సంకలనాలు
Telugu

ఇంట్లోనే వైద్య సేవలు అందించే ఇండియా హోం హెల్త్ కేర్

వైద్యం భారతీయుల పాలిట అందని ద్రాక్ష. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితున్న వారు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంటే ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. కొందరు ఆపరేషన్లు ముగిసిన వెంటనే ఇంటికి వచ్చే తర్వాత తీసుకోవాల్సిన చికిత్సలను పట్టించుకోవడం లేదు. అలాంటి వారి కోసం ఇంటి వద్దే నర్సింగ్ సేవలు అందించే సంస్థలు వచ్చేశాయి. ఆసుపత్రిలో ఖర్చు లేకుండా అంతకంటే చాలా తక్కువకే వైద్యం అందిస్తున్నాయి. ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్న ఇండియా హోమ్ హెల్త్ కేర్ సంస్థ గురించి నాలుగు మాటలివి.

22nd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వైద్య రంగంపై చర్చ జరిగిన ప్రతీ సందర్భంలోనూ ఖరీదైన హై టెక్నాలజీ పరికరాలు, అధునాతన వైద్యశాలలు, వైద్యులు గుర్తుకు వస్తాయి. ఇంటి దగ్గరే అందుబాటులోకి వస్తున్న ప్రత్యామ్నాయ సేవలు మన మదిలో మెదలడం లేదు. హోమ్‌ కేర్ అనేది పెద్దలకు, వయో వృద్ధులకు ప్రయోజనకరం. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కోలుకునేందుకు, అదనపు వైద్య సేవలు పొందేందుకు హోమ్ కేర్ చాలా అవసరం. దీని వల్ల అనవసరంగా ఆసుపత్రికి వెళ్లే ఖర్చు తప్పుతుంది. స్వల్ప కాలిక నర్సింగ్, పునరావాస చికిత్స దీని కిందకే వస్తాయి. విదేశాల్లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ సేవలు విస్తృత జనాదరణ పొందుతున్నాయి. ఈ దిశగా ఇండియా హోమ్ హెల్త్ కేర్ అనే సంస్థను ఫ్రాంక్ గోల్లర్, వి. త్యాగరాజన్, సమీర్ మెహతా కలిసి చెన్నైలో 2009లో ప్రారంభించారు.

image


ఫ్రాంక్, జర్మన్ జాతీయుడు. ఇండియా హోమ్ హెల్త్ కేర్ సంస్థకు నాలుగేళ్ల పాటు సీఈఓగా పనిచేశారు. తొలుత ఆయన అమెరికాలోని శాన్‌డిగోలో ఏడాది పాటు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో ఉన్నారు. తర్వాత తన మిత్రుడితో కలిసి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. తర్వాత దాన్ని ఒక పెద్ద కంపెనీకి లాభానికి విక్రయించారు. డెలాయిట్ కన్సల్టింగ్‌లో చేరిన ఫ్రాంక్ పదేళ్ల పాటు అంతర్జాతీయ ప్రాజెక్టుల నిర్వహణాధికారిగా ఉన్నారు. తయారీ రంగంతో పాటు ఆరోగ్య రంగంపై ఆయన దృష్టి పెట్టారు. జర్మనీలోని కోలోన్ విశ్వవిద్యాలయం నుంచి అయన డిగ్రీ పట్టా పొందారు. ఇటలీలోని మిలాన్‌లో ఉన్న బోకోనీ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. 2009లో చెన్నై వచ్చిన ఆయన ఇండియా హోమ్ హెల్త్ కేర్ స్థాపించారు. ఇంటి దగ్గరే నాణ్యమైన వైద్య సేవలు అందించగలిగారు. సీఈఓ పదవికి 2013లో రాజీనామా చేసి జర్మనీ వెళ్లిపోయిన ఫ్రాంక్.. ఇప్పుడు కూడా సంస్థ డైరెక్టర్‌గా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

సమస్యల్లోనే అవకాశాలను వెదుక్కునే వ్యక్తి మంచి వ్యవస్థాపకుడవుతారు. ఫ్రాంక్‌తో పాటు ఆయన సహ వ్యవస్థాపకులు అదే సూత్రాన్ని పాటించారు.

ఏజెన్సీల మాదిరి ఔట్‌సోర్సింగ్ చేయం

“ నేను మార్పు తీసుకురావాలనుకున్నాను. కలకాలం ఉండిపోయే మార్పు కోసం ప్రయత్నించాను. పశ్చిమ దేశాలతో పోల్చితే ఇక్కడ గృహ వైద్యం రంగం ఆ స్థాయిలో వృద్ధిలేదు. వ్యక్తిగత అనుభవాలే నేను ఇండియా హోమ్ హెల్త్ కేర్ స్థాపించేందుకు దోహదం చేశాయి” అని ఫ్రాంక్ భారత్ లో తన తొలి అనుభవాన్ని వివరించారు. తాము పొందిన స్పూర్తితోనే వీళ్లు మంచి ప్రారంభానికి పునాది వేసుకోగలిగారు. “ రోగులకు ఇంటివద్దే మేము వైద్య సేవలు అందిస్తాం. భారత్‌లో ఇదీ కొత్తేమీ కాదు. చాలా ఏజెన్సీలు ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తున్నాయి. మా పని మాత్రం చాలా వైవిధ్యమైనది. నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం. శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తాం. రోగులకు అందించిన సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులు ఉంటాయి. మేము ఏజెన్సీల తరహాలో పనిచేయం. ఫీల్డ్ స్టాప్ మా కంపెనీ ఉద్యోగులే. సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటాం” అని ఫ్రాంక్ తెలిపారు.

వైద్యానికి ఇక్కడ ప్రాధాన్యం తక్కువే

పాశ్చాత్య దేశాలకు భారత్‌కు చాలా వ్యత్యాసముంది. వైద్య సేవల రంగంపై వారి అవగాహన వేరుగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణకు జనం డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఇష్టపడరు. “జనం అత్యవసరమైతేనే వైద్య సేవలను వినియోగించుకుంటారు. సాధారణ వైద్యుడితో వారు సరిపెట్టుకుంటారు. వైద్య రంగం విషయంలో భారతీయుల అవగాహన, పాశ్చాత్య దేశాల ప్రజల అవగాహన వేరుగా ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో పేషెంట్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందాలనుకుంటారు. ఇందుకోసం కొంత రుసుము చెల్లించేందుకు వాళ్లు వెనుకాడరు. భారతీయులు ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాత్రమే మేలైన వైద్య కోసం తాపత్రయపడ్తారు. ఇంటికెళ్తే ఆసక్తి తగ్గి, ఖర్చులు చూసుకుంటారు. మేము అందించే సేవలు కొంత ఖరీదైనవే. వాటిని అందరూ భరించలేరని నాకు తెలుసు. నాణ్యమైన సేవలు అందించేందుకు మేము భారీ పెట్టుబడి పెట్టాల్సిందే. ఇందులో ఎలాంటి రాజీకి తావు లేదు” అని ఫ్రాంక్ వివరించారు.

ఫ్రాంక్ గోల్లర్, ఇండియా హోం హెల్త్ కేర్ సహ వ్యవస్థాపకులు

ఫ్రాంక్ గోల్లర్, ఇండియా హోం హెల్త్ కేర్ సహ వ్యవస్థాపకులు


నాలుగేళ్లలో సాధించిన ఫలితాలు ఇండియా హోమ్ హెల్త్ కేర్ మిషన్‌కు ఊతమిచ్చాయి. ఈ భాగస్వామ్యం తమ సేవలను విస్తృత పరిచేందుకు దోహదం చేసింది. “2013 మధ్య కాలం నుంచి అమెరికాకు చెందిన బయాడా హోమ్ హెల్త్ కేర్‌తో భాగస్వామ్యం కుదిరింది. దీని వల్ల మెట్రో నగరాల్లో మా సేవలు విస్తరించే అవకాశం రావడంతో పాటు… హోం హెల్త్ కేర్ రంగంలో అగ్రగామి సంస్థ నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. వచ్చే ఐదేళ్ల కాలంలో మేము 15 మెట్రోలకు విస్తరిస్తాం. పదేళ్ల కాలంలో అన్ని ఆదాయ వర్గాలకూ ఇంటి వద్దే వైద్య సేవలు అందించగలం. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన రోగులకు మేలైన సేవలందించగలం. హోం హెల్త్ కేర్‌ను ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ప్రభుత్వమే మాకు ఆర్థిక సాయం చేస్తుందని నమ్ముతున్నాం” అని ఫ్రాంక్ గర్వంగా చెబుతున్నారు.

చిన్న వయస్సులోనే ఫ్రాంక్ రెండు సంస్థలను స్థాపించారు. పెట్టుబడులు పెట్టి సంస్థలను స్థాపించాలనుకునే వారికి ఆయన ఒక సలహా ఇస్తున్నారు. “నేను చెప్పే సలహా ఒక్కటే. మీ ప్రధాన ఉత్పత్తిపై దృష్టిపెట్టండి. సులభంగా కనిపించే ఇతర అవకాశాల వైపుకు వెళ్లకండి. దీని వల్ల మీ అసలు వ్యాపారం దెబ్బతింటుంది” అని ఫ్రాంక్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags