సంకలనాలు
Telugu

ఉద్యోగుల మధ్యే రైడ్ షేర్ - పూల్ సర్కిల్ సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్

team ys telugu
21st Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సాధారణంగా సోమవారం ఉదయం.. ఆఫీసుకు వెళ్లడమంటే ప్రతీ ఒక్కరికీ ఎక్కడలేని బద్దకం వస్తుంది. అదే ఇక కారులో ఆఫీసుకు వెళ్లే వాళ్లైతే మరింత ఇబ్బందిపడ్తారు. కారణం ఏంటంటే.. సోమవారం రోజున.. విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇక బెంగళూరు లాంటి నగరంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లతో పాటు కారు, బుర్ర రెండూ వేడెక్కిపోతాయి. సగం ఎనర్జీ మొత్తం ఆఫీసుకు వెళ్లేలోపే ఆవిరైపోతుంది. ట్రాఫిక్ పోలీసుల అంచనా ప్రకారం బెంగళూరులో వాహనాల సంఖ్య 56 లక్షలు దాటింది. వైట్ ఫీల్డ్, బిటిఎం లే అవుట్, సిల్క్ బోర్డ్, బెల్లండూర్, మరాఠహల్లి ప్రాంతాల్లో అయితే ఈ స్థితి మరింత దిగజారుతోంది.

బస్ అగ్రిగేటర్లు అయిన ZIPGO, షేరింగ్ సర్వీసులు అందిస్తున్న జిఫీ, లిఫ్టో, బ్లా బ్లా కార్.. వీటితో పాటు కార్ అగ్రిగేటర్లు అయిన ఓలా షేర్, ఉబర్ పూర్ వంటివి ఈ రోజుల్లో నిత్యావసరాలయ్యాయి. అన్నింటికంటే ఆందోళనకర విషయం ఏంటంటే.. ఇలాంటి క్యాబ్‌లలో కేవలం ఒక్క ప్రయాణీకుడితో ప్రయాణించే వాటి సంఖ్యే అధికం. 2014లో పూల్ సర్కిల్ ఫౌండర్ రఘు రామానుజంతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లక్ష్యం ఒక్కటే.. కారులో ప్రయాణించే వాళ్ల సంఖ్యను ఒకటి నుంచి నాలుగు పెంచడమే.

undefined

undefined


కోట్ల రూపాయల పరిశ్రమ -

కార్ పూలింగ్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. తాజాగా ప్రైజ్ వాటర్ హౌజ్ కూపర్స్ రీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా షేర్డ్ ఎకానమీలో కార్ పూలింగ్ వాటా 15 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.1,02,000 కోట్లు. 2025 నాటికి ఇది 335 బిలియన్ డాలర్లకు (రూ. 22,78,000 కోట్లు) వెళ్తుందని అంచనా.

''2015లో మా బేస్ ఎనిమిది రెట్లు పెరిగింది. మా కస్టమర్లలో 80 శాతం మంది బి 2 సి యూజర్స్ ఉంటే, మిగిలిన 20 శాతం మంది కార్పొరేట్ క్లైంట్లు ఉన్నారు. మా దగ్గర ఇప్పుడు 20,000 రోజు వారీ వర్క్ కమ్యూట్ రూట్లు ఉన్నాయి. యావరేజ్ డిస్టెన్స్ కూడా 17 కిలోమీటర్ల పైనే ఉంది''- రఘు.

టెక్ పార్క్ క్లైంట్ల కోసం బెంగళూరు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఎంబసీ గ్రూపుతో ఈ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను లెక్కగట్టేందుకు ఎర్న్‌స్ట్ అండ్ యంగ్‌తో థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కార్ పూలింగ్ వల్ల రోడ్లపై ఎన్ని కార్లు తగ్గాయో అర్థం చేసుకోవడంతో పాటు పర్యావరణానికి తాము చేసిన ఉపకారమెంతో స్పష్టంగా తెలుసుకునేందుకు దీని వల్ల వీలు కలుగుతుంది.

అక్టోబర్ 2015లో బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ కార్ పూలింగ్ ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఎల్సియా (ఎలక్ట్రానిక్స్ సిటీ ఇండస్ట్రీస్ అసోసియేషన్- ఎలక్ట్రానిక్ సిటీ గవర్నింగ్ బాడీ)తో పూల్ సర్కిల్ కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ గవర్నింగ్ బాడీలో 70 కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,40,000 పైనే ఉంది.

ప్రైవేట్ నెట్వర్క్ కాన్సెప్ట్ క్లిక్ అయింది 

ఎల్సియా కోసమే పూల్ సర్కిల్ ఓ ప్రైవేట్ కార్ పూల్ నెట్వర్క్‌ను రూపొందించింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ వైట్ లిస్ట్ ఈమెయిళ్ల ద్వారా ఇన్విటేషన్లు పంపారు. ఈ కార్ పూలింగ్‌లో చేరాలంటే.. సదరు ఉద్యోగి తన కార్పొరేట్ మెయిల్ ఐడీ నుంచి రిక్వెస్ట్ పంపాలి. దీని వల్ల ఈ కార్ పూలింగ్ అంతా ఎల్సియా సభ్యుల మధ్యే జరిగేందుకు వీలు కలుగుతుంది.

''పూల్ కార్ ఓ పెద్ద కార్ పూలింగ్ కమ్యూనిటీని అభివృద్ధి చేసింది. భద్రతను పెంచడంతో పాటు ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొనేందుకు ఇది దోహదపడ్తుంది. ఎలక్ట్రానిక్ సిటీని స్మార్ట్‌గా పర్యావరణ హితంగా మార్చేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడ్తుందని'' ఎల్సియా సీఈఓ ఎన్ఎస్ రమ చెప్తున్నారు.

సాధారణంగా 75 శాతం మంది యూజర్స్‌కు తమ సెర్చ్ క్రైటీరియా ఆధారంగా రైడ్స్ దొరికిపోతాయి. పీక్ సమయాల్లో కోరమంగళ, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఇందిరా నగర్, బెల్లందూర్ వంటి అధిక జనాభా ఉన్న ప్రాంతాలకైతే 20 నుంచి 25 ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

4,500 కార్ పూల్ కనెక్షన్లు తమ ద్వారా కుదిరినట్టు పూల్ సర్కిల్ చెబ్తోంది. ఏడు రోజుల తర్వాత తమ యూజర్‌ ఈ సేవలను 53 శాతం తిరిగి ఉపయోగించుకుంటున్నారు. నాలుగు వారాల తర్వాత కూడా ఇది 37 శాతం వరకూ ఉంది.

రైడ్ షేరింగ్ వల్ల పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంతో ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉంటుందని రఘు చెబ్తున్నారు. క్యాబ్ అగ్రిగేషన్ మోడల్ కంటే ఇది దీర్ఘకాలం నిలిచేందుకు, ఆర్థికంగా కూడా స్థిరత్వం సాధించేందుకు సులువైన మోడల్‌ అని విశ్లేషిస్తున్నారు.

పూల్ సర్కిల్ ఇంటెలిరైడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లను ఇక్కడ కలపడం కంటే ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. రూట్ల్ ఓవర్ ల్యాపింగ్‌ను కూడా ఇది గుర్తిస్తుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేలోపు చిన్న రూట్ చేంజ్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు దీనివల్ల కుదురుతుంది. కేవలం ప్రయాణించడం కాదు.. అందరూ కలిసి ఎంత ఎక్కువ దూరం ప్రయాణించగలిగారు అనేదే మా ఉద్దేశమని చెప్తుంది పూల్ సర్కిల్ టీం. ఈ కొత్త టెక్నాలజీ వల్ల 80 శాతం అధికంగా రూట్లను గుర్తించేందుకు వీలవుతుందని టీం క్లైం చేస్తోంది.

టఫ్ రైడ్

ఇప్పుడు ఈ స్థాయికి చేరడం వెనుక చాలా పెద్ద కష్టమే దాగుంది. 2014 ఆఖరు నాటికి వీళ్లు మొదటి రౌండ్ ఫండింగ్‌ను సమీకరించగలిగారు, అది కూడా ఎన్నో రౌండ్ల చర్చల తర్వాతే. ''మాకు అప్పుడు వాస్తవంగా అది హ్యాపీ న్యూయర్ మాత్రం కాదు. మా టీంపై మాకు ఉన్న నమ్మకం, కస్టమర్ల ఆదరణ వల్లే మేం ఒప్పుకోవాల్సి వచ్చింది. దీని వల్ల స్థిరమైన ఆదాయం మార్గాన్ని కనుగొనేందుకు మాకు మార్గం సుగమమైంది. ఉద్యోగుల మధ్య క్లోజ్డ్ లూప్ కార్ పూలింగ్‌ ఇది దోహదపడింది'' అంటారు రఘు.

బూట్ స్ట్రాపింగ్ సమయంలో మార్కెట్ ప్లేస్‌ మార్గాన్ని అనుసరించడం సరైంది కాదని వీళ్లు గుర్తించారు. కార్ పూలింగ్ అంటేనే కస్టమర్ల బిహేవియర్‌లో ఓ మార్పును తీసుకురావడం. అది అంత సులువైన వ్యవహారమేమీ కాదు. అందుకే రెఫరెన్సుల ద్వారా కస్టమర్ల బేస్ పెంచుకోవడానికే సిద్ధమయ్యారు.

ఆర్థిక ప్రోత్సాహం అనే విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల పెద్ద తప్పు చేశామని టీం ఆలస్యం గుర్తించింది. సామాజిక, పర్యావరణ లాభాల సంగతి ఒక ఎత్తైతే.. పూలింగ్ వల్ల ఎంత మిగులుతుంది అనే విషయాన్ని స్పష్టంగా జనాల్లోకి తీసుకోకపోవడంలో వెనుకబడినట్టు గుర్తించారు.

''మేం ఆ విషయంపై మొదట్లోనే ఆలోచించి ఉంటే.. ఇంకా వేగంగా వృద్ధి చెంది ఉండేవాళ్లం. త్వరలో మొబైల్ వాలెట్ ఇంటిగ్రేషన్‌ను లాంఛ్ చేయబోతున్నాం. దీని వల్ల క్యాష్‌లెస్ పేమెంట్స్‌ చేసేందుకు వీలు కలుగుతుంది'' అంటారు రఘు.

బి2సి కస్టమర్లకు, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో రైడ్ టేకర్, రైడ్ గివర్ మధ్య జరిగిన లావాదేవీలకు కొంత మొత్తాన్ని కమిషన్‍‌గా ఛార్జ్ చేస్తామని పూల్ సర్కిల్ చెబ్తోంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. బి2బి కస్టమర్లకు నెలవారీ సబ్‌స్క్రిబ్షన్ పద్ధతిన కొంత ఫీజును వసూలు చేస్తారు. యూజర్ శ్లాబ్స్‌ ఆధారంగా ఫీజును నిర్ణయిస్తారు.

పూల్ సర్కిల్‌లో కొత్త వాళ్లు ఎవరూ ఉండరు. సదరు వ్యక్తితో పరిచయం ఉండకపోయినా వాళ్లు ఎవరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఈమెయిల్ ఎక్స్‌టెన్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ల ఫేస్ బుక్ కౌంట్ సహా ఇతర డేటా పాయింట్ల ఆధారంగా కార్ పూల్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయాలో వద్దో నిర్ణయించుకోవచ్చు.

ట్రస్ట్ పాయింట్ల ఆధారంగా కూడా రేటింగ్ ఇచ్చేందుకు ఈ పూల్‌లో ఆస్కారం ఉంది. ఏ నెట్వర్క్, ఏ సర్కిల్‌లో రైడ్‌ను ఎంపిక చేసుకోవాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు. ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు.. ఇలా వివిధ కాంబినేషన్ల ద్వారా ఎంపిక చేసే వెసులుబాటు ఉంటుంది. అంతే కాదు జెండర్ ప్రిఫరెన్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ప్రతీ సారీ తాను ఎంచుకున్న రైడ్‌ ఓ మంచి అనుభూతిగానే మిగిలిందని చెబుతారు పూల్ సర్కిల్ రెగ్యులర్ రైడర్ వినయ్ కుమార్. 

ఈ వేదిక ద్వారా పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులనూ భాగస్వామ్యం చేయాలని చూస్తోంది పూల్ సర్కిల్. ఇప్పటికే వాట్సాప్‌లో ఇలాంటి కార్ పూలింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అయితే నమ్మకమైన, ఆర్థిక ప్రోత్సాహాన్ని కలిగించే కార్ పూలింగ్‌ వ్యవస్థను రూపొందించి కమ్యూటర్లకు సాయం చేయడమే తమ లక్ష్యమని రఘు చెబ్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags