సంకలనాలు
Telugu

క‌ళాకారుల‌ను క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌రికి చేర్చిన శిల్ప్‌మంత్ర‌ !

సృజ‌నాత్మ‌క‌త‌తో క‌ళాకండాల‌ను సృష్టిస్తున్న క‌ళాకారులు వాటిని స‌రైన ధ‌ర‌కు అమ్ముకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ఈ బ‌ల‌హీన‌త‌ను క్యాష్ చేసుకుంటున్న ద‌ళారులు ఆర్టిస్టులు రూపొందించే హ్యాండీక్రాఫ్ట్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌కు కొని ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తూ భారీగా లాభాల‌ను ఆర్జిస్తున్నారు. ఐతే ఈ ద‌ళారీ వ్య‌వ‌స్థ‌కు చెక్ చెప్పి క‌ళాకారుల‌కు చేదోడువాదోడుగా నిలుస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను ద‌గ్గ‌రికి చేస్తున్న‌ది శిల్ప్‌మంత్ర‌..

GOPAL
30th Apr 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

హస్తకళలు రాజస్థాన్ సంస్కతిలో ఒక భాగం. జాతీయంగాను, అంతర్జాతీయంగానూ రాజస్థాన్ హస్తకళలు ఎంతో పేరొందాయి. రాజస్థాన్ పర్యటించే పర్యాటకులు రాజ‌స్థాన్‌ కళాఖండాల‌ను కొనుగోలు చేయకుండా తిరిగి వెళ్లరు. ఈ వ్యాపారం ప్రతిఏటా వేగంగా పెరుగుతున్నది. హస్తకళలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ వాటిని తయారు చేసే కళాకారుల జీవితాల్లో మాత్రం పెద్ద మార్పు కనిపించడంలేదు. సరైన మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లేకపోవడంతోపాటు దళారీ వ్య‌వ‌స్థ పెరిగిపోవ‌డంతో చాలామంది కళాకారులు తమ కుల‌వ‌ృతి వదులుకోవాల్సి వస్తున్నది. 

ఈ మంత్రమే వాళ్ల జీవితాలను మార్చేస్తోంది

ఈ నేప‌థ్యంలో క‌ళాకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శిల్ప్‌మంత్ర‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్ ముందుకొచ్చింది. ఉద‌య్‌పూర్‌కు చెందిన లోకేంద్ర రణావత్, వీరేంద్ర రణావత్, సందీప్ గౌర్ 2013మే లో ఈ శిల్ప్‌మంత్ర‌ను ప్రారంభించారు. రాజ‌స్థాన్ కు చెందిన వీరికి వ్యాపార వ్య‌వ‌హారాల్లో, ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. కళాకారులను, కొనుగోలుదారులను నేరుగా కలపడమే తమ వ్యాపార ముఖ్య లక్షణమని ఈ పోర్టల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లోకేంద్ర రణావత్ అంటున్నారు. 

"ఎంతో నైపుణ్యమున్న కళాకారులు వేరే వ‌ృతిల్లోకి వెళ్లిపోతే ప్రాచీన‌మైన ఈ కళలు అంతరించిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే కళాకారులను ఆదుకోవాలి. వాళ్లు తయారు చేసిన హస్తకళలు నేరుగా కస్టమర్ల చేతికే వెళితే కళాకారుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని'' లోకేంద్ర చెప్తున్నారు. 


వీరేంద్ర రణావత్,లోకేంద్ర రణావత్, సందీప్ గౌర్ - శిల్ప్ మంత్ర బృందం

వీరేంద్ర రణావత్,లోకేంద్ర రణావత్, సందీప్ గౌర్ - శిల్ప్ మంత్ర బృందం


హస్తకళలను తయారుచేసే కళాకారులు, వాటిని కొనుగోలు చేసే కస్టమర్ల మధ్య ఆన్‌లైన్ పోర్టల్ శిల్ప్‌మంత్ర‌ వారధిగా నిలుస్తున్నది. కళాకారులతో కలిసి పనిచేస్తూ వారు తయారు చేసిన హస్తకళలను వాటి పూర్తి వివరాలతో సహా పోర్టల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే మార్కెట్ ట్రెండ్స్, డిజైన్స్‌పై వ‌ర్క్‌షాప్‌ల‌ను కూడా నిర్వహిస్తూ కళాకారులకు సాయంగా నిలుస్తున్న‌ది శిల్ప్‌మంత్ర‌. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ద్వారా ప్రస్తుత మార్కెట్ డిమాండ్ తెలుసుకుంటున్న కళాకారులు కొనుగోలుదారుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా హస్తకళలను రూపొందించి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. 

కళాకారుల కుంచె నుంచి జాలువారిని చిత్తరువు

కళాకారుల కుంచె నుంచి జాలువారిని చిత్తరువు


రాజస్థాన్ స్థానిక మార్కెట్లో తక్కువ ధరకే హ్యాండీక్రాఫ్ట్‌ల‌ను అమ్ముకుంటున్న ఆర్టిస్టులు శిల్పమంత్రలో విక్రయించడం ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. శిల్ప్‌మంత్ర‌ గురించి కళాకారులకు తెలియజేసేందుకు లోకేంద్ర రణావత్, వీరేంద్ర రణావత్, సందీప్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. 

ముచ్చటగొలిపే మరో త్రీడీ పెయింటింగ్

ముచ్చటగొలిపే మరో త్రీడీ పెయింటింగ్


రాజస్థాన్‌లో 300 గ్రామాల్లో పర్యటించి హ్యాండీక్రాఫ్ట్‌ల‌ను సేకరించి, శిల్ప్‌మంత్ర‌ పోర్టల్ గురించి ఆర్టిస్టులకు వివరించారు. ఈ రెండేళ్లలో 200 మందికిపైగా కళాకారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు 20 వేలకు పైగా ఆర్డర్లు దక్కించుకున్నారు. ప్రతిరోజు శిల్ప్‌మంత్ర‌ను మూడువేలకు పైగా విజిటర్లు సందర్శిస్తుంటారు. ఇందులో 60 దేశాలకు చెందిన సందర్శకులుండటం విశేషం. గత ఎనిమిది నెలల్లో ఈ సంస్థ టర్నోవర్ 70 లక్షలు. సంపాందించిన దానిలో 15 శాతాన్ని మార్కెటింగ్ ఖర్చులకు పక్కనపెట్టి, మిగతా మొత్తాన్ని కళాకారులకు నేరుగా అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులతో టై అప్ కావాడం, వారితో కమ్యునికేషన్‌ను కొనసాగించడం తమకు ఎంతో సవాలుతో కూడుకున్నదని లోకేంద్ర అంటారు. అయితే ఇప్పుడు ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా నేరుగా కళాకారులతోనే కనెక్ట్ కాగలుగుతున్నామని చెప్తున్నారు. 

ఆన్‌లైన్‌ పోర్టల్ ను కస్టమర్లకు దగ్గర చేసేందుకు శిల్పమంత్ర ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ప్రొడక్ట్ డిజైనర్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మార్కెటింగ్ నిపుణుల వంటి 45 మంది ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్ శిల్ప్‌మంత్ర‌ను కస్టమర్లకు దగ్గరచేసేందుకు క‌ృషిచేస్తున్నారు. రాజస్థాన్‌లో దళారీ వ్యవస్థను కనుమరుగు చేసిన ఈ శిల్ప్‌మంత్ర‌ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఆఫ్‌లైన్‌లోనూ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నది. ద‌ళారీల బారిన ప‌డ‌కుండా క‌ళాకారుల‌ను ఆదుకుంటున్న శిల్ప్‌మంత్ర‌ మ‌రింత విస్త‌రించాల‌ని ఆకాంక్షిద్దాం..

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags