సంకలనాలు
Telugu

700కు పైగా వీధి కుక్కలను చేరదీసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

శునకాల కోసం విశాలమైన ఫామ్ హౌజ్

21st Dec 2016
Add to
Shares
25
Comments
Share This
Add to
Shares
25
Comments
Share

యులిన్ అని చైనాలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అది ఎంత క్రూరంగా ఉంటుందంటే.. కుక్కలను అతి కిరాతకంగా వేటాడి నరికి చంపి పండగ చేసుకుంటారు. ప్రపంచంలో అంతకంటే ఘోరమైన చర్య ఇంకోటి లేదు. పసికూనను కూడా వదలరు. చూస్తుంటేనే మనసు చివుక్కుమంటుంది.

సరే, ఆ విషయం పక్కన పెడితే, ఈ సృష్టిలో విశ్వాసంగల ఏకైక జంతువు ఏదైనా ఉందీ అంటే అది కేవలం కుక్క మాత్రమే. పాచిపోయిన అన్నం పెట్టినా తిని తోకాడిస్తూ కాళ్లదగ్గర పడివుంటుంది. తిండిపెట్టిన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. యజమానికి కనిపించకుంటే కుక్కలు కన్నీళ్లు పెట్టిన సందర్భాలూ లేకపోలేదు. అలాంటి మూగజీవాల కోసం జీవితాన్నే త్యాగం చేశాడో మనసున్న మనిషి.

image


రాకేశ్ శుక్లా. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మొదట ఢిల్లీలో పనిచేశాడు. ఆపై అమెరికా వెళ్లాడు. లగ్జరీ లైఫ్‌. ఖరీదైన కార్లు. లంకంత ఇల్లు. కావల్సినంత సంపాదన. ప్రపంచంలో తిరగని ప్రదేశమంటూ లేదు. కానీ ఇవేవీ అతడికి తృప్తినివ్వలేదు. ఇది కాదు జీవితం అని.. తిరిగి బెంగళూరుకు చేరాడు. అక్కడో సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు.

కుక్కలంటే రాకేశ్‌కు చిన్నప్పటినుంచీ వల్లమాలిన అభిమానం. అందుకే వాటికోసం తన జీవితాన్ని ధారపోయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే మొదటిసారిగా నెలన్నర వయసున్న గోల్డెన్ రిట్రైవర్ అనే జాతి శునకాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. దానిపేరు కావ్య.

ఆ తర్వాత ఒకటీ రెండు వీధి కుక్కలను చేరదీసినప్పుడు వాటిని ఆఫీసులో ఉంచాడు. మరో ఐదు శునకాలను ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో, ఆఫీసులో కలిపి పదికి చేరాయి. వంటిట్లో, బెడ్రూంలో, సోఫాల మీద ఎక్కడ పడితే అక్కడ తిరిగాయి. అలా వాటి సంఖ్య 125కి చేరింది.

భార్యకు సుతరామూ ఇష్టం లేదు. ఇదెక్కడి సంత అని గొడవ పెట్టింది. ఆమె వాటిని ఎక్కడ తరిమేస్తుందో అనే భయంతో ఇంటినే ఆఫీసుగా మార్చాడు. కుక్కల నంబర్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇల్లు సరిపోలేదు. దాంతో నగర శివారులోని దోడ్ బల్లాపూర్‌ లో కొంత స్థలం తీసకుని ఫామ్ హౌజ్ నెలకొల్పాడు. 

అదొక విశాలమైన స్థలం. అందులో డబుల్ ఫెన్సింగ్ తో 10 ఎన్‌క్లోజర్లు. ప్రతీ ఎన్‌క్లోజర్‌లో ఒక వాటర్ పాండ్. అది కాకుండా పావు ఎకరం స్థలంలో మరో స్విమ్మింగ్ పూల్. అందులోనే ఒక ట్రామా కేర్ సెంటర్. ఎప్పటికీ అందులో ఒక 20-30 కుక్కలకు ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. రాకేశ్ దగ్గరున్న మొత్తం 735 కుక్కల్లో.. వీధి కుక్కలతో పాటు జాతికుక్కలూ ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే అది ఒక అందమైన కుక్కల ప్రపంచం. విశాలంగా ఉంటుంది. ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్. పరిగెత్తడానికి చాలినంత గ్రౌండ్. ఆలనా పాలనా చూడ్డానికి పదిమంది స్టాఫ్. కుక్కలకు ఏదైనా జబ్బు చేస్తే నయంచేసేలా సిబ్బంది మొత్తానికి ట్రైనింగ్.

శునకాల తిండికి, వైద్య ఖర్చుల కోసం నెలకు ఎంత లేదన్నా రోజుకు రూ. 50వేలకు పైనే అవుతుంది. దాదాపు 93 శాతం డబ్బులు తన జీతం నుంచే ఖర్చుపెడతాడు. డైలీ 200 కేజీల చికెన్.. రెండు క్వింటాళ్ల అన్నం వండి పెడతాడు. మృత్యుముఖంలోకి జారుకున్న ఎన్నో కుక్కలు రాకేశ్ పుణ్యమాని తిరిగి ప్రాణాలు పోసుకున్నాయి. వీధుల్లో పడి చిక్కి శల్యమైన శునకాలు ఇవాళ లేచి చెంగు చెంగున తిరుగుతున్నాయంటే- అది అతని చలవే.

పెద్దసంఖ్యలో కుక్కలు ఉండటం.. అవి రాత్రిళ్లు మొరగడం.. దాంతో చుట్టుపక్కల వాళ్లు డిస్ట్రబ్ అవుతోందని గొడవకు దిగారు. దాన్ని మూసేయాలని కూడా గోల చేశారు. కొందరు యానిమల్ యాక్టివిస్టులు ఫామ్ హౌజ్‌ లోకి అనమతించాలని అర్ధంలేకుండా ఆందోళనకు దిగారు. కానీ అవేవీ రాకేశ్ పట్టించుకోలేదు. నేను చనిపోయేంత వరకు కుక్కలను నా నుంచి దూరం చేయలేరు అని ఖరాకండిగా చెప్పేశాడు. అవి తన లైఫ్‌లో భాగమని ఉద్వేగంగా అన్నాడు. నోరులేని మూగజీవాల పక్షాన నిలబడి జీవితాన్ని త్యాగం చేసిన రాకేశ్‌ నిజంగా గొప్పోడు.. మనసున్నోడు. 

Add to
Shares
25
Comments
Share This
Add to
Shares
25
Comments
Share
Report an issue
Authors

Related Tags