సంకలనాలు
Telugu

నిరుపేద గర్భిణిల కోసం అద్భుతమైన వైద్య పరికరాన్ని కనిపెట్టారు

15th Aug 2017
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మీకు తెలుసా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీరోజూ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తో 800 మందికి పైగా గర్భిణిలు చనిపోతున్నారు. ఇవి గాలి లెక్కలు కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న నివేదిక. అందులో ఎక్కువ శాతం మరణాలు ఇండియా, ఆఫ్రికా లాంటి అల్పాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేక ఎందరో గర్భిణిలు పురిటి నొప్పుల కంటే ముందే ప్రాణాలు విడుస్తున్నారు.

image


వైద్యశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది అని గర్వంగా చెప్పుకుంటాం గానీ ఇప్పటికీ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళ పసరు మందులతో సరిపుచ్చుకుంటోంది. మెటర్నల్ హెల్త్ కేర్ విషయంలో ఇండియా చాలా వెనుకబడి వుంది. ఈ గ్యాప్ ని పూరించడానికి ముందుకొచ్చింది కేర్ ఎన్ ఎక్స్ అనే స్టార్టప్. మారుమూల ప్రాంతాలు, మురికివాడ్లలో కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తోంది. హెల్త్ వర్కర్ల సాయంతో ప్రతీ గర్భిణిని చెక్ చేసి వాళ్లకు అవసరమైన పరీక్షలు, ట్రీట్ మెంట్, మెడిసిన్ అందించడంలో సాయపడుతోంది.

శాంతన్ పాఠక్, ఆదిత్య కులకర్ణి అనే ఇద్దరు ఇంజినీర్ల బ్రెయిన్ చైల్డ్ కేర్ ఎన్ ఎక్స్. ముంబైకి చెందిన సైన్స్ ఫర్ సొసైటీ అనే ఎన్జీవో కలిసి పనిచేస్తున్నప్పుడు మారుమూల గ్రామాల్లో గర్భిణులు పడుతున్న అవస్థలను కళ్లారా చూశారు. ఎలాంటి వైద్య సదుపాయం లేని వాళ్ల బాధలను దగ్గరుండి గమనించారు. రెగ్యులర్ చెకప్స్ లేక, బేసిక్ మెడిసిన్ కూడా దొరకని వాళ్ల నిస్సహాతయకు చలించిపోయారు. గర్భంతో ఉండి ఎంత రిస్క్ చేస్తున్నారో చూసి ఆవేదన చెందారు. ఇలాంటి వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే కేర్ ఎన్ ఎక్స్.

5 రాష్ట్రాలు, 150 గ్రామాలు, 12కు పైగా మురికివాడల్లో కేర్ ఎన్ ఎక్స్ సేవలందిస్తోంది. ఇప్పటిదాకా 6వేల మంది గర్భిణులకు కేర్ ఎన్ ఎక్స్ మెడికల్ సహాయం చేసింది. కార్పొరేట్ కంపెనీల సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా 2017కల్లా 23వేల మంది గర్భిణులకు వివిధ రకాల సేవలందించబోతున్నారు.

ముంబైకి చెందిన అర్మన్, స్వస్థ్య లాంటి లాభాపేక్ష లేని సంస్థలు కూడా ఇలాంటి మెటర్నల్ హెల్త్ కేర్ సేవలనే అందిస్తున్నాయి. కాకపోతే కేర్ ఎన్ ఎక్స్ మాదిరిగా ఓవరాల్ చెకప్స్ కోసం పనిచేయడం లేదు. సమస్యను గుర్తించడమే కాదు.. దానికి సొల్యూషన్ కూడా చెప్తుందీ స్టార్టప్. గైనకాలజిస్టుల నుంచి అవసరమైన వైద్యం సాయం అందిస్తుంది.

image


సర్వీస్ మొత్తం హెల్త్ వర్కర్లే చూసుకుంటారు. మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్, మెడికల్ కిట్ ఈ మూడు వాళ్ల దగ్గరుంటాయి. దాంతో వాళ్లు ఇల్లిల్లూ తిరిగి ప్రతీ గర్భిణిని చెక్ చేస్తారు. స్మార్ట్ అల్గారిథం ద్వారా గర్భిణికి ఏ రకమైన వైద్య సాయం కావలో వెంటనే చెప్తారు. సదరు మహిళను అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి చేరవేస్తారు. పూర్తిగా టెక్నాలజీ సాయంతో పనిచేసే కేర్ ఎన్ ఎక్స్ మెటర్నల్ హెల్త్ కేర్ విషయంలో కీలకపాత్ర పోషిస్తోంది. డేటా కలెక్షన్, అనాలిసిస్, రిపోర్టింగ్ అంతా క్లౌడ్ ద్వారా చేస్తారు.

కేర్ ఎన్ ఎక్స్ రెండు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని కూడా డెవలప్ చేసింది. అందలో ఒకటి ఐఎన్ఎస్టీ. ఇది గర్భంలో శిశువు హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. ఇంకోటి యూనివర్సల్ స్ట్రిప్ రీడర్ (యూఎస్ఆర్). ఇది నిమిషాల్లో వివిధ రకాల పరీక్షలు చేస్తుంది.

ఈ స్టార్టప్ పనితీరు చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఐఐటీ బాంబే సెంటర్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్ షిప్ వాళ్లు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. గ్రాండ్ ఛాలెంజెస్ కెనాడా, వర్లడ్ హెల్త్ పార్ట్ నర్స్, ఐక్యారాజ్య సమితి మహిళా కమిటీ, ఇండియా, అమెరికాలోని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్లు నిధులివ్వడానికి ముందుకు వచ్చారు. కేర్ మదర్ కిట్స్ అమ్మకం ద్వారా కేర్ ఎన్ ఎక్స్ ఇప్పుడిప్పుడే రెవెన్యూ సాధిస్తోంది.

ఈ స్టార్టప్ లో పదిమందితో కూడిన టీం ఉంది. మహారాష్ట్ర, నాగాలాండ్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. ఆరోగ్య సంస్థలతో కలిసి ఒక లాంగ్ టర్మ్ విజన్ తో బలమైన టెక్నాలజీని తయారుచేసి ప్రతీ గర్భిణికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేర్ ఎన్ ఎక్స్. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags