Telugu

5 నెలల్లోనే 70వేల డాలర్ల నిధులు సమీకరించిన ‘స్టాక్ రూం’

ashok patnaik
15th Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మీ సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలా ? వాళ్లకెలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అపాయింట్‌ చేసిన తర్వాత వాళ్లు సరిగ్గా చేస్తారా లేదా అనే డౌట్ మీలో ఉండొచ్చు. సాధారణంగా స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద సమస్య. ఇంటర్న్‌ లను తీసుకుంటే ట్రెయినింగ్ ఇవ్వొచ్చు. కానీ అనుభవం ఉన్న ఉద్యోగులను తీసుకున్నాక వారికి ట్రైనింగ్ ఇవ్వడం అంటే స్టార్టప్ కంపెనీలకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశమే. ఈ సమస్యకు పరిష్కారం చూపుతానంటోంది స్టాక్ రూం.

“సాధారణంగా ఉద్యోగానికి అప్లై చేసిన అప్లికెంట్ తన రెజ్యుమేలో తన క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెబుతాడు. నిజంగా తానేం చేస్తాడనేది ఎక్కడా చెప్పడు. ఆ విషయాన్నే మేం చెబుతాం అంటున్నారు.” స్టాక్ రూం కో ఫౌండర్ నరేన్

ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీలను డిస్కవర్ చేసే బాద్యతను స్టాక్ రూం చేపడుతుంది. మార్కెట్లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో స్కిల్ గ్యాప్ అయితే ఉంది. దాన్ని ఫిల్ చేస్తామంటోంది ఈ హైదరాబాదీ స్టార్టప్. టాలెంట్‌ను చూపించడానికి రెజ్యుమేలో అసలు ప్లేస్ లేదు. కానీ స్టాక్ రూంలో ఉందంటున్నారు నరేన్ .

స్టాక్ రూం(Stockroom.io) ఎలా పనిచేస్తుంది

స్టాక్ రూం డేటాలో ఒక వ్యక్తి తాలూకు పోర్ట్ ఫోలియో ఉంటుంది. స్కిల్స్ అనేది అన్నింటి కంటే ప్రధానమైనవిగా మా సంస్థ నమ్ముతుందని మరో కో ఫౌండర్ ఆశిష్ తెలిపారు. ఇప్పటి వరకూ స్టాక్ రూం 10,000లకు పైగా రిజిస్ట్రర్డ్ యూజర్లను సంపాదించుకుంది. ఇటీవల స్టాక్ రూం హ్యాచ్ అనే ప్రాడక్టును లాంచ్ చేసింది. దీనిలో కంపెనీలు హోస్ట్ చేసుకునే వెసులుబాటుంది.

“హ్యాకథాన్ ద్వారా నిజమైన నైపుణ్యాన్ని గుర్తించవచ్చు.” ఆశిష్

హ్యాచ్ (Hatch ) ప్రోడక్ట్ లాంచింగ్ ఉద్దేశం ఇదేనని వివరించారు. ఇందులో ప్రధానంగా ఆఫ్ లైన్ హ్యాకథాన్స్, ఆన్ లైన్ చాలెంజస్, సరైన టాలెంట్ గుర్తించడానికి కంటెస్ట్‌లను చేపడతారు. హ్యాకథాన్, ఆన్ లైన్ చాలెంజీలన్నీ ఇన్విటేషన్ ఉన్న వారితోనే చేపడతారు. చాలెంజీలో పాల్గొన్న ప్రతి క్యాండిడేట్ తాలూకు పూర్తి రిపోర్టుతో పాటు రేటింగ్‌ను స్టాక్ రూం ఇస్తుంది. కంపెనీలు హైరింగ్ ప్రాసెస్ స్పీడ్ అప్ చేయడంతో పాటు క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నరేన్ అభిప్రాయడ్డారు. ప్రారంభమైన రోజు నుంచే స్టార్టప్ తోపాటు ఇతర కంపెనీల హాట్ ఫేవరేట్ గా నిలిచిన స్టాక్ రూం ఫోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయడంలో వెబ్ డెవలపర్స్‌కి సాయం అందిస్తోంది. దీని కోసం డెవలపర్స్ గిట్ హబ్‌లో ఓ క్లిక్ చేస్తే సరిపోతుంది. స్టాక్ ఓవర్ ఫ్లో, బిట్ బకెట్‌లను ఒక దగ్గరకు చేర్చడంతోపాటు ఇతర సోషల్ పోర్ట్‌ఫోలియోలను ఒక దగ్గరకు చేర్చడం ద్వారా ఇంటిగ్రేటెడ్ ప్రోడక్టును తీసుకురావాలని చూస్తున్నారు.

image


ఫండింగ్

స్టాక్ రూం స్ట్రాటజీతోపాటు ప్రాపర్ అనాలసిస్ ప్రారంభించిన 6 నెలల్లోనే సీడ్ ఫండింగ్ వచ్చేలా చేసింది. అక్టోబర్‌లో 70వేల అమెరికన్ డాలర్ల సీడ్ ఫండింగ్ వచ్చింది.హైదరాబాద్‌కు చెందిన ఓ ఏంజిల్ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దీంతో ఉత్సాహంగా పనిచేస్తోన్న టీం.. లార్జ్ స్కేల్‌లో మొదటి రౌండ్ ఫండింగ్ కోసం దూసుకుపోతోంది. ఫండింగ్ విషయంలో తొందరలోనే నెక్ట్స్ బ్రేకీవెన్ చెబుతానని నరేన్ అంటున్నారు.

స్టాక్ రూం టీం

నరేన్ క్రిష్ణ... స్టాక్ రూం కో ఫౌండర్ సీఈఓ. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి అయిన నరేన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ స్టార్టప్ ప్రారంభించారు. ఆశిష్ కుమార్ సాహూ మరో కో ఫౌండర్ . సిటీఓగా ఉన్న ఆయన భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీ నుంచి డిగ్రీ పొందారు. వీళ్లిద్దరూ పాటు వీకెండ్ హ్యాకథాన్‌లో దాదాపు 48 గంటలపాటు కలసి పనిచేసినప్పుడు దీన్ని ప్రారంభించాలనే ఐడియా వచ్చింది. అలా మొదలైందే ఈ స్టాక్ రూం. వీరితో పాటు మరో నలుగురు టీంలో ఉన్నారు. ముంబై ఏంజెల్ స్క్రీనింగ్ కమిటీకి చెందిన పురు మొడనీ ఈ వెంచర్‌లో అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు.

image


సవాళ్లు

సాధారణంగా బిటుబి వ్యాపారం చేసే స్టార్టప్‌లకు ఫండింగ్ రావడం అంత సులువైన విషయమైతే కాదు. బిటుబి వ్యాపారంలో కాంపిటీషన్ మాట పక్కన పెడితే ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుంది. కానీ ఫండింగ్ వచ్చిన కంపెనీల ఆదాయం మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్న అధిగమించాల్సిన అవసరం ఉంది. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత పోర్ట్‌ఫోలియోల స్క్రీనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెద్ద పెద్ద జాబ్ కన్సల్టింగ్ కంపెనీలు కుప్పకూలిన చరిత్ర ఉంది. అయితే ఆబ్జెక్టివ్ , ప్రోడక్ట్ ఓరియెంటెడ్‌గా ముందుకుపోతున్న ఈ స్టార్టప్ ఇలాంటి తప్పులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

image


భవిష్యత ప్రణాళికలు

సీడ్ ఫండింగ్ అందించిన మద్దతుతో మెయిన్‌స్ట్రీం హైరింగ్ ప్రాసెస్‌లో అడుగుపెట్టిన స్టాక్ రూం మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇప్పటి వరకూ 5వేలకు పైగా డెవలపర్స్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియోలున్న కంపెనీ దీన్ని రెట్టింపు చేయాలని చూస్తోంది. దీంతో పాటు స్టాక్ రూం అప్లికేషన్‌లో మార్పులు చేసి మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారబోతోంది. నాన్ టెక్నికల్ టీంను పెంచుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరులో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న స్టాక్ రూం ఇతర మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది. పూర్తి స్థాయి బిటుబి బిజినెస్ మోడ్‌లో ఉన్న ఈ కంపెనీ ఈ సెగ్మెంట్లో నంబర్ వన్ కావాలని చూస్తోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags