సంకలనాలు
Telugu

ఐదు లక్షల మంది అనాథలకు అండగా నిలుస్తున్న హైదరాబాద్ యంగిస్తాన్

15th Apr 2017
Add to
Shares
34
Comments
Share This
Add to
Shares
34
Comments
Share

నీతి సూక్తులు ఎన్నయినా చెప్పొచ్చు. కానీ అవి ఆచరించి చూపినవాడే అసలైన ఆదర్శవంతుడు. ఒకేసారి గంపగుత్తగా సమాజాన్ని మార్చాలనుకోవడం భ్రమ. చిన్నచిన్న చేంజెస్ చాలు.. అవే ఒక మ్యాజిక్ చేస్తాయి. అడుగులు జత కలుస్తాయి. అలాంటి ప్రయత్నమే చేస్తోంది హైదరాబాద్ కి చెందిన యంగిస్తాన్ ఫౌండేషన్.

అరుణ్ యెల్లమాటి. మొదట్నుంచీ సేవా తత్పరత ఉన్న వ్యక్తి. తోటి మనిషికి చేతనైన సాయం చేయాలని భావాలు కలవాడు. తన 18వ ఏట పిజా డెలివరీ బాయ్ గా పని చేశాడు. కొంతకాలం రాక్ బ్యాండ్ లో వర్క్ చేశాడు. వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజులు గట్రా కట్టుకునేవాడు. సింగిల్ మదర్ చైల్డ్. కాబట్టి బాల్యంలో చాలా గడ్డు రోజులను ఎదుర్కొన్నాడు. కనీసం అవసరాలకు కూడా నోచుకోలేదు. అలాంటి కష్టాలు పక్కోడికి రావొద్దని కోరుకున్నాడంటే- ఎంత మానసిక క్షోభ అనుభవించాడో అర్ధం చేసుకోవచ్చు.

image


బ్యాండ్ కన్సర్ట్ లో భాగంగా అరుణ్ ఒకటి రెండు వీడియోలు ప్రదర్శిస్తాడు. దాంట్లో అనాథలు, అభాగ్యుల కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వాటిని చూసి ఎవరో ఒక మనసున్న మనిషి ముందుకు రాకపోతాడా అని ఆశ. ఒకసారి ఇలాగే ప్రదర్శిస్తే.. షో తర్వాత ఒక వ్యక్తి వచ్చి నిజంగానే నాకు సమాజ సేవ చేయాలనుంది. కానీ దానికి సరైన వేదిక దొరకడం లేదు. నువ్వేమైనా దారి చూపిస్తావా అని అడిగాడు. విచిత్రం ఏంటంటే అలా అడిగిన వ్యక్తి మళ్లీ కనిపించలేదు. కాకపోతే అతని మాటలు మంత్రంలా పనిచేశాయి. వేదిక ఏదో తానే ఎందుకు క్రియేట్ చేయకూడదు అనుకున్నాడు. అలా 2010లో మొదలైంది యంగిస్తాన్ ఫౌండేషన్. 2014లో రిజిస్టర్ అయింది. సమాజానికి తమవంతు సేవచేయాలనుకునే యువతీ యువకులకు ఇదొక మంచి ప్లాట్ ఫాం.

2010లో ఐదుగు వలంటీర్లతో ప్రయాణం మొదలైంది. 10మంది నిరాశ్రయులకు కడుపునిండా తిండిపెట్టేవాళ్లు. దేశంలోని నాలుగు నగరాల్లో వీరు సుమారు వెయ్యి మంది అనాథలకు, నిరాశ్రయులకు ప్రతీ ఆదివారం కడుపునిండా అన్నం పెడతారు. ఒక్క అన్నమే కాదు. వాళ్ల కనీస అవసరాలనూ తీరుస్తారు. అంటే జుట్టు నీట్ గా కట్ చేయడం.. స్నానం చేయించడం.. మంచి బట్టలివ్వడం.. మానని గాయాలుంటే వాటికి ట్రీట్ మెంట్ చేయడం.. ఫౌండేషన్ చేసే ఇంకో మంచి పని ఏంటంటే ఏ ఆదెరువూ లేని మహిళకు ఆర్ధికంగా కూడా చేయూతనిస్తున్నారు. దాంతోపాటు బ్రైట్ స్పార్క్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని కూడా రన్ చేస్తున్నారు. జెండర్ అవేర్ నెస్ ప్రాజెక్ట్ పేరుతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తున్నారు. హైదరాబాద్ మురికివాడల్లోని సుమారు 50మంది మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు.

సవాళ్లు ఉంటేనే రాటు దేలుతారు. బండి నల్లేరుమీద నడకైతే కష్టాలు తట్టుకోలేరు. సంస్థ స్థాపించిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రాబ్లమ్స్ లేవని కాదు. అందులో ముఖ్యంగా- ఎవరూ అంత తేలిగ్గా వీరిని నమ్మేవారు కాదు. ఇంకొందరు టైం వేస్ట్ చేసుకోకుండా ముందు కెరీర్ చూసుకోండని ఉచిత సలహాలు ఇచ్చేవారు. కొందరు వలంటీర్లు మధ్యలోనే మనసుమార్చుకుని డ్రాప్ అయ్యారు. ఇవన్నీ సమస్యలు తమని మరింత విశ్వాసంతో నిలబెట్టాయని ఫౌండర్ అరుణ్ అంటారు.

image


నాలుగేళ్లు తిరిగేసరికి సంస్థ కార్యకలాపాలు ఊహించనంతగా పెరిగాయి. సుమారు ఐదు లక్షల మంది నిరాశ్రయులకు కడుపునిండా అన్నం పెడుతున్నారు. సుమారు 3వేల మంది జీవితాల్ని తిరిగి నిలబెట్టారు. 50మంది చిన్నారులకు చదువు చెప్పిస్తున్నారు. మరో 50మంది మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు తగిన ప్రోత్సాహమిచ్చారు. రెండువేల మంది అమ్మాయిలతో కలిసి విమెన్ కరేజ్ అనే ప్రోగ్రాంలో భాగంగా పలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లలో, ఫుట్ పాత్ పై, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర తచ్చాడే అనాథ పిల్లల్ని చేరదీస్తున్నారు. చలికాలంలో రోడ్డువారగా వణికిపోతూ పడుకున్న వారందరికీ టీం సభ్యులు రాత్రంతా తిరుగుతూ వెచ్చటి దుప్పట్లు అందిస్తారు. వర్షాకాలమైతే రెయిన్ కోట్లు పంపిణి చేస్తారు. వాటితోపాటు ఎండాకాలంలో చెప్పుల్లేని వారికి చెప్పులు, పరిశుభ్రమైన తాగు నీరు అందిస్తారు.

సాటి మనిసికి సాయం చేయడమే పరమావధిగా పెట్టుకున్న యంగిస్తాన్ ఫౌండేషన్ కు ప్రతిష్టాత్మక ఏషియా ఫసిఫిక్ అవార్డు దక్కింది. ప్రస్తుతానికి ముంబై, భోపాల్, నోయిడా, హైదరాబాదులో ఉన్న సంస్థ కార్యకలాపాలు దేశమంతా విస్తరించాలని భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వీధివీధి తిరుగుతూ 24 గంటలపాటు ఆహారాన్ని అందించాలనేది వీరి ఫ్యూచర్ ప్రాజెక్ట్. దాంతోపాటు వొకేషనల్ ట్రైనింగ్, షెల్టర్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది మరో టార్గెట్. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఏడాది విమెన్ ఆఫ్ కరేజ్ అనే ప్రాజెక్టు కింద రకరకాల అవేర్ నెస్ ప్రోగ్రాంస్ ఇప్పించడం కోసం సుమారు 5వేల మంది అమ్మాయిల్ని ఆ కార్యక్రమంలో ఇన్ వాల్వ్ చేయాలని చూస్తున్నారు. 

Add to
Shares
34
Comments
Share This
Add to
Shares
34
Comments
Share
Report an issue
Authors

Related Tags