సంకలనాలు
Telugu

మిమ్మల్ని ఖచ్చితంగా నిద్ర లేపే ‘Walk Me Up! Alarm Clock’ యాప్.

సామాన్య అలార్మ్ యాప్స్ లా కాకుండా నిద్ర లేపి మరీ నడిపించే యాప్.మీరు విన్నది కరెక్ట్.. వేక్ మి అప్ కాదు.. వాక్ మి అప్లేచి కొన్ని అడుగులు వేస్తే గాని ఈ అలార్మ్ ఆగదు. ఈ యాప్ నే మోసం చేయాలని చూస్తే, పెనాల్టీ కూడా వేస్తుంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్లో లక్షనరకు పైగా డౌన్లోడ్స్

ABDUL SAMAD
4th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
image


ఉదయాన్నే సరైన సమయానికి లేవడమంటే చాలా మందికి అదో పెద్ద సమస్య. మన దగ్గరున్న అలార్మ్ పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే చాలా మంది స్నూజ్ బటన్ నొక్కేసి మళ్లీ నిద్రపోతారు. ఇక నిద్ర లేవాలంటే మన మీద పేరెంట్స్ అరవడమో, లేక మన బ్లాంకెట్ గుంజితే గాని అది సాధ్యం కాదు.

ఎలాగైన ఈ సమస్య వల్ల ఇబ్బంది పడి నా డైలీ షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదని నిర్ణయించుకున్నా. ఉదయాన్నే నిద్ర లేపడానికి చాలా యాప్స్ ఉన్నాయి, కాని నిజానికి నాకు పనికొచ్చేది మాత్రం మన ఇండియాన్ యాప్ ‘Walk Me Up! Alarm Clock’

ఏంటీ యాప్?

ఇదో వీనూత్నమైన అలార్మ్ యాప్. మీరు లేచి కొన్ని అడుగులు నడిస్తే కాని ఈ అలార్మ్ ఆగదు, ఆ లోగా మీ నిద్ర మాయమవ్వడం ఖాయం. మన డివైస్‌లో ఉన్న ఆక్సెలెరోమీటర్ మీ అడుగులను పసిగడుతుంది.

image


ఎన్ని అడుగులు కావాలో యూజర్ సెట్ చేసుకోవచ్చు, ‘స్టెప్’, ‘షేక్’ సెన్సిటివిటీ సెట్టింగ్స్ కూడా అందులో చేసుకునే వీలుంది.

అంతే కాకుండా, తెలివైన ఆల్గరిదమ్స్ సహాయంతో మీరు నడవడానికి బదులు ఫోన్ షేక్ చేసి మోసం చేయాలనుకుంటే అది కూడా తెలిసిపోతుంది. మీరు ఆ యాప్‌ని మోసం చేస్తున్నట్టు తెలిస్తే, మరో ఐదడుగులు ఎక్కువ నడవాలని పెనాల్టి కూడా వేస్తుంది.

ఈ యాప్ 879kb స్పేస్ మాత్రమే తీసుకుంటుంది, దీనికి యాండ్రాయిడ్ 2.2 లేదా హైఎండ్ అవసరముంటుంది.

ధర :

గూగుల్ ప్లే లో యాడ్ సపోర్టెడ్ ఫ్రీ వర్జన్ తో పాటు ప్రో వర్జన్ కూడా అందుబాటు లో ఉంది. అయితే ప్రో వర్జన్ కు 1.99 డాలర్లు ఖర్చౌతుంది.

image


ఇక ఫ్రీ వర్జన్ లో వాల్యూమ్ క్రెసెండో కోసం 1 డాలర్, ఎక్కువ స్నూజ్ కోసం 1 డాలర్, యాడ్స్ తీసేయాలంటే మరో డాలర్ వెచ్చించే అవకాశం కూడా ఉంది.

ఇందులో ఉన్న ఫీచర్స్

ఎవిల్ మోడ్: స్నూజ్ బటన్ ని డిజేబుల్ చేసుకోవచ్చు.

వాయిస్ అసిస్ట్: మీకు నచ్చిన పాటని అలార్మ్ టోన్ గా పెట్టుకువచ్చు.

స్నూజ్ డ్యూరేషన్ని తగ్గించి, క్విక్ అలార్మ్ పెట్టుకొవచ్చు.

ఇక అలార్మ్ లో ఉండాల్సిన మిగితా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

లాభాలు , నష్టాలు

వివిధ డివైజులపై ఈ యాప్‌ని టెస్ట్ చేయడంతో పాటు వివిధ సెట్టింగ్స్, మోడ్స్ చెక్ చేసి, ఈ నిర్ణయానికి వచ్చాం.

ఈ యాప్‌ని చాలా బాగా తయారు చేసారు, చెప్పింది చేయడంతో పాటు, ఎవిల్ మోడ్, వాయిస్ అసిస్ట్, క్విక్ అలార్మ్ లాంటి అదనపు ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

వివిధ స్మార్ట్ ఫోన్స్ లో ఉండే డీఫాల్ట్ సెట్టింగ్స్ కారణంగా, పలు డివైజులలో ‘స్టెప్’, ‘షేక్’ లాంటి సెన్సిటివిటి లో మైనర్ సమస్య కనిపించింది.

దీని వెనుక ఉన్న టీం

అభినయ్ బగారియా మణిపాల్ MIT నుండి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసారు. పగలు అంతర్జాతీయ మార్కెట్లో కమాడిటీస్ వ్యాపారం చేసే ఇతను, రాత్రి వేళల్లో యాప్ డెవలపర్. ఏ మోబైల్ కనిపించినా వాటిని లోతుగా పరిశీలించడంతో పాటు చదవడమంటే చాలా ఇష్టం.

image


ఇక ముహమ్మద్ షహబాజ్ మూసా కూడా మణిపాల్ MIT నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఇతను హార్డ్ కోర్ కోడర్. ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే కోడ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే 30 వెబ్ సైట్లను డెవలప్ చేసిన మూసా, ఇటీవల మొబైల్ యాప్ డెవలెప్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు.

మరి కొన్ని యాప్ ఐడియాలను సిద్ధం చేస్తున్నారు ఈ ఇద్దరు మిత్రలు, అంతే కాకుండా తమ టీమ్ ని పెంచడంతో పాటు OEM’s(Original Equipment Manufacturers) తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.

గూగుల్ ప్లే పై లక్షనర డౌన్ లోడ్స్ తో పాటు 4.2/5 రేటింగ్ అందుకున్న ఈ యాప్ తప్పనిసరిగా వాడాల్సిన ప్రాడక్ట్. ప్లే స్టోర్ పై ఎన్నో సానుకూలమైన రివ్యూలు కూడా ఈ యాప్ అందుకుంది.

image


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags