సంకలనాలు
Telugu

విద్యార్థులకు.. పరిశ్రమలకు మధ్య వీళ్లే వారధి

పారిశ్రామిక రంగంపై విద్యార్థుల్లో అవగాహనప్రయోజనకరంగా ఉండే ఇండస్ట్రియల్ టూర్ల రూపకల్పనపరిశ్రమ అవసరాలేంటో, విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పే వ్యవస్థవిద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కసరత్తుఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఇద్దరు యువతీయువకుల ఆలోచన

CLN RAJU
30th Apr 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మన విద్యా వ్యవస్థ లోపాలమయం. చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి చాలా తేడా. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యార్థులను తయారుకావడం లేదు. కోర్సు ఏదైనా ఎలాంటి పరిశీలనానుభవం ఉండటం లేదు. దేశంలో లక్షలాది విద్యార్థులు ప్రతి ఏడాది పట్టా చేతపట్టుకుని కళాశాల నుంచి బయటకు వస్తున్నా..స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగానికి అర్హులు కాలేకపోతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన గురించి ఈ మధ్య వింటున్నా...అవన్నీ పిక్నిక్ టూర్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో చదువుకు అనుభవానికి లంకె కుదరడం లేదు. అలాంటి వ్యత్యాసాన్ని తగ్గించేందుకే విద్యార్థులు, పరిశ్రమలకు వారధిగా నిలుస్తోంది...పర్పుల్ స్క్విరల్ ఎడువెంచర్స్. ఇటు విద్యార్థుల ఆకాంక్షలు తీర్చడమే కాకుండా...పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులను అందిస్తోంది.

ఐఐటీ పట్టభద్రులెవరైనా ఏదైనా గొప్ప మల్టీనేషనల్ కంపెనీలో జాబ్, లేదంటే విదేశాల్లో మంచి వేతనమున్న ఉద్యోగం సంపాదిస్తే చాలు చాలా సంతోషిస్తారు. కానీ ఐఐటీ ముంబై అలుమ్నీ గ్రాడ్యుయేట్ ఆదిత్య గాంధీ...జర్మనీలో ఓ గొప్ప అనుభవంతో తన లక్ష్యాన్ని సాధించేందుకు ఇండియాలో అడుగుపెట్టాడు.

పర్పుల్ స్క్విరెల్ టీమ్

పర్పుల్ స్క్విరెల్ టీమ్


యూరప్‌లో ఉద్యోగ ప్రాధాన్యత గమనించిన ఆదిత్య, పరిశ్రమల క్షేత్రస్థాయి పరిశీలన విద్యార్థులకు ఎంతగానే ఉపయోగపడతాయని భావించాడు. ఇండియాలో ఇండస్ట్రియల్ పర్యటనలు పాఠ్యాంశాల్లో భాగమైనా....అవి విద్యార్థులకు జ్ణానయుక్తంగా ఉండటం లేదు. కానీ యూరప్‌లో అలా కాదు. పరిశ్రమల్లోని వివిధ విభాగాల పనితీరు, క్షేత్రస్థాయి పరిశీలన విద్యార్థుల్లో తమ కెరీర్ పట్ల స్పష్టమైన ఆలోచనిస్తుంది. అలాగే తమకు కావాల్సిన నాణ్యమైన వనరులను పరిశ్రమలు పొందుతాయి.

ఐఐటీ బాంబేలో బీటెక్, ఎంటెక్ పట్టా పొందిన ఆదిత్య ఉద్యోగ వేటలో భాగంగా యూరప్ వెళ్లాడు. ఆర్థిక రంగంలోని ఆప్టివర్ అమ్‌స్టర్ డ్యామ్‌లో డెరివేటివ్స్,ఈక్విటీస్ ఆప్షన్ ట్రేడర్‌గా పని చేశాడు. ‘’ యూరప్ లో ఉండటం, విద్యార్థులతో ముఖాముఖి, ఉద్యోగులను కంపెనీలు రిక్రూట్ చేసుకునే విధానాన్ని అర్ధం చేసుకున్నాను. పర్పుల్ స్క్విరల్ ఎడువెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇదే అనుభవం బీజం వేసింది’’ అని వివరించాడు...25 ఏళ్ల ఆదిత్య.

ఇదే సమయంలో సాహిబా ధంధానియా అనే బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా ఫైనాన్స్ సెక్టార్ లోనే పని చేశారు. డిఈ షా అండ్ కో హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సాహిబాకు...విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల్లో పెంపొందించాలని పట్టుదల. కాలేజీ ద్వారా AISEC తో అనుబంధం కారణంగా ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడమే కాదు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల విద్యార్థులతో నిత్యం సంభాషించడానికి అవకాశం లభించింది. ఇదే క్రమంలో వ్యాపార సామర్థ్యం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి....తర్వాతి కాలంలో ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

పారిశ్రామికరంగంలో అనారోగ్యకరమైన ఉద్యోగాల ఎంపిక పెద్ద సమస్యగా మారిందని మా అధ్యయనంలో వెల్లడైంది’’ అంటున్నారు...ఆదిత్య. ఇదే సమస్యలోంచి పర్పల్ స్క్వైరల్ ఎడువెంచర్స్ ఐడియా వచ్చింది. 2013లో దీన్ని లాంచ్ చేశారు. దానికి ఎప్పటికప్పుడు తుదిరూపునిస్తూనే ఉన్నాయి.

ఆదిత్య, సాహిబా

ఆదిత్య, సాహిబా


ఆదిత్య, సాహిబా వారి మిషన్ గురించి తమ అనభవాలు, ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను యువర్ స్టోరీతో పంచుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్య సంభాషణలు.

యువర్ స్టోరీ :పర్పల్ స్వ్కైరల్ ఎడువెంచర్స్ స్థాపన వెనక ఆలోచనేంటి..?

ఆదిత్య & సాహిబా: కెరీర్ ఎంపిక పట్ల అసహనంతో రగిలిపోయే వారిని చూశాం. దాని పరిష్కార మార్గాన్ని సూచించడమే పర్పల్ స్వ్కైరల్ ఎడువెంచర్స్ ను లాంఛ్ చేయడానికి కారణం. అనుభవపూర్వక విద్య, పని వాతావరణం అవపోసనపట్టిన శక్తివంతమైన కార్మిక శక్తే దేశ భవిష్యత్తని నమ్మాం. పరిశ్రమలు, విద్యాలయాల మధ్య అంతరాలను తగ్గించాలన్న ఆలోచనతోనే ఈ సంస్థను స్థాపించాం. 10 వేల మంది అనుభవజ్ణులు, 350 మంది భాగస్వాములు, 10 డెస్టినేషన్స్ మా వెనక ఉన్నాయి. ఈ రోజు వరకు మేం గర్వంగా చెప్పగలం...ఈ ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నామని.

యువర్ స్టోరీ :ఈ స్టార్టప్ ప్రత్యేకతలేంటి ?

ఆదిత్య & సాహిబా: క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ లేదంటే పట్టభద్రులు తమ ఉద్యోగాలను ఎలా ఎంచుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. తమకంటే ముందున్నవారు ఏం సాధించారో... అదే ప్రభావం వారి మీద ఎక్కువ. పరిశ్రమలు, విద్యార్థుల మధ్య దూరాన్ని తగ్గించడానికి PSQ ను వేదిక చేయాలనుకున్నాం. అదే మా సంస్థలో అరుదైన లక్షణం. (ఆదిత్య మాట్లాడుతూ) తమ చదువుకు తగ్గట్లు కెరీర్ ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఉండాలి. వాస్తవిక ప్రపంచం గురించి, పరిశ్రమల గురించి వారికి అవగాహన ఉండాలి. ఇండస్ట్రలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు వారికి తెలుస్తుండాలి. ఇందుకు PSQ వేదిక. స్టూడెంట్స్ , ఇండస్ట్రీ మధ్య నిరంతర సంభాషణ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అనుభవపూర్వక విద్య, పని వాతావరణం తెలిస్తే...చక్కని కెరీర్ ఎంచుకోవడానికి స్పష్టతవస్తుందని కాలేజీ యాజమాన్యాలకు తెలియచెబుతాం.

యువర్ స్టోరీ: PSQ ఎలాంటి పరిశ్రమల క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టింది. ?

ఆదిత్య&సాహిబా: విద్యార్థుల ఎదుట వివిధ ఆప్షన్లు ఉంచుతుంది...PSQ. విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగానే పరిశ్రమల క్షేత్రస్థాయి పరిశీలన స్టడీ టూర్లను ఏర్పాటు చేశాం. మంచి కంపెనీలు, స్టార్టప్ లు,వ్యాపార సంస్థలను సంప్రదిస్తాం. తర్వాతి రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాలికలు వేస్తాం. ఈ పర్యటనల్లో విద్యార్థులు కార్పొరేట్ డెలిగేట్లతో ఇంటరాక్ట్ అవుతారు. వారు ఎలాంటి వర్క్ ఆశిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటారు. గొప్ప ప్రసంగీకులతో సదస్సు ఏర్పాటు చేస్తాం. ఇందులో ముఖాముఖి ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. తక్కువ సమయంలో సమస్త అంశాలను తెలుసుకునేందుకు ఇదొక అవకాశం. అంతేకాదు విద్యార్థుల మనోఉల్లాసం కోసం అనేక కల్చరల్ ప్రోగ్సామ్స్ ఏర్పాటు చేస్తాం.

యువర్ స్టోరీ : PSQ ఆఫర్ చేసే వివిధ రకాల కెరీర్ ఆప్షన్లేంటి.?

ఆదిత్య & సాహిబా: విద్యార్థుల ఎదుట అనేక కెరీర్ ఆప్షన్లు ఉంచుతాం. వివిధ పరిశ్రమల పని వాతావరణం, ఉత్పత్తి ప్రక్రియ చూపిస్తాం. ఉదాహరణకు వైన్ తయారీ పరిశ్రమ, స్వచ్చంద సంస్థల పనితీరు, కోక్ బాటిల్ ఎలా తయారవుతంది...ఇలా ఎన్నో విభిన్న అంశాలను వారికి చూపుతాం. ఇవే కాదు మీడియా,ఇంజినీరింగ్, బయోకాన్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ లను కూడా విద్యార్థులకు వివరిస్తాం. వివిధ రంగాల సాధకబాధకాలు తెలిస్తే విద్యార్థికి తన కెరీర్ ను ఎంచుకోవడానికి పూర్తి స్పష్టత, స్వేచ్చ లభిస్తుంది.

యువర్ స్టోరీ: PSQలో మీ అనుభవాలేంటి...భవిష్యత్తు ప్రణాళికలేంటి..?

ఆదిత్య & సాహిబా: ఏడాదిన్నర క్రితం కేవలం 40 మంది సిబ్బందితో మొదలుపెట్టాం. కానీ దేశ నలుదిక్కులా ఉన్న విద్యార్థుల చెంతకు 10 వేలమంది అనుభవజ్ఝులను పంపాం. ఐఐటీ బాంబేలో ఇంక్యూబేషన్ ను స్థాపించడంలో SINE నుంచి పొందిన సపోర్ట్ ను మరువలేం. చాలా సంస్థల నుంచి నిధులు కూడా సమీకరించగలిగాం. సాహిబా మాట్లాడుతూ ‘’వచ్చే మూడు నెలల్లో 150 మందితో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నాం.

యువర్ స్టోరీ: PSQ సంపాదనేంటి..ఆదాయం ఎలా వస్తుంది.?

ఆదిత్య&సాహిబా: కంపెనీలు,విద్యార్థులు, కాలేజీలే PSQ స్టేక్ హోల్డర్స్. యూనివర్సిటీలు, క్యాంపస్ లతో ప్రస్తుతం B2B బిజినెస్ మోడల్లో పని చేస్తున్నాం. ఇండియాలో 20 బిలియన్ల విద్యార్థులు,35 వేల కాలేజీలున్నాయి. ఇవే PSQ కు స్వాగత ద్వారాలు. కానీ విద్యార్థులు ఒక్కసారి మా సంస్థ ద్వారా అనుభవం పొందితే వారి కెరీర్ కు ఢోకా ఉండదు. ఉద్యోగంలో ఎదుగుదల వారి చేతుల్లోనే ఉంటుంది.

త్వరలోనే ఓ యాప్ రిలీజ్ చేయబోతున్నాం. దీని ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్టుగా మా సిబ్బందితో మాట్లాడొచ్చు. 2015-2016 లో మరింత అగ్రెసివ్ గా పని చేయబోతున్నాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags