సంకలనాలు
Telugu

విజయానికి దారేది ?

ఇతరుల ఓటమినే మన సక్సెస్‌గా భావిస్తున్నామా ?విజయం పొందినవాళ్లందరూ ఆనందంగానే ఉన్నారా ?సచిన్, వినోద్ కాంబ్లీల మధ్య ఏ వ్యత్యాసం అసమానతలు తెచ్చింది ?గుండప్ప విశ్వనాధ్, గవాస్కర్‌ మధ్యా బేధం ఏంటి ?విజయానికి కొలమానమేంటి ?ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ గుప్తా ప్రత్యేక కాలం యువర్ స్టోరీ వీక్షకుల కోసం

team ys telugu
6th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సక్సెస్ అంటే ఏంటి ? దీన్ని వివరించేందుకు ప్రతీ ఒక్కరి దగ్గరా ఒక్కో నిర్వచనం ఉంటుంది. కొందరి కేవలం ఇదో ఉన్నత మానసిక స్థితి, కొందరికి దాని వల్ల వచ్చే లాభాలను లెక్కలేసుకుంటారు. మరికొందరికి పెరిగే హోదా చూస్తే.. ఇంకొందరు మాత్రం ప్రజల నుంచి పెరిగే గుర్తింపును చూస్తారు. నా దృష్టిలో విజయమనేది పరిస్థితులకు తగ్గట్టు అన్వయించుకునేది. ఇది ఎప్పటికీ సంపూర్ణం కాలేదు. విజయంతో మన జీవితం అక్కడే అయిపోదు, మన జీవిత గమనంలో అదో కీలక మలుపు. అక్కడితో ఎవరూ సంతృప్తి పడరు. ఇంకా గొప్పగా.. మరింత పైపైకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటాం. సక్సెస్ సాధించిన వాళ్లెవరినీ సంతోషంగా ఉండడం నేను ఇంతవరకూ చూడలేదు. వాళ్లు టాప్ పొలిటీషియన్లు కావొచ్చు, సెలబ్రిటీలు, సినీ స్టార్లు ఎవరైనా ఉండొచ్చు. వీళ్లెవరూ వాళ్లతో వాళ్లు పోటీపడకుండా ఇతరులతో పోల్చుకుంటున్నవారే. ఇతరుల ఓటమిని మనం సక్సెస్ అని ఎంజాయ్ చేస్తున్నారు.

image


నా ఉదాహరణే ఇక్కడ ప్రస్తావిస్తాను. రూ.1500 జీతంతో ట్రైనీ రిపోర్టర్‌గా నా కెరీర్ ప్రారంభించాను. నాతో పాటు చదువుకున్న వాళ్లలో కొందరు డాక్టర్లయ్యారు. కొంత మంది బ్యూరీక్రసీలో, పోలీస్ శాఖలో, అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్లు ఉన్నారు. కానీ నేను మాత్రం జర్నలిజం వచ్చాను. ప్రారంభంలో అందరికంటే ఇదే గొప్ప వృత్తి అనుకున్నప్పటికీ మెల్లిగా వాళ్లందరినీ చూసి నాలో అసూయ చెలరేగేది. జర్నలిజంలోకి వచ్చి తప్పుచేశానా అని అనేక సందర్భాల్లో అనుకునేవాడిని. నాకు రాయడమంటే మహా ఇష్టం. అందుకే ఇప్పటికీ రాస్తూనే ఉంటాను. సమాజంలో ఉన్న అత్యంత శక్తిమంతులైన జనాలపై విమర్శలు చేసేందుకు నాకు ఉన్న స్వేచ్ఛతో మొదట్లో మహా సరదాగా ఉండేది. అంతే కాదు ఇతర స్నేహితులతో పోలిస్తే నాకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉండేవి. కానీ ఆ తర్వాత నాలో రగులుతున్న అసూయను చూసి నేనే సిగ్గుపడ్డాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా లేరని, మన ఆలోచనలే మనల్ని ప్రభావితం చేస్తున్నాయని గుర్తించాను. కలలను కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు జనాలు పడే తాపత్రయం నాకు తెలిసొచ్చింది. ప్రపంచ కప్ విజయం తర్వాత సచిన్ టెండుల్కర్ అన్న మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ ఒక కల ఉండాలని, దాన్ని వెంటపడి మరీ సాధించేందుకు వాళ్లు చేయాల్సిన కృషిని సచిన్ ప్రస్తావిస్తాడు.

సచిన్ చాలా గొప్ప క్రికెటర్, కానీ ఈ విజయంతో మీరు సంపూర్ణమైన సక్సెస్‌ను సాధించారా అని అడిగితే.. సమాధానం మాత్రం నిరుత్సాహంగానే ఉండొచ్చు. అతడిని క్రికెట్ దేవుడిగా ప్రజలు కీర్తించొచ్చు, కానీ అతడు పర్ఫెక్ట్ కాదని ఆయనకూ తెలుసు. అతడు ఉన్నత బ్యాట్య్‌మెన్ అనే విషయాన్ని ఎవరూ కాదనరు, కానీ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆడుతూ పరుగుల వేటలో ఉన్నప్పుడు మాత్రం సచిన్ అత్యున్నత ఆటగాడిగా మాత్రం రుజువు చేసుకోలేకపోయాడు. ఉరిమే జోరు ఉన్నప్పటికీ అతడు ఒత్తిడిని మాత్రం తట్టుకోలేకపోయేవాడు. అదే వివిఎస్ లక్ష్మణ్ అయితే ప్రెజర్ కుక్కర్ లాంటి పరిస్థితుల్లోనే మెరుగైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతే కాదు జట్టు కెప్టెన్‌గా కూడా సచిన్ మంచి పేరు సంపాదించుకోలేకపోయాడు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి టీమ్‌కు కెప్టెన్‌గా ఉండే బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ... సౌరవ్ గంగూలీలా ప్రభావశీల వ్యక్తిగా మాత్రం ఉండలేకపోయాడు. స్కిప్పర్‌గా సచిన్ పూర్తిగా నిరుత్సాహపరిచాడు. ఒక దశలో బ్యాటింగా.. లేక.. కెప్టెన్సీ బాధ్యతలా అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు మనసు మాట విని బ్యాటింగ్ వైపే మొగ్గుచూపాడు సచిన్. సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనిపించుకునేందుకు సచిన్‌ తెగ ఆరాటపడేవాడు.

సచిన్‌కు అత్యద్భుత ప్రతిభ ఉంది. కానీ విజయాన్ని వరించాలంటే మాత్రం ఎన్నింటినో త్యజించాలని అతడు చిన్న వయస్సులోనే గ్రహించగలిగాడు. అతడు జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నాడు. ఉన్నతులందరిలో అత్యున్నతుడు కావాలనేది అతని కల. అయితే ఇదేమంత సులభమైన విషయం కాదు. కేవలం బ్యాటింగ్‌ ఒక్కటే అతడిని ఈ స్థాయిలో నిలబెట్టలేదు. తన లోటుపాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకున్నాడు. కెప్టెన్‌ బాధ్యతలు నిర్వహించడం కష్టమని తెలుసుకున్న మరుక్షణం ఆలస్యం చేయలేదు. తాను బెస్ట్ అయ్యేందుకు కెప్టెన్సీ అవరోధమని గుర్తించాడు. ఇది చాలా కీలకమైన నిర్ణయం. సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ కూడా అదే స్థాయిలో టాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోలేక విఫలమయ్యాడు. ఆత్మపరిశీలన చేసుకోకుండా.. తనలోని శక్తిని తెలుసుకోకుండా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. టాలెంట్ ఒక్కటే మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చలేదని విషయాన్ని తన స్నేహితుడుని చూసిన ప్రతీ సారీ కాంబ్లీకి గుర్తొస్తూ ఉంటుంది.

గుండప్ప విశ్వనాధ్, సునీల్ గవాస్కర్ విషయంలోనే అదే జరిగింది. 1980ల్లో గుండప్ప బ్యాటింగ్ చూసి జనాలు మురిసిపోయేవారు. కానీ అతడి బంధువైన గవాస్కర్ మాత్రం అతడి కంటే విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కారణం చాలా సింపుల్. గవాస్కర్‌కు తన జీవిత లక్ష్యమేంటో తెలుసు. అందుకే ఆలోచనలను క్రమబద్ధీకరించుకుంటూ స్పష్టమైన వాటితోనే ముందుకెళ్లాడు. విశ్వనాధ్ కూడా మరింత ఫోకస్డ్‌గా ఆలోచించి ఉండాల్సిందని నేను అనుకుంటున్నాను.

విజేతలు కావాలంటే ఏం చేయాలని.. యువత నన్ను అనేక సందర్భాల్లో అడిగింది. జీవిత లక్ష్యమేంటో తెలుసుకోవాలని నేను సూచిస్తూ ఉంటాను. మిమ్మల్ని మీరు గుర్తించండి, అదే మీ కెరీర్ అవుతుంది. ఇతరులు ఏం చేస్తున్నారో చూసి ప్రభావితం కావొద్దు. మీకు మీరే గొప్ప నిర్ణేతలు. మిమ్మల్ని మీరు మోసగించుకోకుండా...నిజాయితీగా ఉండండి. బ్యాటింగ్‌కు సూట్ అయినప్పుడు బౌలింగ్‌ చేయమనే బలవంతం వద్దు. ప్లానింగ్ లేకపోవడం వల్ల గొప్ప టాలెంట్ అంతా వృధా అయిపోతోందని నేను భావిస్తున్నాను. ఎవరి నైపుణ్యాన్ని వాళ్లు గుర్తించలేకపోతున్నారు. వాళ్లతో వాళ్లు పోటీపడకుండా ఇతరులతో పోటీకి దిగడం వల్లే ఈ సమస్య. నా ప్రియ మిత్రుడు ఒకరున్నారు. జర్నలిజంలో అతడు నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవాడు.

ఈ రోజు అతని ప్రస్తావనే ఎక్కడా లేదు. తనతో తాను ఏం చేయగలడో, చేయించగలడో స్పష్టత లేదు. మా స్నేహితులందరిలో అతడికే మొదటి అవకాశం దక్కింది, అయినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చేసిన తప్పులను ఒప్పుకోలేదు. మరింత మెరుగ్గా చేసి ఉంటే బాగుండేదనే విషయాన్ని జీర్ణించులేకపోయాడు. ఇతరులను అనుసరిస్తూ.. అనుకరించడంలోనే ఉండిపోయాడు. ఒక దశలో ఎవరినీ కాపీ కొట్టలేని స్థాయికి ఎదిగినప్పటికీ.. తన ఒరిజినాలిటీని కూడా చూపించడంలో విఫలమయ్యాడు. చివరకు అతడో ట్రాజిక్ - కామెడీగా మిగిలిపోయాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ తన తప్పును గ్రహించకపోవడం. తన ఓటమికి, ఇతరుల విజయానికి సాకులు వెతికి సంతృప్తిపడుతున్నాడు. తనను తానే మోసం చేసుకున్నాడు. 20వ శతాబ్దపు రష్యన్ బ్యాలే డ్యాన్సర్ అన్నా పావ్‌లోవా, ఒక విషయాన్ని చాలా కరెక్ట్‌గా చెప్తారు.

"విజయమనేది ఓ వ్యక్తి...చొరవ,శ్రమకు ఒక పెద్ద కొలమానం మాత్రమే, కేవలం శ్రమ వల్లే లభించేది కాదు'' - అన్నా పావ్‌లోవా

విజయమంటే ఏంటని మళ్లీ చివర్లో అడగొచ్చు. కేవలం కష్టపడి పనిచేయడమా, లేక వ్యక్తుల చొరవా ? అత్యంత ప్రతిభగల నైపుణ్యమా ? కెరీర్‌లో ఉన్నతదశను చూసిన నేను ఒక్కటే చెప్పగలను. సక్సెస్ అనేది పరిపూర్ణతకు ఒక సూచిక మాత్రమే. విజయమనే ఎండమావి వెనుక మనమంతా పరిగెడుతూ ఉంటాం. కానీ ఎంతసేపూ మనతోనే మనం కాకుండా ఇతరులతో పోటీపడ్తాం.

విజేతలు కావాలంటే మనమేంటో మనకు తెలియాలి, మన ఆత్మతో మనమే పోటీపడాలి.

-అశుతోష్

అశుతోష్ గుప్తా, ఆప్ అధికార ప్రతినిధి

అశుతోష్ గుప్తా, ఆప్ అధికార ప్రతినిధి


అశుతోష్ పరిచయం

జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో నేతగా మారారు. ఇప్పుడు ఆప్‌కు అధికార ప్రతినిధి. గతంలో ఆయన టివి 18కి చెందిన ఐబిఎన్ 7 ఛానల్‌లో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags