సంకలనాలు
Telugu

గాల్లో తేలిపోండి.. కేన్సర్ బాధితులకు సాయం చేయండి!

కేన్సర్ బాధితుల కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్

26th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హైదరాబాద్ రోటరీ క్లబ్ తో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కేన్సర్ బాధితుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్కైఫెస్ట్ నిర్వహించనున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ లో ఆకాశంలో చక్కర్లు కొట్టి రావొచ్చు. డిసెంబర్ 23నుంచి ప్రారంభమయ్యే ఈ స్కై ఫెస్టివల్ లో వచ్చిన ఫండ్స్ ని హాస్పైస్ ఆసుపత్రి, రోటరీ క్లబ్ సంయుక్తంగా చేపట్టే క్యాన్సర్ క్యాంపైన్ కోసం వినియోగిస్తారు.

“ఉదాత్తమైన ఆశయం కోసం చేపడుతున్న ఈకార్యక్రమంలో అంతా పాల్గొనాలి.” కెటిఆర్

క్యాన్సర్ పై అవేర్నెస్ కల్పించడంతోపాటు బాధితులకు సాయం అందించడానికి ఏర్పాటు చేసిన స్కైఫెస్ట్ సక్సెస్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు.

image


క్యాన్సర్ పై క్యాంపైన్

హైదరాబాద్ లో మొదటిసారి ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది. దీన్ని భవిష్యత్ లో కూడా కొనసాగిస్తాం. జనంలో కూడా కేన్సర్ మహమ్మారిపై అవేర్ నెస్ తీసుకొస్తామని డాక్టర్ సుబ్రమణ్యం చెప్పారు. ఈయన స్పర్శ్ హాస్పైస్ ఆసుపత్రి ట్రస్టీగా ఉన్నారు. నిర్వహకుల్లో ఒకరిగా ఈ ఆసుపత్రి వ్యవహరిస్తోంది. స్కైఫెస్ట్ లో ఉపయోగించే బెలూన్ ట్రయల్ ను చేపట్టారు. స్కైఫెస్ట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ మద్దతిస్తుందని కెటిఆర్ చెప్పుకొచ్చారు. నాలుగైదు స్వచ్ఛంద సంస్థలు ఈ ఫెస్ట్ నిర్వహణ బాధ్యతలను చెపట్టాయి. సిటీలో ఫెస్ట్ కోసం క్యాంపైన్ మొదలు పెట్టారు.

image


రిజిస్ట్రర్ చేసుకుని గాల్లో తేలిపోండి

స్కై ఫెస్ట్ లో పాల్గొనాలనుకునే వారు వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవల్సిందిగా నిర్వహకులు చెబుతున్నారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరున జరిగే ఈ ఫెస్ట్ కోసం ఇప్పటికే వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. దీనికి లిమిటేషన్ లేదని, ఎవరైనా రిజిస్ట్రర్ చేసుకొని బెలూన్ లో ఎగిరిపోవచ్చన్న మాట. ఫేస్ బుక్ లో దీనికోసం పెద్ద ఎత్తున్ క్యాంపైన్ మొదలు పెట్టారు. బ్రౌచర్ ను కూడా రిలీజ్ చేశారు. స్కై ఫెస్ట్ వారి ఫేస్ బుక్ పేజీలో ఈవెంటుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ఆన్ లైన్ టికెట్ బేకింగ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

image


భవిష్యత్ లో మరిన్నిఈవెంట్స్

స్కై ఫెస్ట్ కు అనుబంధంగా మరిన్ని ఈవెంట్లు చేపట్టనున్నారు. గతంలో కేన్సర్ వాక్స్ లాంటివి మనం చూసినవే. అయితే వినూత్న రీతిలో స్కైఫెస్ట్ ను మొదటిసారిగా హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈవెంట్ లో పాల్గొనే వారి సంఖ్య రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే 2వేల మంది గా అంచనా వేయొచ్చు. మొదటి ఈవెంట్ సక్సెస్‌ అయితే మరిన్ని ఈవెంట్స్ చేపడతామంటున్నారు నిర్వహకులు. ఐదురోజుల పాటు పలు కల్చరల్ ఈవెంట్స్ తోపాటు, వ్యాపార సంబంధమైన సమిట్‌ లకు కూడా వేదిక కానుంది స్కైఫెస్ట్. భవిష్యత్ లో స్కై ఫెస్ట్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపినింగ్ ఫెస్ట్ గా మారుతుందని ఆశిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags