సంకలనాలు
Telugu

ఊహించని విజయం కోసం ఎదురుచూస్తున్న పూజా సూద్

కళా రంగానికే కాలం వెచ్చిస్తే...నిస్వార్ధ సేవకే సమయం అంకితం చేస్తే...కళాకారుల అభివృద్ధే సంస్థ శ్రేయస్సు అనుకుంటే...ప్రతీ ఆలోచనకూ ఆచరణ రూపం ఇవ్వాలనుకుంటే... అదే ఖోజ్

ABDUL SAMAD
27th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పూజాసూద్... ఖోజ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు డైరెక్టర్. ఆమె మ్యాథమెటిక్స్‌లో పట్టభద్రురాలు. పూనేలోని సింబయాసిస్‌ నుంచి మార్కెటింగ్‌లో ఎంబిఏ పట్టా అందుకున్నారు. వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా కళల రంగాన్ని ఎంచుకున్నారు పూజ. పాతికేళ్ల ఈ ప్రయాణంలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్ హిస్టరీలో కోర్స్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఎన్నో గుర్తుంచుకోదగ్గ అంశాలున్నాయంటారు పూజ. ఐదేళ్ల సమయంలో ఖోజ్ స్టూడియోలను తర్వాతి తరాలకు అందించాలని భావిస్తున్నారామె.

image


“నేను మ్యాథ్స్ చదువుతున్నపుడే కళల పట్ల ఆకర్షితురాలినయ్యాను. ఇంగ్లీష్ లిటరేచర్‌కు సంబంధించిన అన్ని క్లాసులకు హాజరయ్యేదాన్ని. పెళ్లి, పిల్లలు తర్వాత ఆర్ట్ హిస్టరీ చదవాలనుకున్నది సరదాగా మాత్రమే. అయినా సరే నేను వాటికి అటాచ్ అయిపోయానం”టారు పూజాసూద్. ఇప్పుడామె వయసు 51 సంవత్సరాలు.


ఖోజ్‌కి ముందు ఐషర్

ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఐషర్ గ్యాలరీలో రెండు పాత్రలు పోషించడం పూజ జీవితాన్ని మలుపు తిప్పింది. క్యూరేటర్, అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. “ ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఇక్కడ మూడేళ్లపాటు విధులు నిర్వహించడం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ సమయంలో కళలకు సంబంధించిన అనేక విషయాలు నేర్చుకున్నా” అంటారు పూజాసూద్.

ఐషర్ ఆధ్వర్యంలో ఎన్నో గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీకి చెందిన సిరామిక్ ఆర్టిస్ట్ గురుచరణ్ సింగ్ ప్రదర్శనలు, టెక్స్‌టైల్ ఆర్ట్ ప్రదర్శనల సిరీస్, షీబాచాచి ఆధ్వర్యంలో సినీనటి మీనాకుమారిపై ప్రదర్శన, ఆహార పదార్ధాలపై ద రెసిపీస్ షో, భారత్-పాక్ మధ్య గుర్తులతో 'మాపింగ్స్: షేర్డ్ హిస్టరీస్... ఎ ఫ్రాగిల్ సెల్ఫ్' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లకు అద్భుతమైన స్పందన లభించింది.

ఖోజ్ ప్రారంభానికి పునాది

ఖోజ్ ప్రారంభించాలన్న ఆళోచన బ్రిటిష్ ఆర్ట్ కలెక్టర్ రాబర్ట్ లాడర్ మూలంగా వచ్చింది. ఐషర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లో ఈ ఐడియా తట్టింది. భారతీ ఖేర్, సుబోధ్ గుప్తా, మనీషా పరేఖ్, అనితా దూబే, ప్రీత్‌పాల్ ఎస్. లాడి, పూజాసూద్‌లు టీంగా ఏర్పడి 1997లో ఖోజ్‌ను ప్రారంభించారు. “అప్పటికే నేను ఈ అందరు కళాకారులతో కలిసి చాలాసార్లు కార్యక్రమాలు నిర్వహించా. అందుకే వీరితో జట్టుగా ఏర్పడి ఖోజ్ ప్రారంభించగలిగాను. మా టీం అంతా ఇప్పటివరకూ కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ మాదిరిగానే ఉండడం విశేషం. మాకు ఖోజ్ కేవలం ఒక పని మాత్రమే కాదు. సుబోధ్, భారతిలు అప్పుడప్పుడు సిటీలోనే బెస్ట్ అనదగ్గ మాంచి పార్టీలు ఇస్తుంటారు. అలాగే సుబోధ్ మా కోసం ఎప్పుడూ వంట చేస్తూంటుంది. ఇప్పుడు అందరం బిజీగానే ఉన్నా... మేం కలవాలని అనుకున్నపుడు ఒకచోటకి తప్పకుండా చేరతాం”అంటారు పూజ.

ప్రారంభంలో వివిధ వయసుల్లోని కళాకారులు, స్థానిక సంస్థలు ఖోజ్‌కు ఎంతో సహాయపడ్డారు. లాభాపేక్ష లేకుండా నడిచే సంస్థలకు ప్రారంభమనేది చాలా కీలకం. నిలకడగా నిధులు వచ్చేంత స్థాయికి చేరుకునేవరకూ అది కత్తి మీద సాముగానే చెప్పాలి. 2011లో 40మంది పెద్ద ఆర్టిస్టులు లిమిటెడ్ ఎడిషన్ పోర్టిఫోలియోల కొనుగోలు ద్వారా భారీ మొత్తాలు అందించారు. తాజాగా అనీష్ కప్పోర్, అతు దోడియా, సుబోధ్ గుప్తా, మీథు సేన్, భారతీ ఖేర్‌లతో సహా 10మంది ఆర్టిస్టులు ఇచ్చిన వాటితో నిర్వహించిన క్రిస్టీస్ వేలం ద్వారా రూ. 2 కోట్ల నిధులు సమీకరించుకుంది ఖోజ్.

“కళాకారులు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం.. వారికి మాపై ఉన్న నమ్మకమే. ఖోజ్‌లో చాలా విలువైన కార్యకలాపాలను నిస్వార్ధంగా నిర్వహించేవారు వారంతా. అలాగే లోకల్‌గానే కార్యకలాపాలు ఉండాలనే విధానానికి మేం వ్యతిరేకం. మా నెట్వర్క్ మరింతగా పెంచుకుని అంతర్జాతీయంగా వాణిజ్యేతర రంగంలో ఎన్నో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం.”- పూజాసూద్

ప్రారంభ కష్టాలు

అన్నీ బాగున్నా ఖోజ్ ఆరంభం మాత్రం అంత గొప్పగా ఏం లేదు. మొదట్లో హివోస్ అందించిన నిధులతో దక్షిణ ఢిల్లీలో ఓ చిన్న ఆఫీస్‌లో పనులు మొదలయ్యాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తెచ్చిన ఫర్నిచర్‌తోనే ఆఫీస్ నిర్వహించేవారు. 2002లో మూడంతస్తుల బిల్డింగ్ కొనుగోలు చేసింది ఖోజ్. ఐదు స్టూడియోలు, ఒకేసారి 6గురికి ఆవాసం కల్పించే రూమ్స్, కిచెన్, లివింగ్ రూం, మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ స్పేస్, లైబ్రరీ, రీడింగ్ రూం, మీడియా ల్యాబ్, కేఫ్, మీటింగ్ రూమ్స్, పలు కార్యకలాపాలకు అనుగుణంగా టెర్రస్... ఇదీ ఆ తర్వాత ఖోజ్ అభివృద్ధి.

ప్రతీ ఆలోచననూ ఆచరణలో పెట్టాలని ప్రయత్నం చేసేవారిక్కడ. అందులో భాగంగా నిర్వహించిన కొచ్చి-ముజిరీస్ బీనేల్ ఇండియా ఆర్ట్ ఫెయిర్ వంటివి కొన్ని విమర్శలపాలయ్యాయి. “ నిరంతర అభివృద్ధికి అవకాశమున్న సంస్థల్లో ప్రతీ ఆలోచనకూ అవకాశముంటుంది. ప్రైవేట్ గేలరీలు, మ్యూజియంలు, మాలాంటి ఆర్ట్ ఎన్జీఓలు, వాణిజ్యేతర ప్రదర్శనల వంటివి పోటీ తత్వాన్ని పెంచుతాయి. మా స్థానాన్ని పదిలం చేసుకోవడం కంటే... కళల గురించి పదిమందికీ తెలియచెప్పడమే మా ప్రధానోద్దేశ్యం ” అంటారు పూజాసూద్.

ఖోజ్ స్వయంగానూ కొన్ని ఎగ్జిబిషన్లు నిర్వహించింది. ఖోజ్‌లివ్ 08(ఇంటర్నేషనల్ పెర్ఫామెన్స్ ఆర్ట్ ఫెస్టివల్), పీర్స్( ఔత్సాహిక కళాకారుల ప్రదర్శన), సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ (దక్షిణ ఆసియాను కవర్ చేసే ప్రదర్శన), నేమ్‌లెస్ హియర్ ఎవర్‌మోర్(మల్టీమీడియా ఎగ్జిబిషన్ కం గ్లోబల్ ట్రామా), వర్డ్ సౌండ్ పవర్, ఖోజ్ మారథాన్ వంటి కార్యక్రమాలు... ఖోజ్ సంస్థ ఖ్యాతిని మరింతగా పెంచాయి.

స్ట్రెంగ్త్ టూ స్ట్రెంగ్త్

పదేళ్లుగా ఖోజ్ నిర్వహించిన కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చిన వారిపై... పూజాసూద్ ఎడిటర్‌గా నడిచే ఖోజ్‌బుక్‌లో వివరాలు అందిస్తున్నారు. కళలపై పరిశోధనలు చేసే సుధబ్రతా సేన్ గుప్తా వంటివారు రాసిన వ్యాసాలు అనేకం ప్రచురించారు ఇందులో. “ విభిన్నమైన ప్రతిభాపాటవాలున్న వారు, ఖోజ్ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఇలాంటి వారిని మరింతగా వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వర్క్ షాప్స్, ఇంటింటికీ ప్రచారం, ఈవెంట్స్, ఆర్టిస్టుల పెర్ఫామెన్స్, ఎగ్జిబిషన్స్ వంటి వాటిని ఎన్నిటినో ఏర్పాటు చేసింది ఖోజ్. ప్రతీ ప్రదర్శనలోంచి ఎన్నో నేర్చుకుని, తర్వాతి ఎగ్జిబిషన్ కోసం సిద్ధమయ్యేవారం. ప్రదర్శనల్లో పరిచయమయ్యే వ్యక్తుల సలహాలు, సూచనలను వీలైనంతవరకూ పాటించేదుకు ప్రయత్నాలు జరిగేవి” అని చెబ్తున్నారు పూజాసూద్.

ఖోజ్ అభివృద్ధిలో అన్నీతానై వ్యవహరించిన పూజ, మరిన్ని ప్రణాళికలకూ ప్రాణం పోశారు. 2002లోవృద్ధి చెందుతున్న కళాకారులు తమ అనుభవాలు పంచుకునే వేదికగా సౌత్ ఏషియన్ నెట్వర్క్ ఫర్ ది ఆర్ట్స్(సానా)ను ప్రారంభించారు. కొత్త మీడియా అవకాశాలను తెలిపే ఏపీజే మీడియా గ్యాలరీని ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్టుల కోసం 48°C పబ్లిక్ ఆర్ట్ ఎకాలజీని 2008లో ప్రారంభించారు. ఆర్థింక్ సౌతేషియాకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

“ మా కార్యకలాపాలకు మేమే నిధులు ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదగడం మా తరువాతి లక్ష్యం. ప్రస్తుతం అమలు చేస్తున్న మూడేళ్ల ఫండిగ్ విధానం నుంచి బయటకు రాగలిగినప్పుడే... ఖోజ్ పూర్తి స్థాయి స్వతంత్ర సంస్థగా మారుతుందం”టారు పూజాసూద్.

పూజాసూద్ మాదిరిగా మారాలంటే ఈ కిందివన్నీ సాధ్యమైతే అది అసాధ్యం కాదు

- భారతీ ఖేర్, అనితా దూబే, రోహిణి దేవషేర్, అతుల్ భల్లా, బాణి అబిడి వంటి 5గురు కళాకారులు

- గీతా కపూర్ రాసిన వెన్ వంస్ మోడర్నిజం, ఎం,జి వాసాంజీ రానిసి ది అస్సాసిన్స్ సాంగ్, చిమామంద జోగి అడిచి రాసిన అమెరికానా, ది ఖోజ్ బుక్, ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మాంగోస్ వంటి ఐదు పుస్తకాలు

- ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మీనియేచర్, కార్పెట్స్, బుక్స్... ఈ ఐదు కళలపై వీలైనంత సమయం వెచ్చించాలి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags