సంకలనాలు
Telugu

షాకింగ్ సర్‌ప్రైజులకు కేరాఫ్ అడ్రస్ 'ఓయ్ హ్యాపీ'

ashok patnaik
14th Oct 2015
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

కాబోయే శ్రీమతికి జీవితం కాలం గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలి ! గాళ్ ఫ్రెండ్ ఆ సర్‌ప్రైజ్‌కి నోరెళ్లబెట్టి.. ఇక ఏం మాట్లాడో కూడా అర్థం కాకుండా సైలెంట్ అయిపోవాలి ! ఎక్కడో ఉన్న అమ్మ, నాన్నకు వెడ్డింగ్ యానివర్సరీ విష్ చేస్తే.. వాళ్లు పిచ్చ థ్రిల్ ఫీల్ కావాలి ! అయితే ఇవన్నీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే.. సరిపోదు. అంతకు మించి.. ఏదైనా చేయాలి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి.

ఓ ప్రైవేట్ ఛార్టర్ ఫ్లైట్‌లో ఓ గంట సేపు అలా చక్కర్లు కొట్టిస్తే ఎలా ఉంటుంది ? రాత్రి వేళ.. నగర అందాలు మొత్తం కనిపించేలా.. ఓపెన్ టాప్.. హిల్ హోటల్‌పై డిన్నర్ ? పొద్దునే నిద్రలేచేసరికి బెడ్ రూం అంతా బెలూన్లతో నిండిపోతే.. ? ఉదయాన్నే మీరు కాఫీ తాగుతుండగా.. గిటారిస్ట్ వచ్చి మీకు గుడ్ మార్నింగ్ విష్ చేస్తే.. ? మీ బుజ్జాయి బర్త్ డేని ఓ వంద మంది పేద పిల్లల మధ్య సెలబ్రేట్ చేస్తే.. ? ఊహే కాస్త డిఫరెంట్‌గా ఉంది కదూ... ? ఇదే కాన్సెప్ట్‌తో పుట్టింది 'ఓయ్ హ్యాపీ'

image


ఇష్టమైన వారికి ప్రత్యేకమైన క్షణాల్లో ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయంటే ? ఓయో హ్యాపీవారిచ్చే గిఫ్టుల్లా ఉంటాయంటారు ఆ సంస్థ ఫౌండర్ హర్ష్. జనాన్ని సర్‌ప్రైజ్ చేసే గిఫ్టులను అందించడంలో అందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నామంటోంది ఈ హైదరాబాదీ స్టార్టప్. మొదట్లో ఓ హాబీగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు ఆన్‌లైన్ యూజర్ల హాట్ ఫేవరేట్‌గా మారింది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యపడలేదంటున్నారు హర్ష్.

image


ఓయ్ హ్యాపీ ప్రారంభం

ఓయ్ హ్యాపీ 2009లోనే మొదలైంది. అయితే అప్పుడది హర్ష్‌కి ఓ హాబీ ప్రాజెక్ట్. గిఫ్టింగ్ అనే ప్యాషన్‌తో దాన్ని మొదలు పెట్టారు. అలా ఓ రెండుమూడేళ్లు గడిచిపోయాయి. 2013లో ఈవెంట్లను చేయడం మొదలు పెట్టారు. అయితే పూర్తి స్థాయి ఈవెంట్ మేనేజర్లుగా కూడా మారలేదు. ఈవెంట్లలో గిఫ్టులను అందించడం. కాన్సెప్ట్ డిజైన్ చేయడం ప్రాధాన్యతాంశాలుగా ఉండేవి. హాబీ నుంచి వ్యాపారంగా మారాలనే ఆలోచన హర్ష్‌కు అప్పుడే మొదలైంది. 2014 మొదట్లో ప్రయోగాత్మకంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ-కామర్స్ వెబ్ సైట్ లాంచింగ్ గతేడాది ఆగస్టులో ప్రారంభం అయింది. ఆర్డర్లను తీసుకోవడం నుంచి డెలివరీ వరకూ ప్రతీదీ తనే చూసుకునే వాడు. మంచి పొటెన్షిల్ ఉన్న మార్కెట్‌ ఉందని అప్పుడే అర్థమైంది. అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు యాప్ లాంచింగ్‌కి రెడీ అవుతోంది.

image


ఓయ్ హ్యాపీ ప్రత్యేకతలు

ఓయ్ హ్యాపీ అనేది ఓ సాధారణ గిఫ్టింగ్ కంపెనీ కాదు. ఇందుకోసం ఈ-కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఉన్నాయి. ఆ మాటకు వస్తే.. బహుమతులు ఇచ్చేందుకే ప్రత్యేకంగా వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. కానీ ఓయ్ హ్యాపీ అలా కాదు. ఇదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గిఫ్టింగ్ కంపెనీ. రొటీన్ బహుమతులు ఇక్కడ కనపడవు. పప్పీలు ఇష్టం ఉంటే డాగ్ షెల్టర్‌కి తీసుకెళ్లి రోజంతా గడిపేలా ఏర్పాటు చేస్తారు. కేక్స్ ఇష్టమని తెలిస్తే.. అన్‌లిమిటెడ్ కప్ కేక్స్‌ డెలివరీ చేస్తారు. కపుల్స్ కోరుకుంటే వారిద్దరి కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటవుతుంది. తమ కంపెనీని గిఫ్టింగ్ అనే కంటే సర్‌ప్రైజింగ్ కంపెనీ అంటే కచ్చితంగా సరిపోతుందంటారు హర్ష్.

“హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కావాలంటే హ్యాపీనిచ్చే సర్‌ప్రైజింగ్ లతోనే సాధ్యపడుతుంది.” హర్ష్

ఓయ్ హ్యాపీ వెబ్ సైట్ విశేషాలు

ఓయ్ హ్యాపీ చూడటానికి ఈ-కామర్స్ సైట్‌లానే కనిపిస్తుంది. కానీ ఇందులోని ప్రొడక్టులు మాత్రం వేరు. అక్కడ దొరికే వస్తువులే వేరు. ప్రారంభించిన రోజు నుంచి యూజర్ బేస్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నెలకి 20వేలమంది యాక్టివ్ యూజర్లున్నారు. రోజుకి కనీసం 25 గిఫ్టింగ్, సర్‌ప్రైజింగ్ ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 80కి పైగా కాన్సెప్ట్స్ డిజైన్ చేశారు. ఆశ్చర్యం గొలిపే బహుమతులు ఇవ్వాలంటే కొద్దిగా ముందుగానే చెప్పాలంటారు హర్ష్. అందుకు తగిన ప్లానింగ్ చేసుకోవడానికి తమకూ టైం దొరుకుతుందని.. కస్టమర్లు కూడా 100 శాతం ఎంజాయ్ చేస్తారని చెబ్తున్నారు. లాగిన్ అయిన తర్వాత వారికి ఇష్టమైన విషయాల గురించి తెలియజెబితే ..వాటితో సర్‌ప్రైజ్ ని ప్లాన్ చేస్తుంది ఓయ్ హ్యాపీ.

image


హ్యాపీ టీం

హర్ష్, వరుణ్ ఓయ్ హ్యాపీ కో ఫౌండర్లు. హర్ష్ టిపికల్ హైదరాబాదీ. ఎంబియే పూర్తి చేసిన హర్ష్ కెపిఎంజి(KPMG)లో 15 నెలల పాటు ఉద్యోగం చేశారు. రొటీన్ 9 టు 5 జాబ్ నచ్చకపోవడంతో దాన్ని వదిలేశారు. ఆ తర్వాత ఓ ఎడ్వర్టైజింగ్ కంపెనీ పెట్టాలని అనుకున్నారు. ఇవి చేస్తుండగానే ఓయ్ హ్యాపీని హాబీగా మొదలు పెట్టారు. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందని అనిపించడంతో పూర్తి స్థాయిలో దీనిపైనే పనిచేయడం ప్రారంభించారు. 

డిగ్రీ వరకూ సాధారణ గ్రామీణ నేపధ్యం కో ఫౌండర్ వరుణ్‌ది. కానీ క్రియేటివిటీ విషయంలో మాత్రం అతడి రూటే సెపరేటు. అస్సాంలోని ఓ ప్రాంతంలో డిగ్రీ పూర్తి చేసిన వరుణ్.. బెంగళూరులో ఓ యాడ్ ఏజెన్సీలో ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్లిద్దరూ కజిన్స్. మొదట్లో బెంగళూరు నుంచే ఓయ్ హ్యాపీకి సాయం చేసేవాడు. ఇప్పుడు స్టార్టప్ ఇక్కడ యాక్టివ్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు మకాం మార్చేశాడు. 

image


సవాళ్లు, లక్ష్యాలు

సర్‌ప్రైజ్ ఎక్స్‌పీరియన్స్, గిఫ్టింగ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రత్యేకంగా మారుతోంది. ప్రతీ ఈ-కామర్స్ కంపెనీలోనూ గిఫ్టింగ్ కు ప్రత్యేకంగా విభాగాలున్నాయి. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ లాంటి బడా ఈ-కామర్స్ కంపెనీలు గిఫ్టింగ్‌పై పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే, ఓయ్ హ్యాపీ లాంటి కంపెనీలు వాటిని తట్టుకోవడం కష్టమైన పనే. కానీ మేం పూర్తిగా వాటిపైనే ఆధారపడలేదు అంటారు హర్ష్.


“మాకు కాన్సెప్ట్ ఓరియెంటెండ్ సర్‌ప్రైజ్ ప్రధానం. ఈ సెగ్మెంట్ చాలా క్రియేటివిటీతో కూడుకున్నది. ఒక్కో సర్‌ప్రైజ్ ఒక్కో ఐడియా నుంచి పుడ్తుంది. మా దగ్గర ఐడియాలు, క్రియేటివిటీ ఉన్నంత వరకూ మాకు ఎవరూ పోటీ రాలేరు” - హర్ష్


ఫండింగ్ ,భవిష్యత్ ప్రణాళికలు

ఓయ్ హ్యాపీ అనేది పూర్తి స్థాయి బూట్‌స్ట్రాప్డ్‌ కంపెనీ. సీడ్ ఫండింగ్ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి తెచ్చుకున్నదే. బి టు సి కంపెనీ కావడంతో కస్టమర్ బేస్ చాలా ప్రధానమైది. దీన్ని కాపాడుకుంటూ మరింత పెంచుకుంటూ దూసుకుపోవడమే తమ ముందున్న లక్ష్యం అంటున్నారు హర్ష్. బెంగళూరులో కూడా ఆపరేషన్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఫండింగ్ వస్తే ఇతర మెట్రో నగరాల్లో కూడా సేవలను విస్తరించి, స్థానికంగా కాన్సెప్ట్ డిజైన్ చేస్తామని హర్ష్ ముగించారు.

website

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags