సంకలనాలు
Telugu

ఫ్యాషన్‌లో బడా ఖిలాడీ ఈ మైలేడీ అవెన్యూ

క్యాట్‌వాక్ ట్రెండ్ డ్రసెస్ కావాలంటే మైలేడీ అవెన్యూకు ట్యూన్ అవ్వాల్సిందేట్రెండీ డ్రస్సులతో అదరగొడుతున్న మిలాడీపెరుగుతున్న మహిళల ఆన్‌లైన్‌ కొనుగోళ్లులేటెస్ట్ ఫ్యాషన్ కోసం పోర్టల్స్‌పై ఆధారపడుతున్న అతివలు

Krishnamohan Tangirala
8th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మన దేశంలో 6 కోట్ల మంది మహిళలు తమ రోజువారీ జీవితంలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని 2013 జూన్‌లో గూగుల్ ఇండియా ప్రకటించింది. దుస్తులు, యాక్సెసరీస్ కొనుగోలుకు మహిళలు ఆన్‌లైన్‌ను ఆధారం చేసుకుంటున్నారని... ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీల ఆధారంగా వెల్లడైంది. మిడిల్ క్లాస్ గణనీయంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు అంతకంతకూ ఊపందుకోవడంతో మహిళల కొనుగోలు సామర్ధ్యంతోపాటు, అలవాట్లు, తీరుతెన్నులు కూడా మారుతున్నాయి. వీటిని అర్ధం చేసుకున్న అర్జున్, హర్ష్ సేథ్‌లు మిలాడీఅవెన్యూ.కాం పేరుతో ట్రెండీ డ్రస్సులను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అది కూడా సరసమైన రేట్లలోనే అందించాలని భావించారు.

image


లేటెస్ట్ ఫ్యాషన్‌ను మహిళలందరికీ అందుబాటులోకి తెచ్చే యోచనతో దుస్తులు, యాక్సెసరీస్, ఫుట్‌వేర్‌లను ట్రెండ్‌కు అనుగుణంగా విక్రయించాలని అనుకున్నారు ఈ ఇద్దరు. అలాగే అనేక ఫ్యాషన్ బ్రాండ్లను ఒకేచోటకు తెచ్చేలా తమ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. రెండు కంప్యూటర్లతో ఓ చిన్న ఆఫీసులో తమ కార్యకలాపాలు ప్రారంభమైన మిలాడీ అవెన్యూ... ఇప్పుడు 50మందికి పైగా టీంతో రెండంతస్తుల బిల్డింగ్‌కు మారింది.

“మొదటి వారం రోజులు మా సైట్ నుంచి ఒక్క విక్రయం కూడా జరగలేదు. మొదటి ఆర్డర్‌ను ముంబైకి చెందిన ఓ కస్టమర్... మిలాడీ(సొంత బ్రాండ్) షర్ట్‌కు ఇచ్చారు. క్రమంగా అమ్మకాలు పెరిగాయి. ప్రతీ నెలా కస్టమర్ రిజిస్ట్రేషన్లలో అభివృద్ది కనిపించేది. ఈకామర్స్ ద్వారా భారీ వ్యాపారం నిర్వహించచ్చని మాకు తెలుసు. దీన్ని సాధించేందుకు ఎంత కష్టమైనా పడేందుకు మేం సిద్ధం” అంటున్నారు అర్జున్.

image


అర్జున్ ఒక ఫ్యాషన్ ప్యాషన్. గతంలో ఈయన ఫరెవర్ 21 ఇండియాకు విజువల్ మర్చండైజర్‌గా పని చేశారు. ఆ తర్వా మధుర ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్‌లో కీలక విధులు నిర్వహించారు. వస్త్ర వ్యాపారానికే చెందిన 2 స్టార్టప్స్‌లో పని చేయడంతో హర్ష్‌కు గణనీయమైన అనుభవం లభించింది.

మిలాడి అవెన్యూ అంటే సంథింగ్ స్పెషల్

“సృజనకు సాంకేతికతను జోడించి వ్యూహాత్మకంగా సరికొత్త ఫ్యాషన్‌ను అందుబాటు ధరల్లో అందించడం మా లక్ష్యం. దాంతోపాటే హైఎండ్ ఫ్యాషన్ లేబుల్స్, బ్రాండ్స్, సొంత బ్రాండ్ మిలాడీ, క్యాట్‌వాక్ ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను మా సైట్లో విక్రయిస్తాం” అన్నారు అర్జున్.

image


ఫిటింగ్ కుదిరితే బిజినెస్ హిట్టే

ఆన్‌లైన్ కొనుగోళ్లతో వచ్చిన చిక్కల్లా... కస్టమర్లు వాటిని టచ్ చేయడం కానీ, ఫీల్ అవడం కానీ కుదరదు. అందంగా అలంకరించిన ఫోటోలు చూసి కొనాల్సిందే. వాటి సరైన కొలతలు కూడా తెలియవు. దీంతో ఏ సైజ్ కొనాలో, ఏ నెంబర్ తీసుకోవాలో అనే కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. 

“ ఈ సమస్యను అధిగమించడానికి ఒకే డ్రస్‌కు సంబంధించిన ఫోటోలను అనేక యాంగిల్స్‌లో అందుబాటులో ఉంచుతాం. అలాగే అన్నిటికీ జూమింగ్ ఆప్షన్ తప్పనిసరి. బాడీ టైప్స్, స్పెసిఫికేషన్స్‌తోపాటు అన్ని వివరాలతో కూడిన సైజ్ ఛార్ట్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది” అని చెప్తున్నారు అర్జున్.

రాష్ట్రానికో ట్యాక్సింగ్ విధానం పెద్ద తలనొప్పి

మన దేశంలో డెలివరీలు చేసేందుకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ట్యాక్సులు వసూలు చేస్తుంటారు. ట్యాక్సింగ్ విధానాలు కూడా మారిపోతున్నాయి. ఒక మిలాడిఅవెన్యూకే కాదు... అన్ని ఈకామర్స్ కంపెనీలకు ఇది ఇబ్బందే. “గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్(GST) విధానం అమల్లోకి వచ్చాక మా సమస్యలు తగ్గుతాయి. అప్పుడు కేంద్రంతోపాటు, రాష్ట్రాల్లోనూ ఒకే పన్నుల విధానం ఉంటుంది. ప్రభుత్వాలు సప్లై సంస్థలకు మేలు చేసినట్లే” అంటున్నారు హర్ష్. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ద్వారా సేవలు, ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. నిజానికి ఈ అధిక రేట్లను కస్టమర్లు భరించాల్సిందే.

క్లాత్ బిజినెస్‌లో ఖిలాడీ ఈ మైలేడీ

ఈ స్టార్టప్ మరికొన్ని హై-ఫ్యాషన్ లేబుల్స్‌తో ఒప్పందాల విషయంలో తుది దశ చర్చలు నిర్వహిస్తోంది. ప్రతీనెలా 8-10 కొత్త బ్రాండ్లను జత చేసుకోవాలన్నది యోచన. తమ వెంచర్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు నిధుల అన్వేషణ కూడా జరుపుతోంది మిలాడీఅవెన్యూ. “ ప్రస్తుత స్థాయిలో మాకు నిధులు అవసరం కూడా. పెట్టుబడులు, విస్తరణ ద్వారా ఆదాయం పెంచుకుని... నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలంటే... ఇప్పుడున్న స్థాయి నుంచి పెరగాల్సి ఉందంటు”న్నారు హర్ష్.

వెబ్‌సైట్ : http://www.miladyavenue.com/

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags