సంకలనాలు
Telugu

బార్ టెండర్స్, బేకర్స్, హోం చెఫ్స్.. ఎవరు కావాలన్నా రీలిస్టెడ్‌లో దొరుకుతారు

నలుగురు ఢిల్లీ యూత్ ఆలోచనసొంతంగా పార్టీలు చేసుకునే టైంలో పుట్టిన ఐడియాపార్టీ ఏర్పాటుకు అవసరమైన వాళ్లందరూ ఒకే చోటికి

Poornavathi T
20th Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మీరు ఇంట్లో ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నారు. గెస్ట్స్ సంఖ్య కూడా బాగా తక్కువే. పదో, ఇరవై మందో ఉంటారు. బయట క్యాటరింగ్‌కు ఇవ్వడం ఇష్టంలేదు. అలా అని వంట చేస్తూ కూర్చుంటే పార్టీ ఏర్పాటు ప్రయోజనమే లేదు. వంట వాళ్లు ఎవరైనా పిలుద్దామంటే.. వాళ్లు ఎలా చేస్తారో అనే ఆందోళన లోలోపల ఉంటుంది. అందుకే వంట బాగా తెలిసి కుక్స్, బేకర్స్, బార్ టెండర్స్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. రుచికరంగా అన్నీ చేసి పెట్టే సామర్ధ్యం వాళ్లకు ఉన్నా, సరైన వేదికలేక అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్ల సంఖ్యకూ కొదవేం లేదు. అందుకే ఇద్దరినీ కలిపేందుకు ఢిల్లీలో పుట్టుకొచ్చిందో సంస్థ. అదే రీలిస్టెడ్.

image


ఈ మధ్య హోం ఫుడ్ కోసం జనాలు తహతహలాడిపోతున్నారు. హెల్త్ కాన్షియస్ మరీ పెరిగిపోవడంతో ఇంటి వంట కోసం అర్రులు చాస్తున్నారు. అయితే అలా చేసిపెట్టేవాళ్ల వివరాలు తెలియకపోవడం, ఇలాంటి సర్వీసులు ఆఫర్ వేసే ఆన్‌లైన్ వేదికలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం కూడా ఫుడ్ లవర్స్‌ను ఇబ్బంది పెడ్తోంది. గతరెండేళ్లుగా మనకు ఇష్టమైన హోం ఫుడ్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చే సర్వీసులకు విపరీతమైన గిరాకీ పెరిగింది.


రీలిస్టెడ్‌లో క్యాటరర్స్ వివరాలు

రీలిస్టెడ్‌లో క్యాటరర్స్ వివరాలు


ఇప్పుడు రీలిస్టెడ్ కూడా అలాంటి డైరెక్టరీనే రూపొందించింది. గొప్పగా వంట చేసే హోం చెఫ్స్, హోం బేకర్స్, బార్ టెండర్స్‌ను ఎంపిక చేస్తోంది. అయితే కేవలం పేర్లు, ఫోన్ నెంబర్లు మాత్రమే ఇచ్చే డైరెక్టరీలా కాకుండా వ్యక్తిగతంగా వెరిఫికేషన్ చేసి రేటింగ్ కూడా ఇస్తోంది. ఎవరైనా వాళ్ల సేవలు ఉపయోగించుకుంటే అందుకు తగ్గ కామెంట్స్‌ కూడా రాస్తారు. దీని వల్ల టాలెంట్ ఉన్నా గుర్తింపులేకుండా మరుగునపడిపోతున్న వాళ్లను వెలుగులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

ఎందుకొచ్చిందీ ఆలోచన

రీలిస్టెడ్‌ను నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించారు. వాళ్లే రోహిత్ పిళ్లై (కో ఫౌండర్. సిటిగ్రూప్, గ్రూపాన్‌లతో పాటు అడ్వర్టైజింగ్ రంగంలో పదేళ్ల అనుభవం ఉన్న ఎంబిఏ గ్రాడ్యుయేట్), శాంభవి సింగ్(కో ఫౌండర్. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌లో పదేళ్ల అనుభవం), అఖిల్ వాబ్లే (కో ఫౌండర్. ఫేస్ బుక్‌లో పనిచేసిన తొలితరం ఇంజనీర్. కోవె పేరుతో కంపెనీ స్థాపించారు. ఈ మధ్యే దాన్ని డ్రాప్ బాక్స్ కొనుగోలు చేసింది), రోష్నీ చావ్లా (పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్. టాప్ లైఫ్ స్టైల్ క్లైంట్లతో సంబంధాలు, ఓ ఫ్రెంచ్ కన్సల్టింగ్ సంస్థకు హెడ్‌గా పనిచేస్తున్నారు).

అఖిల్, రోహిత్ పిళ్లై, రోషిణి, శాంభవి (క్లాక్ వైజ్)

అఖిల్, రోహిత్ పిళ్లై, రోషిణి, శాంభవి (క్లాక్ వైజ్)


వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఈ నలుగురు స్నేహితులూ భోజన ప్రియులు కూడా. నిత్యం కలుసుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. తరచూ వీళ్ల పార్టీల అవసరం కోసం నిపుణులైన సిబ్బందిని వెతుకుతూ ఉండేవారు. అలా వాళ్ల అవసరం కోసమైనా ఓ డైరెక్టరీని రూపొందించాల్సి వచ్చింది. అలా కొంత మంది చెఫ్స్, బేకర్స్, వెండార్స్ నెంబర్లతో రూపొందిన డైరెక్టరీని ఇతరులు కూడా ఉపయోగించుకునేవారు. దీంతో మనమే ఎందుకు ఇలాంటి డైరెక్టరీని రూపొందించకూడదనే ఐడియా వచ్చిందంటారు రోహిత్.

''పార్టీలను నిర్వహించడం మాకు మహా సరదా. ఇందులో ఉన్న వ్యాపారావకాశాలు కూడా మమ్మల్ని ఆకర్షించాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్షన్‌ ఇప్పటికీ అవ్యవస్థీకృతంగానే ఉంది. వీటన్నింటినీ ఒక చోటికి తీసుకురావాలని అనుకున్నాం. మా ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కొద్దిగా డేటా కూడా సమకూర్చుకున్నాం. మొదట ఓ బేసిక్ ప్రొడక్ట్‌ను రూపొందించాం'' అనేది రోహిత్ మాట.

అయితే ఇప్పటికే ఈ రంగంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో ఫుడ్ క్లౌడ్ ఒకటి. అయితే కస్టమర్లు నేరుగా చెఫ్స్‌తో మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ల పేర్లు తప్ప ఇతర కాంటాక్ట్ డీటైల్స్ ఏవీ అక్కడ అందుబాటులో ఉండవు. ఫాసో వంటి సంస్థలు చెఫ్స్ కోసం అగ్రిగేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. హోలాచెఫ్, యుమిస్ట్ వంటి వేదికల ద్వారా హోం ఛెప్స్ నేరుగా ఇళ్లకే తాము వండిన ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు. కానీ రీలిస్టెడ్ మాత్రం హై క్వాలిటీ క్యాటరర్స్, బార్ టెండర్స్ కోసం ఈ వేదికను తయారు చేసింది. ఏ పార్టీ అయినా వీళ్ల అవసరం తప్పకుండా ఉంటుందనే నమ్మకం ఈ చతుష్టయానిది.

నెల రోజుల క్రితమే ఈ ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభమైంది. ఇందులో రకరకాల ఫిల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. బడ్జెట్, కావాల్సిన వంటకాలు, ఈవెంట్‌కు ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు వంటి అంశాలన్నీ పొందుపరిస్తే చాలు మనకు అవసరమైన వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికి సొంత నిధులతోనే ఈ పోర్టల్ ప్రారంభించారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిత్యం మార్పు,చేర్పులు చేస్తూ మరింత అభివృద్ధి చేస్తామని చెబ్తున్నారు. ప్రస్తుతానికి 300 మంది వెండార్లు వీళ్ల దగ్గర లిస్ట్ అయ్యారు. మరో 50 మంది వరకూ ర్యాంకింగ్ కోసం వేచిచూస్తున్నారు.

భవిష్యత్ ఏంటి ?

వివిధ రకాల వెండార్స్‌ను గుర్తించేందుకు అనేక మార్గాలను వీళ్లు ఉపయోగించుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల, పబ్లికేషన్స్, ఆర్టికల్స్‌ నుంచి వివరాలు సేకరించి రెకమెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న ఫుడ్ గ్రూప్స్‌ను కూడా వీళ్లు విరివిగా ఉపయోగించుకుని అక్కడి నుంచి చెఫ్స్, బార్ టెండర్స్, బేకర్స్ వివరాలు సేకరిస్తున్నారు. అలా సేకరించిన ప్రతీ ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరిస్తున్నారు. అన్నీ డీటైల్స్ పక్కాగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వివరాలు పొందుపరుస్తున్నారు. తమ దగ్గర లిస్ట్ చేసుకున్న వెండార్లకు బ్లూస్టార్ రేటింగ్ కూడా కంపెనీ ఇస్తోంది. వీళ్ల తమ ఫేవరెట్స్ అని సూచించేందుకే ఇలా చేస్తున్నారు. జనాల దృష్టిని ఆకర్షించిన తర్వాత భవిష్యత్ ఏంటని ఆలోచిస్తామని చెబ్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఇక్కడ బేస్ పెంచుకోవాలని చూస్తున్నారు. డెకొరేషన్స్, లైటింగ్, టేబుల్ లినెన్, టెంట్ల ఏర్పాటు వంటి విభాగాల్లో కూడా ప్రవేశించే యోచన వీళ్లకు ఉంది. ఒక పార్టీకి అవసరమైన అన్నీ విభాగాలూ తమ దగ్గర అందుబాటులో ఉంటే కస్టమర్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఆలోచన. ప్రస్తుతానికి మాత్రమే చెఫ్స్, క్యాటరర్స్, కేక్స్ అండ్ డెజర్ట్స్, బార్ టెండర్ల వివరాలు మాత్రమే అందుబాటులో ఉంటారు. పార్టీలు, ఈవెంట్లకు తమ సైట్‌ను ఒన్ స్టాప్ సొల్యూషన్‌లా మార్చాలనేది వీళ్ల టార్గెట్.

image


మొదట్లో ఈ టీమ్ అనేక ఇబ్బందులనే ఎదుర్కొంది. వెండార్లను వ్యక్తిగతంగా వెళ్లి కలుసుకోవడానికి బాగానే కష్టపడాల్సి వచ్చింది. మూడు వందల మందికి ఫోన్లు చేయాల్సి వచ్చింది. అయితే వాళ్లలో అధిక శాతం మంది ఫోన్లకు, మెయిల్స్‌కు రెస్పాండ్ కాకపోవడం, కొన్నిసార్లు అక్కడున్న వివరాలు తప్పుగా ఉండడాన్ని గమనించారు. అయితే నాలుగు నెలల అనుభవం తర్వాత వీళ్లు ఎంతో నేర్చుకున్నారు. వీళ్ల వివరాలు ఎక్కడ సులువుగా దొరుకుతాయో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల కసరత్తు తర్వాత ఇప్పుడు సైట్‌కు ఓ రూపం వచ్చింది.

''రీలిస్టెడ్ నానాటికీ విస్తరిస్తుంది. మేం మొదట అనుకున్న దానికంటే వేగంగా, విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. మేం మా సమయాన్ని, శక్తినంతటినీ ఇందుకోసం ధారపోస్తున్నాం. అవసరాన్ని బట్టి మా టీమ్‌ను కూడా విస్తరిస్తూ మరింత మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాం'' అంటారు ముగించారు ఈ నలుగురు దోస్తులు.

Photo credits - Relisted

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags