సంకలనాలు
Telugu

పనులన్నీ మాకొదిలేయండి.. హాయిగా పెళ్లి చేసుకోండి! మార్కెట్ దున్నేస్తున్న హైదరాబాద్ స్టార్టప్..!

SOWJANYA RAJ
2nd May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


భారతదేశంలో ఏడాదికి పది మిలియన్లకుపైగా వివాహాలు జరుగుతూంటాయి. ఒక్కో వివాహానికి సగటున రూ 20లక్షల వరకు ఖర్చు పెడుతూంటారని అంచనా. మొత్తంగా చూస్తే ఇండియాలో పెళ్లిళ్ల మార్కెట్ నలభై బిలియన్ డాలర్లు. మామూలుగా అయితే ఈ మార్కెట్ అంతా అసంఘటితమైనదే. పెళ్లి కుటుంబాల వారే పనులన్నీ చూసుకుని నానా టెన్షన్ పడాల్సి వస్తుంది. కానీ మ్యారేజ్ సర్వీసెస్ స్టార్టప్స్ ఇప్పుడు ఆ బాధ్యతలను పంచుకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం తామే తీసుకుంటున్నాయి. అలా వచ్చిన చాలా స్టార్టప్ లు నిలదొక్కుకుంటున్నాయి కూడా. పెళ్లి బాధ్యతలు తీసుకోవాల్సిన పెద్దలకు .. రిలీఫ్ ఇవ్వడమే కాదు.. పెళ్లి చేసుకోబోతున్న జంటకు వారి అభిరుచుల మేరకు వివాహం జరిగేలా కేర్ తీసుకుంటున్నారు. ఇలాంటి సర్వీసెస్ విషయంలో హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్టప్ "అప్పిలీఎవర్" ( AppilyEver )

పెళ్లిళ్లు చూసిన అనుభవాలతో స్టార్టప్

రాకేష్ గుప్తా, సుమిత్ హండా ఇద్దరు జిగిరీ దోస్తులు. మామూలుగానే వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. కాలేజీ, ఉద్యోగం ఇలా ప్రతీచోటా చాలా మంది మిత్రులు ఉన్నారు. వీరి పెళ్లిళ్లకు మిస్ కాకుండా వెళ్లేవాళ్లు. అలా వెళ్లినప్పుడల్లా వీరి మధ్య కచ్చితంగా చర్చకు వచ్చే అంశం పెళ్లి పనులు. పెళ్లికొడుకు, కూతురు కుటుంబాలు క్షణం తీరిక లేకుండా పడే టెన్షన్ పై వీరు చర్చించుకునేవారు. అలాగే కొత్త జంట డ్రెస్సింగ్, అలంకరణ, కేటరింగ్ ఇలాంటి విషయాల్లో పెళ్లికొచ్చే అతిథుల భిన్నాభిప్రాయాలూ ఆసక్తిగా వినేవారు. పెళ్లి చేసేందుకు ఎంత టెన్షన్ పడినా ఎక్కడో ఓ చోట జరిగే పొరపాటుతో మొత్తం పెళ్లికే మాయని మచ్చగా మారిపోవడం వీరి దృష్టికి దాటిపోలేదు. వీరు సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వీరికి మొదటి వచ్చిన ఆలోచన మ్యారేజ్ సర్వీసెస్. దీంతో అప్పిలీఎవర్ కు రూపకల్పన చేశారు. ఆ తరుణంలోనే మరో ఎల్పీ మదన్ అనే మరో మిత్రుడు జత కలిశాడు.

రాకేష్ గుప్తాకు డొమైన్స్, ఫైనాన్స్, స్ట్రాటజీ, కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్ మెంట్, టెక్నాలజీ డెవలప్ మెంట్ లాంటి విభాగాల్లో పన్నెండేళ్ల అనుభవం ఉంది. రెండువేల ఆరులోనే హైదరాబాద్ కేంద్రంగా ఆర్డర్ మోంగర్.కామ్ అనే స్టార్టప్ కు కో ఫౌండర్ గా వ్యవహరించారు. ఫుడ్, గ్రోసరీ, ఫ్లవర్స్, కార్ రెంటల్స్ కు ఇది మార్కెట్ ప్లేస్.

ఐఐటీ ఖరగ్ పూర్ లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాకేష్.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చేశారు. సుమిత్ హండాకు పదిహేనేళ్ల మార్కెటింగ్ అనుభవం ఉంది. ఐటీ, టాటా గ్లోబల్ బెవరేజెస్, సెయింగ్ గోబెయిన్ లాంటి సంస్థల్లో పనిచేశారు. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులను సరఫరా చేసే బీటూబీ మార్కెట్ ప్లేస్ వాంటెజ్ సర్కిల్.కామ్ కు ఫౌండింగ్ ఇన్వెస్టర్. ఎన్ఐటీ కురుక్షేత్రాలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుమిత్ సింబయాసిస్ లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. పన్నెండేళ్ల అనుభవం ఉన్న మదన్ టీసీఎస్, సీఎస్సీ, బ్రిటిష్ టెలికాలమ్ లాంటి సంస్థల్లో మంచి హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు.

భిన్నమైన సేవలతో ముందడుగు

అప్పిలీఎవర్ ఆలోచనకు కార్యరూపం ఇచ్చే క్రమంలో పరిశోధనకు ఎక్కువ సమయం కేటాయించారు. అప్పుడే మ్యారేజ్ సర్వీసెస్ విషయంలో ఉన్న లూప్ హోల్స్ ను కనిపెట్టారు. ఒక్కో సర్వీసుకు ఒక్కోచోట ఒక్కో ధర చెప్పడం వీరిని ఆశ్చర్యపరిచింది. సర్వీస్ ప్రొవైడర్స్ లిస్ట్ ను సిద్ధం చేసుకున్న తర్వాత కూడా వీరికి కొన్ని ఇబ్బందులొచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్లు ఎంత బాగా చేసినప్పటికీ వారికి చెల్లించాల్సిన ధర విషయంలో మాత్రం కస్టమర్లు అసంతృప్తి చెందేవారు. అందుకే అప్పిలీఎవర్ లో ప్యాకేజెస్ ను తీసుకొచ్చారు. కొన్నిరకాల సేవలు ప్యాకేజీగా తీసుకుంటే వచ్చే సేవలు.. సర్వీస్ ప్రొవైడర్ల అనుభవాలు.. వారి గురించిన రివ్యూస్ .. ఇలా ప్రతీది అందుబాటులో ఉంచారు. సేవలు పొందే విషయంలో ఉపయోగపడే సమాచారం అంతా సైట్ లో ఉందుబాటులో పెట్టామని రాకేష్ చెబుతున్నారు.

<br>పెట్టుబడుల సమీకరణ

అప్పిలీఎవర్ టీం ఇటీవల తన యాప్ ను "సోషల్ ఇన్ స్పిరేషన్ డిస్కవరీ అండ్ ఎగ్జిక్యూషన్" పేరుతో అప్ గ్రేడ్ చేసింది. పెళ్లి చేసుకోబోయే జంట తమకు కావాల్సిన వస్తులవన్నింటినీ ఇందులో షాపింగ్ చేయవచ్చు. 12 విభాగాల్లో తమ ఆలోచనలు, ఐడియాలను పంచుకోవచ్చు. తమ అభిరుచులను వివరించవచ్చు. అలా వీరు మెరుగ్గా పెళ్లి షాపింగ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు అప్పిలీఎవర్ లో ఉంటాయి. రెండు వేలకుపైగా ఉత్పత్తులు ఉంచడమే కాదు.. వెండార్స్ తో అప్పిలీఎవర్ టైఅప్ అయింది. ప్రధానమైన మెట్రో సిటీలన్నింటిలోనూ సేవలు అందిస్తోంది.

అప్పిలీఎవర్ టీం గత ఫిబ్రవరిలోనే నాలుగు లక్షల డాలర్ల పెట్టుబడిని ఎంజెల్ ఇన్వెస్టర్స్, అంట్రపెన్యూర్ల దగ్గర నుంచి సేకరించింది. యూనివెరైటీ సంస్థ ఫౌండర్, సీవోవో ఈ పెట్టుబడిని సమీకరిచడంలో కీలకపాత్ర పోషించారు. నెలకు 50 నుంచి 70 శాతం గ్రోత్ నమోదు చేస్తున్నట్లు స్టార్టప్ బృందం చెబుతోంది. సైట్ విజిట్స్, యాప్ ఇన్ స్టాల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత మంది సర్వీస్ ప్రొవైడర్స్ ను ఫ్లాట్ మీదకు తీసుకువచ్చి.. సేవలను దేశవ్యాప్తంగా అప్పిలీఎవర్ ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నారు.

అప్పిలీఎవర్ బృందం 

అప్పిలీఎవర్ బృందం 


పోటీ ఎక్కువైనా అపరిమిత అవకాశాలు

వెడ్డింగ్ సర్వీసెస్ రంగంలో చాలా స్టార్టప్ లు ఇప్పటికే తమదైన ముద్రవేస్తున్నాయి. కానీ వీటి మార్కెట్ చాలా పరిమితంగానే ఉంది. ఏడాదికి 40 బిలియన్ డాలర్ల మ్యారెజ్ మార్కెట్లో.. ఇప్పుడు ఉన్న సంస్థలు పొందుతున్న మార్కెట్ వాటా చాలా తక్కువ. కానీ ర్యాపిడ్ గా వీటి వృద్ది సాగుతోంది. వెడ్డింగ్జ్, షాదీసాగా, ఇన్ డియర్ లాంటివి మంచి వృద్ధిని నమోదు చేస్తూ ఫండింగ్ పొందుతున్నాయి.

యువతరాన్ని ఆకట్టుకునేలా సృజనాత్మకంగా ముందుకెళ్తే అప్పిలీఎవర్ బృందానికి అవకాశాలు పుష్కలం. వీరి ప్రయత్నాలు విజయవంతమైతే హైదరాబాద్ ను మ్యారేజ్ సర్వీసెస్ మార్కెట్ లీడర్ గా మారవచ్చు కూడా..!

వెబ్ సైట్  

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags