సంకలనాలు
Telugu

జేమ్స్ బాండ్ vs ఆంట్రప్రెన్యూర్

Sri
6th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

007... ఈ కోడ్ చూడగానే అందరికీ గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. సినిమాల సిరీస్ తో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ మిగిల్చే జేమ్స్ బాండ్... స్టార్టప్ జర్నీ చేస్తున్న యువతకూ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. అదెలా అనుకుంటున్నారా..? నిజమే. జేమ్స్ బాండ్ సినిమాకు... స్టార్టప్ కు చాలా పోలికలుంటాయి. క్యాసినో రాయల్ లో జేమ్స్ బాండ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో... మార్కెట్ ప్లేస్ లో జాక్ పాట్ కొట్టేందుకు ఆంట్రప్రెన్యూర్ల వ్యూహాలు అలాగే ఉంటాయి. స్టార్టప్స్ తో హల్ చల్ చేస్తున్న ఆంట్రప్రెన్యూర్స్... బాండ్ సినిమాల నుంచి స్ఫూర్తి ఎలా పొందాలో చూద్దాం...

image


జేమ్స్ బాండ్ vs ఆంట్రప్రెన్యూర్

మీరెప్పుడైనా ఏదైనా జేమ్స్ బాండ్ సినిమా చూశారా? ఓసారి గుర్తుతెచ్చుకోండి. అందులో జేమ్స్ బాండ్ ఎంట్రీ ఎలా ఉంటుందో? ఒక్కసారి చూస్తే మర్చిపోలేం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్టన్నింగ్ ఎంట్రీ ఇవ్వడం జేమ్స్ బాండ్ స్టైల్. స్టార్టప్స్ కి కూడా అలాంటి స్టన్నింగ్ ఎంట్రీ అవసరం. మార్కెట్లోకి దూసుకొచ్చే స్టైల్ విభిన్నంగా ఉండాలి. అందర్నీ ఆకర్షించగలగాలి. ఫస్ట్ ఇంప్రెషన్ కలిగించేందుకు సెకండ్ ఛాన్స్ ఎప్పటికీ దొరకదు... ఇదీ బాండ్ ఫిలిమ్స్ అందించే స్ఫూర్తి. జేమ్స్ బాండ్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

బాండ్... మై నేమ్ ఈజ్ జేమ్స్ బాండ్ అంటూ సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ ఇంట్రడక్షన్ డైలాగ్ విజిల్స్ కొట్టేలా చేస్తుంది. స్టార్టప్ విషయంలోనూ అంతే. మార్కెట్లో అస్తవ్యస్తంగా, అయోమయంగా ఉన్న పరిస్థితుల నుంచి అవకాశాల్ని వెతుక్కొని సరైన సమయంలో ఇంప్రెస్ చేసేలా తొలి స్టెప్ వేయడం చాలా ముఖ్యం. జేమ్స్ బాండ్ ప్రేక్షకుల మనస్సు దోచేసినట్టు... ఆంట్రప్రెన్యూర్ వినియోగదారుల మనస్సులో చోటు సంపాదించుకోవాలి. తమ కంపెనీ వల్ల కలిగే లాభాలేంటో పక్కాగా వివరించగలగాలి.

బాండ్ సినిమా vs స్టార్టప్ జర్నీ

రాక్ స్టార్ పాడే ఓపెనింగ్ ట్రాక్ దగ్గర్నుంచి చివర్లో పడే క్రెడిట్ రోలింగ్స్ వరకు సినిమా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుంది. స్టార్టప్ కూడా అంతే. తొలి క్షణం నుంచే ఉత్కంఠ. ప్రోటోటైప్ నుంచి లాంఛింగ్ వరకు... ఆ తర్వాత మార్కెట్లో ముద్ర వేయడానికి వేసే ప్రతీ అడుగూ ఉత్కంఠే. జేమ్స్ బాండ్ సినిమాలా తొలి క్షణం నుంచే ఉత్కంఠగా మొదలవుతుంది స్టార్టప్ జర్నీ. బాండ్ ప్రతీ సినిమా మొదటి క్షణం నుంచే ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ప్రతీ సన్నివేశం ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పల్స్ రేట్ పెంచుతుంది. కొత్తకొత్త సన్నివేశాలతో బాండ్ అలరించినట్టు... కొత్తకొత్త ఐడియాలతో ప్రపంచాన్ని మేల్కొలపడం ఏ స్టార్టప్ కైనా అవసరం. ఎలా అంటే... ఓసారి యాపిల్ 1984 కమర్షియల్ ను గుర్తుతెచ్చుకోండి. సూపర్ బౌల్ సమయంలో మాత్రమే ఎయిర్ అయిన కమర్షియల్ లా గొప్ప ఉదాహరణగా నిలవాలి కొత్త కంపెనీ.

టెక్నాలజీ ప్రాముఖ్యత

బాండ్ సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సన్నివేశం ఏంటంటే... అతడు 'క్యూ'ని కలుసుకునేది. దాంతోపాటు... బాండ్ ఉపయోగించే కొత్త కొత్త గాడ్జెట్స్, అదృశ్యమయ్యే వాహనాలు, వాచ్ కమ్ ట్రాన్స్ మిటర్స్, గన్ షేపులో ఉండే పెన్స్, పెన్ షేపులో ఉండే గన్స్... ఇలా ఎన్నని చెప్పాలి. ప్రతీ సినిమాలో ఎవరూ ఊహించని కొత్తకొత్త గాడ్జెట్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి. ఇలాంటి వండర్ గాడ్జెట్స్ సాయంతో క్లైమ్యాక్స్ లో థ్రిల్ ను హైపిచ్ కు తీసుకెళ్లి శుభం కార్డు వేసేస్తాడు బాండ్. స్టార్టప్ కంపెనీలు కూడా ఈ రోజుల్లో టెక్నాలజీని ఆ స్థాయిలో వాడుకోవాలి. పనులన్నీ టేబుల్ పైకి వచ్చేయాలి. ప్రతీది టేబుల్ పైనుంచే జరిగిపోవాలి. సాంకేతికత సాయంతో విభాగాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం స్టార్టప్ కు చాలా ముఖ్యం. డాటా బేసెస్ ను వినూత్నంగా ఉపయోగించడం, కస్టమర్లతో సత్సంబంధాలను ఏర్పర్చుకోవడం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం చాలా అవసరం. ఆర్గనైజేషన్ లోనే ఫోరమ్స్ క్రియేట్ చేసి ఐడియాలను పంచుకోవాలి. సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఏ స్టార్టప్ కైనా టెక్నాలజీ గొప్ప స్నేహితుడు.

బాండ్ క్యారెక్టర్స్ vs స్టార్టప్ టీమ్

బాండ్ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. స్టార్టప్ లో కూడా అంతే. ప్రతీ కో-ఫౌండర్ ది ఓ స్పెషాలిటీ. ఉద్యోగుల్లో రకరకాల టాలెంట్ కనిపిస్తుంది. సంస్థలో స్వతంత్రంగా ఆలోచించేవాళ్లను గుర్తించాలి. ప్రతీ బాండ్ సినిమాలో గూఢచారులు, తిరుగుబాటుదారులు ఉంటారు. సొంత అజెండా ప్రకారం వెళ్తుంటారు. వారి బాస్ అయిన ఎం సూచనలకు తగ్గట్టుగా నడుచుకుంటారు. సంస్థలో అలాంటివాళ్లు ఉన్నారేమో గుర్తించగలగాలి. ఎవరేంటో... ఎవరి టాలెంటేంటో తెలుసుకోగలగాలి. కొన్ని సంస్థలు వారి ప్రయత్నాల్లో, ఆశయాల్లో, నిర్ణయాల్లో విఫలమైనా... వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యేవాళ్లుంటారు. అలాంటివారికి మరిన్ని అవకాశాలు వస్తుంటాయి. బాండ్ ను ఎలా నడిపించాలో 'ఎం'కు బాగా తెలుసు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. అవసరమైనప్పుడు వెనకడుగు వేయించడం, అవసరం ఉన్నచోట ముందడుగు వేయించడం అతని స్టైల్. ప్రతీ సంస్థలో విభిన్నంగా ఆలోచించేవాళ్లుంటారు. వీళ్లు సంస్థకు అలవాటుపడుతున్నకొద్దీ... సంస్థ పాలసీకి అనుగుణంగా ఆలోచిస్తారు. ఇలాంటివాళ్లు సంస్థకు చాలా ముఖ్యం. సంస్థను ముందుకు నడిపించడంలో వారి సాయం తీసుకోవాలి. అలాంటివాళ్లైతే వెంటేనే సరికొత్త ఐడియాలు ఇవ్వగలరు. కోర్ టీమ్ కు భిన్నంగా ఆలోచించగలరు.

ఊహించు... నడిపించు...

ఊహకు ఉన్న శక్తి ఏంటో బాండ్ సినిమాలోని ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ఉండే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. అలాంటి ఊహాశక్తి స్టార్టప్ కి అవసరం. ఊహించడం అంటే... కస్టమర్ల అవసరాలను ముందే పసిగట్టడం. జనానికి ఏది అవసరమో గుర్తించి అది ఇవ్వగలిగితే విజయానికి తొలి అడుగుపడ్డట్టే. ప్రపంచాన్ని కాపాడటమే బాండ్ లక్ష్యం. సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ హెడ్-MI6 ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటాడు బాండ్. చివరకు క్యూ ఇచ్చిన గాడ్జెట్స్ తో తన లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. విలన్ ను ఓడిస్తాడు. జీవితంలో, మార్కెట్ అనుభవాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. పోటీ ధరలకే విస్తృతమైన ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ అందించాలని కోరుకునే కస్టమర్లు కొందరు. స్థానికంగా ఉండే ఉడిపి హోటల్ లో మనం చెల్లించే డబ్బులకు రుచికరమైన భోజనాన్ని వీలైనంత వేగంగా అందించాలని అనుకుంటారు మరికొందరు కస్టమర్లు. ఇలా కస్టమర్ల అంచనాలు చాలా ఉంటాయి. అందుకు తగ్గట్టుగా సర్వీస్ ఉండాలి. వ్యాపారంలో కస్టమర్ల అనుభవాల రూపంలో వచ్చే ఊహించని మలుపులను స్వాగతించాలి. అలాంటి మనస్తత్వమే ఇతరులకంటే భిన్నంగా, వేగంగా స్టార్టప్ ను విజయం వైపు నడిపిస్తుంది.

బాండ్ చెప్పే పాఠం

ఇక బాండ్ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే- బాండ్ ఎవరిపైనా ఆధారపడడు. బాండ్ సినిమాల సిరీస్ కొనసాగిస్తున్న సమయంలో -ఆ క్యారెక్టర్ చేస్తున్న సియాన్ కన్నెరీ తప్పుకోవాలనుకున్నాడు. ఇక అంతే... బాండ్ సిరీస్ ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వెంటనే రోజర్ మూర్ తెరపైకొచ్చారు. ఆ తర్వాత పియర్స్ బ్రోస్నన్ ను డేనియల్ క్రేగ్ రీప్లేస్ చేశారు. ఈ నటులందరూ బాండ్ చిత్రాల్లో తమతమ ఫ్లేవర్ ని అద్దినవాళ్లే. ఈ కొత్త మొహాలన్నీ కొత్త తరం ఫ్యాన్స్ అభిరుచులకు తగ్గట్టుగా బాండ్ క్యారెక్టర్ ను ప్రతిబింబించగలిగారు. ఏదేమైతేనేం... బాండ్ సినిమాలు ఆగలేదు. చివరకు బాండ్ క్యారెక్టర్ చిరస్థాయిగా నిలిచింది. స్టార్టప్ కూడా అంతే. ఎవరిపైనా ఆధారపడకూడదు. వ్యవస్థ ఎప్పుడూ వ్యక్తిపై ఆధారపడకూడదు. వ్యక్తులు మారినా వ్యవస్థ కొనసాగుతుండాలి. చివరగా అన్నిస్టార్టప్ లకు బాండ్ సినిమాలు చెప్పే పాఠం ఏంటంటే... బాండ్ సినిమాల్నీ సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరిగినట్టు... స్టార్టప్ ఇమేజ్ మొత్తం ప్రజాకర్షణ గల వ్యవస్థాపకుడితో ముడిపడి ఉంటుంది. స్టార్టప్ వయస్సు పెరుగుతున్నకొద్దీ ప్రజాకర్షణ గల వ్యక్తుల జాబితా టీమ్ లో పెరగాలి. స్టార్టప్ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక వ్యూహం అవసరం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags