సంకలనాలు
Telugu

మీరు ఎంత చెమటోడిస్తే అన్ని ఆఫర్లు ఇచ్చేందుకు వాకాన్ సిద్ధం

ఫిట్ నెస్ యాప్ లో రిటైల్ డీల్స్హెల్త్ కేర్ నుంచి ఫిట్స్ నెస్ యాప్ దాకాయాప్ వాడితే కూపన్స్ ఫ్రీభవిష్యత్ లో మరిన్ని డీల్స్ అంటున్న ఫౌండర్లు

ashok patnaik
18th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హోం వర్క్ పూర్తి చేస్తే చాక్లెట్ ఇస్తానంటూ అమ్మనాన్నలు చెప్పిన చిన్ననాటి రోజులు గుర్తున్నాయా? రివార్డు ఇవ్వడం ఇక్కడి నుంచే ప్రారంభమైందన్న మాట. ఏది కూడా ఉచితంగా దొరకదనే జీవిత పాఠాన్ని నేర్చుకోవాల్సిన విషయం ఇది. మొబైల్ హెల్త్ సొల్యూషన్ పై పనిచేసిన కంపెనీ వాకాన్ తో జనం ముందుకు వచ్చింది. అయితే వాకాన్ అనేది ఫిట్ నెస్ తోపాటు ఈకామర్స్ కలిసిన ఆండ్రాయిడ్ యాప్.

వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ లాంటి ఫిజికల్ ఎక్సెర్ సైజులు యాప్ ద్వారా చేస్తే కూపన్లు ఉచితంగా లభిస్తాయి. దాదాపు 20 బ్రాండ్ లకు సంబంధించిన డీల్స్, ఫ్రీ ప్రాడక్ట్ లు ఈ యాప్ కలిగి ఉంటుంది. మేక్ మై ట్రిప్, ఫరెవర్ 21, స్మోక్ హౌజ్ డెలి, ఖాదీ నేచురల్స్, ఉజూరి డెక్, డైనింగ్ లాంటి వాటికి సంబంధించిన డీల్స్ లభిస్తాయి. జనాలకు ఆఫర్లు ఇవ్వడం ద్వారా యాక్టివ్ లైఫ్ స్టైల్ తోపాటు ఫిట్ నెస్ పై అవగాహన కల్పిండం, అలవాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. మరో వైపు బ్రాండ్ ప్రమోషన్ కు హెల్త్ ఇమేజిని కల్పించడం.

సీరియల్ ఆంట్రప్రెన్యూర్లు అయిన శ్వేతంక్ వర్మ, రాహుల్ బాత్రా మదిలో మెదిలిన ఐడియా ఇది.

మొబైల్ హెల్త్ సొల్యూషన్ ప్రారంభించడానికి ముందు వర్మ పిడబ్యూసిలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసేవారు. బిలియన్ డాలర్ ఫండ్‌ను మేనేజ్ చేసే టీంలో భాగస్వామిగా ఉన్నారు. తర్వాత తక్కువ కాస్ట్‌తో హెల్త్ కేర్ వెంచర్‌ని ప్రారంభించారు. బాత్రా కూడా క్లీ ఎనర్జీ వెంచర్ స్టార్టప్‌కు కో ఫౌండర్‌గా పనిచేశారు. వాకాన్ అనేది ఫిట్‌నెస్‌ను కరెన్సీగా మారుస్తుంది. జనం వ్యాయామాన్ని ఇష్టపడితే వారికి రిటైల్ ఔట్ లెట్ల ద్వారా కొన్ని వస్తువులు, సేవలు ఉచితంగా లభిస్తాయి. రన్ కీపర్, మూవ్స్ ఈ రెండింటినీ కలిపి యాప్ పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో 4 రోజులకు 12 కిలోమీటర్లు నడవాల్సిన చాలెంజ్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. 

ఒంటికి తొడుక్కునే డివైజ్‌లను తయారు చేసే పనిలో ఫౌండర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. బేసిక్ యాప్‌తో రివార్డు పొందిన తర్వాత ఒక్కటి ఒక్కటిగా రివార్డులను పెంచుకుంటూ పోతామని బాత్రా చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో పేడోమీటర్ కలిగిన యాప్‌ని లాంచ్ చేయబోతున్నట్టు నిర్వాహకులు చెబ్తున్నారు. 

యూజర్ ఒకసారి యాప్ వాడితే.. నిరంతరంగా తనకు చాలెంజెస్ ఇస్తూనే ఉంటారు. వాటిని పూర్తి చేస్తే కొద్దీ కూపన్లు వస్తూనే ఉంటాయి. ఈ రకం మార్కెటింగ్ జనానికి కొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఈ కూపన్స్ మూడు నెలల వ్యవధిలో వాడుకొనే వెసులుబాటుంది. భవిష్యత్‌లో గేమ్స్ , డీల్స్ పెంచుకుంటూ పోతామంటున్నారు బాత్రా.

శ్వేతంక్ వర్మ, రాహుల్ బాత్రా -మొబైల్  హెల్త్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు

శ్వేతంక్ వర్మ, రాహుల్ బాత్రా -మొబైల్ హెల్త్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు


ప్లే స్టోర్ లో యాప్ ప్రారంభమైన నెలరోజుల్లోనే 2వేల ఇన్ స్టాలేషన్ జరగడంతోపాటు 7వందల మంది యాక్టివ్ యూజర్లను సాధించగలిగింది. ఇది చాలా ఆసక్తి కలిగిన కాన్సెప్ట్ గా మేం నమ్మడమే కాదు.. యూజర్ల అభిప్రాయం కూడా అదే రకంగా ఉందని వర్మ,బాత్రాలు ముగించారు.

Download the app here

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags