సంకలనాలు
Telugu

మీ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తాం..

-చిన్న వ్యాపారాలకు వీడియో ప్రకటనలు-ఆటోమెటింగ్ వీడియో క్రియేషన్ తో సెన్సేషన్-ఐఐటి-హైదరాబాద్ విద్యార్థుల నయా స్టార్టప్

Sri
23rd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దృశ్యం... మాటలకన్నా చాలా పవర్ ఫుల్. అందుకే అంటారు... ఒక దృశ్యం వెయ్యి పదాలతో సమానమని. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చాలా కంపెనీలు విజువల్ అడ్వర్టైజ్ మెంట్లపై ఆధారపడటానికి కారణం అదే. పెద్ద కంపెనీల సంగతి సరే... మరి చిన్నచిన్న వ్యాపారాల సంగతేంటీ? ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న స్టార్టప్ ల పరిస్థితి ఏంటీ? దృశ్యరూపంలో ప్రకటనలు తయారుచేయడమంటే... భారీ బడ్జెట్ కావాలి. ఎంతో సమయం వెచ్చించాలి. ఈ లోటును తీర్చేందుకు అద్భుతమైన ఐడియా కనుగొన్నారు ఐఐటి-హైదరాబాద్ విద్యార్థులు. అదే స్టోరీ ఎక్స్ ప్రెస్. అసలేంటీ స్టోరీ ఎక్స్ ప్రెస్? మీరే చదవండి.


ఆటోమెటింగ్ వీడియో క్రియేషన్

స్టోరీ ఎక్స్ ప్రెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఆటోమెటింగ్ వీడియో క్రియేషన్ అన్నమాట. అంటే... మీ వ్యాపారానికి సంబంధించిన వీడియో ప్రకటన సిద్ధం చేసివ్వడమే స్టోరీ ఎక్స్ ప్రెస్ లక్ష్యం. ఐఐటి-హైదరాబాద్ కు చెందిన విద్యార్థుల బుర్రలో పుట్టిన ఆలోచన ఇది. కస్టమర్ ఎప్పుడైనా విన్నదానికంటే... చూసినదాన్నే ఎక్కువగా నమ్ముతాడు. బడాబడా వ్యాపార సంస్థలకు ఈ సూత్రం బాగా తెలుసు. ఆన్ లైన్ కొనుగోళ్లలో కస్టమర్లు త్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేవి ఈ వీడియోలేనని ఓ రీసెర్చ్ లో తెలిసింది. ప్రొడక్ట్ వీడియోలు చూసిన తర్వాతే 52 శాతం మంది కస్టమర్లు కొనుగోళ్లు చేస్తారట. ఇదీ విజువల్ యాడ్ కి ఉన్న పవర్. వీడియోలు పొందుపర్చడం వల్ల వెబ్ సైట్ కి ట్రాఫిక్ పెరగడమే కాదు... వినియోగదారులతో ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఈ ఐడియా అంతా బాగానే ఉంది కానీ... ఇలా విజువల్ యాడ్ తయారు చేయడమంటే అంత సులువు కాదు. ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ సేవలు ఉపయోగించుకోవాలి. ఇందుకు చాలా ఖర్చవుతుంది. అందుకే చిన్నచిన్న వ్యాపారులు విజువల్ యాడ్ గురించి పట్టించుకోరు. ఆ లోటు భర్తీ చేసేందుకే స్టోరీ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించారు ఈ విద్యార్థులు.

నాలుగు క్లిక్కులతో వీడియో రెడీ

స్టోరీ ఎక్స్ ప్రెస్ లో వీడియో యాడ్ తయారు చేయడం చాలా సులువు. మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, ఇంకొంత సమాచారాన్ని అప్ లోడ్ చేయడం, టెంప్లేట్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు... వీడియో రూపంలో ఓ ప్రకటన రెడీ అవుతుంది. వీడియో ఎలా ఉండాలో, స్టోరీ ఎలా రాయాలో, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఎలా ఉంటే బాగుంటుందో... అన్నీ స్టోరీ ఎక్స్ ప్రెస్ చూసుకుంటుంది. అలా సిస్టమ్ ని తీర్చిదిద్దారు ఈ కుర్రాళ్లు. పదుల సంఖ్యలో వీడియోలు కావాల్సిన క్లైంట్లే వీరి టార్గెట్. క్యాంపస్ లో పుట్టిన ఐడియానే ఇప్పుడు స్టార్టప్ స్థాయికి చేరుకుంది. 2013లో ఆరో సెమిస్టర్ చదువుతున్న సమయంలో అంకిత్ ప్రొఫెసర్లలో ఒకరైన డాక్టర్ సుమోహన మల్టీమీడియా కమ్యూనికేషన్ కోర్స్ ఆఫర్ చేశారు. మల్టీమీడియా, ఇమేజెస్, వీడియోల లాంటి అంశాలతో ఈ కోర్సును రూపొందించారు. కోర్సులో భాగంగా వీటిపైన ఓ ప్రాజెక్ట్ చేయమని విద్యార్థులను అడిగారు ప్రొఫెసర్. ఈ ప్రాజెక్ట్ పై తన స్నేహితుడు ముదిత్ తన్వనితో అంకిత్ మిశ్రా చర్చించాడు. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. వెంటనే రంగంలోకి దిగారు. వీరి జూనియర్లైన సన్యం కపూర్, చిన్మయ్ జిందాల్ ఈ టీమ్ లో చేరారు. అంతా కలిసి స్టార్టప్ వీకెండ్ యూనివర్సిటీలో భాగస్వాములయ్యారు. తమ ఐడియాకు వర్కవుట్ చేయడానికి, ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి, ఓ నమూనా రూపొందించడానికి స్టార్టప్ వీకెండ్ చాలా ఉపయోగపడింది. తమ ఐడియాకు మెరుగులు దిద్దడం మొదలు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత రిజుల్ ఈ టీమ్ లో చేరాడు.

image


బిజినెస్ @ కాలేజీ క్యాంపస్

స్టోరీ ఎక్స్ ప్రెస్ టీమ్ ఐదుగురికి చేరింది. అందరూ ఐఐటి-హైదరాబాద్ విద్యార్థులే. వీరిలో ముదిత్, సన్యం, చిన్మయ్- కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు. రిజుల్, అంకిత్ -ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. బిజినెస్ డెవలప్ మెంట్, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకోవడం అంకిత్ పని. డిజైన్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఆపరేషన్స్ ముదిత్ చూస్తున్నాడు. రిజుల్, సన్యం, చిన్మయ్ క్రియేటీవ్ బ్రెయిన్స్ అనే చెప్పాలి. వీడియోలు సులువుగా తయారుచేసేందుకు ఉపయోగపడేలా డిజైన్లను కోడ్స్‌ రూపంలోకి మార్చడంలో తమ టాలెంట్ చూపించారు. తమ స్టార్టప్ ని మార్కెట్ కి పరిచయం చేయడానికి ముందు ఇండస్ట్రీలో రీసెర్చ్ చేశారు. కస్టమర్ల అవసరాలను, అనుభవాలను తెలుసుకున్నారు. లోటుపాట్లను గుర్తించారు. వాళ్లకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. భారతీయ పారిశ్రామికవేత్తలకు, చిన్నచిన్న వ్యాపారులు చేసుకునేవారికి వీడియో ప్రభావం తెలియదు. అందుకే వీడియో మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి టూల్స్ అస్సలు ఉపయోగించుకోవట్లేదని గుర్తించారు. కొందరు వ్యాపారులను ఇంటర్వ్యూ చేస్తే ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లను ఉపయోగించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. సొంతగా తీయాలనుకున్నా చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. అందుకే వీడియో యాడ్ లను అంత సీరియస్ గా తీసుకోలేదని చాలామంది వ్యాపారులు చెప్పారు. మార్కెట్ లో ఉన్న లోటు పాట్లేంటో అప్పుడు తెలిసింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగానే స్టోరీ ఎక్స్ ప్రెస్ ని తీర్చిదిద్దారు.


స్టోరీ ఎక్స్ ప్రెస్ చిన్నచిన్న వ్యాపారుల అవసరాలను సమర్థవంతంగా తీరుస్తోంది. స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలన్నదానిపై ఈ టీమ్ సృజనాత్మకంగా పనిచేస్తోంది. కస్టమర్లకు పర్సనలైజ్డ్ డైనమిక్ టెంప్లేట్ ని రూపొందిస్తున్నారు.

"యానిమోటో, స్ట్యూప్ ఫ్లిక్స్ మా కాంపిటీటర్స్. కానీ వాళ్లకు మాకు చాలా తేడాలున్నాయి. మేము తీర్చిదిద్దిన సిస్టమ్ కస్టమర్లకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తోంది. మా దగ్గర యూనిక్ కాన్సెప్ట్ స్టోరీ బోర్డింగ్ ఉంటుంది. ప్లెయిన్ వెనిల్లా యానిమేషన్స్ సీక్వెన్స్ తో మరింత ఎఫెక్టీవ్ గా వీడియో తయారుచేస్తాం. ఏ రెండు వీడియోలు ఒకలా ఉండవు. ఇన్ పుట్ ఇమేజెస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఆధారంగా యానిమేషన్స్ సెలెక్ట్ చేసేలా సిస్టమ్ ని డెవలప్ చేశాం" అంటారు అంకిత్.

ఇలాంటి ఐడియాలపై కాలేజీ రోజుల్లోనే వర్కవుట్ చేయడం మంచిది. ఎందుకంటే... స్నేహితులు ఉంటారు. వారి సహాయ సహకారాలుంటాయి. ఎవరూ జీతం అడగరు. మనకు మనం జీతం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాలేజ్ హాస్టలే ఆఫీసు. ఎలాగూ ఫ్రీ వైఫై ఉంటుంది. కావాల్సినంత సమయం ఉంటుంది. అప్పుడే లాభాలు పొందాలన్న ఒత్తిడి ఉండదు. ఇవన్నీ కొత్త ఐడియాను అమల్లోకి తీసుకొచ్చేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కుర్రాళ్లకు కూడా అదే ప్లస్ అయింది. "మైక్రోసాఫ్ట్ బిజ్ స్పార్క్ లాంటి ప్రోగ్రామ్స్ కి మేం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవి మాకెంతో ఉపయోగపడ్డాయి. అందుకే మేం ఎంఎస్ బిజ్ స్పార్క్ నే ఫాలో అవమని యువ పారిశ్రామికవేత్తలకు చెబుతాం" అంటారు అంకిత్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags