ఇతను కనిపెట్టిన కంప్యూటర్ నీళ్లతో పనిచేస్తుంది..!!

ఇతను కనిపెట్టిన కంప్యూటర్ నీళ్లతో పనిచేస్తుంది..!!

Sunday January 10, 2016,

1 min Read

ప‌వ‌ర్‌క‌ట్స్ గురించి ప‌రేషాన్ కాన‌క్క‌ర్లేదు. యూపీఎస్ అయిపోతోదంని దిగులే లేదు. కాసిన్ని మంచినీళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుంటే చాలు.. ఎంచ‌క్కా కంప్యూట‌ర్ మీద ప‌నిచేసుకుంటూ ఉండ‌చ్చు. ఏంటీ..? నీటితో ప‌నిచేసే కంప్యూట‌రా? ఇదెక్క‌డి విడ్డూరం అనుకుంటున్నారా? నిజంగా నిజం! అలాంటి కంప్యూట‌ర్‌ని డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో దాదాపు స‌క్సెస్ అయ్యారు భార‌త్‌కు చెందిన ఓ ప్రొఫెస‌ర్ .

image


మ‌నుప్ర‌కాష్‌. స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో బ‌యోఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప‌దేళ్ల పాటు వ‌ర్క‌వుట్ చేసి..క‌దిలే నీటిబిందువుల‌తో న‌డిచే ఓ సింక్రొన‌స్ కంప్యూట‌ర్‌ను రెడీచేశారు. ఫిజిక్స్‌లోని ఒక ప్రాధ‌మిక సూత్రంపై ఇది ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. దానికి డ్రాప్‌లెట్ కంప్యూట‌ర్ అని పేరుపెట్టారు. గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసిన వెంట‌నే ఇలాంటి ఐడియాను ఎలాగైనా వ‌ర్క‌వుట్ చేయాల‌నుకున్నారు మ‌నుప్ర‌కాష్‌. అప్ప‌టి నుంచి అయ‌స్కాంత క్షేత్రంలో క‌దిలే నీటిబిందువుల‌ను ఉపయోగించి కాలుక్యులేష‌న్స్ చేయ‌గ‌లిగే ఒక క్లాక్‌ను త‌యారుచేశారు. ఇదే ఈ ప‌రిశోధ‌న‌లో మొట్ట‌మొద‌టి అడుగు. మామూలు ఎల‌క్ట్రానిక్ కంప్యూట‌ర్ల‌కంటే అతి త‌క్కువ వేగంతో ప‌నిచేయ‌గ‌లిగే ఈ డ్రాప్‌లెట్ కంప్యూట‌ర్‌ని మానుప్యులేట్ చేయ‌డం కూడా చాలా సులువ‌ని, దీనిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయని ఆయ‌న చెబుతున్నారు.

ఇలాంటి ప‌రిశోధ‌న‌లు చేయ‌డంలో మ‌నుప్రకాష్ ఎప్పుడూ ముందుంటారు. గ‌తంలో పేప‌ర్ మైక్రోస్కోప్‌ను త‌యారుచేసి ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆశ్చ‌ర్యప‌ర్చారు. ఐడియాలు రావాలే కానీ.. టెక్నాల‌జీతో ఎలాంటి అద్భుతాల‌నైనా సృష్టించ‌చ్చు అనే దానికి ఈ స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెస‌ర్ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు.