సంకలనాలు
Telugu

ఐఐటి చ‌దివారు.. ట్ర‌క్కులు న‌డుపుతున్నారు !

bharathi paluri
28th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇంకా అసంఘటితంగా , ఆన్‌లైన్‌కి దూరంగా వుండ‌డం చూసాక అంకిత్ , అనురాగ్, నిశాంత్ అనే ముగ్గురు కుర్రాళ్ల‌కు త‌ట్టిన ఆలోచ‌నే ట్ర‌క్ మండీ.

అన్మోల్ ఫీడ్స్ అధిప‌తి, సిఐఐ చైర్మ‌న్ అయిన అమిత్ స‌రోగితో మాట‌ల సంద‌ర్భంలో అంకిత్‌కి రవాణా రంగం ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థ‌మ‌యింది. ద‌ళారీల పెత్త‌నం ఎక్కువైపోయింది. ఇష్ట‌మొచ్చిన‌ట్టు న‌డ‌వ‌డం, టైమ్ కి చేర‌కపోవ‌డం ట్రాన్స్ పోర్ట్ ప‌రిశ్ర‌మ‌లో రివాజుగా మారిపోయాయనే సంగతిని అర్థం చేసుకున్నాడు.

డిన్న‌ర్ డిస్క‌ష‌న్స్

అంకిత్, అనురాగ్, నిశాంత్‌లు ఒకే ఫ్లాట్ లోఉండేవాళ్లు. ట్రాన్స్‌పోర్ట్ ఇండ‌స్ట్రీ గురించి తెలిసాక‌..అది ఇంత అధ్వాన్నంగా వుండ‌డానికి కార‌ణాల‌పై ఈ ముగ్గురూ డిన్న‌ర్ టైమ్ లో చ‌ర్చించుకునే వాళ్లు. టైమ్‌కి వ‌స్తువ‌ుల‌ను చేర‌వేయ‌డం, వాహ‌నాల‌ను స‌మ‌కూర్చ‌డం, ప‌నిగంట‌లు వృధా కాకుండా చూడ్డం, ద‌ళారీల‌ను త‌గ్గించ‌డం... ఇవ‌న్నీ చేయ‌గ‌లిగితే, స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్టే అనుకున్నారు.

ఇవ‌న్నీ చేయాలంటే, క‌స్ట‌మ‌ర్ల‌ను.. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను క‌లిపే ఒక కామ‌న్ ప్లాట్‌ఫామ్ వుండాల‌నుకున్నారు. అదే ‘‘ట్ర‌క్ మండి ’’. రవాణా రంగంలో ప్ర‌స్తుతం వున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిదిద్దుతూ, క‌స్ట‌మ‌ర్ల‌కు, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు మ‌ధ్య ఉన్న అగాధాన్ని త‌గ్గించేందుకే ఈ ట్ర‌క్ మండి.

‘‘టి లాబ్స్ ఇంట్రోపిచ్ సెష‌న్ లో మేం చెప్పిన ఈ ఐడియా వారికి నచ్చ‌డంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయ్యాం. ఆ విధంగా మాకు త‌గిన శిక్ష‌ణ‌, ఎక్స్‌ప‌ర్ట్ ల గైడెన్స్, ప‌ని చేసుకోవ‌డానికి ఒక ఆఫీస్ అందుబాటులోకి వ‌చ్చాయి’’ అని చెప్పారు అంకిత్. 
ట్రక్ మండీ టీమ్

ట్రక్ మండీ టీమ్


అలా ఇద్ద‌రితో మొద‌లైన ట్ర‌క్ మండి టీమ్ ఇప్పుడు 20 మందికి చేరింది. ఇందులో ‘‘ గ‌తి’’ కార్గో నేష‌న‌ల్ హెడ్ కూడా ఉన్నారు.

ట్ర‌క్ మండి వెనుక వున్న ముగ్గురూ మూడు నేప‌థ్యాల నుంచి వ‌చ్చిన వాళ్లు. అంకిత్ ఐఐటి- ఖ‌ర‌గ్‌పూర్ గ్రాడ్యుయేట్. ష్లూంబ‌ర్గ‌ర్‌లో ఫీల్డ్ ఇంజ‌నీర్ గా ప‌శ్చిమాసియా, ర‌ష్యాల‌లో ఏడాదిన్న‌ర‌పాటు ప‌నిచేసాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్ళు స్నాప్‌డీల్‌లో ప‌నిచేసి, సొంతంగా 'ఫ్లై మై ఫుడ్' అనే స్టార్ట‌ప్ కూడా పెట్టాడు. ఐఐటి ఢిల్లీలో చ‌దివిన అనురాగ్, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్ సంస్థ‌ల్లో ప్రోడ‌క్ట్, అన‌లిటిక్స్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసాడు. నిశాంత్ టీసీఎస్ లో ప‌నిచేసాడు.

అభివృద్ధి ప‌ధం

ప్ర‌స్తుతం వంద‌కోట్ల ట్రాన్సాక్ష‌న్ ర‌న్ రేట్ వాల్యూతో న‌డుస్తున్న ట్ర‌క్ మండి. 400శాతం వృద్ధి రేటుతో ముందుకు దూసుకుపోతోంది. ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ సంస్థ హిమాచ‌ల్ ప్ర‌దేశ్, పంజాబ్, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌ల‌లో ట్ర‌క్కుల‌ను ఆప‌రేట్ చేస్తోంది. ‘‘ప్రస్తుతం మాకు 500 భాగస్వామ్య కంపెనీలున్నాయి. 300 మంది ట్రాన్స్‌పోర్ట‌ర్లు, ట్ర‌క్ ఓన‌ర్లు పార్ట‌న‌ర్లుగా వున్నారు’’ అని వివ‌రించారు అంకిత్.

విశ్వ‌స‌నీయ‌మైన ట్రాన్స్ పోర్ట‌ర్ల నుంచి అతి త‌క్కువ టైమ్‌లో అత్యుత్త‌మ రేట్ల‌ను అందించ‌గ‌లుగుతున్నారు. వెండ‌ర్ల‌ను బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయ‌డం వ‌ల్ల మంచి రేటు పొంద‌డం వీల‌వుతోంది. మార్కెట్ ప్లేస్ మోడ‌ల్‌లో సాగుతున్న ట్ర‌క్ మండి... ఆస్తుల కొనుగోలుపై ఎక్కువ‌గా ఖర్చు చేయ‌దు. ప్ర‌తి ట్ర‌క్కులోనూ జిపిఎస్ వుంటుంది. దీనివ‌ల్ల ట్రాన్సాక్ష‌న్స్ మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మ‌వుతున్నాయి.

ప్ర‌తి వెండ‌ర్ ద‌గ్గ‌ర నుంచి ట్రాన్సాక్ష‌న్ వాల్యూ పై రెండు శాతం క‌మీష‌న్‌ను ట్ర‌క్ మండి వ‌సూలు చేస్తుంది.

ఈ మ‌ధ్యే ఈ సంస్థ 50 కోట్ల ఒప్పందం ఖ‌రారు చేసుకుంది. ‘‘మేం ప్ర‌ధానంగా బిటుబి సిగ్మెంట్ పై దృష్టి పెట్టాం. వారానికి ప‌ది నుంచి న‌ల‌భై ట్ర‌క్కులు ఎంగేజ్ చేసే చిన్న‌మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, రోజుకు ప‌ది నుంచి యాభై ట్ర‌క్కులను డిప్లాయ్ చెయ్య‌గ‌లిగే ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్ట‌ర్లు మా టార్గెట్.’’ అని చెప్పారు అంకిత్.

2019 నాటికి ఇండియాలో లాజిస్టిక్స్ మార్కెట్ 48వేల కోట్ల రూపాయ‌ల‌కు పెరుగుతుంద‌ని ఒక అంచ‌నా. అర్బ‌నైజేష‌న్ పెర‌గ‌డంతో లాజిస్టిక్స్ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఆన్ లైన్‌లో లాజిస్టిక్స్ మార్కెట్ పోటీ కూడా బాగానే వుంది. ఐఐటి గ్రాడ్యుయేట్సే పెట్టిన దిపోర్ట‌ర్, బ్లోహార్న్, లాజినెక్స్ట్, ఇండియా ఆన్ టైమ్ లాంటి మ‌రి కొన్ని వెబ్ సైట్లు ట్ర‌క్ మండికి పోటీ గా మార్కెట్ లో వున్నాయి.

image


స‌వాళ్ళు

ముందే చెప్పిన‌ట్టు లాజిస్టిక్స్ ప‌రిశ్ర‌మ పూర్తిగా అసంఘ‌టితంగా, ఒక దారి తెన్నూ లేకుండా వుంది. ఇక్క‌డ ఒక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని చూస్తే, ఇంకో నాలుగైదు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ట్రాన్స్‌పోర్ట‌ర్ల‌లో టెక్నాల‌జీకి సంబంధించి అవ‌గాహ‌న తేవ‌డం, త‌క్కువ ధ‌ర‌ల్లో వారి నుంచి మేలైన స‌ర్వీస్ పొంద‌డం, ట్రాన్సాక్ష‌న్స్‌లో పార‌ద‌ర్శ‌క‌త సాధించ‌డం, మంచి డ్రైవ‌ర్ల‌ను నియ‌మించ‌డం.. ఇవ‌న్నీ ట్ర‌క్ మండి ఎదుర్కొన్న స‌వాళ్ళ‌ని చెప్పాలి.

“ప‌రిశ్ర‌మ‌లో పేరుకుపోయిన అవినీతి మ‌రో పెద్ద స‌మ‌స్య‌. అది పెద్ద MNC అయినా, చిన్న కంపెనీ అయినా ప్ర‌తి సంస్థ‌లో లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ లో వున్న వాళ్ళు లంచాల‌కు అల‌వాటు ప‌డ్డారు. ఈ టెక్నాల‌జీతో అవినీతి లేని సిస్ట‌మ్‌ను తీసుకురావొచ్చు అని చెప్పినా అర్థం చేసుకునే ప‌రిస్థితి లేదు. అయితే, ఈ స‌మ‌స్య‌ను కూడా ఒక స‌వాలుగా తీసుకుని ముందుకెళ్తాం” అంటున్నారు.. అంకిత్.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags