సంకలనాలు
Telugu

వెదురుతో అందమైన పొదరిల్లు అల్లుతున్న హైదరాబాదీ జంట

team ys telugu
17th Mar 2017
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

ఇంటి కాన్సెప్ట్ మారిపోతోంది. లివింగ్ ఏరియా మోడ్రనైజ్ అయింది. ఇటాలియన్ లెదర్ సోఫాలు హాల్లో కొలువు దీరుతున్నాయి. అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ గోడమీద దర్జా ఒలకబోస్తోంది. రబ్బర్ వుడ్ స్టెయిర్ కేస్ లోనే కళాత్మకతను వెతుక్కుంటున్నారు. ఆంటిక్ ఆర్ట్ ఎఫెక్ట్ కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. సహజత్వానికి దూరంగా బతుకుతున్నారు. కాయితపు పూలలోనే ప్లాస్టిక్ నవ్వుల్ని వెతుక్కుంటున్నారు. ఇలాంటి మాయలో పడి బతుకుతున్న జనానికి వెదురిల్లుని మించిన పొదరిల్లు లేదని ప్రాక్టికల్ గా నిరూపిస్తోంది బాంబూ హౌజ్ ఆఫ్ ఇండియా.

image


అరుణ- ప్రశాంత్. ఈ కపుల్ కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే అందమైన వెదురిల్లు కాన్సెప్ట్. అలాగని ఇదేదో ప్లాన్ చేసి మొదలు పెట్టింది కాదు. పెళ్లయిన కొత్తలో ఇంటికోసం అందమైన ఫర్నిచర్ వెతికారు. ఎక్కడా నచ్చలేదు. ఇండో-బంగ్లాదేశ్ బోర్డర్ లో వెదురు బొంగులతో అందమైన ఫర్నిచర్ తయారుచేసే ఆర్టిషన్స్ కమ్యూనిటీ ఒకటి ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వాళ్లతో మాట్లాడాక తెలిసింది.. ఇలాంటి కళాకారులు ఇండియా అంతా ఉన్నారని. అయితే ఫర్నిచర్ మాత్రమే కొనాలనే ఉద్దేశంతో వెళ్లిన ఆ దంపతుల ఆలోచన మారిపోయింది. కళాకారులు చెప్పిన మాటలతో ఇద్దరిలో మెరుపులాంటి ఐడియా వచ్చింది. అందమైన కళను చేతిలో పెట్టుకుని, కడుపునిండా అన్నం లేని వారి దీనమైన బతకుల్ని ఎందుకు బాగుచేయకూడదు అనుకున్నారు. వాళ్ల కళను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలని భావించారు. అందుకోసం రెండేళ్లు ఫారెస్ట్ ఏరియాలో స్టడీ చేశారు. వాస్తవానికి ఏ ఆర్గనైజేషన్ కూడా వెదురులో పూర్తిగా ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. అందుకే ఆ రంగంలో సమస్యలేంటి అనే దిశగా పరిధోధన మొదలుపెట్టారు. డొమైన్ నాలెడ్జ్ కోసం అన్వేషణ మొదలైంది.

అలా 2010లో మొదలైంది బాంబూ హౌస్ ఆఫ్ ఇండియా. దీని ప్రధాన ఉద్దేశం వెదురుతో ఇల్లు కట్టడం. బాంబూ కర్రలతో చిన్నచిన్న ఐటెమ్స్ చేస్తే లాభం లేదు. అనుకున్నంత డబ్బు రాదు. బాంబూ పొటెన్షియల్ బుట్టలు, తట్టలకు మాత్రమే పరిమితం కావొద్దు. అందుకే బాంబూ హౌసింగ్ ఎంపిక చేసుకున్నాం అంటారు అరుణ. ఒక్కసారి వెదురిల్లు కడితే 25 నుంచి 30 ఏళ్ల వరకు చెక్కుచెదరదు. స్క్వేర్ ఫీట్ కు 600 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇదంతా నేచురల్ మెటీరియల్. రెండు డిగ్రీల వరకు చల్లగా ఉంటుది. వెదురులో సిలికా ఉంటుంది. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్ పూస్తారు. రూఫ్‌ ఓవర్ హ్యాంగ్స్ ఇస్తారు. రక్షణ గురించి భయం లేదు. బయటి నుంచి పెయింటింగ్ వేస్తారు. మొత్తమ్మీద రుష్యాశ్రమంలాంటి ఇల్లుని తయారు చేసి ఇస్తారు.

image


ఇది అసంఘటిత రంగం కాబట్టి భవిష్యత్తులో బాంబూ పొటెన్షియల్ ను పెంచాలన్నదే వీరి ధ్యేయం. వెదురు ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అవగాహన లేకపోవడం వల్ల వెదురును సరిగా ఉపయోగించుకోవడం లేదంటారు అరుణ. ఇప్పటివరకు 200 వెదురిళ్లు నిర్మించారు. వినియోగదారులు చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పారామె. ఈకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ కాబట్టి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లేదు. వీరి దగ్గర 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇంకా చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. వెదురు ఉత్పత్తితో ముడిపడి ఉన్న వాళ్లందరికీ లాభం చేకూరుతుంది.

సిమెంట్ నిర్మాణం వేడిని ఆకర్షిస్తుంది. కానీ వెదురు చల్లగా ఉంటుంది. మెయింటెనెన్స్ పెద్దగా వుండదు. సిమెంట్ ఇంటిని ఎలా చూస్తామో దీన్ని అలాగే చూస్తే సరిపోతుంది. పైగా వెదురిళ్లతో పర్యావరణానికి బోలెడంత మేలు.

image


బాంబూ హౌజ్ తో పాటు ఏడాది కిందటే ఒక రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభించారు. డ్రమ్స్, టైర్లు ఇతరత్రా వేస్టేజీ తీసుకొని వాటితో కుర్చీలు తయారు చేస్తున్నాం. పార్కులకు, కార్పొరేట్ ఆఫీసులకు ఇస్తున్నారు. ఇలా రీ సైక్లింగ్ కాన్సెప్ట్ నూ ప్రమోట్ చేస్తున్నారు.

నిజమే ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న తరుణంలో ఇళ్లలో పూలవాసనే కరువైంది. అవే క్రోటన్ మొక్కలతో బాల్కనీని మేకోవర్ చేస్తున్నారు. స్కాండినేవియన్ మాయలో పడి.. ఇంటికీ కార్పొరేట్ ఆఫీసుకీ పెద్ద తేడా లేకుండా చేస్తున్నారు. అందుకే మరిచిపోతున్న పల్లెను నట్టింట్లో ప్రతిష్టించే గొప్ప సామాజిక బాధ్యతను తలకెత్తుకుంది బాంబూ హౌజ్ ఆఫ్ ఇండియా. ఈ కాన్సెప్ట్ వెనుక వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా దాగివుండటం ఎంతైనా అభినందనీయం.

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags