సంకలనాలు
Telugu

ఇంటిరుచిని ఆఫీసుల‌కు మోసుకువ‌స్తున్న‌ ట‌మ్మీకార్ట్‌

Karthik Pavan
12th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

స్టార్ట‌ప్స్‌లో ఈ మ‌ధ్య‌కాలంలో బాగా క్లిక్ అవుతున్న కాన్సెప్ట్‌.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ. ముఖ్యంగా హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ఢిల్లీలాంటి సిటీస్‌లో ఐటీ కంపెనీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. క్యాంటీన్ల‌లో తిండికి మొఖం వాచిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. ఇలాంటి సైట్ల‌ను అమితంగా ఆద‌రిస్తున్నారు. స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించాల‌నే ఆలోచ‌న ఒక‌టైతే.. వాళ్లు అందిస్తున్న హోంమేడ్ ఫుడ్ టేస్ట్‌, టైమ్లీ మీల్స్‌.. ఆ కంపెనీల‌ను స‌క్సెస్‌బాట‌లో న‌డిపిస్తున్నాయి. అలాంటి స్టార్ట‌ప్స్‌లో ఒక‌టే.. ట‌మ్మీకార్ట్‌.

అలా మొద‌లైంది..

ఐఐఎం క‌ల‌క‌త్తాలో చ‌దువుకున్నవేణుబాధవ్‌, విశ్వ‌జీత్‌లు గుర్గావ్‌లోని కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న స‌మ‌యంలో.. గంట‌ల త‌ర‌బ‌డి ఆఫీసుల‌కు ప్ర‌యాణించేవారు. ఉద‌యాన్నే వండిన ఫుడ్ తినేటైమ్‌కి అంత ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించేది కాదు. దీంతో..ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఒక స్టార్ట‌ప్ పెట్టాల‌ని అనుకున్నారు. హెల్దీ ఫుడ్‌తో పాటు స్నాక్స్ దొర‌క్క‌పోవ‌డాన్ని గ‌మ‌నించారు. అప్ప‌టికే హైద‌రాబాద్‌లో కొన్ని కంపెనీల‌కు స్నాక్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న శ్రీకాంత్ అనే మిత్రుడితో త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

వేణు, శ్రీకాంత్‌లు ఇద్దరూ హైద‌రాబాద్‌కు చెందిన వాళ్లు కాగా.. విశ్వ‌జిత్ హైద‌రాబాద్‌లో రెండేళ్ల పాటు ప‌నిచేశారు. 2015 ఆగస్ట్‌లో ట‌మ్మీకార్ట్‌ని లాంచ్ చేశారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు లంచ్‌ని ఆఫీసుల‌కు డెలివ‌రీ చేయ‌డం మొద‌లుపెట్టారు. రూ.50 నుంచి ప్యాకేజ్‌లు ఉంటాయి. క‌స్ట‌మ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ ద‌గ్గ‌ర్నుంచి.. ఆరోగ్య‌వంత‌మైన వాతావ‌ర‌ణంలో ఆహారాన్ని త‌యారుచేయ‌డం, వాటిని డెలివ‌రీ చేయ‌డం వ‌ర‌కూ ప్ర‌తీదీ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తారు.

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీ బేస్‌గా ప‌నిచేస్తున్న ట‌మ్మీకార్ట్‌.. అక్క‌డికి ఎనిమిది కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కూ స‌ర్వీసులు అందిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, గ‌చ్చీబౌలీ, కొండాపూర్‌, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ఏరియాల‌పై దృష్టిపెట్టారు. ప్ర‌స్తుతానికి రోజుకు క‌నీసం 450 ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయని అంటోంది ట‌మ్మీకార్ట్ టీమ్‌.

ఈ స్టోరీ కూడా చదవండి

image


ట‌మ్మీకార్ట్ టీమ్‌

ఐఐటీ క‌ల‌క‌త్తా, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌ల‌లో చ‌దువుకున్న వేణు.. అవ‌స‌ర‌మైనని సేక‌రించ‌డంలో నిపుణులు. విశ్వ‌జిత్‌కు ఐఐఎం క‌లక‌త్తాలో చ‌దువుకుని టైమ్స్ గ్రూప్‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ట‌మ్మీకార్ట్ ఆప‌రేష‌న్స్ మొత్తం ఆయ‌నే చూసుకుంటున్నారు. యాక్సెంచ‌ర్‌లో పనిచేసిన శ్రీకాంత్‌.. సేల్స్‌, ఆప‌రేష‌న్ల‌ను చూసుకుంటున్నారు. జేఎన్‌టీయూ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసిన శివ‌, నైరుత్‌, శ్రీహ‌ర్ష వేముల‌ప‌ల్లి ట‌మ్మీకార్ట్‌లో కీల‌క బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

రూ.30ల‌క్ష‌ల పెట్టుబ‌డితో మొద‌లైన ట‌మ్మీకార్ట్‌.. అందులో పెద్ద మొత్తాన్ని హ‌బ్ కిచెన్‌ను స‌మ‌కూర్చుకోవ‌డంలో.. నిపుణులైన చెఫ్‌లు, డెలివ‌రీ బాయ్స్‌ను తీసుకోవ‌డంతో పాటు టెక్నాలజీపైనే ఖ‌ర్చుచేశారు. డిమాండ్‌కు త‌గ్గ‌ట్టుగా డెలివ‌రీ చేయ‌డంతో పాటు.. కార్పొరేట్ల‌తో టైఅప్ అవుతూ వ్యాపారాన్ని విస్త‌రిస్తున్నారు. మొత్త‌మ్మీద ఎనిమిది మంది చెఫ్‌ల‌తో క‌లిపి 45మంది ఎంప్లాయీస్ ఇందులో ప‌నిచేస్తున్నారు.

"ప్ర‌తీ స్ధాయిలోనూ తీసుకువ‌చ్చిన స‌రుకుల‌ను ఎంత‌మేర‌కు వాడుతున్నారో కచ్చితంగా లెక్క‌గ‌ట్టే ఇన్వెంట‌రీ మేనేజ‌ర్ ఉన్నారు. వ‌చ్చిన ఆర్డ‌ర్స్‌ను అన‌లైజ్ చేయ‌డం ద్వారా స్టాక్ మేనేజ్‌మెంట్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తున్నాం. మెనూలో ఉన్న ప్ర‌తీ ఐట‌మ్‌కు ఏ మేర‌కు స‌రుకులు అవ‌స‌ర‌మవుతాయో లెక్క‌గ‌డ‌తాం. దీన్నిబ‌ట్టి ఎంత మొత్తంలో స‌రుకులు అవ‌స‌ర‌మ‌వుతుందో తలుస్తుంది. ఇలా ప్ర‌తీదానికి ఒక స‌ప్ల‌య‌ర్‌ను ఎంచుకుని., వీలైనంత త‌క్కువ ధ‌ర‌కు మంచి క్వాలిటీ ప్రొడ‌క్ట్స్‌ని కొనుకోగ‌లు చేస్తున్నాం" అంటారు విశ్వ‌జిత్‌

ప్ర‌తీ నెలా 50శాతం రెవెన్యూ వృద్ధి సాధిస్తోంది ట‌మ్మీకార్ట్‌. ఖ‌ర్చులు పోను.. 30శాతం మిగులు సాధిస్తోంది. వ‌చ్చిన ఆర్డ‌ర్స్‌లో 90శాతం సొంత వ్య‌వ‌స్ధ‌తోనే డెలివ‌రీ చేస్తుండ‌గా.. మిగ‌తా 10శాతం ఆర్డ‌ర్స్‌ను ఒపీనియో, రోడ్‌ర‌న్న‌ర్‌ల‌తో టైఅప్ అయి డెలివ‌రీ చేస్తోంది. వీటితో పాటు జ్విజ్జీ, ఫుడ్‌పాండా, జొమాటోలాంటి సైట్ల‌లో కూడా ఆర్డ‌ర్ల‌ను తీసుకుంటున్నారు. ఓలాకేఫ్‌, ఫాసోస్ కంపెనీల‌తో ఆఫీషియ‌ల్ టైఅప్ చేసుకున్నారు.

"ఇదే కాన్సెప్ట్‌పై ఎన్నో బిజినెస్ మోడ‌ల్స్ ఉన్నాయి. అందుకే.. ఇన్వెంట‌రీ ద‌గ్గ‌ర్నుంచి ఆర్డ‌ర్లు తీసుకోవ‌డం, ప్రియార్టీ ఇవ్వ‌డం, ఆర్డ‌ర్‌ను ప్రాసెస్ చేయ‌డం, డెలివ‌రీ చేయ‌డం దాకా ప్ర‌తీదాన్నీ ఇంటిగ్రేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్ర‌స్తుతానికి అవి మాన్యువ‌ల్‌గా చేస్తున్నా.. త‌ప్పులు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం" - ఇంద్ర‌జీత్‌

2016 చివ‌రిక‌ల్లా 2000మంది కార్పొరేట్ మీల్స్ టార్గెట్‌ను సాధించ‌డంతో పాటు.. 1500మంది వ్య‌క్తిగ‌త మీల్స్‌ను అందించాల‌న్న‌ది లక్ష్యంగా పెట్టుకుంది ట‌మ్మీకార్ట్‌. మొత్తంగా రూ..8కోట్ల రెవెన్యూ సాధించాల‌న్న‌ది ల‌క్ష్యం. ఆన్‌లైన్‌లోనే కాకుండా. ఎంపిక చేసిన కొన్ని ప్ర‌దేశాల్లో ఔట్‌లెట్స్‌ను ఏర్పాటుచేయాల‌ని ప్లాన్‌చేస్తున్నారు.

మార్కెట్‌.. పోటీ..

గ‌తంలో కేవ‌లం ఫుడ్ డెలివ‌రీ వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఫుడ్ టెక్ ఇండ‌స్ట్రీ మెల్ల‌గా అడ్వాన్స్ అవుతోంది. ఇప్పుడు ఇంట్లో త‌యారుచేసిన భోజ‌నం.. ప్రొఫెష‌న‌ల్ చెఫ్ వండిన వంట‌.. ఇలా ఏది కావాలంటే అది దొరుకుతుంది. స్టార్ట‌ప్‌లు పుట్ట‌గొడుగుల్లా పెరుగుతున్న ఈ టైమ్‌లో.. ఫుడ్ మార్కెట్ కూడా ట్రెండ్ సెట్‌చేస్తోంది. హోలాచెఫ్‌, ఇన్న‌ర్‌చెఫ్‌, రాకెట్ చెఫ్‌, జూప‌ర్ మీల్‌, కిచెన్ ఫుడ్‌, సైబ‌ర్‌చెఫ్‌లాంటి సంస్ధ‌లు ఇప్ప‌టికే మార్కెట్‌లో గ‌ట్టిపోటీ ఇస్తున్నాయి.

ముంబైకు చెందిన హోలాచెఫ్ ఈ మ‌ధ్య‌నే క‌లారీ క్యాపిటెల్‌, ఇండియా కోషెంట్ కంపెనీల నుంచి రూ.20కోట్ల ఫండింగ్ ద‌క్కించుకుంది, గుర్గావ్ కేంద్రంగా న‌డుస్తున్న ఇన్న‌ర్‌చెఫ్ రూ.11 కోట్లు, ముంబైకి చెందిన మ‌రో సంస్ధ జూప‌ర్‌మీల్ రూ.13.676 కోట్లు ఫండింగ్ ద‌క్కించుకున్నాయి. అయితే, ఈ ఇండ‌స్ట్రీలో ఫండింగ్ ఒక్క‌టి ఉంటే స‌రిపోద‌ని గ‌తంలోనే తేలిపోయింది. డాజో, స్పూన్‌జాయ్ కంపెనీలు.. కోట్ల పెట్టుబ‌డి ఉన్నా కూడా అక్టోబ‌ర్ 2015లో మూత‌బ‌డ్డాయి. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు టైనీ ఔల్‌.. నాలుగు ప‌ట్ట‌ణాల్లో ఆఫీసులు మూసేయ‌డ‌మే కాకుండా 300మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది.

యువ‌ర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

హైద‌రాబాద్ బేస్‌గా న‌డుస్తున్న ట‌మ్మీకార్ట్‌.. అతిత‌క్కువ ధ‌ర రూ.50తో మొద‌లుపెట్టింది. బీటుబి, బీటుసీ క్ల‌యింట్స్‌కు స‌రిపడా ప్యాకేజీల‌ను అందిస్తోంది. కొంత‌మంది ఇన్వెస్ట‌ర్ల‌తో మాట్లాడుతున్న టమ్మీకార్ట్‌.. పుణె, చెన్న‌య్‌, బెంగ‌ళూరులకు విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఫండింగ్ వ‌చ్చాక‌.. చాలా ఫుడ్ టెక్ స్టార్ట‌ప్‌లు వేగంగా విస్త‌రించ‌డాన్ని గ‌తంలో గ‌మ‌నించాం. ఈ నేప‌ధ్యంలో.. పెట్టుబ‌డులు దొరికితే. టమ్మీకార్ట్ స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో చూడాలి. దీనితో పాటు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్‌ల‌ను కూడా రెడీచేస్తోంది ట‌మ్మీకార్ట్‌.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags