ఇలాగైతే లాభం లేదు.. ప్రెసిడెంటుని గట్టిగానే నిలదీద్దాం..

ఇలాగైతే లాభం లేదు.. ప్రెసిడెంటుని గట్టిగానే నిలదీద్దాం..

Saturday February 04, 2017,

1 min Read

డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేస్తున్నాడు. పదవీ బాధ్యతల స్వీకరించిన మరుక్షణమే మెక్సికన్ల మీద కసి తీర్చుకుంటున్నాడు. ఆ వెంటనే ఏడు ముస్లిం దేశాలను అమెరికాలో అడుగుపెట్టనీయొద్దని డిసైడయ్యాడు. హెచ్ వన బీ వీసాలను కఠినతరం చేశాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదనుకుని ట్రంప్ దగ్గర తమ వాయిస్ గట్టిగానే వినిపించేందుకు సిద్ధమయ్యాయి. యాపిల్, గూగుల్, ఎయిర్ బీఎన్బీ, ఉబర్, లిఫ్ట్ తో పాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎక్స్ పీడియా వంటి ప్రముఖ కంపెనీలు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

image


బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ ట్రంప్ విధానాలపై బాహాటంగానే విమర్శిస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల కస్టమర్లకు సరైన సేవలు అందిచలేమని ఆవేదన వ్యక్తం చేసింది. బ్లాక్ రాక్ అనే మనీ మేనేజింగ్ కంపెనీ కూడా అసహనం ప్రదర్శించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే కానీ, వ్యక్తిగత హక్కులను గౌరవించాల్సిందేని హితవు పలికింది.

ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు లాయ్డ్ బ్లాంక్ఫీన్ సీఈవో గోల్డ్ మ్యాన్ సాచ్. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పాలసీని ఎట్టిపరిస్థితుల్లో సమర్ధించబోమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆల్రెడీ ఫెడరల్ సవాల్ చేశామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జేపీ మోర్గాన్ చేజ్ అనే బ్యాంకింగ్ దిగ్గజం కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న వారి క్లబ్ లో చేరింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆక్రోషాన్ని వెళ్లగక్కింది. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో తమ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలంటే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందే అనే పట్టుదలతో ఉంది. అమెరికన్ కాఫీ హౌజ్ చైన్ స్టార్ బక్స్ కూడా వీరితో గొంతు కలిపింది.