సంకలనాలు
Telugu

మొబైల్ వాడకాన్నిబట్టి కస్టమర్ల మైండ్ సెట్ చెప్పేస్తారు!!

స్మార్ట్ గా డేటాని సేకరించే స్మార్ట్లీ యాప్... స్మార్ట్ బ్రాండ్లకు అది అమూల్యం..

అనామిక
27th Jan 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ఓ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఎంత ఆలోచిస్తాం. ఎన్ని వెబ్ సైట్లు తిరగేస్తాం. ఎన్ని రివ్యూలు, స్పెసిఫికేషన్లు చదువుతాం? ఏ ప్రాసెసర్, ఎంత స్పీడు, ర్యామ్ ఎంత? కెమేరా ఎంత మెగా పిక్సెల్? ఫ్రంటెంత? రియర్ ఎంత? ఇదే కేటగిరీలో వేరే బ్రాండ్ లో ఫోన్లెలా ఉన్నాయి? 

ఇలా.. సవాలక్ష డిటెయిల్స్ చూసి మనశ్శాంతించిన తర్వాత గానీ మనం ఓ మొబైల్ ఫోనుకి ఫిక్సవ్వం. ఫోన్ మాత్రమే కాదు.. ఏ వస్తువు కొనాలన్నా మార్కెట్ లో దొరికే ఇతర బ్రాండ్ ల ధర, పనితీరుతో పోల్చి చూసి కావలసింంది నిర్ణయించుకుంటాం. ఈ పని చేసే యాప్స్ ఇప్పుడు మార్కెట్ లో చాలా ఉన్నాయి. బెంగుళూరు బేస్డ్ స్టార్టప్ మొబి ఆర్బిట్ ల్యాబ్స్ విడుదల చేసిన smartly.me యాప్ కూడా వీటిలో ఒకటి.

స్మార్ట్ టీమ్

స్మార్ట్ టీమ్


ఇంతవరకే అయితే ఈ యాప్ గురించి ఇక్కడ పెద్దగా చెప్పటానికేం లేదన్నమాటే. కానీ, అంతకు మించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అంటే, కస్టమర్ కు కావలసిన స్మార్ట్ ఫోన్ ని సజెస్ట్ చేయటమే కాదు... ఆల్రెడీ వాడుతున్న ఫోన్ ఉపయోగించే విధానంలో అతడి ఇష్టా ఇష్టాలను తేలిగ్గా అంచనా వేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ ట్రై చేసే ఉత్సాహం ఉన్నవాడా? సోషల్ సైట్స్ ఎక్కువగా వాడుతూ అందరికీ కాంటాక్ట్ లో ఉంటాడా? ఈ బుక్స్ బాగా చదివే సీరియస్ రీడరా? కెమేరాతో ఎక్కువ ఫోటోలు తీసే ఇంట్రస్ట్ ఉన్న ఫోటోగ్రాఫరా? గేమర్? ఫన్ ఫ్రీక్, ట్రావెలర్ ? ఇలా మొబైల్ యూజర్ ని అతడి స్మార్ట్ ఫోన్ వినియోగాన్నిబట్టి అంచనావేస్తుంది.

ఇది అంతిమంగా ఆ యూజర్ మైండ్ సెట్ ని చెప్తుంది. అంటే, కస్టమర్లు దేనికోసం ఎక్కువగా వెతుకుతున్నారో? ఏ ఫీచర్లు వారిని ఆకట్టుకుంటున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా లక్షలాది యూజర్ల ఆసక్తులు కలెక్ట్ చేయగలిగితే, అది ఫోన్ తయారీ సంస్థలకు ఎంత ఉపయోగపడుతుందో కదా...!! ఆ డేటాను అనుసరించి వాళ్ల ఉత్పత్తుల్లో కూడా మార్పులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కదా..! ఆ పని smartly.me యాప్ చాలా స్మార్ట్ గా చేసేస్తోంది.

అంటే ఆ స్టార్టప్ అల్గారిధమ్ యూజర్లకు మాత్రమే కాదు.. రిటెయిలర్లకు, ఫోన్ కంపెనీలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఐడియా ఇప్పటిది కాదు. సంతోశ్ ప్రభు, మురళీధర్, పలాష్ పాటిల్ ఈ ముగ్గురూ ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఆర్ అండ్ డీలో పనిచేస్తున్న టైం లో ఈ ఆలోచన వచ్చింది.

ఆ కంపెనీ ఇండియాలో 2011 నుండి 2014 వరకు లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మాన్యు ఫాక్చరర్ కూడా. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే తీరు వినియోగదారుడి వ్యక్తిత్వాన్ని చెప్తుందని ఎప్పుడైతే గ్రహించారో.. ఈ ముగ్గురూ ఆ దిశగా ఆలోచించటం మొదలు పెట్టారు. అదే కోట్లాది వినియోగదారుల ఆలోచనలను, ఆసక్తులను ఓ దగ్గర చేర్చగలిగితే అది ఎంత పెద్ద డేటా అవుతుంది? ఫోన్ కంపెనీలకెంత పెద్ద డేటా బేస్ అవుతుంది? 

ఈ ఆలోచన రావటమే ఆలస్యం. లక్షల జీతాలొచ్చే ఉద్యోగాలకు రాం రాం పలికారు. కొత్త టెక్నాలజీ ఆవిష్కారానికి పూనుకున్నారు. లక్ష్యం సింపుల్. యాప్స్ వాడకంలో డేటాను ఒక్కచోట చేర్చి, దాన్ని ఆర్గనైజ్డ్ గా మార్చటం..

ఈ క్రమంలో రిటెయిలర్స్ ని కూడా కలుసుకున్నారు. ఆయా స్టోర్లలో స్టాక్ వివరాలు మొబైల్ ఫోన్ ద్వారా ఎలా మేనేజ్ చేయొచ్చో అర్ధం చేసుకున్నారు. సింపుల్ గా ఏడు నెలల్లో ప్రొడక్ట్ ని తయారు చేశారు. 2015 అక్టోబర్ లో లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నాడిని రికార్డ్ చేసే పనిలో ఉంది.

ఇక మిగిలిందల్లా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ తో టైఅప్ పెట్టుకుని ఎప్పటికప్పుడు వినియోగదారుల ఆలోచనల్లో స్మార్ట్ ఫోన్ వినియోగంలో వస్తున్న మార్పులను ఎనలైజ్ చేసి ఆ డేటాను వాటికి అందించటమే. అదే సమయంలో కన్స్యూమర్ కి ప్రొడక్ట్ ని అమ్మటం కూడా చేస్తోందీ యాప్. ఈ యాప్ ని ఇప్పటివరకు 5 వేలమంది పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ సంస్థ ఫౌండర్స్ ఇందులో 70వేల డాలర్లపైగా పెట్టుబడి పెట్టారు.

మొబి ఆర్బిట్ బిజినెస్ మోడల్ సక్సెస్ అవ్వాలంటే అన్నిటి కంటే ముందు ఎక్కువ మంది కన్స్యూమర్లు ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్పుడే వివిధ బ్రాండ్లకు ఇవ్వగలిగేంత, వాటిని ఎట్రాక్ట్ చేసేంత సమాచారం పోగు చేయగలుగుతుంది.

"అయితే ఈ ప్రాసెస్ లో రెండు వైపులా కొన్ని రిస్కులున్నాయి. సరైన బాండ్ విడ్త్ తో గట్టి టెక్నాలజీని సమకూర్చుకోవటమే కాదు.. కస్టమర్లను ఆకర్షించటమూ సమస్యే'' -- ఆర్ నటరాజన్, సీఎఫ్ వో, హీలియన్ వెంచర్ పార్టనర్స్..

మై స్మార్ట్ ప్రైస్, స్మార్డ్ పిక్స్, ప్రైస్ బాబా ఇలా ఇప్పటికే చాలా స్టార్టప్స్ ఇదే బిజినెస్ మోడల్ లో ఉన్నాయి. కానీ అవన్నీ కన్స్యూమర్ ఫిల్టర్ చేసిన డేటా పై ఆధారపడ్డవి. ఇలా దాదాపు 20 కంపెనీలు ఇండియాలో పోటీపడుతున్నాయి. మైస్మార్ట్ ప్రైస్ వీటన్నిటిలో దూసుకుపోతున్న కంపెనీ. మరో స్టార్టప్ వూడూ టెక్నాలజీస్ ఒక యాప్ లోనే, ఆయా ఉత్పత్తుల ధరలు ఇతర యాప్ లలో ఎలా ఉన్నాయో అవకాశాన్నిస్తోంది. ఉదాహరణకు ఫ్లిప్ కార్ట్ లో ఓ ఐటమ్ ధర చెక్ చేస్తుంటే, అదే ఐటమ్ ధర స్నాప్ డీల్ లో ఎంతో కూడా పక్కనే ఓ విండోలో కనిపిస్తుంది. మొబి ఆర్బిట్ బిజినెస్ మోడల్ బీ టూ బీలో పోటీ కూడా ఉంది. రేడియో లోకస్ కంపెనీ. ఇది రిటెయిలర్స్ తో కనెక్టయి వినియోగదారుల ఆలోచనా ధోరణి, కొనుగోలు పద్ధతులపై వివరాలు అందించబోతోంది.

"టెక్నాలజీ కంపెనీలు ఎదగటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ, ఈ క్రమంలో ఫెయిలనవి కూడా చాలా ఉంటాయి". మోహన్ దాస్ పాయ్, ఎండీ, ఆరిన్ కాపిటల్

ఏ యాప్ కూడా కస్టమర్ వాడే డివైజ్ ని ఆధారంగా చేసుకుని అతణ్ని అంచనా వేయటం లేదు. ప్రతి సంస్థ కూడా షాపింగ్ హాబిట్స్ ఆధారంగానే అంచనా వేస్తున్నాయి. ఇదే మిగతావాటితో పోల్చితే మొబి ఆర్బిట్ కున్న ఎడ్వాంటేజ్. ఈ స్టార్టప్ మొత్తం యాప్ లనీ, ఫోన్ వినియోగాన్ని, గమనించిన తర్వాత కానీ, ఆ యూజర్ ని అంచనా వేయటం లేదు. కానీ, కస్టమర్లను ఆకట్టుకుని, పెద్ద బ్రాండ్లతో టై అప్ పెట్టుకుని, లాభాల్లో అడుగు పెట్టడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అయితే, అదృష్టవశాత్తూ, ఈ సంవత్సరం ఇలాంటి బిజినెస్ మోడల్స్ కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. స్మార్ట్ గా దూసుకుపోవటమే మొబి ఆర్బిట్ ముందున్న లక్ష్యం.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags