సంకలనాలు
Telugu

విద్యార్థుల సృజనను వెలికితీసే “ఆవిష్కార్ బాక్స్”

పాఠ్యాంశాలకు అనుగుణంగా కిట్స్ తయారీసులభంగా అర్థమయ్యే విధంగా రూపకల్పననెలవారీ టార్గెట్స్ తో ఇంటికొచ్చే కిట్స్

CLN RAJU
17th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆరేడేళ్ల వయసులో మ్యాథ్స్, సైన్స్ కు సంబంధించిన ప్రాధమిక సూత్రాలను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం కదా. కానీ ఇప్పటి పిల్లలు మాత్రం కేవలం విద్యాసంబంధ విషయాలకే కాదు.. టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లోనూ చాలా ముందుంటున్నారు. రోబోటిక్స్‌కు సంబంధించి మనం పై తరగతుల్లో నేర్చుకుంటాం.. కానీ ఇప్పుడు రెండు, మూడు తరగతుల్లోనే రోబోటిక్స్ గురించి చదువుకుంటున్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఢిల్లీకి చెందిన ఆవిష్కార్ బాక్స్ కంపెనీ రెండు డబ్బాలను తయారుచేసింది. అవి 1. స్టీమ్, 2. ఇన్వెంటర్స్.

స్టీమ్ అనేది ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మ్యాథమ్యాటిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది. కానీ ఇన్వెంటర్స్ మాత్రం నిర్దేశిత టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది.. “ఉదాహరణకు రోబోటిక్స్, రోబోట్రానిక్స్ కు సంబంధించి కోడిగో (CodiGo) (ఇది ప్రపంచంలో ఫిజికల్ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి పేటెంట్ పొందిన మొదటి అంశం) వెల్లడిస్తుంది. ఇది రెండో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా డిజైన్ చేశాం” అంటున్నారు ఆవిష్కార్ బాక్స్ సహ వ్యవస్థాపకులు తరుణ్ భల్లా.

పిల్లలు నెలవారీగా చేయాల్సిన విద్యాసంబంధ అంశాలను ఆవిష్కార్ బాక్స్ అందిస్తుంది. భారత్‌లో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికే విధంగా వీటిని రూపొందించారు. ఎడ్యుకేషనల్ కరిక్యులమ్‌కు ఇది అనుబంధం. “ స్కూల్ లో చదువుకునే అంశాలకు ఈ కిట్లు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయి. ఆయా తరగతుల పాఠ్యాంశాలకు అనుగుణంగా ఈ బాక్స్‌లను జాగ్రత్తగా రూపొందించాం” అంటున్నారు తరుణ్.

ఈ బాక్సులను ఒక్కొక్కటిగా కొనుక్కోవచ్చు.. లేదంటా సంవత్సరానికి ఒకేసారి చందా కట్టి తెప్పించుకోవచ్చు.. చందా కడితే ప్రతినెలా కిట్లు పంపిస్తారు..

పిల్లల చేతిలో ఆవిష్కార్ బాక్స్

పిల్లల చేతిలో ఆవిష్కార్ బాక్స్


ఆవిష్కార్ బాక్స్‌ను తరుణ్, స్వాతి గుప్తా ప్రారంభించారు. గత నాలుగు నెలల్లో ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లలో కలిపి సుమారు 5వందల పెట్టెలను అమ్మారు. దేశంలోని పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి తరుణ్ కలలు కంటున్నారు. తన కుమార్తెకు మంచి విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో వచ్చిన ఆలోచనే ఆవిష్కార్ బాక్స్. స్వాతి గుప్తాకు కన్సల్టింగ్, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో సుమారు ఏడేళ్ల అనుభవం ఉంది. మేనేజ్‌మెంట్ పట్టా పొందిన స్వాతి పలు కంపెనీల స్థాపనలో పాలుపంచుకున్నారు.

“మా ఇన్వెంటర్ బాక్స్‌లన్నీ పూర్తిగా భారత పేటెంట్ కలిగి ఉన్నాయి. వాడుతున్న హార్డ్‌వేర్ కూడా మా సొంతమే. ATMEL, ARM9 మైక్రో కంట్రోలర్స్‌లతో మేం ఉమ్మడిగా పనిచేస్తున్నాం. ప్రతి బాక్స్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌తో డిజైన్ తో రూపొందించారు. అదే ఆ ప్రాడక్ట్ ప్రత్యేకత'' అంటున్నారు స్వాతి. అన్ని ఇంటర్ ఫేసెస్ పైన పనిచేసే విధంగా ఈ ప్రోగ్రామ్ లను రూపొందించారు. వైర్ లెస్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా కోడిగో (CodiGo) రూపొందించారు. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్ తో పనిచేసే విధంగా రోబోజి(RoboG) తయారుచేశారు. (ఇది డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో పనిచేస్తుంది.) 80 మరియు 100 RPM మోటార్లు (టచ్, ఐఆర్, సౌండ్, ఉష్ణోగ్రత), సెన్సార్లను సొంత కంపెనీలోనే తయారు చేస్తున్నారు. 

image


సవాళ్లు

“ ఉత్పాదన కేంద్రంగా పనిచేస్తున్నప్పుడు వాటిని ఎక్కువగా అమ్మాలని ప్రయత్నించి మా టార్గెట్ చేరుకోవాలని ప్రయత్నిస్తాం. అయితే భారత్‌లో ఈ తరహా ఉత్పాదనలను కొనేంత మంది వినియోగదారులు ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే దాన్ని బట్టే మా స్థానం ఆధారపడి ఉంటుంది” అంటున్నారు స్వాతి.

వ్యవస్థాపకులిద్దరికీ ఎలాంటి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం, పాఠ్యాంశాల రూపకల్పనతో సంబంధం లేకపోవడం వల్ల అనేక సవాళ్లు ఎదురయ్యాయి. “ఉత్పాదన అభివృద్ధి, మూలాలు, అమ్మకందారులు, బృందం ఏర్పాటుచేసుకోవడం లాంటి అన్ని స్టేజ్ లలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి హార్డ్ వేర్ తరహా కంపెనీని నడపడం చాలా కష్టతరం.” అంటున్నారు తరుణ్.

ముందుంది మంచికాలం

''ప్రపంచాభివృద్ధిలో భారత్ పాత్ర కూడా ఉందని చెప్పడానికి ఆవిష్కార్ బాక్స్ సమధానం చెబుతుంది. ఉత్పాదనలు చాలా చౌక, వీటిని సులభంగా వినియోగించవచ్చు. పాఠ్యాంశాలకు అనుగుణంగా రూపొందించాం. అన్నిటికీ మించి అభివృద్ధి చెందుతున్న ప్రపంచంతో పోటీ పడేవిధంగా ఇవి తయారయ్యాయి. ఉదాహరణకు లెగో (Lego) వయసు, నిపుణత ఆధారంగా ఉత్పత్తులు అమ్ముతుంది. అయితే మేం మాత్రం తరగతులకు అనుగుణంగా అమ్ముతున్నాం. వాడే వస్తువులు, భారత్‌లో విద్యార్థి నేర్చుకునే సామర్థ్యం లాంటి అంశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడే అవకాశం కల్పిస్తుండడం వల్లే మేం ఈ మార్కెట్ లో గెలవగలం” అంటున్నారు స్వాతి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags