సంకలనాలు
Telugu

అలాంటి ఇబ్బంది ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతోనే లైఫ్ సర్కిల్ స్టార్టప్

12th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటి దగ్గర కొన్నాళ్లు నర్సింగ్ సేవలు అవసరం ఉంటుంది. అయితే వయసులో పెద్దవారికైతే ఈ సేవల అవసరం మరీ ఎక్కువ. అయితే దీనికోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగని ఇలాంటి సేవలు ఇంట్లోవారు చేయలేరు. ట్రయినింగ్ ఉంటే ఫర్వాలేదు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలాంటి పనులు చేయడానికి అంతగా టూం సరిపోదు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది లైఫ్ సర్కిల్ అనే హైదరాబాదీ స్టార్టప్.

ఇది మొదలు

దీని ఫౌండర్ అనంత్. అతని రియల్ లైఫ్ లో జరిగిన ఓ సంఘటన నుంచి ఈ ఆలోచన మొలకెత్తింది. హెల్త్ కేర్ ఇండస్ట్రీకి చెందిన అనంత్ వాళ్ల అమ్మకు సుస్తీ చేసినప్పుడు నర్స్ ని ఇంటి దగ్గరకే రప్పించాలని చూశారు. కానీ కుదరలేదు. అలాంటి ఇబ్బంది ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతోనే లైఫ్ సర్కిల్ అనే కేర్ గివింగ్ సర్వీస్ మొదలుపెట్టారు. 

“నేను హైదరాబాద్ లో ఉంటా, అమ్మా వాళ్లు ఢిల్లీలో ఉంటారు. సెలవు పెట్టి అమ్మకు ట్రీట్మెంట్ చేయించి నేను ఇక్కడకు తిరిగి వచ్చేశా. కానీ అమ్మను దగ్గరుండి చూసుకోడానికి ఓ మనిషి దొరకలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది.” అనంత్
image


అప్పటికే పదిపదిహేనేళ్ల పాటు హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ పై అనుభవం ఉన్న తనకే ఓ నర్సింగ్ సర్వీసు అందించడం కష్టమైంది. మరి సాధారణ వాళ్ల పరిస్థితి ఏంటని అప్పుడు ప్రశ్నించుకున్నారు. అలా మొదలైన ఆలోచన ఇప్పుడు ఓ మిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగింది.

లైఫ్ సర్కిల్ పనితీరు

లైఫ్ సర్కిల్ ఇప్పటి వరకూ 1500 గంటల సర్వీసు చేశారు. వందల మందికి ఈ సర్వీస్ అందించారు. 2013 అక్టోబర్ లో దీనికి అంకురార్పణ జరిగింది. 2014 మొదట్లో ఇది పూర్తి స్టార్టప్ గా మారింది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మాత్రమే సర్వీసు అందుబాటులో ఉంది. వీరి సర్వీసును గుర్తించి రెండు సార్లు యూరప్, అమెరికా కు చెందిన సంస్థ వీళ్లకు రెండు సార్లు ప్రెయిజ్ మనీ అందించింది. ఈ రకంగా దాదాపు 13వేల డాలర్లు జమ చేసుకోగలిగింది కేర్ గివింగ్ స్టార్టప్.

అయితే ఇలాంటి సర్వీసులు మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అవి వ్యవస్థీకరించి లేవు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ మార్కెట్ ను పూర్తిస్థాయి ప్రొఫెషనల్ సొల్యూషన్ తో జనం ముందుకు తీసుకొచ్చామని అనంత్ చెప్పుకొచ్చారు. ఆండ్రాయిడ్ యాప్ లో ఈ సర్వీసు ఉంది. ఐఓఎస్ ను కూడా ప్రారంభించబోతున్నామని అన్నారాయన.

లైఫ్ సర్కిల్ టీం

ఇక టీం విషయానికొస్తే అనంత్ కుమార్ దీని వ్యవస్థాపకులు. హాస్పిటల్ మేనేజ్మెంట్ లో సింబియాసిస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన అనంత్- ఎన్వీఎస్ సింగపూర్ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ పొందారు. బై ప్రొఫెషన్ డాక్టర్ కాకపోయినా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అపార అనుభవం ఉంది. హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇతర కేర్ మేనేజ్మెంట్ లో చాలా ఏళ్లు పనిచేశారు. ప్రియా అనంత్ దీనికి మరో కో ఫౌండర్. రూరల్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన ఆమె-1997 నుంచి 2009 వరకూ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఇదే రంగంలో పనిచేశారు. అనంతరం 2013 ఏడాది చివరి దాకా హెల్త్ ఇండస్ట్రీలో మంచి అనుభవం గడించారు. స్వీడర్, చైనా తో పాటు వివిధ దేశాల్లో హెల్త్ కేర్ ఇంస్ట్రీలో వివిధ డాక్యుమెంటరీ మేకింగ్ లో పనిచేశారు. చివరగా చెప్పుకోదగిన వ్యక్తి అతుల్. ఈయన కూడా సంస్థకు కో ఫౌండర్. ప్రొఫెషనల్ లాయర్ అయిన అతుల్- సంస్థకు కావల్సిన లీగల్ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. దీంతో పాటు 75 మంది ట్రెయిన్డ్ స్టాఫ్ పనిచేస్తున్నారు.

image


లైఫ్ సర్కిల్ ప్రధాన సవాళ్లు

1.ఇలాంటి సేవలు ప్రొఫెషనల్ గా ప్రొవైడ్ చేయడం అనేది మన దేశంలో కొత్త. ఈ కల్చర్ ని ఎడాప్ట్ చేసుకునే స్థితిలో పాత తరం వాళ్లు సిద్ధంగా లేరు. తమకు అవసరం ఎక్కువగా వయసు పైబడిన వారితోనే. ఈ సవాలు అధిగమించాల్సి ఉందని ప్రియా అంటున్నారు.

2. ఈ సర్వీస్ అందించడానికి ప్రొఫెషనల్ నర్స్ వినియోగించలేం. ఎందుకంటే అన్ని సేవలూ నర్సింగ్ సేవలు కావు. దీంతో కేర్ గివర్ అనే ఓ క్యాటగిరీని తామే క్రియేట్ చేశామంటున్నారు. అయితే ఈ ప్రొఫెషన్ ని తీసుకోడానికి కూడా జనం సిద్ధంగా లేరు. రిక్రూట్మెంట్ కూడా ఓ సమస్య అంటున్నారామె.

image


ఫండింగ్

ఇప్పటి వరకూ రెండుసార్లు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ హెల్త్ మార్కెట్ ఇన్నోవేషన్స్ అనే ఆర్గనైజేషన్ 8 వేలు తర్వాత 5 వేలు కలపి 13వేల డాలర్ల ప్రైజ్ మనీ అందించింది. ఇటీవల ప్రీ సిరీస్ ఏ రౌండ్ లో ఫండ్ రెయిజ్ చేశారు. దాన్ని సంస్థ ఎక్స్ పాన్షన్ కోసం వినియోగిస్తున్నట్లు అనంత్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ నుంచి మెంటారింగ్ , నెట్ వర్కింగ్ సేవలను పొందుతున్నారు. వచ్చే ఆరు నెల్లో సిరీస్ ఏ ఫండింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రియా చెప్పుకొచ్చారు.

భవిష్యత్ ప్రణాళికలు

ఈ ఏడాది చివరి కల్లా ఢిల్లీలో పూర్తిస్థాయి ఆపరేషన్స్ ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 2020 నాటికి అంటే వచ్చే మూడున్నరేళ్లలో దేశంలో ఉన్న 20 ప్రధాన నగరాల్లో సేవలను ప్రారంభిస్తామని అనంత్ అంటన్నారు. అప్పటి వరకు 10 లక్షల మంది పేషెంట్లకు సేవలను అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

“స్టార్టప్ తో ఓ సమస్యకు పరిష్కారం చేయడమే కాదు.. వయస్సులు పెద్దవాళ్లకు సేవలను అందించే భాగ్యం కలిగింది. ఇంతకంటే సమాజానికి, దేశానికి చేయగలిగిందేముంటందని ముగించారు అనంత్”
image

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags