సంకలనాలు
Telugu

ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లి పది మందికీ ఉపయోగపడే పారిశ్రామికవేత్తగా... !

పుర్కల్ గ్రామంలో స్త్రీ సాధికార విప్లవంఒక్క మహిళతో ప్రారంభమై...ఆన్‌లైన్లో స్త్రీ శక్తిఅమెరికా, ఇంగ్లండ్ దేశాల్లోనూ స్త్రీ శక్తిప్రతి ప్రయాణానికీ ఓ పరమార్థం ఉంటుంది.

r k
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మార్పు ఇంట్లోంచే మొదలవుతుందంటారు వాళ్లు. చిన్ని స్వామి విషయంలో అదే జరిగింది. ఉత్తరాంచల్ రాష్ట్రంలో పుర్కల్ గ్రామంలో ఒకే ఒక్క మహిళతో ఆమె సొంతింట్లో స్త్రీ శక్తి మొదలయ్యింది. 2001.. చిన్ని, ఆమె భర్త స్వామి... హిమాలయాల పాదానువుల్లోఉండే ఏదైనా ఓ ప్రాంతానికెళ్లిపోదామనుకున్నారు. చాలా మందికి ఆ ఊసెత్తగానే ముస్సోరి పర్వతానువుల్లో ఉన్న సుందరమైన పట్టణం డెహ్రాడూన్ మదిలో మెదులుతుంది. డెహ్రడూన్, ముస్సోరి మధ్యలో ఉన్న పుర్కల్ అనే అందమైన చిన్న గ్రామాన్ని ఎంచుకున్నారు స్వామి.

చిన్ని స్వామి, స్త్రీ శక్తి వ్యవస్థాపకురాలు

చిన్ని స్వామి, స్త్రీ శక్తి వ్యవస్థాపకురాలు


చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లల కోసం స్వామి ఓ పాఠశాలను ప్రారంభిస్తే... స్థానిక మహిళలకోసం ఎంబ్రాయిడరీ దుప్పట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు చిన్ని. నెమ్మదిగా కొన్నేళ్లకు స్త్రీ శక్తి పేరు ఓ వ్యాపార సంస్థగా మలచి చిన్ని తన రంగు రంగుల ఎంబ్రాయిడరీ దుప్పట్లను ప్రపంచానికి పరిచయం చేశారు.

కొన్నేళ్ల క్రితం నేను మొట్ట మొదటి సారిగా పుర్కల్ వెళ్లాను. అప్పటి నుంచి అక్కడే ఉండి స్ఫూర్తినిచ్చే ఈ సంస్థ అద్భుత ప్రయాణంలో ఏటా నా వంతు సహకారం అందిస్తునే ఉన్నానంటారు చిన్ని స్వామి.

ఒక్క మహిళతో ప్రారంభమై...

"నేను మొదట కనీసం ఒక్క పేద మహిళకు సాయపడితే చాలనుకున్నాను. నాకు అల్లికలంటే చాలా ఇష్టం. ఇద్దరం కలిసి కొన్ని దుప్పట్లను తయారు చేశాం. చూసినవాళ్లంతా బాగుందనేసరికి... గ్రామంలో ఉన్న పేద మహిళలకు దీన్ని ఓ ఉపాధిగా మలచాలని భావించాను" - ఇదీ చిన్ని మొట్టమొదటి మాట.

మహిళా సాధికార శక్తి సాధనలో భాగంగా లాభాపేక్షరహితమైన సంస్థగా గుర్తింపు పొందింది స్త్రీ శక్తి. కేవలం దుప్పట్లను మాత్రమే కాదు కుషన్ కవర్స్, బ్యాగులు, ల్యాప్ టాప్ కవర్లు,స్కార్ఫ్‌లు ఇలా ఒక్కటి కాదు... చిన్నపిల్లలకు వెచ్చని సుతిమెత్తని దుప్పట్ల నుంచి పుస్తకాలకు అందమైన అట్టల వరకుఅన్నింటినీ తయారు చేస్తుంది. అన్నింటిలోనూ స్త్రీ శక్తి అనగానే గుర్తొచ్చేది అందమైన ఎంబ్రాయిడరీ దుప్పట్లే అంటారు చిన్ని చాలా గర్వంగా...

ఒక్కరితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు 130 మంది సభ్యులున్నారు. ఇందులో తయారు చేసేవాళ్లు.. డిజైనర్లు.. అకౌంట్ మేనేజర్, పర్చేజ్ అండ్ మార్కెటింగ్ మేనేజర్, స్టోర్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్, క్వాలిటీ కంట్రోలర్, ట్రైనీలు అందరూ ఉన్నారు.

పుర్కల్లో ఉన్న విమెన్ సెంటర్‌లోని రిటైల్ దుకాణంలో స్త్రీ శక్తి ఉత్పత్తులన్నీ లభిస్తాయి. ఆన్ లైన్ స్టోర్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు జరిగే ఎగ్జిబిషన్లలలో కూడా స్త్రీ శక్తి ఉత్పత్తులను ప్రదర్శిస్తుంటారు. అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో కూడా రిటైల్ పార్టనర్లు ఉండడ విశేషం.

image


వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. అమ్మకాలు పెరిగుతున్నప్పుడు సీజనల్ మార్కెట్ డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తి పెంచడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. "రాబోయే సీజన్ కోసం నాలుగైదు నెలల స్టాకును ముందే తయారు చేసి ఉంచుకోవాల్సి వచ్చేది. దీంతో పెట్టుబడంతా బ్లాక్ అయ్యేది.

మొదట్లో లాభాలు వచ్చినా ఖర్చులకు సరిపడా ఉండేవి కాదు. ఎందుకంటే స్త్రీ శక్తి మహిళా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చు ఎక్కువుండేది.తమ వ్యాపారంలో మహిళా సంక్షేమం చాలా ముఖ్యమైనదంటారు చిన్ని. ఎందుకంటే చాలా మంది మహిళలకు చిన్నపిల్లలుంటారు. చదువుకునే పిల్లలుంటారు. తల్లులు ప్రశాంతంగా పని చేసుకోవాలంటే వాళ్ల పిల్లల్ని తామే చూసుకోవాలంటారు చిన్ని. అంతే కాదు స్త్రీ శక్తి తన వద్ద పని చేసే మహిళలకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంది. అవసరమైన చికిత్సనందించడంలోనూ సాయం చేస్తుంది. పని చేసే సెంటర్‌కు నిత్యం వెళ్లి వచ్చేందుకు తగిన రవాణా సౌకర్యాలను కూడా సంస్థే కల్పిస్తుంది.

స్తీ శక్తితో  పనిచేస్తున్న మహిళా సిబ్బంది

స్తీ శక్తితో పనిచేస్తున్న మహిళా సిబ్బంది


కొన్ని ప్రయాణాలకు పరమార్థం ఉంటుంది

ఇవాళ పుర్కల్ చుట్టుపక్కల 15 గ్రామాల మహిళలు స్త్రీ శక్తి ఉద్యోగులు. మహిళలు ప్రతి నెలా సంపాదిస్తూ ఉంటే సహజంగానే కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వారిలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక స్థిరత్వంతో సమాజంలో విలువ పెరుగుతుంది. తన సంస్థలో పని చేసే మహిళంతా ఒకరికోసం ఒకరు అన్న భావన తనకెంతో తృప్తినిస్తుందని గర్వంగా చెబుతారు చిన్ని.


మొట్టమొదటిసారి పుర్కల్ వెళ్లినప్పుడు తన జీవితంలో ఇదే సుదీర్ఘ ప్రయాణం అనిపించిందంటారు చిన్ని. విమానంలో ఢిల్లీకి అక్కడ నుంచి రైల్లో డెహ్రడూన్.. ఆ తరువాత రాజ్‌పూర్ అనే చిన్న పట్టణానికి ట్యాక్సీలో చివరకు ఓ స్కూల్ బస్సులో పుర్కల్ గ్రామానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి సంస్థ వల్ల గ్రామ మహిళల్లో వచ్చిన మార్పు.. లెర్నింగ్ సెంటర్లోని చిన్నారుల చిరునవ్వులు.. సప్తవర్ణ శోభితమైన ఉత్పత్తులను చూస్తుంటే కొన్ని ప్రయాణాలకు పరమార్థం ఉంటుందనిపిస్తుంది అంటారు చిన్ని. సంతృప్తితో కూడిన చిరునవ్వుతో...

వెబ్ సైట్:streeshakti.org

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags