పల్లె ఆలోచనలకు రెక్కలు తొడిగే రూరల్ టెక్నాలజీ పార్క్

పల్లె ఆవిష్కరణలకు సరైన వేదిక రిస్క్ 2017

పల్లె ఆలోచనలకు రెక్కలు తొడిగే రూరల్ టెక్నాలజీ పార్క్

Tuesday March 07, 2017,

3 min Read

స్టార్టప్ ఐడియా క్యాంపస్ కెఫెటేరియాలోనే పుట్టాలనే రూలేం లేదు. స్టార్ బక్స్ లో కోల్డ్ కాఫీ చప్పరిస్తూ ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడాలని రాసిపెట్టిలేదు. ఇంక్యుబేషన్ సెంటర్లోనే ఆలోచనకు రెక్కలు తొడగాలన్నది సిద్ధాంతమూ కాదు. మట్టిలో మాణిక్యాలున్నట్టే పల్లె జీవుల మస్తష్కంలోనూ కత్తిలాంటి ఐడియాలుంటాయ్. ఏ రచ్చబండ దగ్గరో, ఏ చింతచెట్టు కిందనో పిచ్చాపాటి మాట్లాడుతుంటే ఆలోచన పుడుతుంది. ఇంకాస్త పట్టుదలగా ముందుకెళ్తే అది ఆవిష్కరణగా మారుతుంది. అది నలుగురికీ ఉపయోగపడాలని సంకల్పిస్తే ఆటోమేటిగ్గా ఆంట్రప్రెన్యూర్షిప్ గా మారుతుంది. దానికి టెక్నాలజీ జోడిస్తే బ్రహ్మండమైన వ్యాపారం అవుతుంది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే పదిమందికీ ఆదర్శంగా నిలుస్తుంది.

image


దేశం ఇప్పుడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటోంది. విశ్వయవనిక మీద మేకిన్ ఇండియా సింహం గర్జిస్తోంది. ఈ నేపథ్యంలో పల్లె జీవుల మేథస్సులో మెరిసిన ఆలోచనలకు సరైన గుర్తింపు లేదు. వాళ్ల ఆవిష్కరణలకు సరైన వేదిక లేదు. మార్కెటింగ్ అవకాశాలూ అంతంత మాత్రమే. అందుకే రూరల్ స్టార్టప్ లకు సరైన ప్లాట్ ఫాం కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చింది రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ 2017. పల్లె ఆవిష్కరణలకు ఒక వేదిక కల్పించడం, రూరల్ ఆంట్రప్రెన్యూర్లను వెన్నుతట్టి ప్రోత్సహించడం, వారికి మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరడచం, అసరమైతే మెంటారింగ్, ఫండింగ్ ఏర్పాటు చేయడం, అవార్డులతో ప్రోత్సహించడం.. రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ (RISC) మెయిన్ కాన్సెప్ట్. దీనికి పార్ట్ నర్లుగా మేనేజ్, నార్మ్, టీ హబ్, టీఈ హైదరాబాద్, ఆటో డెస్క్ తో పాటు తదితర సంస్థలు వ్యవహరిస్తున్నాయి. యువర్ స్టోరీ మీడియా పార్ట్ నర్ గా ఉంది.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఐడియాలు, వాటర్-హెల్త్, వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ హౌజింగ్, ఇతర జీవనోపాధి అంశాలు.. ఇలా ఆరు సరికొత్త ఇన్నోవేషన్స్ కు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా ఉండాలన్నదే RISC ప్రధాన ఎజెండా.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ మరియు పంచాయతీరాజ్(NIRDPR) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కాన్సెప్ట్ పేరు రూరల్ టెక్నాలజీ పార్క్. మార్చి 23, 24 తేదీల్లో జరగబోయే ఈ ఈవెంట్ లో ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు, అకాడమిక్స్, ఆంట్రప్రెన్యూర్స్, వెంచర్ కేపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటు ఆంట్రప్రెన్యూరియల్ ఈకో సిస్టమ్ నుంచి అనేక మంది వక్తలు, టెక్నాలజిస్టులు, కార్పొరేటస్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని డైరెక్టర్ జనరల్ డా. డబ్ల్యూఆర్ రెడ్డి తెలిపారు.

image


ఆబ్జెక్ట్ ఏంటంటే..

రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ గుర్తించడం

స్టార్టప్స్ కు సరైన వేదిక కల్పించడం

ఎడ్యుకేట్ చేసి వాటికి సరైన స్తోమత కల్పించడం

మెంటారింగ్, ఇంక్యుబేషన్, డిజిటల్ కనెక్షన్

జాతీయ, అంతర్జాతీయంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం

రూరల్ టెక్నాలజీ పార్క్ లో పానెల్ డిస్కషన్స్ కూడా చేపడతారు. ఇన్నోవేటివ్ స్టార్టప్స్ కు సంబంధించి థిమాటిక్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఆలోచన ఎలా వచ్చింది.. ఎలా పనిచేస్తుంది.. దాంట్లో ఏ మేరకు కమర్శియల్ సక్సెస్ సాధించారు లాంటి అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఉంటుంది.

పాల్గొనాలనుకునే ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 10 ఆఖరు తేదీ. ప్రిలిమినరీ జ్యూరీ సభ్యులు 90 ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్లంతా మార్చి 24న జరిగే ఈవెంట్ లో 5 నిమిషాల పాటు తమ ఇన్నోవేషన్ గురించి ప్రజెంట్ చేయవచ్చు. అందులో 2 నిమిషాలపాటు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఫైనల్ గా ప్రోటోటైప్ స్టార్టప్ కేటగిరీ కింద 12 మందిని జ్యూరీ సెలెక్ట్ చేస్తుంది. అందులో టాప్ 6 స్టార్టప్స్ అవార్డుకు అర్హత సాధిస్తాయి. మార్చి 24న అవార్డుల ప్రదానం ఉంటుంది.

అవార్డు సాధించిన స్టార్టప్ కంపెనీలకు ఇంక్యుబేషన్ సపోర్ట్ అందిస్తారు. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఇవ్వడంతోపాటు.. మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరుస్తారు. దాంతోపాటు స్టేట్ రూలర్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, సెంట్రల్ ఏజెన్సీలు, ఎన్జీవోలు, ఇంటర్నేషన్ అసోసియేషన్లతో అనుసంధానం చేస్తారు. తద్వారా స్టార్టప్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అనేక సంస్థలు, వ్యక్తులతో నెట్వర్క్ మైలేజీ వస్తుంది. రూరల్ ఆంట్రప్రెన్యూర్షిప్ ప్రమోషన్ లో భాగస్వామ్యం అవుతారు. రూరల్ డెవలప్మెంట్ లో పార్ట్ నర్ గా అవతరిస్తారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి