సంకలనాలు
Telugu

అమ్మయినా.. అమ్మమ్మయినా.. స్టార్టప్ పెడితే అదరగొట్టాల్సిందే..!

24th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


స్టార్టప్ ఐడియా ఉందా? వయస్సుతో పనిలేదు. అయినా సాధించాలన్న సంకల్పం ఉంటే వయస్సుతో సంబంధమేంటీ..? వయస్సనేది ఓ సంఖ్య మాత్రమే. మంచి ఐడియా ఉందా? అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారా? అయితే రిబ్బన్ కట్ చేసెయ్యండి. గత పదేళ్లుగా చూస్తే స్టార్టప్ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. బోర్ కొట్టిన కెరీర్ నుంచి తప్పుకొని స్టార్టప్ వైపు అడుగులు వేస్తున్నారు. మహిళలంటే ఏ పాతికేళ్లో, ముప్ఫై ఏళ్లో అనుకోకండి. వాళ్లంతా నలభై ఏళ్లు దాటిన మధ్య వయస్కులు. ప్రస్తుతం ఉన్న వెంచర్లలో 15-18 శాతం వీరి చేతుల్లోనే ఉన్నాయి. 2007లో ఈ సంఖ్య 2-3 శాతం మాత్రమే ఉండేదని ఓ అధ్యయనం సారాంశం. అయితే స్టార్టప్ నేషన్ గా గుర్తింపుతెచ్చుకుంటున్న మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మహిళల ఆంట్రప్రెన్యూర్ షిప్ పైన వాషింగ్టన్ కు చెందిన గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ 17 దేశాల్లో సర్వే చేసింది. అందులో ఇండియా ర్యాంకు 16. ఉగాండా కన్నా ఒకటి ఎక్కువ. ఇది 2013 నాటి సర్వే. ఒకవేళ అదే సర్వే ఇప్పుడు చేస్తే ఇండియా ర్యాంకింగ్ కాస్త మెరుగ్గా ఉండొచ్చు. కానీ అది సరిపోదు. 


స్టార్టప్ వైపు విద్యావంతులు, సెమీ-స్కిల్డ్ మహిళలు అడుగులు వేస్తుండటం ఆనందించాల్సిన విషయం. స్టార్టప్స్ కేవలం యంగ్ స్టర్స్ గేమ్ మాత్రమే కాదని నిరూపిస్తున్నారు ఆ మహిళలు. ఇదంతా చూస్తుంటే ఇకపై ఆంట్రప్రెన్యూర్ షిప్ మోడల్ లో మహిళల సంఖ్య వేగంగా పెరగనుంది. ఇలా స్టార్టప్స్ తో సత్తాచాటుతున్న 40-50 ఏళ్ల మహిళలల్లో ఇద్దరి గురించి తెలుసుకుందాం. 

షలాన్ డెరె, పాటర్స్ ప్లేస్ ఫౌండర్. 45 ఏళ్ల వయస్సులో పాటరీ వెంచర్ ప్రారంభించారు. దీని కంటే ముందు ఆమె మూడు దశాబ్దాలు స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడిపారు. 

విశాఖా సింగ్, రెడ్ పోల్కా ఫౌండర్. 41 ఏళ్ల వయస్సులో ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్యాషన్ ప్లాట్ ఫామ్ అది. ఆమె మార్కెటింగ్ ఎక్స్ పర్ట్. సుమారు రెండు దశాబ్దాల పాటు మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. తనకున్న అనుభవం, జ్ఞానంతో వెంచర్ ప్రారంభించాలనుకున్నారామె.

image


ఈ రెండు వైవిధ్యమైన ఉదాహరణలేంటంటే... ఒకరు తన అధికార పరిధిలో స్టార్టప్ అవకాశాలను వెతుక్కుంటే... మరొకరు తనకు అభిరుచి ఉన్న అంశాన్ని ఎంచుకుని నడివయస్సులో ఆంట్రప్రెన్యూర్లుగా మారారు. చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే తమ అభిరుచికి తగ్గట్టుగా స్టార్టప్ వైపు అడుగులు వేస్తున్నారు. వీళ్లు కూడా దశాబ్దాలుగా తమకు అనుభవం ఉన్న, తమ పరిచయాలు ఉపయోగపడే రంగాన్నే ఎంచుకుంటున్నారు. ఏదయితేనేం... మహిళలు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. 'స్టార్టప్ కోసం ఇదేమీ ఆలస్యం కాదు'. ఇప్పటికైనా మంచి అవకాశాలున్నాయి. స్టార్టప్ కేవలం 30 ఏళ్ల యువత వల్లే సాధ్యమవుతుందని మెంటార్లు, ఇన్వెస్టర్లు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోకండి.

ఇక ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... మధ్యవయస్కులైన మహిళా ఆంట్రప్రెన్యూర్లే పాతికేళ్ల యువ ఆంట్రప్రెన్యూర్ల కన్నా మెరుగ్గా రాణిస్తారన్నది వాస్తవం. ఎందుకంటే...

* పనిలో దశాబ్దాల అనుభవం వారి సొంతం.

* వారి రంగానికి సంబంధించిన వ్యవస్థపై పూర్తి పట్టు ఉంటుంది.

* స్టార్టప్ కోసం మంచి పెట్టుబడి పెట్టగల సామర్థ్యం వారికి ఉంటుంది.

* నలభై ఏళ్ల నాటికి వాళ్లు మాతృత్వాన్ని ఆస్వాదించేసి ఉంటారు. స్వతంత్రంగా ఎదుగుతున్న పిల్లలుంటారు.

* ఇక వారికున్న పరిణితి, వయస్సు చూసుకుంటే... వాళ్లు విఫలమయ్యే, నష్టపోయే అవకాశాలు తక్కువ.

ఇక స్టార్టప్ విషయంలో మహిళా ఆంట్రప్రెన్యూర్లకు ఒడిదుడుకులున్నాయి. నిధుల సేకరణ లాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆ సవాళ్లను ఎలా అధిగమించాలి? కలల్ని ఎలా నిజం చేసుకోవాలి? అదెలాగో చూద్దాం.

* నేర్చుకున్నది మర్చిపోండి: అవును... ఇది నిజం. మీకు ఏళ్లకేళ్ల అనుభవం ఉండొచ్చు. మీ రంగంలో దుమ్మురేపే టాలెంట్ ఉండొచ్చు. కానీ గేమ్ రూల్స్ మారాయి. అప్పటికీ ఇప్పటికీ కాంపిటీషన్ లో చాలా తేడా ఉంది. విజయం సాధించాలన్నా, ఎక్కువ రోజులు మనుగడ సాధించాలన్నా ఈ వ్యవస్థకు తగ్గట్టుగా మీ నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవడం అవసరం.

* నెగ్గడమే కాదు... తగ్గడమూ అవసరమే: గతంలో మీరు కార్పొరేట్ దిగ్గజం కావొచ్చు. ఓ పెద్ద టీమ్ ను లీడ్ చేసి ఉండొచ్చు. కార్పొరేట్ ప్రముఖులతో కలిసిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు స్టార్టప్ లో ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు. కాబోయే క్లైంట్లను కలిసేందుకు చాలా చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి మీ కంటే జూనియర్లను కలవాల్సి వస్తుంది. ఉన్నతస్థాయిలో పనిచేసిన చాలామంది మహిళలు... ఆంట్రప్రెన్యూర్ జీవితానికి అలవాటు పడేందుకు ఇబ్బంది పడుతుంటారు. మీకు బాగా తెలుసు. చాలామంది తమ జూనియర్లను కలిసేందుకు నిరాకరిస్తుంటారు. క్లైంట్ ని కలవాలంటే తమ ఆఫీస్ తరఫున ఓ ప్రతినిధిని పంపిస్తారు. కానీ ఆ బిజినెస్ ఎలా ముగుస్తుందో మీకందరికీ బాగా తెలుసు. అందువల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే... చిన్నవాళ్లను కలవాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, చిన్నతనంగా అనుకోవాల్సిందేమీ లేదు. మీకు ఎవరి బిజినెస్ కావాలో వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి సంసిద్ధులుగా ఉండండి. అందుకే అంటారు. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసుండాలని.

* క్లైంట్లలో సంశయం: మీరు నలభై, యాభై ఏళ్ల మహిళా ఆంట్రప్రెన్యూర్ అయితే, మీ కాబోయే క్లైంట్ మీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు కాస్త వెనకాముందు ఆలోచించే అవకాశాలున్నాయి. మీరు వయస్సులో పెద్ద కాబట్టి వారి అంచనాలను అందుకోగలరో లేదో అన్న సందేహం వారిలో ఉంటుంది. అందుకే ఎవరితోనైనా సులువుగా కలిసిపోయే సీనియర్లు, అనుభవజ్ఞులతో పాటు యంగ్ అండ్ ఎనర్జిటిక్ సిబ్బందిని నియమించుకోవాలి. తద్వారా క్లైంట్ల అపోహలు తొలగించొచ్చు.

* ఫండ్ రైజింగ్ కంచె తెంచండి: బాధపడాల్సిన విషయం ఏంటంటే, వెంచర్ క్యాపిటలిస్టులు మీ బిజినెస్ లో డబ్బులు పెట్టేందుకు తటపటాయిస్తారు. ఎందుకంటే... ఆంట్రప్రెన్యూర్స్ అంటే వారి దృష్టిలో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన ముప్ఫై ఏళ్లలోపు ఇంజనీర్లే. అసలు మీలాంటి వాళ్ల ఆలోచనలకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గర మీది పైచేయిగా ఉండే పరిస్థితి కనిపించదు. అందుకే ప్రొఫెషనల్ నెట్ వర్క్ ను తప్పకుండా ఉపయోగించుకోవాలి. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ని కలిసేందుకు సంకోచించకూడదు. వాళ్లైతే సీడ్ స్టేజ్ లో మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరు మొదట్లోనే మంచి పేరు తీసుకురాగలిగితే... సిరీస్ ఏ ఫండింగ్ ఇచ్చే వెంచర్ క్యాపిటల్స్ మీపైన ఎక్కువగా దృష్టిపెడతారు. కాబట్టి వెనకడుగు వేయకండి. మీ మనసు చెప్పేది విని మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఆలస్యమేమీ కాలేదు. గుర్తుపెట్టుకోండి. వయస్సు ఓ సంఖ్య మాత్రమే.

imageగమనిక: ఈ ఆర్టికల్ లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలు రచయిత వ్యక్తిగతమైనవి. వీటితో యువర్ స్టోరీకి సంబంధం లేదు.

రచయిత: ఛావీ దంగ్, స్టార్టప్స్ కన్సల్టెన్సీ కామ్ సూత్ర ఫౌండర్. మాజీ బిజినెస్ జర్నలిస్ట్. సంప్రదాయాలను ప్రశ్నించడం, సవాళ్లను ప్రేమించడం, వార్తల్ని వెంటాడటం ఆమెకు ఇష్టం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags