ఫోటో అప్‌లోడ్ చేయండి...నచ్చిన డిజైన్లు సొంతం చేసుకోండి అంటున్న 'స్టాక్యూ'

12th Oct 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఇప్పుడంతా ఆన్ లైన్ జమానా. ఏదీ కొనాలన్న ఆన్‌లైన్లోనే. కాకపోతే.. ఈ పోర్టల్స్‌లో ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయడం సులువు. మనకు కావాల్సిన డిజైన్స్ దొరకడం చాలా కష్టం. మనం కోరుకున్న కలర్ కానీ, డిజైన్ కానీ కావాలంటే గంటల తరబడి వెతకాల్సిందే. అలాంటి కష్టాలకు పరిష్కారం చూపెడుతున్నది స్టాక్యూ టెక్నాలజీస్. గూగుల్ సెర్చ్ మాదిరిగానే, ఇమేజెస్ ఆధారంగా సెర్చ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది స్టాక్యూ.

అందరు యువకుల్లాగానే అతుల్ రాయ్ కూడా తనకు నచ్చిన ఓ షర్ట్ కోసం ఆన్‌లైన్లో వెతుకుతున్నారు. ఎంత వెతికినా తను కోరుకున్న డిజైన్ కలిగిన షర్ట్ మాత్రం దొరకడం లేదు. గూగుల్‌లో తనకు మెదిలో మెదిలిన కీవర్డ్‌లన్నింటినీ టైప్ చేశారు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

‘‘ప్రస్తుతం ఈ కామర్స్ మార్కెట్ లో సేవలందిస్తున్న దిగ్గజ సంస్థలేవీ ఇమేజెస్ ఆధారంగా సేవలందించడంలేదు. నాకు కావాల్సిన డిజైన్ కలిగిన దాని గురించి పిక్చర్ ఆధారంగా ఆన్ లైన్‌లో సెర్చ్ చేయాలన్నది నా కోరిక’’ అని అతుల్ తెలిపారు.

స్టాక్యూ టీమ్

స్టాక్యూ టీమ్


తాను కోరుకున్న డిజైన్ ఉన్నటువంటి షర్ట్ కోసం కీవర్డ్స్‌తో ఎంత వెతికినా దొరకకపోవడంతో ఇమేజెస్ ద్వారా వెతికే అవకాశం ఉంటే ఎంత బాగుండేదో అని అతుల్ అనుకున్నారు. ఈ సమస్యను తానే ఎందుకు పరిష్కరించకూడదు అన్న ఆలోచన చేశారు. వెంటనే తనకొచ్చిన ఐడియాను చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో పంచుకున్నారు. దీంతో వీరిద్దరు కలిసి స్టాక్యూ టెక్నాలజీస్ పేరుతో ఈ ఏడాది ఆరంభంలో ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి అతుల్ మాస్టర్స్ డిగ్రీ సంపాదించగా, మేరీలాండ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు అభిషేక్. బయోమెట్రిక్స్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ అండర్ స్టాండింగ్, మెషిన్ లెర్నింగ్‌లో అభిషేక్ నిష్ణాతుడు.

టెక్నాలజీ రంగంలో నిష్ణాతులైన మరో నలుగురిని కూడా తమ భాగస్వాములుగా చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. స్టాక్యూ అనేది ఇమేజ్ టు ఇమేజ్ మ్యాచింగ్ సిస్టమ్. యూజర్లు చేయాల్సిందల్లా, తమకు నచ్చిన దాన్ని క్లిక్ చేసి దాన్ని స్టాక్యూలో అప్‌లోడ్ చేస్తే చాలు. ఆ పిక్చర్‌కు సరిపోయే వేల ఉత్పత్తుల మోడల్స్‌ను స్టాక్యూ మన ముందుంచుతుంది. గూగుల్‌లో కీవర్డ్స్‌ను టైప్ చేస్తే పదాలు వచ్చినట్టుగానే, స్టాక్యూలో పిక్చర్‌ను అప్‌లోడ్ చేస్తే అలాంటి వేలాది మోడల్స్ కనిపిస్తాయి.

ఈ సెర్చ్ ప్రాసెస్‌లో ఉపయోగించిన ఆల్గోరిథమ్ ద్వారా ప్యాటర్న్, కలర్స్, డిజైన్స్, టెక్చర్లను కూడా కంప్యూటర్ గుర్తిస్తుంది. యూజర్లు కోరుకునే విజువల్ కంటెంట్‌ను కూడా మ్యాచ్ అయ్యేలా చేస్తుంది.

ఓ నివేదిక ప్రకారం భారత్‌లో గత ఏడాది ఈ కామర్స్ మార్కెట్ వాల్యూ 13.6 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఈ ఏడాది చివరికల్లా అది 16 బిలియన్ డాలర్లు చేరుతుందని అంచనా. అలాగే 2016 చివరికల్లా భారత్‌లో ఆన్‌లైన్ షాపర్స్ సంఖ్య 100 మిలియన్ల మార్కు చేరుతుందని గూగుల్ ఇండియా ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్, జబాంగ్, మింత్రా వంటి ఈ-కామర్స్ పోర్టళ్లు పెరుగుతున్న ఈ ఆన్‌లైన్ కస్టమర్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇమేజ్ ఆధారిత సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా రూపొందిస్తున్నాయి.

‘‘వీలైనన్ని ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుని విజువల్ సెర్చ్‌తో ఫ్యాషన్ సెక్టార్‌ను రెవల్యూషనైజ్ చేయడమే మా లక్ష్యం. మొత్తంగా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతో వృద్ధి కనిపిస్తుంది’’ అని అభిషేక్ వివరించారు.

గట్టి పోటీ

ఈ సంస్థ డేటాబేస్‌లో ఫ్యాషన్ దుస్తులకు సంబంధించి రెండులక్షలకు పైగా ఇమేజెస్ అప్‌లోడ్ అయ్యాయి. ఆగస్టులో లాంచ్ అయినప్పటి నుంచి ఈ ఢిల్లీకి చెందిన ఈ స్టార్టప్ కంపెనీకి కస్టమర్ల నుంచి రెండువేలకు పైగా చిత్ర సందేహాలు వచ్చాయి. ఈ రంగంలో స్టాక్యూకు మాడ్ స్ట్రీట్ డెన్, వాజాట్ ల్యాబ్స్, స్నాప్ షాపర్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది.

ఫ్యాషన్ ఈ కామర్స్ రంగంలో విజువల్ సెర్చ్ ఎంతో శక్తిమంతమైనది. రెకమండేషన్స్, ఇంటరాక్టివ్ స్టోర్ ఫ్రంట్ రిటైల్ డిస్ ప్లేస్, వర్చువల్ మిర్రర్, సోషల్ ఫ్యాషన్ బేస్డ్ అనాలజిక్స్ వంటివి కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

‘‘మేం ఎలాంటి ఇమేజ్‌తోనైనా పనిచేస్తాం. ఇప్పటివరకు ప్రాసెస్ చేసిన ఇమేజెస్‌లలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్ ద్వారా తీసినవే. కొంతమంది వెబ్‌క్యామ్ ద్వారా తీసిన ఇమేజెస్‌ను కూడా అప్‌లోడ్ చేస్తున్నారు’’ అని అతుల్ పేర్కొన్నారు.

స్టాక్యూ ఇమేజ్ మ్యాచింగ్ ఆల్గొరిథమ్ ఎలాంటి లైటింగ్‌లోనైనా, కఠిన పరిస్థితుల్లోనైనా ఇమేజెస్‌తో కలిసి పనిచేస్తుంది. తాము టీవీల్లో చూసిన, సెలబ్రిటీల ధరించిన దుస్తులను కస్టమర్లు విజయవంతంగా ఈ ఇమేజ్ సెర్చ్‌ల ద్వారా దొరకబుచ్చుకుంటున్నారు.

‘‘ఇప్పటికీ మేం ఎంతో నేర్చుకుంటున్నాం. ఒకసారి ఓ కస్టమర్ ఫ్లాషీ పింక్ ప్లవర్స్‌ను సెర్చ్ చేసి తనకు నచ్చిన ఫ్లోరల్ కుర్తీస్‌ను గుర్తించారు. మరోసారి ఓ కస్టమర్ మాక్‌బుక్ పిక్చర్‌ను అప్‌లోడ్ చేయగా, దానికి సిమిలర్‌గా ఉన్న బ్లాక్ షర్ట్స్ విత్ వైట్ చెకర్స్‌తో ఉన్న రికమండేషన్స్ లభించాయి’’ అని అభిషేక్ నవ్వుతూ చెప్పారు.

ప్రస్తుతానికైతే నేర్చుకునే దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో మాత్రం ఈ-కామర్స్ రంగంలో ఈ ఇమేజ్ సెర్చ్ ఓ విప్లవం. ‘‘ఈ-టెయిలింగ్ రంగంలో కస్టమర్లు ఇమేజెస్‌ను వాడే విధానాన్ని మార్చడమే మా లక్ష్యం. అది ఫ్యాషన్ సెర్చ్ కావొచ్చు లేదంటే ప్రొడక్ట్ రికమండేషన్ కావొచ్చు. కానీ భారత్‌లో ప్రోడక్ట్ సెర్చ్ విధానంలో విప్లవం తేవాలన్నదే మా కోరిక. ఇప్పుడది ఆరంభ దశలో ఉంది ’’ అని అభిషేక్ వివరించారు.

ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైనప్పటికీ స్టాక్యూ ఇప్పటికీ సొంత మూలధనంతోనే నడుస్తోంది. బయటి నుంచి నిధుల సమీకరణ గురించి ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. ఇతర విజువల్ సెర్చ్ ప్లాట్‌ఫామ్స్ మాదిరిగానే ఈ కామర్స్ దిగ్గజాలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుని తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలన్నది స్టాక్యూ అభిమతం. వారి లక్ష్యం నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India