సంకలనాలు
Telugu

చెత్త సమస్యనే పరిష్కారంగా మార్చిన పూనమ్ బిర్ కస్తూరి

ప్రతీ ఇంటి నుంచి కుప్పలు తెప్పలుగా చెత్త పండుగలు, వేడుకల్లో విపరీతంగా పోగవుతున్న వైనంసమస్యను పెంచి పోషిస్తున్న ఫుడ్ బిజినెస్‌లుప్రకృతికి మేలు చేసేలా చెత్తను మారుస్తున్న డైలీడంప్

9th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బుర్ర ఉన్నవాడు మట్టి నుంచి కూడా నూనె పిండుతాడని... చిన్నప్పుడు చదువుకునేవారం. ఎవరైనా తెలివిగల వాళ్ల గురించి చెప్పేటప్పుడు ఈ మాట వాడేవారు. ఇది అక్షరాలా నిజం. ఇంట్లో వాడే చెత్త ఉపయోగించి... సంపాదిచచ్చు అని ఎవరైనా చెబితే నమ్మలేం కానీ... ఈ స్టోరీ చదివాక నిజమే అని తప్పకుండా అనిపిస్తుంది.

image


కాసుల సంపాదించడం కళ అని ఎవరన్నారో కానీ.. వాళ్లకో దండేసి దండం పెట్టాల్సిందే. లేకపోతే.. చెత్త నుంచి చిల్లర డబ్బులు పోగేయడమేంటి చెప్పండి. ఈ స్టోరీ అదే.

వాళ్లందరూ ఆమెను కంపోస్ట్‌వాలీ అంటారు. ఆ బిరుదు పూనమ్‌కు ఖచ్చితంగా సరిపోతుంది. ఆమె ప్రతీ రోజూ నిర్వహించే చెత్త కనీస బరువు ఎంతో తెలుసా... 12వేల 622 కిలోలు. ఏంటీ నమ్మడం లేదా... రోజువారీగా మనం వాడిపాడేసే చెత్తలో కొంత ఇదంతా. డిజైన్‌లో ఆవిష్కరణ, తన ప్రతిభ ఉపయోగించి... చెత్త సమస్యకు పూనమ్ బిర్ కస్తూరి ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. కంపోస్ట్ చేయడాన్ని మన దేశంలోనే కాదు... చిలీలోనూ వేలాది మందికి అలవాటు చేశారు.

అనుకుంటే చేయాల్సిందే

“ఏదైనా చేయాలి అనుకుంటే చేసేయాలంతే... చేద్దామా, వద్దా అని ఆలోచించకూడదు” అంటున్నారు పూనమ్. 2025నాటికి ప్రపంచం మొత్తం నుంచి ప్రతీ రోజు తయారయ్యే చెత్త ఎంతుంటుందో తెలుసా. అక్షరాలా 60 లక్షల టన్నులు. ఈ చెత్తతో నిండిన ట్రక్కులను వరుసగా నించోబెడితే... 5వేల కిలోమీటర్ల పొడుగుంటుంది ఈ క్యూ. ఇది ఇప్పటికి పరిశోధకుల అంచనా మాత్రమే. వాస్తవంలో ఇంకా పెరిగినా ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు.

“ఇంట్లో చెత్త ఉంటే... దాన్ని బయటకు విసిరేయడం చాలా తేలిక. కానీ దాన్ని ఏ మాత్రం వాసన రాకుండా... సారవంతమైన కంపోస్ట్ ఎరువుగా మార్చచ్చని తెలుసా ? అది కూడా పెద్దగా కష్టపడకుండానే”

దీన్ని సుసాధ్యం చేశారు పూనమ. హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ఎనిమిదేళ్ల క్రితమే ఆచరణలో పెట్టారామె. ఇంట్లో రోజువారీ చెత్తను 80శాతం తగ్గించుకోవచ్చంటున్నారు. 'డైలీ డంప్'... ఇదీ పూనమ్ ప్రారంభించిన స్టార్టప్ పేరు. ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారు చేసుకునే పద్ధతిని తెలియచేస్తుంది ఈ కంపెనీ. ఇంట్లోనో, ఓ కమ్యూనిటీగానో ఏర్పడో... చెత్తను కంపోస్ట్‌గా మార్చేందుకు సహకరిస్తుంది. అది కూడా పూర్తి ఆరోగ్యమైన వాతావరణంలో, దుర్వాసన రాకుండాను అంటే ఆశ్చర్యం వేస్తుంది ఎవరికైనా.

image


ఈ పద్దతిని ఓపెన్ ప్లాట్‌ఫాంగా వదిలేయడంతో... ఇప్పటికే మనదేశంలో 12పైగా ఇలాంటి ప్రాజెక్టులు ఉండగా... విదేశాల్లోనూ మరో రెండు ఉన్నాయి. అవసరమైన సాంకేతిక సహాయాన్ని డైలీ డంప్ అందిస్తుండడం విశేషం. తమ సంస్థకు నకిలీలు, కాపీలు రావడాన్ని పూనమ్ ప్రోత్సహిస్తున్నారు కూడా. “ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదొక్కటే పరిష్కారం. బేకరీస్, తినుబండారాలు అమ్మే ప్రాంతాలు, ధోబీలు, టైలర్లు... ఇలా చెత్త ఎక్కడ మొదలవుతుందో... అక్కడే కంపోస్ట్ చేసేలా ఈ విధానం వ్యాప్తి చెందాలి” అంటున్నారు పూనమ్.

ఎవరి కోసం ఈ చెత్త కంపోస్టింగ్ ?

ఇంట్లో వండిన వంట పదార్ధాలతో సహా.. ఏ సహజమైన పదార్ధాన్నైనా కంపోస్ట్ చేయవచ్చు. పర్యావరణానికి ఇది ఎంత అవసరమో దాదాపు అందరికీ తెలుసు. కానీ... ఇంట్లో, మన ప్రాంతంలో కంపోస్ట్ చేయాలనే ఆలోచనను అంతగా జీర్ణించుకోలేం, అంగీకరించం కూడా.

ఇది టైం సరిపోక కావచ్చు, ప్లేస్ లేక కావచ్చు, అలాగే దుర్వాసన భరించలేం అని ఆలోచనతో అయినా కావచ్చు. ఒకవేళ... ఇది సులభంగా అతి తక్కువ సమయంలో చేసే విధానం ఉంటే... కొందరైనా దీనికి మొగ్గు చూపుతారని అలోచించారు పూనమ్. ప్రధానంగా నగరాల్లో పెరిగిపోతున్న ఈ సమస్య పరిష్కారానికి కొంతమందైనా మొగ్గు చూపుతారనే ఆలోచనతోనే... దీన్ని ప్రారంభించానంటారామె.

ఎక్కడైనా... ఎప్పుడైనా..

చిన్న అపార్ట్‌మెంట్లో ఉన్నా... రూఫ్‌టాప్ హౌస్‌లో ఉన్నా సరే... దీన్ని స్వయంగా ఏర్పాటు చేసుకునేంత సులువుగా దీన్ని రూపొందించారు. ఒకసారి సెట్ చేసుకున్నాక.. సేంద్రీయ వ్యర్ధాలను వేరు చేసుకునేందుకు పట్టే సమయం కేవలం రోజుకు 5నిమిషాలే. చెత్తను ఇలా వర్గీకరించడం పూర్తయ్యాక... దాన్ని ఆయా బాక్సుల్లో వేసి.. రీమిక్స్ పౌడర్ చల్లడమే (ఇది డైలీడంప్ స్టోర్ ద్వారా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో కొనుగోలు చేయచ్చు). ఇంట్లోనే దీన్ని నిర్వహించడం కూడా తేలిక. ఒకవేళ దీనికి కూడా టైం లేదని భావిస్తే... డైలీడంప్ సర్వీస్ ప్లాన్‌కు సైనప్ చేస్తే... వారు పూర్తిగా దీని నిర్వహణ చేపడ్తారు.

పరిశుభ్రంగా చెత్త నిర్వహణ

మీరు చదివినది అక్షరాలా నిజమే. ఈ చెత్త కంపోస్ట్‌గా మారే సమయంలో కనిపించే అనేక క్రిములు ఎలాంటి హాని చేయనివే. నిజానికి పర్యావరణానికి ఇవి మేలు చేసేవి కూడా. మీరు ఎలుకల విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. చెదల నుంచి కూడా రక్షణ లభించేలా.. ఈ ప్రోడక్ట్‌ను రూపొందించారు. “ఏదైనా పార్టీ లాంటి జరిగి.. మాంసాహారం, ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఛీజ్ వంటి మిగిలిపోయిన పదార్ధాలు ఎక్కువగా ఉంటే.. అప్పుడు దాన్ని వీలైనంత లోతుగా ఉండేలా చూసుకుని... ఎక్కువగా రీమిక్స్ పౌడర్ కలిపితే సరిపోతుంద”ని చెప్పారు పూనమ్.

కంపోస్ట్‌ను వినియోగించేందుకు పూలకుండీలు, మొక్కలు, తోట లేకపోతే.. ఆ కంపోస్ట్‌ను వీధుల్లో ఉండే చెట్లకు ఎరువుగా వినియోగించచ్చు. దీనిద్వారా భూమాతకు సేవ చేసినట్లవుతుంది. ప్రకృతికి కీడు చేసే పదార్ధాలను విసిరిపారేయడం కంటే... దాన్ని పర్యావరణ హితంగా మార్చి ఉపయోగించడం మేలైన పని. ఇప్పటికీ మీరు సంతృప్తి చెందకపోతే... ఈ కంపోస్ట్‌ను డైలీడంప్ కొనుగోలు చేస్తుంది కూడా.

పూనమ్ గురించి కొంత తెలుసుకోవాలిగా

TED(టెక్నాలజీ, ఎంటర్‌టెయిన్మెంట్, డిజైన్)కి చెందిన వ్యక్తి పూనమ్. ఆదర్శాల కోసం జీవించడమే ఆమె లక్ష్యం. అయితే.. నేలవిడిచి సాము చేయడం లాంటివి ఆమెకు చేతకాదు. ఇప్పటికీ తన పునాదులను మర్చిపోని వ్యక్తిత్వం ఆమెది. ఇలాంటి జీవితాన్ని తన పేరెంట్స్ ప్రోత్సహించారంటారు ఆమె. అలాగే ఆమె చదువుకున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్... ఆమెకు ప్రపంచాన్ని కొత్త కోణంలోకి చూపే వ్యక్తిగా అభివర్ణించింది ఆమెను. డైలీడంప్ ప్రారంభానికి ముందు... ఓ తయారీ సంస్థ, కళల విభాగం, విద్యారంగంలో పని చేశారు పూనమ్.

1990ల్లో ఇండస్‌ట్రీ క్రాఫ్ట్స్‌ పేరుతో... భారతీయ కళాత్మక వస్తువులు డిజైన్, తయారీ చేసి... రిటైల్, ఎక్స్‌పోర్ట్ విక్రయాలు జరిపే కంపెనీని ప్రారంభించారు. బెంగళూరులో సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ & టెక్నాలజీ వ్యవస్థాపక ఫ్యాకల్టీల్లో పూనమ్ కూడా ఒకరు. ఇలా పలు రంగాల్లో విధులు నిర్వహించడంతో... సమస్యలకు పరిష్కారం ఆలోచించే మనస్తత్వమే కాకుండా... సరైన అవసరాలను గుర్తించే నేర్పు కూడా అలవడింది.

మీరు కూడా మీ ఇంట్లో చెత్తను ఉపయోగపడేలా మార్చాలని అనుకుంటున్నారా ? www.dailydump.orgకు లాగిన్ అవండి లేదా +91 9916426661కు కాల్ చేయండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags