ఆంట్రప్రెన్యూర్స్ గా మహిళలు ఎదుర్కొనే సవాళ్లేంటి? ముగ్గురి విభిన్న అనుభవాలు..

ఆంట్రప్రెన్యూర్స్ గా మహిళలు ఎదుర్కొనే సవాళ్లేంటి? ముగ్గురి విభిన్న అనుభవాలు..

Sunday November 22, 2015,

5 min Read

"మహిళలకు సంబంధించిన ఫండమెంటల్ ఫాక్ట్స్ ఇప్పటికీ మగవారికి అర్ధంకావు. మేము మల్టీ టాస్కింగ్ చేసే సూపర్ హీరోస్" - ఓఇండ్రిల దాస్ గుప్తా.

"సమాజం పట్ల అవగహన కలిగి ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో మీ గొప్పతనం ఏంటో కూడా గుర్తించాలి" - మసూం మీనావాలా

"మగవారు పిల్లల్ని కనడం మొదలు పెట్టినపుడే పరిస్థితుల్లోమార్పు వస్తుంది"-బిందియా మహేశ్వరి.

మా జెండర్ కాస్త విభిన్నంగా ఉంటే మా జీవిత అనుభవాలు వేరుగా ఉండేవి. ఇది జగమెరిగిన సత్యం అంటారు ఈ ముగ్గురు ఆంట్రప్రెన్యూర్స్ . కేవలం సమాజంలోనే కాదు మహిళల పట్ల ఉన్న దృక్కోణం ఆంట్రప్రెన్యూర్ ఎకో సిస్టం లో కూడా ప్రవేశించిందనేది వారి అభిప్రాయం.

ఆంట్రప్రెన్యూర్ రంగంలో ఫండ్ రైజింగ్ అంటే, ఎడారిలో ఒయాసిస్ లాంటిదని భావిస్తుంటారు మహిళా ఆంట్రప్రెన్యూర్స్. అయినప్పటికీ, ఈ రంగంలో ఎదురవుతున్న వివిధ రకాల అడ్డంకులను, కష్టాలను అధిగమించి ముందుకు సాగుతున్నారు. ఇలాంటి అవరోధాలు పురుషుల కంటే విభిన్నంగా ఉంటాయని చెప్తున్నారు.

యువర్ స్టోరీ టీం ముగ్గురు మహిళా ఆంట్రప్రెన్యూర్ల ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసింది. ఇన్వెస్ట్ మెంట్ గురించి ఒకరిని, ఒడిదుడుకుల గురించి మరో ఇద్దరిని కలిసింది యువర్ స్టోరీ టీం. కాస్త భిన్నంగా ఉన్నా, ముగ్గురివీ ఒకే తరహా అనుభవాలే. వారి కంపెనీ కోసం ఫండ్ రైజింగ్ అంత సులభం కాలేదనే నిజాన్ని వెల్లడిస్తాయి.

ఓఇండ్రిలా దాస్ గుప్తా, కో-ఫౌండర్, ఈట్, షాప్, లవ్

ఓఇండ్రిలా కు చెందిన కంపెనీలో ఇటివలే పెట్టుబడులు వచ్చాయి. అయితే అంతకుముందు ఆమె చాలా సమస్యలను ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె గర్భవతి. "కంపెనీ ప్రారంభం కాకముందే, అసలు దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగకముందే, ఇన్వెస్టర్లు ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారు. ఓహ్, మీరు గర్భవతా? అంటే ముందు మీరు దానికే ప్రాధాన్యతనివ్వాలి" అంటూ మొదలుపెట్టేవారు.

ఇక కొంతమంది ఇన్వెస్టర్లు ఇంతకంటే కూడా దారుణంగా ప్రవర్తించేవారు. అసలు బిజినెస్ ప్లాన్ ఏంటో కూడా తెలుసుకోకుండానే, కామెంట్లు పాస్ చేస్తూ, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. మగవారిగా పుట్టడంతో వాళ్లకు చాలా సులభంగా అన్నీ అమరే అదృష్టం కలుగుతుందని, వారిని సుపీరియర్ స్పీషిస్ గా పరిగణిస్తారని అంటుంది.

image


"మీ ఐడియాకు ఇన్వెస్టర్లు దొరకడం అంటే, అది చాలా కష్టంతో కూడుకున్న పని. కనీసం ఏం చేయాలన్న అలోచనా లేకుండా ఉన్నప్పటికీ, మగవారికి మాత్రం అవకాశాలు లభిస్తాయి. వారికున్న ఫేస్ వాల్యూ, వాళ్లు వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ వారికి అలా అవకాశాల్ని అందిస్తాయి. ఇక ఆడవారు అంతకంటే క్వాలిఫైడ్ అయినప్పటికీ వారిని మాత్రం దూరం పెడతారు" అంటున్నారు ఓఇండ్రిలా.

తన కంపెనీకి కో-ఫౌండర్ అయిన తన భర్త రంగంలోకి ప్రవేశించగానే పరిస్థితి మారిపోతుందని అంటున్నరు ఓఇండ్రిలా. "అప్పటిదాకా ఉన్న వాతావరణం మారిపోతుంది. అంతకుముందు అదే మీటింగ్ లో, అక్కడున్న అమ్మాయి రిసెప్షనిస్టులా అయిపోతుంది. ఇలా అమ్మాయిలని తక్కువ చేసిచూడడం వల్లే అలాంటి పరిస్థితులు వస్తున్నాయని నేను భావిస్తున్నాను. మా వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, లేకుంటే ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు మేము మల్టీ టాస్కింగ్ చేయగలం" అంటున్నారు.

ప్రొఫెషనల్ మీటింగ్స్ లో సైతం, ప్రతీసారి వ్యక్తిగత అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం మరో చీకటి కోణం అంటున్నారామె. "ఒక మీటింగ్ లో, ఎలాంటి సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించారు. "ఐఐఎం ల నుంచి హాట్ విమెన్ బయటకు రావడం నేనెప్పుడూ చూడలేదు" అన్నాటమా నాకు ఇబ్బందికరంగా అనిపించింది. ఒక్కసారి స్థాణువులా మారిపోయాను, ఎలా రియాక్టవ్వాలో తెలియలేదు" అంటున్నారు.

ఇండిపెండెంట్ విమెన్ సాధించిన విజయాల్ని తక్కువ చేసి చూపిస్తూ, వాళ్ల శరీరం, అప్పీయరెన్స్ గురించి మాట్లాడుతుంటారు. అది సమాజంలో ఒక భాగంగా మారింది. ఇండిపెండెంట్ విమెన్ ను వాళ్లు జీర్ణించుకోలేరు. సరికదా చులకనగా చేసి మాట్లాడుతారని అంటున్నారు ఓఇండ్రిలా.

ప్యానెల్ లో ఉన్న మహిళా ఇన్వెస్టర్లు కూడా తక్కువేమీ కాదన్న అంశాన్ని గ్రహించారామె. కరుకుగా ఉంటూ, హేళనగా చూస్తూ, సెక్సిజం ధ్వనించేలా మాట్లాడేవారని ఆమె అంటున్నారు. "ఒక ప్యానెల్ లో ఉన్న మహిళ, నేనేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, ఆపమన్నట్లుగా చెయ్యెత్తి సైగ చేసింది. నీ అనుభవం సరిపోదు నీ అభిప్రాయం చెప్పడానికి అన్నట్లుగా ప్రవర్తించింది" అంటున్నారు.

మసూం మీనవాలా, ఓనర్, స్టైల్ ఫియెస్ట

మసూం మీనావాా. సంప్రదాయ గుజరాతీ కుటుంబం నుంచి వచ్చిన మహిళ. భారతీయ సమాజంలో ఉన్న కట్టుబాట్లను అనుసరించే కుటుంబంలో పెరిగింది మసూం. తాను అనుకున్న రంగంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

"ఇలాగే ఉండాలి, ఇది మాత్రమే చెయ్యాలి అనే పంథా నుంచి బయటకొచ్చాం. ఆ క్రమంలో మనమేం చెస్తున్నామో చెప్పాల్సిన జవాబుదారీ తనం రెట్టింపు అవుతుంది. అందుకోసం ఎక్కువ కష్టపడాలి" అంటున్నారు మసూం.

వీటన్నింటికీ కారణం తను మహిళ కావడమే అంటున్నారు మసూం. అయితే బిజినెస్ చెయ్యాలన్న తన ఆలోచన మనసు లోంచి వచ్చిందని చెప్తున్నారు. ఇన్వెస్టర్లకు ఇది తెలుసుకాబట్టి, ప్రజెంటేషన్ ఇచ్చే సమయంలో వ్యక్తిత్వం తో కూడిన ప్రొఫెషనలిజాన్ని తనలో చూస్తారని చెప్తున్నారు.

image


"మహిళ ఎప్పుడైతే పెట్టుబడులు పెడుతుందో అదంత ఆషామాషీగా ఉండదు. తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని పణంగా పెడ్తుంది. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని ఏ పొజిషన్ లో ఉంచాలనుకుంటున్నారో అది చెప్తుంది. మీ బిజినెస్ లో వ్యక్తిగత జీవితం అనివార్యంగా ఉంటుంది, అది ఇన్వెస్టర్లకు తెలుసు" అంటారు మసూం.

"మంచి మనసుతో ఆలోచించే మగ ఇన్వెస్టర్లు, మీ జీవిత ప్రణాళికలేంటని అడగడం అసమంజసమైన ప్రశ్నగా నేను భావించను. మీ చుట్టూ ఉన్న సమాజంలోని కట్టుబాట్లను కాదనుకోవడం బుద్ధి తక్కువ తనమే అవుతుంది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి"

తన మొదటి మీటింగ్ లో ఎలాంటి అనుభవం ఎదురవుతుందనే దాని కోసం ప్రిపేర్డ్ గా మసూం లేరు. "నా ముఖం మీదే నేను వచ్చిన కుటుంబ నేపధ్యం గురించి, మా కుటుంబం పాటించే సంప్రదాయాల గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి మా వాళ్లకున్న ఆలోచనలు గురించి గట్టిగా చెప్పారు. అలాంటపుడు మెము ఫండ్స్ ఎలా పెడతామని అన్నారు. పెట్టుబడుల గురించి చెప్పకుండానే బయటకు పంపించారు. అయితే నేను వెనుకడుగు మాత్రం వేయలేదు. పెట్టుబడులు సాధించగలిగాను. నాకు ఫండ్స్ ఇవ్వనని చెప్పిన వ్యక్తిని తప్పు తెలుసుకునేలా ప్రూవ్ చేయగలిగాని" అంటున్నారు మసూం.

"అలా జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదు, అందుకే పరిస్థితిని ముందుగానే అంచనా వేసుకుని, ఎలాంటి ప్రశ్నలు వస్తాయోనని సిద్ధంగా ఉండాలని ప్రతీ మహిళకు చెప్తాను.ఎలాంటి సంధిగ్ధతకు తావు లేకుండా జవాబులిస్తూ, మీ గేం ప్లాన్ ను వివరించండి. మీ వర్క్ ను, లైఫ్ ను ఎలా బాలెన్స్ చేసుకుంటారో చెప్పండి. ఒకవేళ CEO పోస్ట్ కోసం వాళ్లు అన్వేషిస్తున్నట్లయితే, వర్కింగ్ అవర్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకుంటూ, మీ జీవితాన్ని, ఆ కంపెనీ భవిష్యత్తుని, రెండూ ఒకేసారి మానేజ్ చెయ్యొచ్చు" అంటున్నారు మసూం.

బిందియా మహేశ్వరి, VP, CIO ఏంజెల్ నెట్ వర్క్, ముంబై

మనం ఇంకా పాత పద్ధతుల్నే అనుసరించే సమాజంలో ఉన్నాం. క్రియాశీలక ఆలోచనలు వస్తాయని, భవిషత్తు మారుతుందని అనిపించడంలేదు అంటోంది బిందియా మహేశ్వరి. ప్రతీ నెల అయిదు నుంచి, ఏడు సార్లు ఇన్వెస్టర్లు, ఇన్వెస్టిలతో మీటింగ్స్ అటెండ్ అవుతుంది. అలాంటి సమయంలో బిజినెస్ కు ఎలాంటి సంబంధం లేని ప్రశ్నల్ని మహిళలను అడుగుతారని బిందియా అంటున్నారు.

"ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్న చాలామంది మహిళలు, ఇరవై ఏళ్లలో ఉన్నవారే. దీంతో, అనివార్యమైన ప్రశ్న ఒకటి వాళ్లని అడుగుతుంటారు. అది, "మీ పెళ్లయిన తర్వాత ఏంచేస్తారని", దానికి వాళ్ల దగ్గర సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ప్రశ్న వాళ్ల కేపబిలిటీస్ ను జడ్జ్ చేయడానికి కాకుండా, బిజినెస్ పట్ల వారికున్న కమిట్ మెంట్ ను ప్రశ్నించేదిగా ఉంటుంది" అంటున్నారు బిందియా.

image


అలాంటి ప్రశ్నలు అడగడం సమంజసమా, అసమంజసమా అనేది వేరే చర్చ. కానీ, వాటిని ఎందుకు, ఏ కోణంలో అడుగుతున్నారో మాత్రం మనం అర్ధం చేసుకోగలం. అప్పుడనిపిస్తుంది మహిళల పట్ల సమాజంలో అభిప్రాయం ఏంటని? కార్పొరేట్ సెక్టారులో ఎంప్లాయీ-ఎంప్లాయర్ రిలేషన్, ఇన్వెస్టర్-ఆంట్రప్రెన్యూర్ రిలేషన్ కు తేడా ఉన్నా, రెండింట్లోనూ మహిళలు సెకండ్ క్లాస్ కి చెందినవారే" అంటున్నారు బిందియా.

"కార్పొరేట్ ప్రపంచానికి, బిజినెస్ కు చాలా తేడా ఉంటుంది. కార్పొరేట్ రంగంలో మహిళల కోసం ప్రత్యేక వసతులుంటాయి. పర్సనల్ లైఫ్ తో పాటుగా, ప్రొఫెషనల్ లైఫ్ కు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. అక్కడ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఫయిల్యూర్ ఉన్నా అది కంపెనీ మీద ప్రభావం చూపించదు. అక్కడి చట్రంలో తనో భాగం. అయితే దానికి భిన్నంగా విమెన్ ఫౌండర్ కంపెనీ మొత్తానికి తనే చట్రంలా ఉంటుంది. తన పెట్టుబడుల మీద ఇన్వెస్టర్ కు భయం వున్నప్పటికీ , మహిళా పారిశ్రామికవేత్తకు సాయంయం చేయడానికి గానీ, బాధ్యతలు పంచుకోవడానికి గాని ముందుకు రారు. మహిళ ఎంత మల్టీ టాస్కింగ్ చేసినప్పటికీ, వారు సంక్షోభంలో మాత్రం సహకరించరు" అని బిందియా అంటున్నారు.

"ఇక లెక్కలు కూడా అదే చెప్తున్నాయి. నేను ఇప్పటిదాక తొమ్మిది లేదా పది శాతం మాత్రమే ఈ రంగంలో మహిళల్ని చూశాను. మనదగ్గర పాతుకుపోయిన సమాజ కట్టుబాట్ల వల్లే మహిళలకు అవకాశాలు రావడం లేదని అనిపుస్తుంది. నిజానికి మహిళా ఇన్వెస్టర్లు కూడా ఒక రకంగా దీనికి కారణం. ఇప్పటిదాకా మహిళా స్వేచ్చ కోసం మాట్లాడిన ఒక్క విమెన్ ఇన్వెస్టర్ ని కూడా నేనిప్పటిదాకా చూడలేదు. బిజినెస్ అంటే బిజినెస్సే" అంటున్న బిందియా "మగవారు పిల్లల్ని కనడం మొదలు పెట్టినపుడే ఈ పరిస్తితుల్లో మార్పు వస్తుంది" అంటూ ముగించారు.