సంకలనాలు
Telugu

యువర్ అటెన్షన్ ప్లీజ్... రిటైల్ ట్రయిన్ (TRRAIN) వచ్చింది ..

-రిటైల్ వ్యాపారంలో అనుభవమే గొప్ప పెట్టుబడి-క్షేత్ర స్థాయి నుంచి ఇష్టపడి పనిచేస్తేనే రిటైల్ పరిజ్ఞానం -2020 నాటికి రిటైల్ రంగంలో వ్యాపార, ఉద్యోగావకాశాలు రెట్టింపు -ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మార్గనిర్దేశం చేస్తున్న TRRAIN సీఈవో

21st Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

20 ఏళ్లకు ముందు అమీషా ప్రభు రిటైల్ రంగంలో ఉద్యోగాన్ని ప్రారంభించారు. టెస్కో హిందుస్తాన్ హోల్ సేలింగ్, ఆదిత్యా బిర్లా రిటైల్, క్రాస్ వర్డ్ బుక్ స్టోర్స్, స్వచ్చ్ గ్రూప్, షాపర్స్ స్టాప్ లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశారామె. తన వృత్తి జీవితంలో.. టెస్కో నుంచి ఉద్యోగాన్ని వదిలి... ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ & రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా (TRRAIN) కంపెనీ కి నాయకత్వం వహించారు. ఈ కంపెనీ ద్వారా ఎంతోమందికి రిటైల్ రంగంలో సాధికారత కల్పించే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అమీషా. తన నైపుణ్యంతో , అనుభవంతో రైటలింగ్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పడు రిటైల్ రంగాన్ని వృత్తి గా తీసుకోవాలనుకునే వాళ్లకు అమీషా స్ఫూర్తినిస్తున్నారు. అయితే ఆమె ఈ స్థాయికి ఎదగడానికి ఎలాంటి ప్రయాణం చేశారు...? ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....

( ఫోటోలో..... అమీషా  ప్రభు, సీఈవో, ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ & రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా (TRRAIN)  )

( ఫోటోలో..... అమీషా ప్రభు, సీఈవో, ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ & రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా (TRRAIN) )


అమీషా గుజరాతీ కుటుంబంలో పుట్టారు. ముంబైలో పెరిగారు. అర్థశాస్త్రంలో ముంబై యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఆ తర్వాత నార్సీ మోన్జీ లో మార్కెటింగ్ చదువును పూర్తి చేశారు. పాశ్చాత్య నవలలు చదవడం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చిన్నప్పుడు నాన్సీ డ్రూ(Nancy Drew) లాంటి నవలల్ని చదవడం ద్వారా స్వతంత్ర భావాలతో బతకడమెలాలో నేర్చుకున్నారు. “ నేనెప్పుడూ స్వతంత్రంగా వుంటాను. విదేశాల్లోని యువతీ యువకులు , విద్యార్థులు తమ చదువులకు , జేబు ఖర్చులకు కావాల్సిన డబ్బుల్ని తామే సేల్స్ మెన్స్ , వెయిటర్ లాంటి చిన్నాచితకా పార్ట్ టైమ్ పనులు చేసుకుంటూ స్వతంత్రంగా సంపాదించుకుంటారు. నాన్సీ డ్రూ లాంటి నవలల ద్వారా నాకూ ముందు నుంచి అలా బతకాలనే ఆలోచనలు వచ్చాయి.” నార్సీ మోన్జీ లో చివరి ఏడాది పరీక్షలు జరుగుతున్న సమయంలో అమీషాకు చిన్న ప్రకటనలో పనిచేసే అవకాశమొచ్చింది. ఆధునిక రిటైల్ రంగానికి అప్పుడే బీజాలు పడుతున్నాయి. ఒక థియేటర్ చూస్తుండగానే షాపింగ్ మాల్ గా మారిపోయింది. షాపర్స్ స్టాప్ లాంటి గొలుసుకట్టు రిటైల్ స్టోర్లు కొత్తగా వెలిశాయి. “ నేను వెంటనే అందులో పనిచేసేందుకు ఉద్యోగాన్ని కోరాను. స్వతంత్రంగా డబ్బు సంపాదించి బతకడమనే ఉద్విగ్నభరిత క్షణాలు కల నుంచి నిజంగా మారాయి” అంటూ తన వృత్తి జీవిత ప్రారంభాన్ని చెప్పారామె.

ఫోటోలో.. బీ.ఎస్. నగేష్, TRRAIN వ్యవస్థాపకుడు

ఫోటోలో.. బీ.ఎస్. నగేష్, TRRAIN వ్యవస్థాపకుడు


“ బి.ఎస్. నగేష్ భారతదేశ రిటైల్ రంగానికి గాడ్ ఫాదర్ లాంటివారని చెప్పొచ్చు. ఆయనే షాపర్స్ స్టాప్ లో నన్ను ఇంటర్వ్యూ చేశారు. మరుసటి రోజు నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో పనిచేయమని అన్నాడు. 11వందల రూపాయల జీతంతో నా వృత్తి ఉద్యోగ జీవితం రిటైల్ రంగంలో ప్రారంభమైంది. “ అని తన గత జీవిత అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు అమీషా. అంకితభావంతో పనిచేయడంతో చాలా తొందరగానే ఉద్యోగంలో ఉన్నత స్థాయిలను అందుకుంటూ ఒక్కోమెట్టు పైకెదిగారు. షాపర్స్ స్టాప్ లో ఆమె చాలా శాఖల్లో పనిచేశారు. “ నాకు గుర్తుంది. అప్పట్లో బిబా(Biba) అనే బ్రాండ్ వుండేది. చాలామందికి ఆ బ్రాండ్ ఉందన్న సంగతే తెలీదు. కానీ.. ఇప్పుడది 12 వందల కోట్ల టర్నోవర్ గల సంస్థ. బిబా బ్రాండ్ ను కొన్న తొలి వినియోగదారుల్లో నేనూ ఉన్నాను “

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags