సంకలనాలు
Telugu

ప్రశ్న ఎలాంటిదైనా సరే నిమిషాల్లో జవాబు చెప్పే హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్

team ys telugu
13th Aug 2017
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

సాధారణంగా ఏమైనా సందేహం వస్తే ఏం చేస్తాం..? నెట్ అందుబాటులో ఉంటే వెంటనే ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి టైప్ చేస్తాం. సంతృప్తికర సమాధానం వచ్చిందంటే సరే. లేదంటే అంతే సంగతులు. చూసినా కొద్దీ వేలకొద్దీ పేజీలు లోడ్ అవుతూనే వుంటాయి.. మనం అయోమయంలో పడుతూనే ఉంటాం. ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోడానికి జీవిత కాలం పడుతుంది. ఇలాంటి సందేహాలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెప్తోంది యూడూ స్టార్టప్.

image


హైదరాబాదుకి చెందిన తేజ గుడ్లూరు లీడర్ షిప్, మేనేజ్మెంట్ ట్రైనర్. ఒకసారి ఆయన సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నాడు. ట్రాన్సిట్ వీసా కావాలి. దాని గురించి పెద్దగా తెలియదు. ప్రొసీజర్ తెలుసుకుందామని ఇంటర్నెట్ ముందు కూచున్నాడు. ట్రాన్సిట్ వీసా అని టైప్ చేయగానే ధడేల్మని పదివేల పేజీలొచ్చాయి. రెండు గంటలు ఓపిగ్గా వెతికాడు. సమాధానం మాట దేవుడెరు.. మరింత కన్ ఫ్యూజన్లో పడ్డాడు. కొందరు ఎస్ అన్నారు. కొందరు నో అన్నారు. కొన్ని బ్లాగుల్లో సమాచారం ఎప్పటిదో కనిపించింది. మరికొందరు ఎగతాళిగా కామెంట్ చేశారు.

ఏంటీ అయోమయం. జస్ట్ ట్రాన్సిట్ వీసా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంత గందరగోళం భరించాలా? ఇలాంటి నిరాశా నిట్టూర్పులోంచి పుట్టుకొచ్చిందే యూడూ స్టార్టప్ ఐడియా. తనలాగే ఎందరో రోజూ సమాధానం దొరకని ప్రశ్నలతో విసుగెత్తిపోతుంటారు. వాళ్లకోసం పక్కా ఇన్ఫమేషన్ ఇచ్చే ప్లాట్ ఫాం ఏదైనా క్రియేట్ చేస్తే.. అది కూడా నిపుణులతో మాట్లాడించే వెసులుబాటు కల్పిస్తే.. మొత్తం యాప్ ద్వారానే దీన్నంతా నడిపిస్తే.. ఇలా ఆలోచిస్తూనే అడుగు ముందుకు వేశాడు. అలా 2017 ఏప్రిల్ లో యూడూ ప్రయాణం మొదలైంది.

యూడూ యాప్ పనితీరు సింపుల్. యాప్ డౌన్ లోడ్ చేసుకుని సైనప్ అవ్వాలి. అడగాల్సిన క్వశ్చన్ ఏ రంగానికి సంబంధించిందో వెతకాలి. అంతే.. సంబంధిత ఏరియా నుంచి ఒక ఎక్స్ పర్ట్ ఫోన్ లైన్లోకి వస్తాడు. మీరడిగిన ప్రశ్నకు సంతృప్తికర సమాధానం ఇస్తాడు. నిమిషాల్లో మీ సందేహం పటాపంచలు. మరోవైపు మీకు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తోంది యూడూ యాప్. మీరు ఏదైనా రంగంలో నిష్ణాతులైతే ఎక్స్ పర్ట్ పానెల్లో చేరొచ్చు. కొంత పర్సంటేజీ ఇస్తారు. గంటకు వంద నంచి ఐదు వేలకు సంపాదించుకునే అవకాశం ఉంది. కెరీర్ కౌన్సెలింగ్, రిలేషన్షిప్స్, ఫ్యాషన్, పెట్స్ ఇలా 25 రంగాలకు చెందిన 300 మంది నిపుణలు అడ్వైజరీ పానెల్లో ఉన్నారు. యూజర్ల ప్రైవసీని పక్కాగా మెయింటెన్ చేస్తారు. అందులో డౌటే లేదు.

image


ప్రస్తుతం ఈ రకమైన స్టార్టప్స్ ఇండియాలో రెండుమూడు మాత్రమే ఉన్నాయి. బెంగళూరుకి చెందిన టాప్ చీఫ్, చండీగఢ్ బేస్డ్ క్విక్ కన్సల్ట్ ఇన్ స్టంట్ అడ్వైజ్ సేవలు అందిస్తున్నాయి. కాకపోతే ఆ రెండు వెబ్ సర్వీసు మాత్రమే. యూడూ ఒక్కటే యాప్ మోడ్ లో ఉంది.

ఐదుగురు ఉద్యోగులు, ఆరుగురు అడ్వైజర్లు, రూ.30 లక్షల పెట్టుబడితో మొదలైన యూడూ ప్రయాణం శరవేగంగా దూసుకెళ్తోంది. సస్టెయినబుల్ మోడ్ లో బిజినెస్ రన్నవుతోంది. ప్రస్తుతానికి నిధుల సేకరణపై అంతగా ఫోకస్ చేయడం లేదు. నాలుగు నెలల క్రితం లాంఛైన ఈ యాప్ 9వేల డౌన్ లోడ్స్ నమోదు చేసింది. యాండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ నుంచి యాపిల్ స్టోర్లో లభిస్తుంది.

వచ్చే ఆరు నెలల్లో మరో నాలుగు స్టార్టప్స్ తో కలిసి వర్క్ చేయబోతున్నారు. 4.5లక్షల విద్యార్ధులకు రీచ్ కావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

టూరిజం, వ్యవసాయం, స్కిల్ డెవప్మెంట్ రంగాల్లో యాప్ ని బలంగా ముందుకు తీసుకుపోవాలని తేజ భావిస్తున్నాడు. కొన్ని గ్రూపుల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహించి రైతుల ఆత్మహత్యలు ఆపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇండియా ఒక్కటే కాదు.. గ్లోబల్ ఆడియెన్స్ మీద కూడా యూడూ యాప్ కన్నేసింది. ఆల్రెడీ ఒక మలేషియా కంపెనీతో అసోసియేట్ అయింది. సెప్టెంబర్ కల్లా అక్కడ మార్కెట్ చేయాలని ఉత్సాహ పడుతున్నారు. తర్వాతి స్టాప్ అమెరికా. ఫిబ్రవరి 2018 నాటికి యూఎస్ఏలో వెంచర్ స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది నాటికి 1మిలియన్ డాలర్ రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యూడూ.. 2019 నాటికి ఆరు మిలియన్ల డాలర్ల గ్రోథ్ సాధించాలని పట్టుదలతో ఉంది. 

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags