సంకలనాలు
Telugu

వస్త్రాలకు వినోదాన్ని జోడించి మరీ ఆదరణ పొందుతున్న చుల్‌బుల్ స్టోర్

ఐఐటి విద్యార్థుల వినూత్న ఆలోచనసూపర్ హిట్ అయిన టివి సీరియళ్ల ఆధారంగా ప్రత్యేక డిజైన్లుకస్టమైజ్డ్ డిజైన్‌తో టి షర్టుల తయారీ

Krishnamohan Tangirala
8th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అన్షుమన్ శర్మ, వివేక్ పాఠక్.. వీళ్లిద్దరూ ఐఐటీ రూర్కీ గ్రాడ్యుయేట్లు. ఇద్దరూ ఎప్పుడైతే సొంత వెంచర్ ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చారో... జాబ్‌లను వదిలేశారు. “మేం చాలా స్థిరమైన, నిలకడైన ఉద్యోగాలను వదిలేశాం. కారణం అవి నిలకడగా ఉండిపోవడమే. ఏమాత్రం సవాల్ లేకుండా.. అలానే నిలిచిపోయే ఉద్యోగాలు మాకు కిక్ ఇవ్వలేదు”అంటున్నారు వీరు.

అన్షుమన్ శర్మ

అన్షుమన్ శర్మ


ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో బ్యాచ్‌మేట్స్‌గా ఉన్నపుడే స్టార్టప్ గురించిన ఆలోచన చేశారు ఈ ఇద్దరు స్నేహితులు. అయితే ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తైన మూడేళ్లకు విధి వాళ్లను మరోసారి బెంగళూరులో కలిపింది. ఇద్దరూ కలిసి 2013 నవంబర్‌లో స్టార్టప్ ప్రారంభించారు.

ఏమిటీ చుల్‌బుల్ ?

“ప్రతీ వ్యక్తికీ ఓ హాబీ, అభిరుచి ఉంటాయి. వారికి టేస్ట్‌లను ప్రతిబింబించేలా టీ షర్టులు ఉండేలా మేం వారికి సహాయపడతాం. చుల్‌బుల్ అనేది ఓ హిందీ పదం. ఓ అల్లరి చిల్లరిగా, కొంటెగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని... ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ పదం చాలా తేలిగ్గా గుర్తుంచుకోగలిగేది” అంటున్నారు వివేక్. ఆపేరును ఎంచుకోవడానికి ఇదే కారణమని చెబ్తారాయన.

మన దేశంలో 65శాతం మంది జనాభా 35ఏళ్లలోపు వారే. 15-34 ఏజ్ గ్రూప్ వ్యక్తులు 2001-2011 మధ్య 35.3కోట్ల నుంచి 43కోట్లకు పెరిగారు. 2021నాటికి ఈ సంఖ్య 46.4 కోట్లకు పెరుగతుందని అంచనా. యువతను టార్గెట్ చేసే అవకాశాన్ని వదులుకోబోమంటున్నారు వివేక్.

వివేక్ పాఠక్

వివేక్ పాఠక్


యువతను కట్టిపడేసే విషయాలపైనే ఆలోచించారు ఇధ్దరు ఫ్రెండ్స్. మిగతావాటితో పోల్చితే మాంచి హిట్టైన సినిమాలు, టీవీ సిరీస్ బాగా ఆకర్షణీయంగా కనిపించాయి వారికి. సినిమాలు, టీవీ సిరీస్‌ల నుంచి ఇన్‌స్పిరేషన్‌తో ప్రత్యేకమైన డిజైన్లు రూపొందించి... వాటిని ఫ్యాన్స్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

“ మా వెంచర్ ప్రారంభంలో టీవీలు, సినిమాల డిజైన్లతో రూపొందించిన టీ షర్టులుండేవి. తర్వాత యువతను ఆకట్టుకునే థీమ్స్ ప్రకారం డిజైన్లను ఇంట్రడ్యూస్ చేశాం” అంటున్నారు అన్షుమన్.

టీ షర్టులే ఎందుకంటే ?

“ మన దేశంలో అమ్ముడయ్యే వస్త్ర వ్యాపారం మార్కెట్ విలువ 40బిలియన్ డాలర్లు. ఇందులో టీ షర్టుల వాటా ఎక్కువే. ఈ విభాగం 12శాతం సగటు వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. దీనితోపాటు ఈ రంగంలో వినూత్నమైన డిజైన్లతో టీ షర్టులు విక్రయించేవారు అంత ఎక్కువగా లేరు. కస్టమర్లకు కస్టమైజ్డ్ టీషర్టులతో పూర్తి స్థాయి సంతృప్తి నుంచే కంపెనీలు లేవు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని, చేజిక్కించుకోవాలని భావించాం. వస్త్ర వ్యాపారం చాలా పెద్ద మార్కెట్. దీనిలో టీ షర్టుల విభాగంలో ఎంటర్ కావాలని నిర్ణయించుకున్నాం. నాణ్యమైన క్లాత్, సరైన ఫిటింగ్‌లకు ప్రాధాన్యతనిచ్చి టీషర్టులు అందిస్తున్నాం. లాంఛింగ్‌కు ముందే రీబాక్, పూమా వంటి బ్రాండ్‌లపై పరిశోధన కూడా చేశాం” అని చెప్పారు అన్షుమన్.

ఆశిష్ భరద్వాజ్

ఆశిష్ భరద్వాజ్


ప్రస్తుతం ఈ టీం చిన్నదే. ఆశిష్ భరద్వాజ్ డిజైనింగ్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగి. “మేం అందిస్తున్న డిజైన్లలో చాలా వరకూ, అలాగే వెబ్‌సైట్ కూడా ఆశిష్ తన ఖాళీ సమయంలో చేసినదే. త్వరలో ఆయన మాతో పూర్తి స్థాయిలో వర్క్ చేయబోతున్నారు. అలాగే మాకు కాలేజీల నుంచి కొంతమంది ఫ్రీలాన్స్ డిజైనర్లు కూడా ఉన్నారు.”- అన్షుమన్. సేల్స్, మార్కెంటింగ్ విభాగాల్లో నిపుణుల కోసం ప్రస్తుతం చుల్‌బుల్ అన్వేషిస్తోంది.

ఇతర ఈ-కామర్స్ స్టోర్లతో తేడా ఏంటి ?

“మా ఉత్పత్తులే మమ్మల్ని మార్కెట్లో నిలబెడతాయి. యువతను ఆకట్టుకునే బ్రైట్ కలర్ డిజైన్లు మా ప్రత్యేకత. దేశంలో చాలా ఈకామర్స్ స్టోర్స్ ఉన్నా... అన్నీ యూత్‌నే టార్గెట్ చేసే డిజైన్లు గల కంపెనీలు లేవు. మూవీస్, బైకింగ్, పార్టీ, స్పోర్ట్స్, ఫిట్‌నెస్, ట్రావెల్ వంటి ధీమ్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాం. మొదటగా మూవీస్, టీవీ సిరీస్‌లతో వ్యాపారం ప్రారంభించాం. బైకింగ్, పార్టీ థీమ్స్ త్వరలో లాంఛ్ చేయబోతున్నామ”ని వివరించారు అన్షుమన్. ప్రస్తుతానికి చుల్‌బుల్‌స్టోర్.కాం టీ షర్టులపైనే దృష్టి పెట్టినా... మొబైల్ కవర్స్, కాఫీ మగ్స్ వంటి ఉత్పత్తులనూ త్వరలో ప్లాన్ చేయనుంది.

చుల్‌బుల్ మార్కెటింగ్

చుల్‌బుల్ చేసే మార్కెటింగ్ ప్రధానంగా సోషల్ మీడియా పైనే. “ మా ఫేస్‌బుక్ పేజ్‌కు 3వేలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలకు సంబంధించిన జోక్స్, ఫన్ సంబంధిత పోస్టులు చేస్తూండడంతో... ఫాలోయర్స్‌తో ఎప్పుడూ లింక్ అయి ఉండేందుకు ప్రయత్నిస్తాం. సినిమాల గురించి, యాక్టర్ల గురించి, వారి బ్లాగులపైనా మా వెబ్‌సైట్‌లోనూ పోస్ట్ చేస్తాం. ఇది మాకు చాలా ట్రాఫిక్‌ను తెచ్చిపెడుతోంది”అంటున్నారు అన్షుమన్.

చుల్‌బుల్ డిజైన్లలో ఇదొకటి

చుల్‌బుల్ డిజైన్లలో ఇదొకటి


సోషల్ మీడియా మార్కెటింగ్‌తో పాటు సండే సోల్ సాంటే, ఫెస్ట్స్, మాల్స్‌, ఈవెంట్లలో ఆఫ్‌లైన్ స్టోర్లను ఏర్పాటు చేస్తోంది చుల్‌బుల్. దీని ద్వారా తమకు ప్రచారం విపరీతంగా లభిస్తోందని చెబ్తున్నారు వీరు. బెంగళూరులోని షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్ సెంటర్లలో ఏర్పాటు చేసిన స్టాల్స్.... తమ టార్గెట్ కస్టమర్ల గురించి మరింతగా తెలుసుకునేందుకు ఉపయోగపడ్డాయని అంటున్నారు.

చుల్‌బుల్‌ పరుగులు ఎలా ?

“ప్రస్తుతం మూవీస్, టీవీ సిరీస్‌లకు సంబంధించిన టీషర్టులు మాత్రమే విక్రయిస్తున్న ఈ చుల్‌బుల్‌స్టోర్.. మరికొన్ని థీమ్‌లను, ప్రోడక్టులను లాంఛ్ చేయనుంది. చుల్‌బుల్ బ్రాండ్‌పైనే అన్నీ లాంఛ్ చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికే ఎక్కువ ఫ్యాన్ బేస్ గల కంపెనీలతో టై అప్ అవ్వాలని చూస్తున్నాం. కో-బ్రాండింగ్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలని మా ఆలోచన. ఇది రెండువైపులా లాభదాయకమైన మార్గం. తయారీ, ప్యాకేజింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విషయాల్లో ఖర్చు కలిసొస్తుంది. కో బ్రాండింగ్ ద్వారా కలిసి అభివృద్ధి చెందాలన్నది మా ప్రణాళిక” అంటున్నారు వివేక్.

ఈ స్టోర్ ఇప్పటికే రెండు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. బెంగళూరుకు చెందిన లామాబైకర్.కాం, హైద్రాబాద్ కంపెనీ క్లియర్‌హై.కాంలతో భాగస్వాములయ్యారు. వీరితో కలిసి కో బ్రాండెడ్ టీషర్టులను జూలై 2014నుంచి విక్రయిస్తున్నారు.

“చుల్‌బుల్‌ని పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిధులు అవసరం. మా మోడల్‌ని అర్ధం చేసుకుని ఫండింగ్ చేసేవారి కోసం చూస్తున్నామ”ని చెప్పారు అన్షుమన్.

చుల్‌బుల్ విక్రయిస్తున్న టీషర్టులు తమిళనాడులోని తిరుపూర్‌లో తయారవుతాయి. ఇక్కడి ఓ ఫ్యాక్టరీతో చుల్‌బుల్ ఒప్పందం చేసుకుంది. ఇన్వెంటరీ విభాగం మాత్రం బెంగళూరులోనే. డెలివీరీలను bundl చేస్తోంది. 

“మేం టీషర్టులను మొదట విక్రయించిన ధర రూ.399. మార్కెట్లో ప్రవేశించినపుడు కస్టమర్లను ఆకర్షించేందుకే తక్కువ రేటు నిర్ణయించాం. ఆ తర్వాత ధరల్లో కొంత మార్పులు చేశాం” అన్నారు అన్షుమన్.


image


పల్సర్ ఎన్ఎస్ బైకింగ్ గ్రూప్... నేక్‌డ్ వూల్వ్స్‌నుంచి బల్క్ ఆర్డర్ లభించింది చుల్‌బుల్‌కి. అప్పట్లో మంచి క్వాలిటీతో, రీజనబుల్ రేటుకు టీషర్టులు అందించే సప్లయర్ కోసం చాలారోజులు వెతికామని, ఇలాంటి అవసరాలకు చుల్‌బుల్ మంచి డెస్టినేషన్ అని చెబ్తోందీ గ్రూప్. అలాగే బెంగుళూరులోని సీబీఆర్ 250ఆర్ రైడర్ల గ్రూప్‌నుంచి కూడా ఆర్డర్ పొందారు. ఈ రెండు ఆర్డర్ల ద్వారా కస్టమర్ల నుంచి అద్భుతమైన రివ్యూలు, ఫీడ్‌బ్యాక్ పొందగలిగింది చుల్‌బుల్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags