సంకలనాలు
Telugu

ఇంపాక్ట్ చాప్టర్ పేరుతో హైదరాబాదులో మరో యాక్సిలరేటర్ స్టార్టప్

ashok patnaik
10th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


టై మాసప్, స్పార్క్10 ల కోవలోనే మరో ఫండింగ్ యాక్సిలరేట్ స్టార్టప్ హైదరాబాద్ లో ప్రవేశించింది. వివిధ దేశాలకు చెందిన యంగ్ టీం దీనికోసం పనిచేస్తోంది. దాదాపు 100 మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. వీరి మొదటి ఆప్షన్ మన భాగ్యనగరమే కావడం విశేషం.

రెండు రోజుల పాటు ఇంపాక్ట్ సదస్సు

ఈనెల 13,14 తేదీల్లో ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. హెచ్ఐసిసి ఈ సదస్సుకు వేదిక కానుంది. అంతర్జాతీయంగా 400లకు పైగా స్టార్టప్ లు, 50కి పైగా ఇన్వెస్టర్లు, మరికొంతమంది మెంటార్లు ఇందులో పాల్గొంటారు. టీ హబ్,నాస్కామ్ 10కె, హైసియా, గాళ్స్ ఇన్ టెక్, టెన్ ఇన్ ఏసియా, ఇండియన్ ఏంజిల్ నెట్ వర్క్, యువర్ స్టోరీ, తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. 

image


స్టార్టప్ లకు ఉండే చాలెంజీల్లో ఫండింగ్ ఒకటని.. దానికి పరిష్కారం చూపిస్తామని ఫౌండర్, సీఈవో అభిలాష్ అంటున్నారు. బిజినెస్ ప్లాన్లను కూడా ఫైనల్ చేస్తామంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్న స్టార్టప్ లీడర్స్ ఈ సదస్సులో మాట్లాడతారని అన్నారాయన. స్టార్టప్ ఇన్వెస్ట్ మెంట్ ఇందులో ప్రధానాంశం అని చెబుతున్నారు. బ్రాండ్ హైదరాబాద్ కు ఇది మరింత యాడ్ చేస్తుందన్నారు.

ఫండింగ్ లో ప్రియారిటీ స్టార్టప్స్ ఇవే..

టెక్ స్టార్టప్ లే మొదటి ప్రియారిటీ అని ఇంపాక్ట్ అంటోంది. టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, టెక్నాజీ తో సొల్యూషన్ చూపించే స్టార్టప్ లకు ఫండింగ్ కు ఎక్కువ అవకాశాలున్నాయని మరో కో ఫౌండర్ సందీప్ అన్నారు. దాంతో పాటు సామాజిక సమస్యలపై పరిష్కారం చూపించే వారికి ఫండింగ్ అందించడంలో ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. దీంతో పాటు భారత్ లో స్మార్ట్ సిటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. దీనికి సొల్యూషన్ తో వచ్చే స్టార్టప్ లకు ఫండింగ్ ఇవ్వడానికి తమ దగ్గర ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని సందీప్ అంటున్నారు. దాదాపు 80కి పైగా దేశాలనుంచి ఇన్వెస్టర్లతో తాము సమావేశం అయ్యామని, అక్కడి వారు భారత్ లో ఫండింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.

1000 కోట్ల ఫండ్స్

ముందుగా వంద కోట్ల ఫండ్స్ ను అందిస్తామని.. దీన్ని వేయి కోట్ల దాకా పెంచుకోడానికి అవకాశం ఉందని వీర చెప్పారు. 800 స్టార్టప్ లు తమ సదస్సులో ఫండింగ్ కోసం అప్లై చేశారని వీర అన్నారు. యాభై మంది ఇన్వెస్టర్లు యాక్సిలరేటర్ కు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి.. స్టార్టప్ ల పొటెన్షియల్ బట్టి సెలక్షన్ ఉంటుందన్నారు.

ఇంపాక్ట్ టీం

టీంలో ప్రధానంగా 8మంది సభ్యులున్నారు. చాలామంది ఫ్రీ లాన్సర్స్ ఉన్నారు. ఆరుగులు కో ఫౌండర్లున్నారు. అభిలాష్ దీని ఫౌండర్ కమ్ సీఈఓ. సందీప్, గౌరవ్, నిశ్చల్, బెర్నిస్, జూలియాని, చైతన్య, నికా- కో ఫౌండర్లు. వీళ్లంతా బెర్లిన్ లో మాస్టర్స్ చేశారు. అక్కడ స్టార్టప్ ఈవెంట్లలో కలసి, అభిప్రాయాలు షేర్ చేసుకుని, ఒక అవగాహనకు వచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అందరికీ ఒకటి రెండేళ్ల పాటు స్టార్టప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. సరికొత్త ఐడియాలజీతో ఉత్సాహంగా ఉన్న టీం భవిష్యత్ లో వండర్స్ క్రియేట్ చేయాలని చూస్తోంది.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఈ సంస్థకు డైరెక్టర్, ఎడ్వైజర్లుగా స్టార్టప్ లో పేరున్న వ్యక్తులున్నారు. వీరంతా గ్లోబల్ గా రెప్యుటేషన్ ఉన్న వ్యక్తులే. ఇలా చూస్తే ఈ సంస్థ గ్లోబల్ స్థాయిలో టాప్ 5లో ఉందని సభ్యలు అంటున్నారు. వేయి కోట్ల ఫండింగ్ ప్రస్తుతం టార్గెట్ గా పెట్టుకున్నారు. భవిష్యత్ లో మరిన్ని ఫండ్స్ తెప్పించడమే లక్ష్యం అంటున్నారు. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags