సంకలనాలు
Telugu

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఈ టూల్స్ ఉంటే మీ బిజినెస్ పెరిగినట్టే !

గ్రోత్ హ్యాకింగ్ పేరు విన్నారా..?

Chanukya
8th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


స్టార్టప్‌కు ప్రతీ పైసా రూపాయితో సమానం. ప్రతీ పైసాను ఆచితూచి ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి.. వ్యాపారాన్ని విస్తరించడానికి మన దగ్గర డబ్బుతో పాటు బయట మార్కెట్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోవాలి. మన ప్రోడక్ట్, సర్వీస్, వెబ్ సైట్‌కు జనాల నుంచి ఎలాంటి రెస్సాన్స్ వస్తోందో తెలుసుకుంటూ ఉండాలి. అవసరమైతే అందుకు తగ్గట్టు మన ప్రోడక్ట్‌నో, వెబ్ సైట్‌నో మార్చుకుంటూ ముందుకు సాగాలి.

ఈ విషయాలన్నీ మాకు తెలుసుగానీ కొత్తగా చెప్పే పాయింట్ ఏంటి అని మీరు అనుకునేలోపు.. సరిగ్గా పాయింట్‌కు వచ్చేస్తున్నాం. ఈ మధ్య గ్రోత్ హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతోంది. ఇది మీ వ్యాపారాభివృద్ధికి దోహదపడ్తుందనేది నా ఆలోచన. గ్రోత్ హ్యాకింగ్ అంటే ఏంలేదు.. చాలా సింపుల్ 'మైండ్ సెట్ ఫస్ట్, టెక్నిక్ సెకెండ్'. ఎనలిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, మెట్రిక్స్ ద్వారా కస్టమర్‌ నాడిని పట్టుకోవడం అందుకు తగ్గట్టు ఆదాయాన్ని పెంచుకోవడం ఈ కాన్సెప్ట్ టార్గెట్. మన ప్రాజెక్టును అమలు చేసే ముందు టెస్టింగ్ చేయడం లాంటిదే ఈ ఆలోచన.

మరి ఇవన్నీ డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు కదా.. అని అనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మనలాంటి వాళ్ల కోసమే అనే కంపెనీలు చాలా ప్రోడక్టులు తయారు చేశాయి. వాటిల్లో మనకు పనికి వచ్చేందేంటో చూసుకుని ప్రొసీడ్ అయిపోవడమే.

ఈ రోజుల్లో కస్టమర్ ఆలోచనను తెలుసుకోవడం అంత సులువైన పనికాదు. అందులోనూ ఆన్‌లైన్‌ జనాల నాడిని పట్టుకోవడం ఇంకా కష్టం. మరి వీళ్ల ఆలోచనకు తగ్గట్టుగా మనం మన ప్రోడక్టును, సర్వీసును మార్చుకోవాలంటే ఎలా ? ఇదిగో ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఇందులో మీకు ఏది సూట్ అవుతుందో తెలుసుకోండి.

Source: depositphotos.com

Source: depositphotos.com


1. గూగుల్ ఎనలిటిక్స్ -

ఇప్పటిదాకా మీకు దీని గురించి తెలియకుండా ఉంటుందని అనుకోను. ఒక వేళ మీరు ఇప్పటిదాకా దీన్ని వాడకపోతే వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్రస్తుతం గూగుల్ ఎనలిటిక్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా 1.8 కోట్ల వ్యాపార సంస్థలు ఉపయోగిస్తున్నాయి. అది కూడా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.

యూజర్స్ వయస్సు, జెండర్, ఆసక్తి, వాళ్ల లొకేషన్‌ తెలుసుకోవచ్చు. 

ఎంత సమయాన్ని వెబ్‌సైట్‌పై వెచ్చిస్తున్నారు, వస్తున్న యూజర్స్‌లో కొత్త వాళ్లు ఎంత మంది, పాత వాళ్లు ఎంత మంది, ఏ ఏ పేజీలను చూస్తున్నారు వంటివి తెలుసుకోవచ్చు.

ఏ మార్కెటింగ్ ఛానల్ ద్వారా మీ సైట్‌కు ఎక్కువ ట్రాఫిక్ వస్తోందో పసిగట్టవచ్చు.

డెస్క్‌టాప్, ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్.. ఇలా ఏ డివైజ్‌ నుంచి ట్రాఫిక్ వస్తోందో తెలుసుకునే వీలుంది.

ఎంత మంది సైన్ అప్ అవుతున్నారు, ఎంత మంది కొనుగోలు చేస్తున్నారు, మధ్యలో వదిలేసి వెళ్లే వాళ్లు ఎంతమందో పసిగట్టవచ్చు.

2. మిక్స్‌ప్యానెల్ - 

MIXPANEL అనేది ఓ అడ్వాన్స్‌డ్ ఎనలిటకల్ టూల్. ఇది ఒక్కో ఇండివిడ్యుయల్ యూజర్‌ బిహేవియర్‌ను తెలుసుకునేలా చేస్తుంది. ఫైనల్ ఎనాలసిస్, ఇండివిడ్యుయల్ యాక్షన్ ఎనాలసిస్, కోహర్ట్ ఎనాలసిస్, సెండ్ నోటిఫికేషన్స్, A/B టెస్టింగ్ వంటివి మరికొన్ని ఫీచర్స్. మొదటి 1000 మంది యూజర్స్‌ లేదా మొదటి 25,000 డేటా పాయింట్ల వరకూ ఈ సర్వీసు ఉచితం.

3. ఇన్‌స్పెక్ట్‌లెట్ - 

Inspectlet అనేది ఓ అడ్వాన్స్డ్‌డ్ టూల్. సైట్‌లోకి ఎంటర్ అయిన యూజర్ ఏం చేస్తున్నాడో వీడియోతో సహా మీరు చూడొచ్చు. వాళ్ల మౌస్ మూమెంట్స్ మొదలు, స్క్రోలింగ్, క్లిక్స్, కీ ప్రెస్ వంటి వాటిని కూడా రికార్డెడ్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. ?

ఒక్కో వెబ్‌సైట్‌కు మొదటి వంద రికార్డింగ్స్‌ వరకే ఈ సర్వీస్ ఉచితం.

4. పీక్ - 

యూజర్స్.. మీ సైట్లోకి ఎంటర్ అయ్యాక.. మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ ఏంటో Peek ద్వారా తెలుసుకోవచ్చు. మనం మన వెబ్‌సైట్ డీటైల్స్‌ను ఈ సైట్‌లో అప్‌లోడ్ చేస్తే కొన్ని గంటల్లోనే... ఓ రియల్ కస్టమర్ వీడియో రివ్యూను వీళ్లు మనకు పంపుతారు. అప్పుడు మన యూజర్లు మన సైట్‌ గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు.

ఇది కూడా ఫ్రీ సర్వీసే.

5. గూగుల్ కీవర్డ్ ప్లానర్ 

మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కోసం వాడాల్సిన కీవర్డ్స్‌ను వెతికిపట్టి సూచిస్తుంది Google keyword planner. కీవర్డ్స్‌ వల్ల సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సులువయ్యేందుకు అవకాశాలున్నాయి. మనం కొన్ని వర్డ్స్ టైప్ చేస్తే.. ఈ సైట్ హిస్టరీలోకి వెళ్లి సదరు వర్డ్స్‌కు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, బిడ్డింగ్స్ ఎలా వచ్చాయి అనే వివరాలను అందిస్తుంది. యాడ్ వర్డ్స్ అకౌంట్ తెరుచుకుని.. ఈ సర్వీసును ఉచితంగానే వాడుకోవచ్చు.

6. ఔట్‌బ్రెయిన్ 

మీరు ఏ వెబ్‌సైట్లోనో ఏదో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదువుతున్నారు.. తీరా చదవడం పూర్తయ్యాక.. ఆఖర్లో అది స్పాన్సర్డ్ ఆర్టికల్‌ అని రాసి ఉండడం గమనించి ఉండొచ్చు. మీరు రాసిన కంటెంట్‌కు మంచి పబ్లిసిటీ రావాలని, మీ స్టోరీలు ఏ సిఎన్ఎన్‌ సైట్లోనో, బిబిసిలోనో కనిపించాలంటే.. ఇందుకోసం OUTBRAIN హెల్ప్ చేస్తుంది.

మీ స్టోరీకి బిడ్డింగ్ చేసుకుంటే ఇది యాడ్‌లా పోస్ట్ చేస్తుంది. యాడ్ క్లిక్స్ ఆధారంగా ఛార్జ్ చేస్తారు.

7. సుమోమి

స్టార్టప్స్, ఫ్రీలాన్సర్స్‌తో పాటు పెద్ద కంపెనీలకు ట్రాఫిక్ తెచ్చేందుకు సుమోమి సంస్థ సహకరిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ 3.5 లక్షలకుపైగా సైట్లకు సేవలను అందిస్తోంది. సైట్లకు ట్రాక్షన్ రావడానికి వీళ్లదగ్గర నుంచి టూల్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరిన్ని ఫీచర్స్ కావాలంటే మాత్రం అందుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటిదాకా మనం తెలుసుకున్నవి, చూసినవి కొన్ని సైట్లు మాత్రమే. ఇలాంటివి ఇంకా వందల్లో, వేలల్లో ఉన్నాయి. మొదటి దశలో ఉన్న మీ ప్రోడక్ట్, వెబ్‌సైట్‌కు ఇవి కొంతమేరకు ఉపకరిస్తాయి. వీటిని ఉపయోగించుకోండి. తర్వాతి దశకు వెళ్లేందుకు పరిశోధనను పెంచండి.

ఆల్ ది బెస్ట్.

రచయిత - అనిరుధ్ నారాయణ్

అనువాదం - చాణుక్య

రచయిత గురించి

నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో 500కు పైగా ఆంట్రప్రెన్యూర్లకు, 15 స్టార్టప్స్‌తో అనిరుధ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. షట్టర్ స్టాక్, లీన్ స్టార్టప్ మెషీన్, రాకెట్ ఇంటర్నెట్ సంస్థల్లో లీడ్ పొజిషన్స్‌లో పనిచేసిన అనుభవం అనిరుధ్ నారాయణ్‌కు ఉంది. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags