సంకలనాలు
Telugu

రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త స్టార్టప్

సౌకర్యవంతమైన ఇంటి ప్రాడక్టుల కోసం యాక్టివ్‌లో లాగిన్ అవ్వండి

ashok patnaik
6th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆటోమేటిక్ డోర్లతో ఇళ్లను మరింత స్మార్ట్ గా మారుస్తానంటోంది యాక్టివ్ డాట్ ఇన్. అపార్ట్‌మెంట్ కల్చర్‌కు అలవాటు పడిన నగర జనాభా మరో అడుగు ముందుకేసి పీీవీసీ డోర్లవైపు మొగ్గు చూపుతోంది. జనం ఆలోచన దోరణిలో వస్తోన్న మార్పుతో పాటే సంస్థ అడుగులేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఐదేళ్ల అనుభవంతో రూపుదిద్దుకున్న సరికొత్త వెంచర్ ఇది.

image


“ ఇన్నేళ్లుగా ఇళ్ల నిర్మాణ రంగంలో ఉన్నాం. జనం నాడి తెలిసిన వాళ్లం. కచ్చితంగా మా కొత్త ప్రాడక్ట్ సక్సస్ అవుతుందని భావిస్తున్నాం ” యాక్టివ్ డాట్ ఇన్ ఫౌండర్ సుబ్బరాజు.

ప్రారంభించిన నెలరోజుల్లోనే వందల సంఖ్యలో ఆర్డర్లు రావడం పాజిటివ్‌గా అనిపించింది. ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు పోతున్నాం. ఒక సాధారణ స్టార్టప్ కోసం పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇప్పటికి అది నెరవేదిందని ఆయన చెప్పుకొచ్చారు. వీపీసీ డోర్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేకపోయినా... వాడే టెక్నాలజీ, డిజైన్స్ , ఇతర కంపెనీలతో పోలిస్తే ప్రత్యేకతను తీసుకొస్తాయంటున్నారు.

యాక్టివ్ ప్రారంభం

రియల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణం, ఇతన కన స్ట్రక్షన్స్‌తో బిజీగా ఉన్న కంపెనీ సడెన్‌గా ఓ స్టార్టప్ ప్రారంభించడానికి ప్రత్యేక కారణం ఉంది. సాధారణ ఇళ్ల నిర్మాణం ఎవరైనా చేస్తారు. ఇంటీరియర్స్ డిజైనింగ్ అనేది ఫ్లాట్ ఓనర్స్ చూసుకునే విషయం. మరింత డిఫరెంట్‌గా ఇళ్లని ఎలా నిర్మించవచ్చో ఆలోచించారు. అప్పుడు వీళ్లకు తట్టిన ఐడియానే పీవీసీ ఆటోమేటెడ్ డోర్స్, విండోస్. పిల్లర్స్ పై గోడలు కట్టగానే ఇంటి నిర్మాణం అయిపోదు. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలంటే తమ ప్రోడక్ట్ ఉపయోగించాలని అంటున్నారు సుబ్బరాజు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రకరకాల ప్రాడక్టులు యాక్టివ్ డాట్ ఇన్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి.. కావల్సినట్లు ఇంటిని నిర్మించుకోవచ్చంటున్నారు. మారుతున్న కల్చర్‌తో పాటు ఆలోచన ధోరణి మారుతూ వస్తోంది. కొత్తతరం నగర జనాభా కోసం సరికొత్త ప్రాడక్టుగా మార్కెట్లో అడుగు పెట్టామని సుబ్బరాజు చెబ్తున్నారు.

image


యాక్టివ్ టీం

యాక్టివ్ డాట్ ఇన్ సంస్థకు సుబ్బరాజు ఫౌండర్. అతనితో పాటు మొత్తం 20మంది దాకా ఆన్ రోల్ ఉద్యోగులు ఉన్నారు. సుబ్బరాజుకి పదేళ్ల పాటు కనస్ట్రక్షన్, ఇంటి నిర్మాణ రంగంలో అనుభవం ఉంది. చాలా సంస్థలతో పనిచేశారు. ప్రత్యేకంగా అర్బన్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణంలో సుబ్బరాజుకు పట్టుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం ఆయన శైలి. ఇప్పుడు యాక్టివ్‌ను కూడా అదే ఆలోచనతో మొదలు పెట్టారు. హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడల్లో సేవలు ప్రారంభించారు. ఇక్కడ కూడా యాక్టివ్ టీం పనిచేస్తోంది.

సవాళ్లు, లక్ష్యాలు

ఇంటి నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎత్తుపల్లాలు కామన్ అయినా .. భారీగా నష్టపోయిన దాఖలాలు లేవు. కానీ ఆ రంగం విడిచిపెట్టి దీన్ని ప్రారంభించడం వొక రకంగా సవాలే అనిచెప్పాలి. ఇదే తరహా వ్యాపారంలో ఎంతో మంది ఇప్పటికే ప్రవేశించారు. వారి దగ్గర నుంచి కాంపిటీషన్ చాలా ఉంది. మరో వైపు ఈ ప్రత్యేకమైన కిటికీలు, డోర్లు ఖర్చుతో కూడుకున్నవి. వీటిని మధ్యతరగతి ఇళ్లకు చేర్చడం అంటే అత్యంత కష్టమైన పని. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఏళ్లుగా ఉన్నాం కనుక కస్టమర్లను ఎలా కొత్త ప్రాడక్ట్ వైపు తీసుకు రావాలో తెలుసనే ధీమాతో ఉన్నారు సుబ్బరాజు. ఆల్ రెడీ తామీ రంగంలో ఎస్టాబ్లిష్ అయ్యాం కనుక తమ కొత్త ప్రాడక్ట్ ఈజీగా మార్కట్ చేయగలమంటున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఇంటి నిర్మాణానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చే ప్రాడక్టులు యాక్టివ్ లో లభిస్తాయి. వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. మరికొన్ని ప్రాడక్టులు మా కొత్త సంస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. మెట్రో తోపాటు టూ, త్రీయర్ సిటీలకు మా ప్రాడక్టులు తీసుకెళ్లాలని చూస్తున్నామని ముగించారు సుబ్బరాజు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags