సంకలనాలు
Telugu

దేశంలోనే తొలి ఇంటర్నేషనల్ బేకింగ్ అకాడమీ పెట్టిన కుర్రాడు.. ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు..!

SOWJANYA RAJ
22nd Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


కెరీర్ బై ఛాయిస్... యువతరంలో ఎక్కువ మంది తమకు ఏ రంగంలో చాన్స్ వస్తే అందులో కెరీర్ ని బిల్డ్ చేసుకుంటారు. ఆసక్తి లేకపోయినా అవకాశం వచ్చిందని దిగితే మనస్ఫూర్తిగా పనిచేయలేరు. రొటీన్ గా జాబ్ చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ పట్టుబట్టి తమకు ఆసక్తి ఉన్న రంగంలోనే దిగేవారు చాలా కొద్ది మంది ఉంటారు. వారే అద్భుతాలు చేస్తారు. ఇలాంటి యువకుడే వినేష్ జానీ. తనకు ఎంతో ఇష్టమైన "బేకింగ్"లోనే పట్టుబట్టి కెరీర్ ప్రారంభించాడు. ఫోర్స్ ఇండియా 2016 సంత్సరానికి ప్రకటించిన " ఫోర్బ్స్ అండర్ 30" కేటగిరిలో చోటు సంపాదించాడు.

బైకింగ్ సైన్స్... పేస్ట్రీ ఆర్ట్స్.... చదవడానికే కొత్తగా ఉంది కదూ... !. ఇదే వినేష్ జానీ క్రియేషన్. ఇరవై నాలుగేళ్ల వయసులో బెంగళూరులో వినేష్ జానీ దీన్ని ప్రారంభించాడు. అవిన్ తలైత్, లిజో ఎపీన్ అనే తన ఇద్దరు మిత్రులతో కల్సి కేకులు, పేస్ట్రీల తయారీ కళను అందరికీ నేర్పించడం కోసం దీన్ని ప్రారంభించారు. "లావొన్ని" భారత్ లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ బేకింగ్ అకాడెమీ. 

వినేష్ కి మొదటి నుంచి హోటల్ మేనేజ్ మెంట్ పై నే అమితమైన ఆసక్తి. అందుకే ఇంటర్ అయిపోగానే బెంగళూరులోని క్రిస్ట్ కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో చేరిపోయాడు. మొదట్నుంచి బేకింగ్ పైనే అమితమైన ఆసక్తి చూపేవాడు. బ్యాచ్ మేట్స్ అవిన్, లిజోలకు కూడా తన లాంటి ఆలోచనలే ఉన్నాయి. ముగ్గురూ కల్సి కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించేవారు. కోర్సు చివరి దశకు వచ్చిన సమయంలో కేకులు, పేస్ట్రీల తయారీలో స్పెషలైజేషన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అలాంటి అడ్వాన్స్ బేకింగ్ కోర్సులు అందించే సంస్థలేవీ ఇండియాలో కనిపించలేదు. ఇలాంటి కోర్సులు చేయాలంటే మలేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలాంటి దేశాలకు వెళ్లాల్సిందే. అందుకే తాము ఇలా వరల్డ్ క్లాస్ బేకింగ్ అకాడమీ పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు.

అయితే అనుభవం కోసం హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒబెరాయ్ గ్రూప్, స్టార్ వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ తర్వాత మలేషియాలోని "ఫేవిస్ డి చాకో అకాడమీ అఫ్ పేస్ట్రీ ఫైన్ ఆర్ట్స్" నుంచి షుగర్ ఆర్ట్, వెడ్డింగ్ కేక్ డెకరేషన్ లో డిప్లొమా చేశాడు. అప్పటికి 24 ఏళ్లొచ్చాయి. అంతకు మించి అంతులేని ఆత్మవిశ్వాసం దరి చేరింది. దాంతో బెంగళూరులో "లావొన్నె ఆకాడమీ"కి అంకురార్పణ జరిగింది.

" మేం కేకులు, పేస్ట్రీల మేకింగ్ లో అడ్వాన్స్డ్ కోర్సు చేయాలనుకున్నాం. ఇండియాలో అలాంటి అవకాశం కనిపించలేదు. ఇతర దేశాలకు వెళ్లి కోర్సులు చేయాల్సిందే. ఈ రంగంలోని చాలా మార్కెట్ ఉందని గమనించాం. హైలెవల్ బేకింగ్, పేస్ట్రీ మేకింగ్ అకాడమీ ప్రారంభించాం" వినేష్ జానీ

వినేష్ జానీ, లావొన్ని ఫౌండర్<br>

వినేష్ జానీ, లావొన్ని ఫౌండర్


నేర్చుకోవడం ఓ కళ

కొత్తగా కెరీర్ ఎంచుకునేవారికి, ఇప్పటికే అనుభవం ఉన్న బేకర్స్ కి కూడా లావొన్ని ఆకాడమీలో కోర్సులు డిజైన్ చేశారు వినేష్ అతని బృందం. 480 గంటల ఫుల్ టైమ్ డిప్లొమోతో పాటు హాబీగా వీకెండ్స్ తో నేర్చుకునేలా కూడా వీరు క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్సే కాదు.. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నేర్చుకునేందుకు ఏదో ఒకటి ఉంటుందక్కడ. శిక్షణ ఇవ్వడానికి పేరుపొందిన అంతర్జాతీయ చెఫ్ లతో ఒప్పందం చేసుకున్నారు. అకాడమీలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించారు. శిక్షణ కోసం వచ్చే వారికి అంట్రపెన్యూరియల్ ట్రైనింగ్ ఇస్తారు. సుగర్ ఆర్ట్, వెడ్డింగ్ కేక్ తయారీలో సృజనాత్మకత పెంచేలా శిక్షణ ఇస్తారు. వీటితో వ్యాపారం ఎలా వ్యాపారం ప్రారంభించాలనేదానిపై ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రత్యేకత చూపించేలా... శిక్షణస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. కోర్సులు పూర్తయిన వారికి ఫైవ్ స్టార్ హోటల్స్ పిలిచి మరీ ఉద్యోగాలిస్తున్నాయి. అయితే కొంతమంది వినేష్ దగ్గరే ఇంటర్న్ షిప్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వారిలో ఎక్కువ మంది సొంతంగా బేకింగ్ అండ్ కన్ఫెక్షనరీలో వెంచర్ ప్రారంభించడానికి ఉత్సాహం చూపించేవాళ్లే. శిక్షణ ఇచ్చేందు కోసమైనా బెల్జియం, ఫ్రాన్స్ నుంచి క్వాలిటీ మెటీరియల్ ను వినేష్ దిగుమతి చేసుకుంటారు.

కష్టాలెన్నో.. !

24 ఏళ్ల వయసులోనే ఎవరూ ఊహించని అకాడమీ పెట్టడం వినేష్ జానీకి అంత ఈజీ కాలేదు. ఆలోచన ఆచరణలోకి తేవడానికి చాలా కష్టపడ్డాడు. ఎలాంటి బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో అసలు ఎలా ప్రారంభించాలో తెలియక ఇక్కట్లు పడ్డాడు. చివరికి అనుమతులు ఎలా తెచ్చుకోవాలో...అగ్రిమెంట్లు ఎలా చేసుకోవాలో కూడా తెలియక తికమక పడ్డాడు. ఈ ఇబ్బందులతోనే తొలిసారి అకాడమీ ప్రారంభించాల్సిన ముందురోజే ఆపేయాల్సి వచ్చింది. భవన యజమానురాలు లేనిపోని పేచీలు పెట్టి అడ్డుపడటంతో... ప్రారంభం రేపనగా. ఈ రోజు భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో కథ మొదటికి వచ్చింది. అయినా వినేష్, అతని మిత్రులు వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా కరెక్ట్ ప్లేస్ దొరికిందని వినేష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వీట్ ఫ్యూచర్

లండన్ కు చెందిన ప్రసిద్ధ కలినరీ ఆర్ట్స్ ఆకాడమీ సిటీ అండ్ గిల్డ్స్ ప్రస్తుతం లావొన్నీ అనుబంధంగా కొనసాగుతోంది. మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రచారం ద్వారానే కొత్త విద్యార్థులు లావొన్నికి వస్తున్నారు. ఫోర్బ్స్ ఇచ్చిన ఘనత, 2016 టైమ్స్ ఫుడ్ ఫ్రైజుల్లో బెస్ట్ కన్ఫెక్షనరీ విభాగంలో వచ్చిన అవార్డులు వినేష్ బృందానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందుకే అతి త్వరలోనే బెంగళూరు వ్యాప్తంగా కేఫ్ లు ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడులు సేకరించి... ప్రపంచం మొత్తం విస్తరించాలని పెద్ద పెద్ద ప్రణాళికలే వేస్తున్నారు.

భారత్ లో బేకింగ్ మల్టీ బిలియన్ డాలర్ల బిజినెస్. పోటీ కూడా అంతే ఉంటుంది. అయితే స్థిరమైన ఆలోచనలకు కొంచెం అంకిత భావం, మరికొంత సహనం కలిపి ప్రయత్నిస్తే విజయవంతమైన బేకర్ కావడం కేకు కోసినంత ఈజీ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags