సంకలనాలు
Telugu

వీసా రిజెక్ట్‌ అయింది..! వ్యాపారం పర్‌ఫెక్ట్ అయింది..!!

ashok patnaik
2nd Dec 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

వెబ్ సైట్ లేని వ్యాపారం వ్యాపారమే కాదు! అని మైక్రో సాఫ్ అధినేత బిల్ గేట్స్ ఇటీవల చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వ్యాపార విషయాన్ని కొద్ది సేపు పక్కన పెడితే స్టార్టప్ కు మాత్రం వెబ్ సైట్ కంపల్సరీ. యాభైవేల నుంచి 50లక్షల ధరల్లో మార్కెట్ లో వెబ్ సైట్ లు అందుబాటులో ఉన్నాయి.

“వెబ్ డెవలప్ మెంట్ నేను కాలేజీ రోజుల నుంచే చేస్తున్నా. కంప్యూటర్ కోడ్ రాయడం స్కూల్ డేస్ నుంచే ప్రాక్టీస్ చేసే వాడిని.” క్రాంతి

సిరి ఐటి పేరుతో హైదరాబాద్‌ KPHB లో ఉన్న సంస్థ కు క్రాంతి ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఒక్క వ్యక్తితో మొదలైన సిరి సంస్థ ఇప్పుడు 15మంది డిజైనర్లు, డెవలపర్స్ తో కళ కళలాడుతోంది. ఫ్రీలాన్సింగ్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

image


సిరి ప్రారంభం

సిరి ఐటి అనే ఆలోచన కాలేజీ రోజుల నుంచే ఉందని క్రాంతి చెప్పుకొచ్చారు. మొదట్లో ఎవరికైనా వెబ్ సైట్ కావాలంటే ఫ్రీగా చేసి ఇచ్చేవారట . కొన్నాళ్లకు లీడ్స్ ఎక్కువ వస్తుండటంతో తక్కువ ధరలో క్వాలిటీ వెబ్ సైట్ బిల్డ్ చేసే వారు. అలా ప్రారంభమైన గతేడాది సిరి పేరుతో ఓ రూపును సంతరించుకుంది.

“వెబ్ డెవలపర్ కావాలంటే ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు.” క్రాంతి

వెబ్ డెవలప్ మెంట్ కోసం కోడ్ రాయడం నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి పెద్దగా డిగ్రీలేం అక్కర్లేదంటారు క్రాంతి. ప్రారంభ రోజుల్లో తెలిసిన వారి దగ్గర నుంచి లీడ్స్ వచ్చేవి. తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు ఫ్రీలాన్సింగ్ వర్క్ లను కాంట్రాక్ట్ ఇచ్చేవి. హైదరాబాద్ లో ఉన్న ఎన్నో ఎమ్మెన్సీ కంపెనీల వెబ్ సైట్ డెవలప్ మెంట్ టీంలలో క్రాంతి పనిచేశారు. సిరి ఐటిని ఓ సంస్థగా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు తామే డైరెక్ట్ లీడ్స్ తీసుకుంటున్నారు.

image


స్టార్టప్ ఈకో సిస్టమ్

హైదరాబాద్ స్టార్టప్ ఈకో సిస్టమ్ లో సిరి కూడా భాగమైందనే చెప్పాలి. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో వెబ్ సైట్ లకు క్రాంతి పనిచేశారు. సిరి ఐటి ఇప్పటి వరకూ వంద స్టార్టప్ కంపెనీల వెబ్ సైట్ లను డెవలప్ చేసింది. అందులో కొన్ని ఫండింగ్ తో దూసుకుపోతున్నాయి. చాలా కంపెనీలు స్వయం ఉపాధితో ప్రయోజనం పొందుతున్నాయి. ఈరోజుల్లో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్లు, వెబ్ సైట్ల కోసం తెలుసుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాచారం విస్తరించింది. భారత దేశంలో స్టార్టప్ కల్చర్ పెరుగుతోంది. సరైన వెబ్ సైట్ ఉంటే వ్యాపారం విస్తరించడం చాలా సులువు . తమ దగ్గరకు వచ్చే క్లెయింట్స్ వెబ్ సైట్ డెవలప్ చేయడమే కాదు. దాన్ని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను, ప్రమోషన్ పార్ట్ ని కూడా తామే చేపడతామని క్రాంతి చెప్పుకొచ్చారు.

image


సిరి టీం

క్రాంతి , సిరి ఐటి ఫౌండర్. 2009లో జెఎన్టియూ నుంచి బిటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వీసా రిజెక్ట్ అయింది. దాంతో యూఎస్ ప్రయత్నాలు మానేసి జావా డెవలపర్ గా ఓ ఐటి కంపెనీలో జాయిన్ అయ్యారు . ఉద్యోగం చేస్తూనే వెబ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులను తీసుకునే వారు. క్రాంతి క్లాస్ మేట్ అవినాష్ సిరి ఐటి కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ఫోటోగ్రఫీలో దశాబ్ద కాలం అనుభం ఉన్న సృజన్ రెడ్డి సిరి ఐటి లో డిజైనింగ్ టీం ని లీడ్ చేస్తూ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. ఆన్ రోల్, ఆఫ్ రోల్ కలిపి దాదాపు 40మంది ఉద్యోగులు సంస్థ లో పనిచేస్తున్నారు.

సిరి లక్ష్యాలు

సిరి ఐటికి ఇప్పటి వరకూ 30మంది క్లెయింట్స్ ఉన్నారు. 10కి పైగా దేశాల్లో సేవలను విస్తరించారు. టెక్సాస్, ఆస్ట్రేలియాల్లో కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నెలకు 100కు పైగా కాల్స్ వస్తాయి. వీటి నుంచి 30 లీడ్స్ జనరేట్ చేస్తున్నారు. వీటి సంఖ్యను పెంచడమే ముందున్న లక్ష్యంగా క్రాంతి చెప్పుకొచ్చారు. డెవలపర్లుగా మారాలనుకుంటున్న వారికి సింపుల్ టిప్స్ చెప్పి ఎవరి వెబ్ సైట్ వారే చేసుకునే లా చేయడమే తన భవిష్యత్ లక్ష్యం అంటున్నారు క్రాంతి.

image


పోటీ దారులు

బిటుబి సెక్టార్ లో ఉన్న సిరి ఐటికి చాలా మంది పోటీదారులున్నారు. వెబ్ సైట్ డెవలప్ మెంట్ కంపెనీలు హైదరాబాద్ లోనే వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే బడ్జెట్ ఆధారంగా, స్టాండర్డ్స్ మెంటెన్ చేస్తూ సిరి దూసుకుపోతోంది. బిటుబి సెగ్మెంట్ లో వెబ్ ఆధారిత సేవలందించే స్టార్టప్ లనుంచి పోటీ ప్రధానంగా ఉంది. దీన్ని అధిగమించాల్సి ఉంది.

భవిష్యత్ ప్రణాలికలు

వెబ్ సైట్ నుంచి యాప్ కు అప్ గ్రేడ్ కావడం ప్రధానంగా పెట్టుకున్నారు. యాప్స్ డెవలప్ మెంట్ ను ప్రస్తుతం ఔట్ సోర్స్ ఇస్తోన్న సిరి ఐటి, ఇన్ హౌస్ టీంని తయారు చేసుకుంటోంది. ఫండింగ్ కు ఇప్పటికైతే ఆసక్తి లేకపోయినా వచ్చే ఏడాదిలో వెళ్లాలనుకుంటున్నారు.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags