిస్తోంది. ప్రతివారం వాళ్లకు నీళ్లు వస్తాయా.. రావా..అనే సమాచారం అందుతుంది. ఒకవేళ రాకపోతే ఎందుకు రావో కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ డ్రాప్ లేనప్పుడు వాళ్లంతా నీళ్లకోసం కనీసం 20 నుంచి 40 గంటలపాటు ఎదురుచూసేవాళ్లు. ఒక్కోసారి రోజంతా పని మానేసి నీళ్లకోసం ఇంటి దగ్గరే ఉండిపోయేవాళ్లు.

ఇప్పుడు నెక్స్ట్ డ్రాప్ బెంగళూరుకు కూడా విస్తరించింది. 5 వందల కుటుంబాలకు సేవలందిస్తోంది. త్వరలోనే సిటీ మొత్తానికి చేరువవుతుంది. “బెంగళూరులో కోటి 10 లక్షల జనాభా ఉంది.అయితే.. కేవలం 20 లక్షల మందికి మాత్రమే నీరు అందుతోంది. ఇక్కడ అందరికీ నీరందడం లేదు. ఇదే ఇక్కడ పెద్ద సమస్య..” అంటాడు డెవిన్. వీధుల్లో వెళ్తున్నప్పుడు పాడైపోయిన పైపులను గుర్తించి.. వాటిని నమోదు చేసుకుని వెంటనే సిస్టమ్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. ఎస్.ఎం.ఎస్. అందుకోవడానికి నెలకు రూ.10 నుంచి రూ.25 చొప్పున వసూలు చేస్తారు. ఇది సిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. హుబ్లీలో 25వేల కుటుంబాలు నెక్స్ట్ డ్రాప్‌తో అంగీకారం కుదుర్చుకున్నాయి.

image


నీటి పంపిణీ రంగంలో ఉన్నట్టుగానే ట్రాన్స్‌పోర్ట్ లాంటి మిగిలిన రంగాల్లోనూ ఇదే తరహా సమస్యలుంటాయి అంటాడు డెవిన్. నెక్స్ట్ డ్రాప్ ఇప్పుడు నీటి పంపిణీ రంగంపైన మాత్రమే దృష్టి పెట్టింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్వహణ, రహదారుల నిర్వహణ లాంటి ప్రభుత్వం చేపట్టే అనేక సర్వీసులపైన పని చేయనుంది. వచ్చే రెండేళ్లలో భారత్‌లోని మిగిలిన నగరాలకు విస్తరించేందుకు కృషిచేస్తోంది.

“మేం ఎక్కువ మెసేజులు పంపాలి.. అలాగే మాకు ఎక్కువ కాల్స్ రావాలి. అందుకోసమే మా ప్రయత్నం.” అంటాడు డెవిన్. అందుకోసం నెక్స్ట్ డ్రాప్ చిన్న వాయిస్ కాల్స్ అందించే వారితో ఒప్పందం కుదుర్చుకుంది. “ప్రజలేమనుకుంటున్నారో మేం వినాలనుకుంటున్నాం. వాళ్ల సమస్యలన్నింటినీ పరిష్కరించగలమని మేము అనుకోవట్లేదు. అయితే భారత్ లో నీటి పంపిణీ వ్యవస్థ మెరుగుపడేందుకు సాయం చేశాం. భారత్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వినియోగంలో వారు చూపిస్తున్న చొరవ గమనించా.. భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. దేశాభివృద్ధిలో ఎలా భాగం కావాలో, మొబైల్ సిటిజన్స్ గా ఎలా మారారో చూశా.. ఈ మార్పు చాలా సంతోషాన్నిస్తోంది.’ అంటూ ముగించారు డెవిన్..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags