సంకలనాలు
Telugu

స్టెమ్‌సెల్ థెర‌పీ స‌ర్వ‌రోగ నివార‌ణ‌ి అంటున్న అడ్వాన్స్ సెల్స్ !

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైద్య రంగంలో వ‌స్తున్న కొత్త టెక్నాల‌జీల‌ను దేశంలో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు అడ్వాన్‌సెల్స్ వ్య‌వ‌స్థాప‌కులు విపుల్ జైన్‌. ఇప్ప‌టివ‌ర‌కు బ్ల‌డ్‌క్యాన్సర్ చికిత్స‌కు మాత్ర‌మే ఉప‌యోగించే స్టెమ్‌సెల్‌ థెర‌పీని అన్నిర‌కాల వ్యాధుల చికిత్స‌కు అందించాల‌న్న ప్ర‌య‌త్నంతో అడ్వాన్‌సెల్స్ సంస్థ‌ను స్థాపించారు. మూల‌క‌ణ చికిత్స‌లో నిపుణులైన వైద్యుల‌తో ఒప్పందం కుదుర్చుకుని పేషంట్ల‌కు ఆరోగ్య ప్ర‌దాత‌గా మారారు.

GOPAL
3rd May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
image


న్యూయార్క్‌లోని రోచెస్ట‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఎంబీఏ చేసిన విపుల్ జైన్ సీరియ‌ల్ ఆంట్రప్రెన్యూర్‌. కొత్త కొత్త బిజినెస్‌లు చేయ‌డం ఆయ‌నకు ఇష్టం. త‌మ కుటుంబ వ్యాపార‌మైన గార్మెంట్ ఎక్స్‌పోర్టును విస్త‌రించి ఫ్యాబ్రిక్ ఇంపోర్ట్ ఎంట‌ర్‌ప్రైజెస్‌ను 1999లో ప్రారంభించారు. 2002లోమిరేజ్ యానిమేష‌న్ సంస్థ‌ను నెల‌కొల్పారు. టీవీ చాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే కార్టూన్ ప్రోగ్రామ్స్‌కు యానిమేష‌న్‌ను ఈ సంస్థ రూపొందించేది. దీని త‌ర్వాత మెడిక‌ల్ టూరిజంలో విస్తృత అవ‌కాశాలున్న‌ట్టు విపుల్ గుర్తించారు. దీంతో మ‌రొక‌రితో క‌ల‌సి ప్లానెట్ హాస్పిట‌ల్‌ను ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప్లానెట్ హాస్పిట‌ల్ వ్యాపారం నుంచి నిష్క్ర‌మించి సొంతంగా మిరేజ్ మెడ్‌స‌ర్వ్ పేరిట ఓ సంస్థ‌ను నెల‌కొల్పారు. ఈ కంపెనీ ప్ర‌ధానంగా సార్క్‌దేశాలు, ర‌ష్యా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలపై దృష్టిసారించింది. ఈ వ్యాపారాల‌తోపాటు రౌండ్ టేబుల్ ఇండియా, మ‌రికొన్ని సామాజిక సంస్థ‌ల్లో కూడా విపుల్ స‌భ్యుడు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో స్టెమ్‌సెల్‌ థెర‌పీపై దేశంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని గ్ర‌హించి 2013లోఅడ్వాన్‌సెల్స్ కంపెనీని ప్రారంభించారు. క్యాన్స‌ర్స్‌తోపాటు ఇత‌ర ప్రాణాంత‌క వ్యాధుల‌కూ మూల క‌ణ చికిత్స‌ను అందించ‌డంపై ఈ సంస్థ దృష్టిసారించింది. నోయిడా కేంద్రంగా ప‌నిచేస్తున్న అడ్వాన్‌సెల్స్‌కు బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాల‌లో కూడా కార్యాల‌యాలున్నాయి.


విపుల్ జైన్, అడ్వాన్స్ సెల్స్ సిఈఓ

విపుల్ జైన్, అడ్వాన్స్ సెల్స్ సిఈఓ


శ‌రీరంలోని స్టెమ్‌సెల్స్‌ను మ‌రింత శక్తివంతం చేసేందుకు ఐవీ లేజ‌ర్స్‌ను కూడా ఉప‌యోగిస్తున్న‌ారు. బోన్‌మారో, కొవ్వు క‌ణ‌జాలాల‌ను పేషంట్ మూలక‌ణాల నుంచి వేరు చేసి అడ్వాన్‌సెల్స్‌‌లో బ‌రోట‌రీలో ప్రాసెస్ చేస్తారు. ఈ స్టిములైజేష‌న్ టెక్నాల‌జీపై పేటెంట్ తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఈ సంస్థ‌ ఉంది. మొద‌ట‌గా పేషంట్ కేస్‌ను పూర్తిగా అంచ‌నా వేసి, ఆ త‌ర్వాత చికిత్స సంబంధించిన వివ‌రాలను, రిస్క్‌లు, రివార్డుల గురించి పేషెంట్‌కు వివ‌రిస్తారు. ఆ త‌ర్వాత రోగి మూల క‌ణాల‌ను సేక‌రించి డాక్ట‌ర్‌తో అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తుంది. అడ్వాన్‌సెల్స్‌ టీమ్.. చికిత్స త‌ర్వాత పేషెంట్ కోలుకునేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. న్యూరాల‌జిక‌ల్ కండిష‌న్స్‌, ఆర్థోపెడిక్స్‌, కిడ్నీ డిసీజెస్‌, సీఓపీడీ, ఊపిరితిత్తులు, కాలేయ స‌మ‌స్య‌లు, కార్డియాల‌జీ, ఆటో ఇమ్యూనో డిసార్డ‌ర్స్‌, ఆప్తామ‌ల‌జీ డిసీజెస్‌, సంతాన సాఫ‌ల్య స‌మ‌స్య‌లు, కాస్మెటిక్ అంశాల‌ను అడ్వాన్‌సెల్స్‌ డీల్ చేస్తుంది. 

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ ద్వారా పెద్ద సంఖ్య‌లో పేషంట్ల‌ను ఆక‌ర్షించింది అడ్వాన్‌సెల్స్‌. అలాగే డాక్ట‌ర్లు, హాస్పిట‌ల్స్‌, ఫిజియోథెర‌పీ సెంట‌ర్లు, ప్ర‌త్యేక స్కూళ్లు కూడా పెద్ద సంఖ్య‌లో రిఫ‌రెన్స్ ఇస్తుంటాయి. మూలక‌ణ చికిత్స గురించి తెలుసుకుని వ‌చ్చే పేషంట్ల కేసుకు సంబంధించి మొద‌ట‌గా అడ్వాన్‌ సెల్స్‌ ప‌రిశోధ‌న చేస్తుంది. స‌ర్జ‌రీకి రోగి ఫిట్‌గా ఉన్నాడ‌ని వైద్యులు నిర్ధారిస్తే, ఆ చికిత్స గురించిన లాభాల‌ను, రిస్క్‌ల‌ను పేషంట్ల‌కు వివ‌రిస్తుంది. స‌ర్జ‌రీకి పేషెంట్ అంగీక‌రిస్తే.. ఆ వెంట‌నే మిగ‌తా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి, రోగి పూర్తిగా కోలుకునేవ‌ర‌కు అవ‌స‌ర‌మైన అన్ని బాధ్య‌త‌ల‌ను తానే తీసుకుంటుంది.

స్టెమ్‌సెల్ థెర‌పీకి పెరుగుతున్న డిమాండ్

బోన్‌మారో నుంచి తీసిన మూల‌క‌ణాల‌తో లుకేమియా, ఇత‌ర ర‌క‌లా బ్ల‌డ్ క్యాన్స‌ర్ రోగాల‌కు గ‌త 60 ఏళ్లుగా చికిత్స అందిస్తున్నారు. ఈ స్టెమ్‌సెల్ థెర‌పీ ద్వారా ఇత‌ర ప్రాణాంత‌క వ్యాధులనూ న‌యం చేయొచ్చ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ప్ర‌స్తుతం వైద్య ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ‌గా రిసెర్చ్ చేస్తున్న అంశం స్టెమ్‌సెల్‌ థెర‌పీనే. భ‌విష్య‌త్‌లో అన్నిర‌కాల‌ వ్యాధుల చికిత్స‌కు ఈ స్టెమ్‌సెల్స్‌ను ఉప‌యోగించ‌డం ఎంతో దూరంలో లేద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. శ‌రీరంలో క‌ణాలు ఎలా వృద్ధి చెందుతాయి? మృత‌ క‌ణాల‌ను తిరిగి ఎలా స‌రిచేయాల‌న్న అన్న అంశాల‌పై ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. మూలక‌ణాల ద్వారా జ‌రిపే చికిత్స అన్నిటికంటే సుర‌క్షిత‌మైన‌ది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ లేన‌టువంటిద‌ని ఇప్ప‌టికే వైద్యులు గుర్తించారు.

గ్లోబ‌ల్ స్టెమ్‌సెల్ గ్రూప్‌తో ఒప్పందం..

మూల‌క‌ణ చికిత్స‌లో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నఅడ్వాన్‌సెల్స్‌ ఈ రంగంలో ఎంతో ప్ర‌ఖ్యాతి సాధించిన గ్లోబ‌ల్ స్టెమ్ సెల్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రంగంలో వ‌స్తున్న నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, టెక్నాల‌జీల‌ను ఈ రెండు సంస్థ‌లు ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఐతే సంస్థ‌ను మ‌రింత విస్త‌రించేందుకు అవ‌స‌ర‌మైన నిధుల కోసం ఈ అడ్వాన్‌సెల్స్‌ ప్ర‌య‌త్నాలు ఆరంభించింది. మూల క‌ణ చికిత్స‌లో సేవ‌లు అందిస్తున్న ఢిల్లీ ఐబీఎస్ హాస్పిట‌ల్స్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అడ్వాన్‌సెల్స్‌ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ది. సొంతంగా ఓపీడీ సెంట‌ర్‌ను కూడా ప్రారంభించాల‌న్న ఆలోచ‌న కూడా ఈ సంస్థ‌కుంది. అలాగే వీలైనంత‌మంది ఎక్కువ‌మంది డాక్ట‌ర్లు, ఇన్‌స్టిట్యూట్‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుని సంస్థ‌ను దేశ‌వ్యాప్తంగా మ‌రింతి విస్త‌రించాల‌న్న‌ది విపుల్ యోచ‌న‌.

శరీరంలోని వివిధ భాగాలకు స్టెమ్ సెల్ ద్వారా పరిష్కారం ఉందని సూచిస్తున్న చిత్రం

శరీరంలోని వివిధ భాగాలకు స్టెమ్ సెల్ ద్వారా పరిష్కారం ఉందని సూచిస్తున్న చిత్రం


నోయిడాలో ప్ర‌ధాన కేంద్రం..

అడ్వాన్‌సెల్స్‌ లోబ‌రేట‌రీ ప్ర‌ధాన కేంద్రం నోయిడాలో ఉంది. అన్ని నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మాలు అక్క‌డి నుంచే జ‌రుపుతున్నారు. ఐతే ఓపీడీకి సంబంధించిన చికిత్స విధానాల‌ను మాత్రం ల‌జ‌ప‌త్‌న‌గ‌ర్‌, ఫ‌రీదాబాద్‌లో ఉన్న సంస్థ ద్వారా నిర్వ‌హిస్తున్నారు. నోయిడాలోని ప్ర‌ధాన కేంద్రంలో నిష్ణాతులైన 12 మంది వైద్యులు, 10 మంది కీ ఆప‌రేష‌న్ లీడ‌ర్స్‌, స్టెమ్‌సెల్ చికిత్స గురించి పూర్తి అవ‌గాహ‌న ఉన్న ఫిజిష‌న్స్ రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టెమ్‌సెల్‌ థెర‌పీలో వ‌స్తున్న తాజా డెవ‌ల‌ప్‌మెంట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నామ‌ని, త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే రోగుల‌కు కూడా ప్ర‌పంచ‌స్థాయి చికిత్స అందిస్తామ‌ని విపుల్ చెప్తున్నారు. రిసెర్చ్ వింగ్‌ను కూడా ప్రారంభించాల‌నుకుంటున్న‌ట్టు చెప్పారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా మూల‌క‌ణ చికిత్స విధానంలో ఏం జ‌రుగుతున్న‌దో త‌మ వ‌ద్ద ప‌నిచేసే నిపుణుల‌కు తెలియ‌జేసేందుకు ఔట్ స్టేష‌న్ సీఎంఈ (కంటిన్యూడ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌) సెష‌న్‌ను కూడా నిర్వ‌హించాల‌న్న‌ది అడ్వాన్‌సెల్స్‌ యోచ‌న‌. మూల క‌ణ చికిత్స‌లో నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న విపుల్ మ‌రింత విజ‌యాల‌ను సొంతం చేసుకోవాల‌ని ఆశిద్దాం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags