సంకలనాలు
Telugu

మా డేటా వాడుకుంటే మీరు దూసుకుపోవచ్చు.. అంటున్న జెర్మిన్8

సోషల్ మీడియా ఎనలిటిక్స్‌లో జెర్మిన్8 జోరుప్రైవేట్, పబ్లిక్ సైట్లలో ఉన్న వివరాలన్నీ ఒకే చోటికి చేరుస్తారుమీ వ్యాపార వృద్ధికి దోహదపడేలా చేస్తారుమీ బ్రాండ్, కంపెనీపై మార్కెట్లో ఏమనుకుంటున్నారో విశ్లేషిస్తారురేపటి భవిష్యత్ అంతా ఎనలిటిక్స్‌దే అంటున్న జెర్మిన్

Poornavathi T
9th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

రంజిత్ నాయర్ దక్షిణా కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అతనికి ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం. కొన్నేళ్ల పాటు యూఎస్ ఉద్యోగం చేసిన తర్వాత రంజిత్‌కు ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం అతనిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇండియాకు వచ్చి ఏదైనా చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు. 'స్టార్టప్ వ్యవస్థ అమెరికాలో బాగా అనుభవాన్ని సంపాదించుకుంది, అందుకే ఇండియా వచ్చిన అవకాశాలు వెతుక్కోవాలని అనుకున్నా అంటారు' రంజిత్. అతని తండ్రి రాజ్ నాయర్ కూడా ఐఐటి బాంబే, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వవిద్యార్థి. వివిధ కంపెనీల్లో ఉన్నతోద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంకేముంది కొడుకు ఉత్సాహానికి తండ్రి అనుభవం కూడా తోడైంది. ఇద్దరూ కలిసి వ్యాపారానికి అవకాశం ఉండి, పెద్దగా ఎవరూ దృష్టిసారించని రంగంవైపు కాలుమోపాలని నిశ్చయించుకున్నారు. రాజ్ కంపెనీకి అడ్వైజర్, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

image


వీళ్ల కంపెనీ పేరు జెర్మిన్8. 2007లో దీన్ని ప్రారంభించారు. కంపెనీలు అన్నీ ఆలోచించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి జెర్మిన్ రీసెర్చ్ ఎంతగానో ఉపయోగపడ్తుంది. ''మార్కెట్ రీసెర్చ్ చేయడం, అవి ఒక్కటే ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని మేం గమనిస్తున్నాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జనాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అందుకే మార్కెట్ పరిశోధనతో పాటు వివిధ సామాజిక సైట్లలో జనాల అభిప్రాయాలను కూడా మేళవించి క్లైంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జర్మిన్8 లక్ష్యం'' అంటారు రంజిత్. జర్మిన్ 8.. బిగ్ డేటా ఎనలిటిక్స్ సంస్థ. తమ ఉత్పత్తి లేదా సేవలను ఉపయోగించుకునే వివిధ రకాల కస్టమర్లు.. కంపెనీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో తెలిపి వాళ్లు తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి జెర్మిన్8 సహాయపడ్తుంది.

జర్మిన్8 టీమ్

జర్మిన్8 టీమ్


సోషల్ సైట్ల వివరాలనూ ఒడిసిపడ్తుంది

సేవల రంగంలో ఎనిమిదేళ్ల పాటు అనుభవం సంపాదించిన తర్వాత 2012లో జెర్మిన్8 ఓ ప్రొడక్ట్ రిలీజ్ చేసింది. దీని పేరు 'ఎక్స్‌ప్లిక్8'. ఇది SaaS(సాఫ్ట్‌వేర్ యాస్ సర్వీస్ - ఇదో వెబ్ బేస్డ్ సర్వీస్ లాంటిది) మోడల్‌లో పనిచేస్తుంది. వివిధ మార్గాల నుంచి సమాచారాన్ని సేకరణ, దాని విశ్లేషణను రియల్ టైంలో చేయడం ఎక్స్‌ప్లిక్8 బాధ్యత. అలా తీసుకున్న డేటాను ఇండస్ట్రీకి అవసరమైన విధంగా మార్చి వివరాలు ఇవ్వడం, లీడ్స్ జనరేట్ చేస్తుంది.

ఎంటివి, జాన్సన్ అండ్ జాన్సన్, గోద్రెజ్ వంటి బ్రాండ్స్, గ్రూప్ఎం, పర్ఫెక్ట్ రిలేషన్స్ వంటి ఏజెన్సీలు ఈ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఎంటివి కేస్ స్టడీని రంజిత్ చెబ్తున్నారు.''ఏదైనా ఎంటివి షోను ఉదాహరణగా తీసుకోండి. రోడీస్ ఉందని అనుకుందాం. ఈ షోలో పాల్గొనే వాళ్ల గురించి ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లలో కొంత మంది అధిక ఉత్సాహాన్ని ఈ షోపై చూపిస్తూ ఉంటారు. ఇక్కడే ఎక్స్‌ప్లిక్8 సీన్‌లోకి వస్తుంది. అలాంటి ఇంట్రెస్టెడ్ పార్టీ వివరాలను ఎంటివికి అందజేస్తుంది. అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్న సదరు పార్టిసిపెంట్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసి ప్రోమోలు చేసేందుకు వీలుంటుంది. దీనివల్ల పరోక్షంగా వ్యూయర్‌షిప్ పెరుగుతుంది''.

image


రేపటి భవిష్యత్తంతా ఎనలిటిక్స్‌దే !

ఈ రంగంలో అపార అనుభవం ఉన్న జెర్మిన్8 సేవలను ఉపయోగించుకోవాడనికి పెద్ద బ్రాండ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయి. బీటా వర్షన్ ఉపయోగించుకుని క్లైంట్లుగా మారాయి. బ్రాండ్ మానిటరింగ్, లీడ్ జనరేషన్, ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ -ORM, ఇన్‌ఫ్లూయన్సర్ ఎంగేజ్‌మెంట్ వంటివి తెలుసుకోవడానికి బ్రాండ్లు, ఏజెన్సీలకు ఉపయోపడ్తుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న జెర్మిన్ 8లో ఇప్పుడు 55 మంది ఉద్యోగులు ఉన్నారు. కొంత మంది ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ నిధులు కూడా సమీకరించింది.

ఎనలిటిక్స్‌ను ఉపయోగించుకోవాలి. ఇవి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తాయి. వాస్తవంగా బిజినెస్ వృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడ్తాయి. ఈ రంగం ఇంకా బాల్యదశలోనే ఉంది. బ్రాండ్స్ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ఎనలిటిక్స్ ఉపయోగించుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఎనలిటిక్స్ ''ఉండే బాగుంటుంది అని కంపెనీలు అనుకుంటున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి అనే స్థాయి వస్తుంది (from good to have to must have)'' అంటారు రంజిత్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags