సంకలనాలు
Telugu

అందరినీ లక్షాధికార్లను చేయడమే ఓ ఇంజనీరింగ్ డ్రాపౌట్ ప్రతీక్ పటేల్ కల

వ్యాపారులకు వాణిజ్య సలహాలుట్రేడింగ్ కల్చర్ నేర్పించే దిశగాకొత్త వ్యాపారానికి సలహాలు, సూచనలుఓటమి నుంచి విజయతీరాలకు ప్రతీక్ పయనం

ashok patnaik
31st May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మిలియన్స్ ? బిలియన్స్ ? ట్రిలియన్స్ సంపాదించడం కంటే ఆనందం ఉందా అంటే ?ఒక పాయింట్ తర్వాత ,మనం ఎంత సంపాదిస్తున్నామో ,చివరకి ఎన్ని జీరోలు యాడ్ అవుతున్నాయో చూసుకోవడం కూడా చాలా కష్టం. ఇంతకీ ఏం సాధిస్తున్నాం ? దీనికి కొలమానం మనం హ్యాపీగా ఉండటం కాదా ? అలాంటప్పుడు సంపాదిస్తూ సంతోషంగా లేకపోతే ప్రయోజనం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలు ప్రతీక్‌ను మొదట్లో ఇబ్బంది పెట్టాయి.

చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత సాధారణ ప్రజల్ని లక్షాధికారులను చేయడమే లక్షంగా నిర్దేశించుకున్నారు. గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణం ఊంజ నుండి ఆయన స్టోరీ ప్రారంభమైంది. 2013లో నిఫ్టీ మిలీనియర్‌ను స్థాపించాడు. స్టాక్ మార్కెట్లో దాదాపు 200 కోట్ల రూపాయల ఇండెక్స్ ఫండ్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతీక్ దగ్గర డబ్బుతో పాటు కార్యసాధనకు తెలివితేటలు కూడా వున్నాయి .ఇండియాలో పొదుపు చేసే వారి సంఖ్యలో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఈక్విటీ సంబంధించి వాటిలో జమ చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈక్విటీ సంబంధించిన పెట్టుబడులు నలభై శాతం వరకూ ఉంటుంది. ఈ గ్యాప్ తగ్గించడానికి చూస్తున్నామన్నారు ప్రతీక్.

నిఫ్టెన్స్ టీం

నిఫ్టెన్స్ టీం


భారతదేశంలో 15 కంటే ఎక్కువ మిలియన్ వ్యాపారులు ఉన్నారు. ఇది మా వ్యాపార మార్కెట్ కంటే 4500 కోట్లు ఎక్కువ. మధ్యతరగతి జనాభా దగ్గర లిక్విడ్ నగదు చాలా ఉంది. ఇది రాబోయే పదేళ్లలో పదిరెట్లు కానుంది. ఆర్థిక స్వేఛ్చ కోరుకునేవారికి నిఫ్టీ మిలీనియర్ ఒక వాణిజ్య వేదికగా మారింది. జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువు చేస్తోంది. 

''రిస్క్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్ పై వాణిజ్య నిర్వహణకు మంచి కాన్సెప్ట్స్ ఆలోచించాం. ఆర్థిక లావాదేవీలు అవగాహన కోసం మేము ఈమెయిల్స్, బ్లాగ్స్ ,వెబ్ సైట్స్, ఒకరితో ఒకరు ఫోన్లలో మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తాం. మా సిస్టమ్ లో మరింత డబ్బు సంపాదించుకొనే వెసులుబాటుంది. మిడిల్ క్లాస్ ఆర్థిక భద్రతతో డబ్బు సంపాదించడానికి ఇదే మంచి దారి. భారతదేశంలో ఆర్థిక రంగంలో పారదర్శకత లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ పరిస్థితిని మార్చడానికి మేము మా సైట్లో రియల్ ట్రేడింగ్ కాంట్రాక్ట్ నోట్ జారీ చేస్తాం. స్టాక్ మార్కెట్లో డబ్బు ఎంత సంపాదించడమో తెలుసుకోవడం కంటే ఎలా సంపాదించామో తెలుసుకోవడం ముఖ్యం. పెట్టుబడిదారులు డబ్బులు పెట్టబోయే కంపెనీలపై రీసెర్చ్ చేసి ముందుకు వెళ్తారు. అయినా వారికి ఫలితం సందేహాస్పదంగా ఉంటుందన్నారు'' ఆర్థిక సలహాదారుడు రోహన్ అరినయ.

జూదమాడే వాళ్ళు కూడా వృత్తి వాణిజ్యదారులుగా మారుతున్నారు. అలాంటిది ప్రతీక్ ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రే తనకు పెద్ద ప్రేరణ. అన్నయ్య ఎన్నోసార్లు తన రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకోమ్మన్నాడు. అయితే తన గోల్ మాత్రం ప్రతీ ఒక్కరికి ఆర్థిక స్వేచ్ఛ వుండాలని కోరుకున్నారు. అదే తనని ముందుకు నడిపించిందని గర్వంగా చెప్తారాయన. ఈ వృత్తిలోకి మంచివాళ్ళు కూడా వస్తారని మాట్లాడుకోవాలి అదే నా ఉద్దేశం. నిఫ్టి మిలీనియర్ ముంబై కేంద్రంగా ప్రారంభమైంది. ఇప్పుడు 1500 మంది వ్యాపారులకు వాణిజ్య సహాయం అందించగా...30వేల మంది ట్రేడర్లతో లావాదేవీలను నిర్వహిస్తోంది. 

''డబ్బు సంపాదించడమనేది ఒక్క రాత్రిలో జరిగిపోదు. నేను 18 ఏళ్ళ వయసులో వున్నప్పుడు తండ్రి వ్యాపారం దివాలా తీసింది. మా దగ్గర రోజువారీ సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. నాన్నగారు ఒక బ్రోకరేజ్ సంస్థ నడిపారు. నేను కూడా అదే ఆఫీసులో కూర్చొని పని నేర్చుకోవడం మొదలుపెట్టాను. నాన్న మొత్తం డబ్బులు పోగుట్టుకొన్న తర్వాత నాకు అవి ఎక్కడ ఎలా పోయాయో కనుక్కోవాలనే కోరిక పుట్టిందంటున్నారు'' రోహన్

ప్రతీక్(కుడి),భార్య,వ్యాపార భాగస్వామ్యులతో

ప్రతీక్(కుడి),భార్య,వ్యాపార భాగస్వామ్యులతో


19 సంవత్సరాల వయసులోనే వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు రోహన్. ప్రారంభంలో అదృష్టం కలిసిరాలేదు. సంపాదించినదంతా నష్టపోయాడు. అప్పటి నుంచి రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని రీసెర్చ్ చేయడం, లాభదాయక మైన వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోవడానికి చాలా బుక్స్ చదివాడు. తాను గమని౦చిన కొత్త విషయాలను ఆఫీసులో వున్న స్టాఫ్ తో పంచుకొనేవాడు. అనుకోకుండా వారూ అతని సలహాలతో లాభాలు గడించడం ప్రారంభమైంది. అప్పుడు అతనిలో కొంత ఆనందం, ధైర్యం కనిపించింది. తాను ఇచ్చిన సలహాలతో బందువులూ మంచి లాభాలు పొందారు . అందులోంచి తనకు కొంత షేర్ కూడా ఇచ్చారు. అదే రోహన్ మొదటి సంపాదన. అప్పటినుండే ఈ వాణిజ్య వ్యాపారం చేయాలనీ నిర్ణయించుకొన్నాడు. అదే టైంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి అహమ్మదాబాద్ ఐఐటి నుండి అడ్మిషన్ వచ్చింది. బిజినెస్ ,చదువు రెండు ట్రై చేశాడు .కానీ అది వీలు కాలేదు. కుటుంబంతో చర్చించిన తర్వాత ఇంజనీరింగ్ చదవడం మానేశాడు. ఏకాగ్రత మొత్తం బిజినెస్ పై పెట్టాడు. అహ్మదాబాద్‌లో 100 మంది ఉద్యోగులతో వ్యాపారం మొదలుపెట్టాడు.

మహాత్మా గాంధీ చెప్పిన మాట “ఈ ప్రపంచంలో మనిషి ఆశకు తగ్గవన్నీ వున్నాయి. అయితే మన అత్యాశకు తగినవి లేవు. ఉన్నత స్థాయి ఉద్యోగులలో దురాశ మొదలైంది, వారి విపరీత కోరికలు తీర్చడానికి నాకు వీలుకాలేదు. దాంతో వాళ్ళు చీటింగ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో నా అయిదేళ్ళ వ్యాపారం నాకు నష్టాలను మిగిల్చింది. ఇది నా రెండవ వైఫల్యం. పరిస్థితులు మరింత దిగజారాయి. 15 రోజుళ్లో నా పెళ్లి వుంది. నా కుటుంబానికి విషయం చెప్పి వాళ్ళను భాదించతలచుకోలేదు. తన పరిస్థితులను కాబోయే భార్యకు అన్నీ వివరించి చెప్పాను .నాద్దగ్గర రూపాయి కూడా లేవని చెప్పాను. ఆమె చాలా భాదపడింది. ఆమె బాగాస్వామ్యంతో ముందుకు నడవాలని కోరుకొన్నాను. కోరుకోన్నట్లు ఆమె నన్ను నిలబెట్టింది .

ఈ పరిస్థితులనుండి ఎలా నెట్టుకు రావాలో అర్థం కాలేదు. ఇండియాలో వ్యాపార సలహాలు ఇచ్చే సంస్థలకు మంచి పేరు లేదు. వందల కంపెనీలు ప్రజల కష్టార్జితాన్ని భాగస్వామ్య౦గా పెట్టుకొని నడుపుతున్నారు. మా స్టాఫ్ కూడా అదే పద్దతిని అవల౦భించారు. అలాగే నడిపితే మేము కూడా మంచి లాభాలనే పొందేవాళ్ళం, కానీ నన్ను నీతినిజాయితీలు ఎప్పుడూ వెంటాడుతు౦డేవి. దాంతో నేను ఆ యూనిట్‌ను నడపకూడదని నిర్ణయించుకొన్నాను. సంస్థను మూసి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వచ్చేశాను .ఇప్పుడు ఏమి చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డాను. నాచుట్టూ చీకటి ఆవరిచింది. మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసి వ్యాపారస్థులు ఎవరైతే నష్టపోయారో వారికి సహాయపడాలనుకొన్నాను.

నిఫ్టియన్స్:

ఈ సమస్యను పరిష్కరించేందుకు తనతో పాటు భార్య ఫోరంపటేల్, ఐటిలో హెల్ప్ చేసేందుకు తన సహచరుడు ప్రవీణ్ దేశాయ్ “నిఫ్టీ మిలీనియర్ క్లబ్ “అనే ఒక కొత్త కాన్సెప్ట్ రూపొంది౦చాను. వ్యాపారులకు సంపద సృష్టించడానికి ఇదొక మంచి మార్గం. వ్యాపారం కొంత స్పీడ్ అందుకొన్నప్పుడు కొంతమంది యం.బి.ఎ వాళ్ళని తీసుకొన్నాను. ఎవరైతే మాతో కలిసి పని చేయలనుకున్నారో వారు ఫైనాన్సు రంగం గురించి తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచనలను ,భావాలను ముందే చెప్పి కన్ప్యూజ్ చేసేవాళ్ళం కాదు . ఈ రంగం పట్ల అభిరుచి,ఆసక్తి వున్నా వాళ్ళను మాత్రమె తీసుకొన్నాం .

మద్య తరగతి ప్రజల ఆర్థిక అపరిపక్వత నాకు పెద్ద పాఠం నేర్పింది. నేను కొన్ని కంపెనీలు పెట్టి ఫెయిలయ్యా. వాటి నుంచి గుణపాఠం నేర్చుకొన్నాక పదే పదే విజయం వరించింది. సమస్యలను నుండి పారిపోకుండా అందులోనే సక్సెస్ వెతుక్కోవాలని పార్థీక్ సలహా ఇస్తారు. తప్పులను తెలుసుకొని తిరిగి సంపాదించడమే బెస్ట్ మానేజ్మెంట్ అంటారాయన.

నేను మొదట డబ్బులకోసం పనిచేసే వారిని తీసుకొన్నాను. వాళ్ళ నుండి వచ్చే కష్టాలు తెలుసుకొన్నాక నాలాగే అభిరుచి వుండి పనిచేసేవారిని నిఫ్టియన్స్లో పెట్టుకొన్నాను. ఇప్పుడు నాకు బలమైన టీం వుంది . మేము తొందర్లోనే 'ఫైనాన్స్ ఫ్రీడమ్ డే' ని చేయబోతున్నాం .దీని ద్వారా ఉత్తమమైన ట్రేడింగ్ అనుభవాలు అందరికీ తెలుస్తాయి .

డబ్బు సంపాదించడానికి పార్థీక్ ఏడు సింపుల్ స్టెప్స్ చెప్పాడు .

 • సేవ్ చేయడం ఎలాగో నేర్చుకోండి.
 • ఒక ఇండెక్స్ ఫండ్ లో దీర్ఘకాల పెట్టుబడులు ఉంచండి.
 • కంపల్సివ్ కొనుగోలు మానుకోండి.
 • అనవసరం కొనుగోలు తగ్గించండి .
 • మీ లాభాలను అందరితో కలిసి మళ్ళీ పెట్టుబడులు పెట్టండి. బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, పిపిఎఫ్ ,రుణాలు ద్వారానే ఎవ్వరూ లక్షాధికారులు ,కోటీశ్వరులు కాలేరు .
 • స్వతహాగా మీరే పెట్టుబడి పెట్టండి .
 • ప్రాక్టీస్ చేస్తూ ఉండటమే సాధారణ జీవితం.
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags