సంకలనాలు
Telugu

ఆటలతో బిజినెస్ అకౌంటింగ్ నేర్పించే అర్థవిద్య

కాలేజ్ విద్యకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరంఉద్యోగానికి.. పనికిరాని, ఉపయోగపడని పుస్తకాల నాలెడ్జ్ వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోతున్న అకౌంటింగ్ విద్యార్ధులు120 గంటల కోర్సుతో ఇండస్ట్రీ రెడీగా మార్చేస్తామంటున్న అర్థవిద్యజాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో అర్థవిద్యకు భాగస్వామ్యం

9th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బిజినెస్ అకౌంటింగ్ నేర్చుకోవడమంటే దాన్ని బ్రహ్మవిద్యగా భావిస్తారు చాలామంది. అయితే... అర్థవిద్య స్కిల్ డెవలప్మెంట్(బీఏపీ) నేర్చుకుంటున్న కామర్స్ విద్యార్ధులు మాత్రం... బిజినెస్ అకౌంటింగ్ ఓ కంప్యూటర్ గేమ్ అడుకున్నంత తేలిక అంటారు. ప్రతీరోజూ కంపెనీలు, కార్యాలయాలు చేసే 60 రకాల లావాదేవీలను... ఓ వర్చువల్ ఆఫీస్‌ ద్వారా... వీరు చేస్తూ ఉంటారు. ఈ కోర్స్ పూర్తయ్యేనాటికి... ఆయా విద్యార్ధులకు 6నెలలపాటు పని చేసిన అనుభవం లభిస్తుంది. అది కూడా కేవలం 120 గంటల్లో అంటున్నారు అర్థవిద్య ఫౌండర్ నాగరాజన్.

image


అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం

ప్రస్తుతం గేమింగ్ అందరిపై చాలా ప్రభావం చూపుతోంది. అందుకే తమ ప్రాజెక్టుకు దీన్నే ఆధారంగా చేసుకున్నారు నాగరాజన్. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ.. విద్యార్ధులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

“అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పరిశ్రమల అవసరాలకు, కాలేజీల్లో విద్యార్ధులు నేర్చుకునే విషయాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. ప్రతీ అంశాన్ని విద్యార్ధులు ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశాన్ని మేం కల్పిస్తున్నాం”అన్నారు నాగరాజన్.

ముందుగా సిద్ధం చేసిన ప్రాసెస్ ప్రకారం విద్యార్ధులకు ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అందించే థియరీ సెషన్స్‌‍తోపాటు... క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌పై రూపొందించిన ప్రయోగాత్మక ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు టాక్సులు, డిడక్షన్లను లెక్క వేయడాన్ని... టెక్స్ట్‌బుక్స్ ద్వారా నేర్చుకుంటారు విద్యార్ధులు. వీటినే గేమ్‌లోని ప్రతీ స్టెప్‌లోనూ అధిగమించడం ద్వారా... ఈ ప్రాసెస్ వారికి మరింత సులువుగా మారిపోతుంది. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఈజీగా అర్ధమవుతాయి.

image


అసెసింగ్, కౌన్సెలింగ్, రీచింగ్ ఔట్

“ మేం పాటించే సూత్రం ACT. దీన్ని విడమరిచి చెబ్తే.. అసెస్మెంట్ (అంచనా), కౌన్సెలింగ్, ట్రైనింగ్(శిక్షణ). ఈ మూడు అంశాలపైనా ఆధారపడి మా దగ్గర కోర్స్ ఉంటుంది. క్లౌడ్ ఆధారంగా అసెస్మెంట్ టూల్‌ని నిర్మించాం. విద్యలో వారి జ్ఞానం, ప్రాసెసింగ్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక స్కిల్స్, సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌(టాలీ, ఎక్సెల్)ను అంచనా వేస్తారు. టెస్ట్ పూర్తయ్యాక ప్రతీ విద్యార్ధికి వారి ప్రతిభ ఆధారంగా ఒక రిపోర్ట్ అందిస్తాం. వారు చదివే కాలేజ్‌లకు కూడా ఈ రిపోర్ట్ పంపించడం ద్వారా.. నాలెడ్జ్, స్కిల్ మధ్య ఉన్న అంతరాన్ని తెలియచేస్తాం. 

ప్రారంభించిన మొదటి ఏడాదే బెంగళూరు, హైద్రాబాద్‌, చెన్నై, కోయంబత్తూర్‌ నగరాల్లోని 45 కాలేజ్‌లలో 4500మంది విద్యార్ధులను బీఏపీ కోర్స్ అందించింది అర్థవిద్య.

పరిశ్రమ నిపుణులు, ఇప్పటికే పని చేస్తున్న ప్రొఫెషనల్స్‌కు... కాలేజ్‌లు నేర్పించే విషయాలు, ఇండస్ట్రీ అవసరాల మధ్య ఉన్న అంతరం బాగానే తెలుసు. అయితే విద్యాసంస్థలు, విద్యార్ధులకు ఈ విషయంపై స్పష్టత ఉండడం లేదు. అర్థ విద్యకు ఇదే అసలు సవాల్. అందుకే కౌన్సిలింగ్‌ను కూడా ఒక కీలక చర్యగా చేపట్టారు అర్థవిద్య టీం.

“మేం ఈ అంతరాలను కౌన్సిలింగ్ ద్వారా విద్యార్ధులకు నేర్పిస్తాం. ప్రతీ స్టూడెంట్‌కు వారి నాలెడ్జ్ రిపోర్టును విడివిడిగా అందిస్తాం. వారు ఏ అంశంలో ప్రతిభ కనపరుస్తున్నారు ? ఏ టాపిక్‌లో వెనుకబడి ఉన్నారో అర్ధమయ్యేలా చెబ్తాం. ఇదే సమయంలో అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో... ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా తెలియచేస్తాం” అంటూ.. తమ కోర్స్ విధానాన్ని వివరించారు నాగరాజన్.

అర్థవిద్య వెనుక ఉన్న విద్యావంతులు

ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ప్రమోట్ చేసిన అర్థవిద్యను... సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ నాగరాజన్ ప్రారంభించారు.

నాగరాజన్ జి, ఫౌండర్

నాగరాజన్ జి, ఫౌండర్


2011 ఆగస్టులో బెంగళూరులో ఈ కంపెనీ ప్రారంభమైంది. నాగరాజన్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్‌ఫీల్డ్ ఇండియాతో కెరీర్ ప్రారంభించిన ఆయన... తర్వాత విప్రోకు మారారు. అందులో 13ఏళ్లపాటు పని చేశాక... రిడింగ్టన్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గాను విధులు నిర్వహించారు. తర్వాత ఈపామ్‌లీఫ్ ఐటీఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. అర్థవిద్య కూడా ఇదే సంస్థకు చెందిన విద్యావిభాగం.

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బీఎఫ్ఎస్ఐ(బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్)లకు నైపుణ్య అభివృద్ధిలో భాగస్వామి ఈ కంపెనీ. అర్థవిద్యకు ఎన్ఎస్‍‌డీసీ రుణాన్ని మంజూరు చేయగా... ఫౌండర్స్, వారి స్నేహితులు కూడా నిధులు సమకూర్చారు.

త్వరలో ఆన్‌లైన్ కోర్స్

బీకాం, ఎంకాం, బీబీఏ, బీబీఎం, ఎంబీఏ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులను టార్గెట్ చేసింది అర్ధ విద్య. అలాగే ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఏసీఎస్‌లకు ఎన్‌రోల్ చేసుకున్నవారు, కొత్తగా అకౌంటెంట్ విధుల్లో జాయిన్ అయిన వారు కూడా అర్థవిద్య టార్గెట్ కస్టమర్లే. వీరితోపాటు ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లోకి మారాలని అనుకునేవారికీ కూడా... ఈ సంస్థ అందిస్తున్న కోర్స్ చాలా ఉపయోగం.

ప్రస్తుతం బెంగళూర్, కోయంబత్తూర్‌లలోని కాలేజ్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది అర్థవిద్య టీం. “వర్చువల్ ఆఫీస్‌ను క్లౌడ్ బేస్డ్‌గానే రూపొందించినా.. తర్వాత ఆన్‌లైన్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాం”అన్నారు ప్రోడక్ట్ డెవలప్మెంట్ హెడ్ బాలాజీ శ్రీనివాసన్.

వెబ్‌సైట్ : arthavidhya

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags